ties the knot
-
గుట్టుగా గోవాలో..పెళ్లి చేసుకున్న నటి
2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్ మూడు ముళ్లు వేయించుకున్న సంబరంలో మునిగి తేలుతోంది. గోవాలో జరిగిన ఒక ప్రయివేట్ ఈవెంట్లో ప్రియుడు, గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాను పెళ్లాడింది. బాలీవుడ్షాదీస్డాట్కామ్ ప్రకారం అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో 'లవ్ ఆఫ్ లైఫ్' సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గులాబీ రంగు లెహంగా, డిజైనర్ ఆభరణాలతో పెళ్లి కూతురిగా అస్మితా, వైల్ కలర్ బంద్‌గాలా సూట్లో సిద్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. అంతేకాదు తొలి రోజు సంగీత్, కాక్టెయిల్ పార్టీ, రెండో రోజు హల్దీ వేడుకలను చేసుకున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బ్రమ్మిగాడి కథ తరువాత, 40కి పైగా బ్రాండ్లలలో కనిపించింది. అలాగే ‘ఫిర్ భీ నా మానే’...‘బత్తమీజ్ దిల్’, ‘దిల్ హీ తో హై’సహా అనేక టెలివిజన్ షోలతో పాపులర్ అయింది. ఇక చివరిసారిగా టీవీ షో, ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. ఇప్పటికే సిద్ధ్ తో డేటింగ్లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల వెకేషన్ ఫోటోలను, ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. -
జహీర్ పెళ్లిలో వీరి ప్రేమకథ మొదలైంది..
తన ప్రాణ స్నేహితుడు అంగద్ బేడిని రహస్యంగా వివాహమాడి అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలకు స్వీట్ షాకిచ్చింది నేహా ధూపియా. సోనమ్ కపూర్- ఆనంద్ అహుజాల పెళ్లి ముచ్చట్లలో మీడియా మునిగిపోయిన వేళ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ కొత్త జంట. అయితే ఎప్పుడూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగా ప్రకటించని నేహా- అంగద్.. మే10న పంజాబీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్య దంపతులుగా మారిన విషయం తెలిసిందే. అయితే గత నవంబర్‌లో జరిగిన క్రికెటర్ జహీర్ ఖాన్- సాగరిక ఘట్కేల వివాహ సమయంలోనే అంగద్... నేహా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినట్లు వదంతులు వినిపించాయి. జహీర్ ఖాన్ పెళ్లి అనంతరం అంగద్- నేహాలు సాగించిన సరదా సంభాషణ గమనిస్తే అది నిజమే అన్పిస్తోంది మరి. జహీర్- సాగరికల పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అంగద్ వారికి శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు బదులుగా నేహా.. ‘తర్వాత నీ వివాహమే అంగద్’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ‘అయితే పదమరి’ అంటూ అంతే కొంటెగా సమాధానమిచ్చాడు అంగద్. నేహా బదులిస్తూ ‘ఎప్పుడు’ అంటూ కామెంట్ చేయగా.. ‘15 జనవరిన’ అంటూ అంగద్ బదులిచ్చాడు. ఇలా వీరి ప్రేమకథ మరో పెళ్లిలో మొదలైంది. ‘ప్రాణ స్నేహితులని పెళ్లి చేసుకోవడం ప్రపంచంలోనే అన్నింటి కన్నా గొప్ప అనుభూతి. ప్రస్తుతం మేము ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాం. స్నేహితులుగా ఉన్న మేము ఢిల్లీలో జరిగిన వివాహ వేడుక ద్వారా దంపతులుగా మారామంటూ’ ఈ నవజంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘వచ్చే వారం స్నేహితులు, సన్నిహితుల మధ్య ముంబైలో రిసెప్షన్ జరపాలనుకుంటున్నాం. మాపై ప్రేమ కురిపించి.. ఆశీర్వాదాలు అందజేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు’ అంటూ ఈ జంట ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పెళ్లైన వెంటనే నేహా- అంగద్‌లు హనీమూన్ కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం. క్రికెట్ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి Finally!!! Big fella is man down!! @zaheer_khan34 @sagarikaghatge game.. Set.. Match! Chak de.. #zaheerkhan #sagarikaghatge A post shared by Angad Bedi (@angadbedi) on Nov 22, 2017 at 10:33pm PST -
క్రికెట్ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి
ముంబై: డేటింగ్ నుంచి మొదలుపెడితే ఎంగేజ్మెంట్.. ముహుర్తం ఖరారు.. బందువుల రాక.. మెహెందీ, సంగీత్.. పెళ్లి.. అప్పగింతలు.. వందలకొద్దీ వార్తలు, వేలకొద్దీ ఫొటోలు, సోషల్‌మీడియాలో చర్చలు..!! సెలబ్రిటీల పెళ్లివేడుకల్లో సాధారణంగా చోటుచేసుకున్న ఈ రొటీన్‌కు కాస్త భిన్నంగా.. చడీచప్పుడు లేకుండా ఎకాఎకిన పెళ్లిచేసేసుకుని అభిమానులకు స్వీట్ షాకిచ్చింది హీరోయిన్ నేహా ధూపియా. క్రికెట్ దిగ్గజం కుమారుడు: భారత క్రికెట్లో దిగ్గజ స్పిన్నర్‌గా పేరుపొందిన బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేటీనే నేహా వివాహం చేసుకుంది. అంగద్ సైతం బాలీవుడ్లో, టీవీ రంగంలో నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లో మెరిపోతున్న ఫొటోలను.. స్వయంగా వధూవరులే పోస్ట్ చేశారు. ‘‘లైఫ్‌లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఇదే.. నా ఫ్రెండ్ అంగద్‌ను పెళ్లి చేసుకున్నాను. హలో.. హస్బెండ్గారు..’’ అని నేహా రాసుకొచ్చింది. ‘ఇప్పటిదాకా స్నేహితురాలు.. ఇకనుంచి భార్య’ అంటూ అంగద్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ద్వారా పెళ్లి వార్తలు తెలుసుకున్న ప్రముఖులంతా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. -
సోనాలీ పెళ్లి చేసుకుంది..
