breaking news
Digital books
-
కార్యకర్తలకు అండగా నిలబడతాం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఫొటోలు, ఆధారాలు కూడా అప్లోడ్ చేయొచ్చు. రెండోది ఐవీఆర్ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ డిజిటల్ బుక్‌లో రికార్డు అవుతాయి. రేపు మనం అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతాం.చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, డైవర్ట్ చేయడం.. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మీరంతా గట్టిగా నిలబడితే ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు.–వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ బుక్‌లో నమోదు చేసిన అంశాల మీద రేపు మనం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ‘అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా.. రాష్ట్రంలో లేకపోయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు వేస్తాం’ అని హామీ ఇచ్చారు. వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారని.. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీని స్థాపించి 14 ఏళ్లయ్యిందని.. పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలేనని పునరుద్ఘాటించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక్కటే ఒక వైపు.. మిగిలిన పార్టీలన్నీ మరో వైపు ఉన్నా, 40 శాతం ఓట్లతో మనం గట్టిగా నిలబడటానికి కార్యకర్తలే కారణమని స్పష్టం చేశారు. ‘ప్రతి కార్యకర్త డేటా నా దగ్గర ఉంటుంది. రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్లకు మంచి జరుగుతుంది. వారి ద్వారా ప్రజలకూ మేలు జరుగుతుంది. వారి చేతుల మీదుగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి మంచి జరుగుతుంది’ అని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుబంధ విభాగాలు కీలకం ⇒ ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రక్చర్‌ను చూస్తే.. ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్చార్జులు ఉన్నారు. వీరంతా జిల్లా కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు. ⇒ వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి. వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు.⇒ అలా కమిటీలు వేసుకున్న తర్వాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్షాత్తు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. ⇒ ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారిని.. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుపెట్టి.. వారి ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను. అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు.. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ గురించి వివరించండి. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన పార్టీ నేతలు గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు టార్గెట్⇒ తుది దశలో గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు.. ఎవరు మహిళా అధ్యక్షురాలు.. ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు.. ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు.. ఎవరు బీసీ అధ్యక్షుడు.. ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోవాలి.⇒ తర్వాత పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు. ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు.. ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. మొత్తంగా గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి ఎనిమిది మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఇలా చెప్పగలిగితే మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే. ⇒ రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్‌తో పార్టీ ఇచ్చే మెసేజ్‌తో ఏ కార్యక్రమమైనా గ్రామంలో విసృ్త్తతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది. డిజిటల్ బుక్ నమూనా కార్యకర్తలే పార్టీకి బలం⇒ మన పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అయ్యింది. మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఒక్కటే ఒక వైపు, మిగిలిన అన్ని పార్టీలూ మరో వైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డామంటే కార్యకర్తలే కారణం.⇒ ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. నేను ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తను.. ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని.. ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని.. యువత అధ్యక్షుడిని.. సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని.. ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని.. అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా.. వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైఎస్సార్సీపీపై పోటీకి పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి. ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే నా తాపత్రయం. ఈసారి కచ్చితంగా గెలవాలి.డిజిటల్ బుక్ ఆవిష్కరణ⇒ రాష్ట్రంలో అన్యాయానికి గురైన మన కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్‌ను లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ⇒ ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం వెబ్సైట్లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డేటా.. ఆ డిజిటల్ బుక్‌లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. ⇒ రెండోది ఐవీఆర్ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్‌కు ఫోన్ చేయగానే దశల వారీగా సమాచారం తీసుకుంటారు. -
రెడ్ బుక్ కు ధీటుగా డిజిటల్ బుక్ ఒక్కొక్కరికి ఇక సినిమానే
-
వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: పేర్నినాని
-
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
భారతదేశంలో అత్యంత ఇష్టమైన హాలిడే స్పాట్. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా గోవా పర్యాటక శాఖ భాగస్వామ్యంతో ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) రాష్ట్రంలోని సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను హైలైట్ చేసే డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించింది. గోవా పర్యాటక శాఖతో సహకారంతో 'రీడిస్కవర్ గోవా' ప్రచారం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఇందులో గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లు , నైట్ లైఫ్‌లకు సంబంధించిన ఎన్నో తెలియనవి వివరాలను విశేషాలను పొందుపర్చింది.గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే, ఎయిర్బిఎన్బి కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ నటుడు అభయ్ డియోల్ సమక్షంలో ఈ గైడ్‌బుక్‌ను ఆవిష్కరించారు. పర్యాటకుల సౌకర్యార్థం ఈ ‘గోవా అన్‌సీన్’గైడ్ బుక్‌లో చెఫ్‌లు, ట్రావెల్ రైటర్లు , కళాకారులతో సహా స్థానిక నిపుణుల అభిప్రాయాలను కూడా ఇందులో ఉన్నాయి. గోవా సంప్రదాయాలు, ప్రత్యేకమైన పాక అనుభవాలు కూడా ఈ డిజిటల్గైడ్బుక్లో లభ్యం. పాకశాస్త్ర విద్వాంసుడు అవినాష్ మార్టిన్స్, ఫుడ్ రైటర్, నోలన్ మస్కరెన్హాస్, కళాకారుడు , కంటెంట్ సృష్టికర్త సిద్ధార్థ్ కెర్కర్, గోవాగెట్టర్ వ్యవస్థాపకుడు గర్వ్ వోహ్రా, ట్రావెల్ రైటర్ ఇన్సియా లాసెవాల్లా ,టీవీ హోస్ట్ మరియు కంటెంట్ సృష్టికర్త స్కార్లెట్ రోజ్ అనుభవాలు, సిఫార్సులతో దీన్ని తీసుకొచ్చారు.గోవా పర్యాటక శాఖతో భాగస్వామ్యంతో ‘రీడిస్కవర్ గోవా’ , ‘గోవా అన్‌సీన్’ వంటి కార్యక్రమాల ద్వారా, రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వం, డైనమిక్ కమ్యూనిటీలు, ప్రత్యేకమైన వసతిని ప్రదర్శించడానికి కృషి చేస్తున్నామని హోమ్ స్టే బుకింగ్ వెబ్సైట్ ఎయిర్బిఎన్బి ఇండియా , ఆగ్నేయాసియా దేశ అధిపతి అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ తెలిపారు. “ రడిస్కవర్ గోవా 2.0 ప్రచారం & గోవా అన్‌సీన్ గైడ్‌బుక్ ఆవిష్కారంపై మాట్లాడుతూ , పర్యాటకం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, ,పునరుత్పాదక పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రయోజనాలు స్థానిక వ్యాపారాలు, సంఘాలు మరియు కొత్త తరం వ్యవస్థాపకులకు చేరేలా నిర్ధారిస్తుందని గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి రోహన్ ఖౌంటే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్రామీణ గోవాలో హోమ్‌స్టేలను ప్రోత్సహించడం ద్వారా మహిళలు, యువతకు సాధికారత కల్పించాలన్ని భావిస్తున్నట్టు వెల్లడించారు. https://news.airbnb.com/wp-content/uploads/sites/4/2025/03/Airbnb-Goa-Unseen-Guide.pdf -
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్‌లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్‌కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్‌లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్‌తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
మాట్లాడే పుస్తకాలు!
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి) : కంటికి శ్రమ ఉండదు.. పెదవులు కదిలించాల్సిన అవసరం లేదు.. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆ పుస్తకాల్లో అక్షరాలపై డాల్ఫియా పెడితే చాలు.. భావయుక్తంగా స్పష్టంగా అర్థమయ్యేలా మాటల రూపంలో వినిపిస్తాయి. ఇది కోడింగ్, డీకోడింగ్ ద్వారా ముద్రించిన మాట్లాడే పుస్తకాల (టాకింగ్ బుక్స్) ప్రత్యేకత. దీంతో విద్యార్థులకు పదాలను ఎలా ఉచ్చరించాలో స్పష్టంగా తెలియడంతోపాటు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సరికొత్త పరిజ్ఞానం తో చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం సీసీఈ పద్ధతిలో విద్యార్థులు బట్టీ పట్టి చద వుతున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా డిజిటల్ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎలా మాట్లాడుతాయంటే.. యునిసెఫ్, సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కోడింగ్, డీకోడింగ్ విధానాన్ని అనుసరించి మాట్లాడే డాల్ఫియాను తయారు చేశారు. ఈ డాల్ఫియా లేదా డాల్ఫిన్ బొమ్మను ప్రతి పుస్తకం కవర్ పేజీపై ఉన్న గెట్ స్టార్ గుర్తుపై ఉంచాలి. తర్వాత పుస్తకంలోని పదాలపై డాల్ఫియాన్ కదిలిస్తూ ఉంటే డీకోడ్ విధానంలో పదాలు వినిపిస్తాయి. ఆ కథలో ఉన్న పాత్రలకు అనుగుణంగా మనకు మాటలు వినపడం వల్ల ఒక నాటికను చూస్తున్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు. -
పుస్తక కోటి.. ఖరగ్‌పూర్ ఐఐటీ!
ఈపుస్తకాలతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు - ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు.. - 70కి పైగా భాషలు.. అన్నీ ఆన్లైన్లో.. ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు.. సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్లైన్లో చదువుకోవచ్చు.. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్ ఆన్లైన్లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) సహకారంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది. ఒక్క క్లిక్.. సమస్తం కళ్లముందు! డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. రిజిస్ట్రేషన్ సులభం డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు. డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో.. ⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్ ⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు ⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు ⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు ⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు ⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు ⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు ⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు ⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు 5,36,487 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్రోగ్రామింగ్ 1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్ 1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్ అండ్ రిలీజియన్ ఆర్ట్స్.. 1,45,290 లిటరేచర్ 4,40,607 హిస్టరీ జియోగ్రఫీ 3,65,535 8,70,802 సోషల్ సైన్సెస్: సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్ 56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు 22,65,577 నేచురల్ సైన్సెస్:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు ఫార్మాట్లు పీడీఎఫ్, హెచ్‌టీఎల్/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్ 70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు