
భారతదేశంలో అత్యంత ఇష్టమైన హాలిడే స్పాట్. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా గోవా పర్యాటక శాఖ భాగస్వామ్యంతో ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) రాష్ట్రంలోని సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను హైలైట్ చేసే డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించింది. గోవా పర్యాటక శాఖతో సహకారంతో 'రీడిస్కవర్ గోవా' ప్రచారం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఇందులో గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లు , నైట్ లైఫ్‌లకు సంబంధించిన ఎన్నో తెలియనవి వివరాలను విశేషాలను పొందుపర్చింది.
గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే, ఎయిర్‌బిఎన్‌బి కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ నటుడు అభయ్ డియోల్ సమక్షంలో ఈ గైడ్‌బుక్‌ను ఆవిష్కరించారు. పర్యాటకుల సౌకర్యార్థం ఈ ‘గోవా అన్‌సీన్’గైడ్ బుక్‌లో చెఫ్‌లు, ట్రావెల్ రైటర్‌లు , కళాకారులతో సహా స్థానిక నిపుణుల అభిప్రాయాలను కూడా ఇందులో ఉన్నాయి. గోవా సంప్రదాయాలు, ప్రత్యేకమైన పాక అనుభవాలు కూడా ఈ డిజిటల్‌గైడ్‌బుక్‌లో లభ్యం. పాకశాస్త్ర విద్వాంసుడు అవినాష్ మార్టిన్స్, ఫుడ్ రైటర్, నోలన్ మస్కరెన్హాస్, కళాకారుడు , కంటెంట్ సృష్టికర్త సిద్ధార్థ్ కెర్కర్, గోవాగెట్టర్ వ్యవస్థాపకుడు గర్వ్ వోహ్రా, ట్రావెల్ రైటర్ ఇన్సియా లాసెవాల్లా ,టీవీ హోస్ట్ మరియు కంటెంట్ సృష్టికర్త స్కార్లెట్ రోజ్ అనుభవాలు, సిఫార్సులతో దీన్ని తీసుకొచ్చారు.
గోవా పర్యాటక శాఖతో భాగస్వామ్యంతో ‘రీడిస్కవర్ గోవా’ , ‘గోవా అన్‌సీన్’ వంటి కార్యక్రమాల ద్వారా, రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వం, డైనమిక్ కమ్యూనిటీలు, ప్రత్యేకమైన వసతిని ప్రదర్శించడానికి కృషి చేస్తున్నామని హోమ్ స్టే బుకింగ్ వెబ్‌సైట్ ఎయిర్‌బిఎన్‌బి ఇండియా , ఆగ్నేయాసియా దేశ అధిపతి అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ తెలిపారు. “ రడిస్కవర్ గోవా 2.0 ప్రచారం & గోవా అన్‌సీన్ గైడ్‌బుక్ ఆవిష్కారంపై మాట్లాడుతూ , పర్యాటకం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, ,పునరుత్పాదక పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రయోజనాలు స్థానిక వ్యాపారాలు, సంఘాలు మరియు కొత్త తరం వ్యవస్థాపకులకు చేరేలా నిర్ధారిస్తుందని గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి రోహన్ ఖౌంటే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్రామీణ గోవాలో హోమ్‌స్టేలను ప్రోత్సహించడం ద్వారా మహిళలు, యువతకు సాధికారత కల్పించాలన్ని భావిస్తున్నట్టు వెల్లడించారు.
https://news.airbnb.com/wp-content/uploads/sites/4/2025/03/Airbnb-Goa-Unseen-Guide.pdf