బొకారో: యాసిడ్ దాడి బాధితురాలు సోనాలీ ముఖర్జీ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఏళ్ల తరబడి చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ, కోర్టులు చుట్టూ తిరిగి తిరిగి వేసారిన ఆమె జీవితంలో వెలుగుపూలు వికసించాయి. ఫేస్బుక్లో పరిచయమైన చిత్తరంజన్ అనే వ్యక్తి సోనాలీ ముఖర్జీ వ్యక్తిత్వాన్ని మెచ్చి ప్రేమించి పెళ్లచేసుకున్నారు. బొకారోలోని కోర్టహాలులో కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సోనాలి 18 ఏళ్ల వయసులో ఉన్నపుడు యాసిడ్ దాడికి గురైంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధించిన వ్యక్తులను ప్రతిఘటించినందుకు గాను, కక్షకట్టిన ముగ్గురు వ్యక్తులు ఆమె తన ఇంటి మేడమీద నిద్రిస్తుండగా సోనాలిపై యాసిడ్ పోశారు. దీంతో ముఖం, మెడ, కుడి ఛాతీ భాగంలో తీవ్ర గాయాల పాలయ్యింది. ఈ కేసులో ఆమె అలుపెరుగని పోరాటం చేస్తోంది. అయితే ఆమె సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు బొకారోలోని గవర్నమెంటు స్కూల్లో చిరుద్యోగాన్ని సంపాదించారు. యాసిడ్ బాధితులకు ప్రభుత్వం ఉద్యోగభృతి కల్పించాలంటూ మీడియా ముందుకొచ్చి డిమాండ్ చేశారు. కౌన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ షోలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కూడా అందుకున్నారు సోనాలి. ఇలా ఆమె ధైర్యానికి , ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన చిత్తరంజన్ ఆమెతో స్నేహాన్ని పెంచుకుని, పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పరస్పర అంగీకారంతో బంధువుల అభినందనల మధ్య చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. జంషెడ్‌పూర్‌కు చెందిన చిత్తరంజన్ ఒడిషాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సోనాలీని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాడుతున్న అతి కొద్దమంది మహిళలో ఒకరిగా ఆమెను గౌరవిస్తామన్నారు. యాసిడ్ దాడి ఘటనతో తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని, ఉత్సాహాన్ని చిత్తరంజన్ తిరిగి తీసుకొచ్చారంటున్నారు సోనాలి. కాగా కోర్టు ఫీజులు, చికిత్స కోసం సోనాలి కుటుంబం ఆస్తులు, బంగారాన్ని సైతం తెగ నమ్ముకుని న్యాయం కోసం పోరాడుతోంది. ఇప్పటికీ నిందితుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు సమాచారం. -
రోడ్డుపైనే తాళి కట్టిన ప్రియుడు
చెన్నై : ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు తన నుంచి ఎక్కడ దూరం చేస్తారనే భయంతో ఓ ప్రియుడు రోడ్డుపైనే తాళి కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అదే ప్రాంతంలోని ప్రయివేటు కళాశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆమెను మందలించారు. అయినా దివ్య తల్లిదండ్రుల మాట వినకపోవటంతో ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వచ్చాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్యను తీసుకుని బస్టాండు చేరుకున్నాడు. అయితే దివ్య ఇంట్లో లేకపోవటంతో ఆమె బంధువులు వెతుక్కుంటూ బస్టాండ్ చేరుకున్నారు. దీంతో ఆనంద్ దిక్కుతోచని స్థితిలో హఠాత్తుగా రోడ్డుపైనే తను ప్రేయసి మెడలో తాళి కట్టాడు. ఊహించని ఈ సంఘటనతో బస్టాండులోని ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న తంజావూరు వైద్య కళాశాల పోలీసు ఇన్స్పెక్టర్ బాలమురుగన్ ఆ ప్రేమజంటను తన జీపులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రేమజంటను విచారించిన పోలీసులు....వారిద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.