జహీర్‌ పెళ్లిలో వీరి ప్రేమకథ మొదలైంది.. | Did Angad Proposed to Neha For Marriage in Jaheer khan Marriage | Sakshi
Sakshi News home page

జహీర్‌ పెళ్లిలో వీరి ప్రేమకథ మొదలైంది..

Published Fri, May 11 2018 5:09 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Did Angad Proposed to Neha For Marriage in Jaheer khan Marriage - Sakshi

అంగద్‌ బేడీ- నేహా ధూపియా (పాత ఫొటో)

తన ప్రాణ స్నేహితుడు అంగద్‌ బేడిని రహస్యంగా వివాహమాడి అభిమానులతో పాటు బాలీవుడ్‌ జనాలకు స్వీట్‌ షాకిచ్చింది నేహా ధూపియా. సోనమ్‌ కపూర్‌- ఆనంద్‌ అహుజాల పెళ్లి ముచ్చట్లలో మీడియా మునిగిపోయిన వేళ తమ పెళ్లి ఫొటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ కొత్త జంట. అయితే ఎప్పుడూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించని నేహా- అంగద్‌.. మే10న పంజాబీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్య దంపతులుగా మారిన విషయం తెలిసిందే.

అయితే గత నవంబర్‌లో జరిగిన క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌- సాగరిక ఘట్కేల వివాహ సమయంలోనే అంగద్‌... నేహా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినట్లు వదంతులు వినిపించాయి. జహీర్‌ ఖాన్‌ పెళ్లి అనంతరం అంగద్‌- నేహాలు సాగించిన సరదా సంభాషణ గమనిస్తే అది నిజమే అన్పిస్తోంది మరి. జహీర్‌- సాగరికల పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన అంగద్‌ వారికి శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు బదులుగా నేహా.. ‘తర్వాత నీ వివాహమే అంగద్‌’  అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ‘అయితే పదమరి’  అంటూ అంతే కొంటెగా సమాధానమిచ్చాడు అంగద్‌. నేహా బదులిస్తూ ‘ఎప్పుడు’ అంటూ కామెంట్‌ చేయగా.. ‘15 జనవరిన’  అంటూ అంగద్‌ బదులిచ్చాడు. ఇలా వీరి ప్రేమకథ మరో పెళ్లిలో మొదలైంది.

‘ప్రాణ స్నేహితులని పెళ్లి చేసుకోవడం ప్రపంచంలోనే అన్నింటి కన్నా గొప్ప అనుభూతి. ప్రస్తుతం మేము ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాం. స్నేహితులుగా ఉన్న మేము ఢిల్లీలో జరిగిన వివాహ వేడుక ద్వారా దంపతులుగా మారామంటూ’  ఈ నవజంట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘వచ్చే వారం స్నేహితులు, సన్నిహితుల మధ్య ముంబైలో రిసెప్షన్‌ జరపాలనుకుంటున్నాం. మాపై ప్రేమ కురిపించి.. ఆశీర్వాదాలు అందజేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు’  అంటూ ఈ జంట ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పెళ్లైన వెంటనే నేహా- అంగద్‌లు హనీమూన్‌ కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం.

క్రికెట్‌ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement