గుట్టుగా గోవాలో..పెళ్లి చేసుకున్న నటి | Actress Asmita Sood Ties The Knot With Fiance Siddh Mehta | Sakshi
Sakshi News home page

గుట్టుగా గోవాలో..పెళ్లి చేసుకున్న నటి

Published Mon, Feb 5 2024 4:24 PM | Last Updated on Mon, Feb 5 2024 5:25 PM

Actress Asmita Sood Ties The Knot With Fiance Siddh Mehta - Sakshi

2011లో టాలీవుడ్‌లో చిత్రం బ్రమ్మిగాడి కథ మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ భామ అస్మితా సూద్ మూడు ముళ్లు వేయించుకున్న సంబరంలో మునిగి తేలుతోంది.  గోవాలో జరిగిన ఒక ప్రయివేట్‌ ఈవెంట్‌లో ప్రియుడు, గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాను పెళ్లాడింది.

బాలీవుడ్‌షాదీస్‌డాట్‌కామ్‌ ప్రకారం అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో 'లవ్ ఆఫ్ లైఫ్' సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. గులాబీ రంగు లెహంగా, డిజైనర్‌ ఆభరణాలతో  పెళ్లి కూతురిగా అస్మితా, వైల్‌ కలర్‌ బంద్‌గాలా సూట్‌లో సిద్‌ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశారు.

అంతేకాదు తొలి రోజు సంగీత్, కాక్‌టెయిల్ పార్టీ, రెండో రోజు హల్దీ వేడుకలను చేసుకున్న ఫోటోలు కూడా  వెలుగులోకి వచ్చాయి.

బ్రమ్మిగాడి కథ  తరువాత, 40కి పైగా బ్రాండ్‌లలలో కనిపించింది. అలాగే ‘ఫిర్ భీ నా మానే’...‘బత్తమీజ్ దిల్’, ‘దిల్ హీ తో హై’సహా అనేక టెలివిజన్ షోలతో పాపులర్‌ అయింది. ఇక చివరిసారిగా టీవీ షో, ‘జనమ్ జనమ్ కా సాత్‌’లో కనిపించింది. ఇప్పటికే సిద్ధ్ తో డేటింగ్‌లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల వెకేషన్‌ ఫోటోలను, ప్రియుడు ప్రపోజ్‌ చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌  చేసింది. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం  కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement