Asmita Sood
-
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?
పలువురు హీరోయిన్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో బ్యూటీ చేరిపోయింది. 'బమ్మిగాడి కథ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఏడడుగులు వేసేసింది. గోవాలో పలువురు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!) హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిపెరిగిన అస్మితా సూద్.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. అలా 'బమ్మిగాడి కథ' సినిమాతో నటిగా జర్నీ షురూ చేసింది. 'ఆడు మగాడ్రా బుజ్జి', 'ఓకే', 'ఆ ఐదుగురు' లాంటి సినిమాలు చేసింది. వీటితో పాటు కన్నడ, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. సినిమాల పరంగా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం హిందీలో షోలు చేస్తూ బిజీగా ఉంది. అస్మిత.. గత కొన్నాళ్లుగా గుజరాతీ వ్యాపారవేత్త సిద్ మెహతాతో ప్రేమలో ఉంది. గతేడాది సెప్టెంబరులో వీళ్ల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు గోవాలో జరిగిన పెళ్లి వేడుకతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. అయితే పెద్దగా హడావుడి లేకుండా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. దీని తర్వాత ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) View this post on Instagram A post shared by 𝑷𝒆𝒂𝒓𝒀𝒂 (@pearya_x_love) -
గుట్టుగా గోవాలో..పెళ్లి చేసుకున్న నటి
2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ మూవీతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్ మూడు ముళ్లు వేయించుకున్న సంబరంలో మునిగి తేలుతోంది. గోవాలో జరిగిన ఒక ప్రయివేట్ ఈవెంట్లో ప్రియుడు, గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాను పెళ్లాడింది. బాలీవుడ్షాదీస్డాట్కామ్ ప్రకారం అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో 'లవ్ ఆఫ్ లైఫ్' సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. గులాబీ రంగు లెహంగా, డిజైనర్ ఆభరణాలతో పెళ్లి కూతురిగా అస్మితా, వైల్ కలర్ బంద్‌గాలా సూట్లో సిద్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. అంతేకాదు తొలి రోజు సంగీత్, కాక్టెయిల్ పార్టీ, రెండో రోజు హల్దీ వేడుకలను చేసుకున్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బ్రమ్మిగాడి కథ తరువాత, 40కి పైగా బ్రాండ్లలలో కనిపించింది. అలాగే ‘ఫిర్ భీ నా మానే’...‘బత్తమీజ్ దిల్’, ‘దిల్ హీ తో హై’సహా అనేక టెలివిజన్ షోలతో పాపులర్ అయింది. ఇక చివరిసారిగా టీవీ షో, ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. ఇప్పటికే సిద్ధ్ తో డేటింగ్లో ఉన్న ఈ అమ్మడు ఇటీవల వెకేషన్ ఫోటోలను, ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. -
Asmita Sood: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్ (ఫోటోలు)
-
పెళ్లికి సిద్ధమైన వరుణ్ సందేశ్ హీరోయిన్..!
కొత్త ఏడాదిలో బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసేందుకు రెడీ అయిపోయింది. 2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్. ఆ తర్వాత ఫిర్ భీ నా మానే...బడ్తమీజ్ దిల్ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అస్మితా తన ప్రియుడు సిద్ధ్ మెహతాను పెళ్లాడనుంది. త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త సిధ్ మెహతాతో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది. ఈ జంట ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో అస్మిత, సిద్ధ్ మెహతాతో కలిసి వేకేషన్ వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అప్పట్లో ఆమె ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఏడాదిన్నర కాలంగా డేటింగ్లో ఉన్నా ఈ జంట.. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకుంది.కాగా.. అస్మితా సూద్ చివరిగా ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s) -
గాజులంటే మోజు
అస్మితా సూద్... మోడల్ నుంచి నటిగా మారిన అమ్మాయి. దాదాపు 40 బ్రాండ్స్‌కి మోడల్‌గా చేసిన ఈ సిమ్లా యాపిల్... కామర్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. తెరపైన హాట్‌గా కనిపించినా... నేను చాలా సాఫ్ట్ అంటోందీ క్యూట్ గాళ్. సాధించాల్సిందెంతో ఉందంటున్న ఈ ముద్దుగుమ్మ... సిటీ గురించి చెబుతున్న ముచ్చట్లు. - శిరీష చల్లపల్లి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే కథక్ నేర్చున్నాను. బయట ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేదాన్ని. ఆ టైమ్‌లోనే నాకు క్లాస్మేట్స్ నుంచి ఫ్యాకల్టీనుంచి తెగ కాంప్లిమెంట్స్ వచ్చేవి. అంతే... మా పేరెంట్స్ కూడా నన్ను ఈ ఫ్యాషన్ అండ్ మోడలింగ్‌వైపు ఎంకరేజ్ చేశారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఎన్నో యాడ్స్ చేయగలిగాను. తరువాత ‘గెట్ గార్జియస్’ అనే రియాలిటీ షోలో చేశాను. ‘ఫెమినా మిస్ ఇండియా’ అందాల పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికయ్యాను. ఆ తరువాత కొద్దికాలానికే టాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఆశ్చర్యపోయాను... బ్రహ్మిగాడి కథ సినిమాతో మొదటిసారిగా నేను హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడి స్టూడియోస్ నాకు అత్తవారిళ్లుగా అనిపించాయి. నేనెవరనేది సరిగ్గా తెలియనివారు కూడా నన్నో గాజుబొమ్మలాగా ట్రీట్ చేశారు. అంత మర్యాదగా ప్రవర్తించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా నా మొదటి సినిమాలో నన్ను నేను స్క్రీన్‌మీద చూసుకుని సంతోషించాను. ఆ తరువాత ‘ఆడు మగాడ్రా బుజ్జి’, ‘ఆ ఐదుగురు’ సినిమాల్లో చేశాను. టాలీవుడ్ పుణ్యమా అని మలయాళం, కన్నడ రంగాల్లో సైతం మంచి సినిమాలు చేశాను. ఇంకా కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇప్పడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది. కృష్ణవంశీ, గౌతమ్ మీనన్‌ల దర్శకత్వంలో నటించాలని ఉంది. గారాబం ఎక్కువ... నేను పుట్టి పెరిగింది హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకు బిజినెస్ ఉంది. నాకో తమ్ముడు. ప్లస్‌టూ వరకు చదువంతా సిమ్లాలోనే సాగింది. డిగ్రీ మాత్రం ఢిల్లీలో చేశాను. చిన్నప్పటినుంచి చాలా సాఫ్ట్. అస్సలు అల్లరిచేసేదాన్ని కాదు. ఒక్క అమ్మాయినే కావడంతో పేరెంట్స్ కూడా బాగా గారాబం చేశారు. తమ్ముడికి, నాకు ఏజ్‌గ్యాప్ ఎక్కువగా ఉండటంతో కొట్టుకోవడం లాంటివేమీ ఉండేవి కాదు. చార్మినార్ బ్యాంగిల్స్... హైదరాబాద్‌కు వచ్చి నాలుగేళ్లు... ఈ పీరియడ్ తక్కువే అయినా ఎన్నో ఏళ్ల అనుబంధం ఏర్పడింది. నా మాతృభాష హిందీ అవ్వడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో భాష కాస్త ఇబ్బంది అయ్యింది. తరువాత తరువాత మేకప్‌మేన్ దగ్గరనుంచి ప్రొడక్షన్, కాస్ట్యూమ్, క్యారావాన్ వరకూ అంద రూ నాకు సపోర్ట్ చేసి తెలుగు నేర్పించారు. ఇప్పుడు బాగా మాట్లాడగలను. సిటీకి వచ్చిన కొత్తలో ఇక్కడి షాపింగ్ గురించి చాలా విన్నాను. అందుకే మొదటిసారి చార్మినార్‌కు వెళ్లాను. అక్కడ రకరకాల గాజుల సెట్స్ చూశాను. ఎంతో అందమైన రేర్ కలెక్షన్ ముత్యాల గాజులు, హ్యాండ్ మెయిడ్ బాంగిల్స్ కొన్నాను. అవి నాకు చాలా ఇష్టం. ట్రెడిషనల్‌గా తయారవ్వాల్సొస్తే... ఆ బ్యాంగిల్స్కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్. -
విలువలున్న సినిమాలే తీస్తాను..!
‘‘సత్యం, మార్గం, లక్ష్యం, నమ్మకం... వీటినే ఆయుధాలుగా చేసుకొని ఐదుగురు యువకులు చేసిన పోరాటమే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యువతరం తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే సినిమా ఇది’’ అని ప్రేమ్‌కుమార్ పట్రా అన్నారు. ఆయన సమర్పణలో క్రాంతి, తనిష్క్, క్రాంతికుమార్, వాసు, కృష్ణతేజ ప్రధాన పాత్రలు, వెంకట్, అస్మితాసూద్ ప్రత్యేక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ అయిదుగురు’. అనిల్ జేసన్ గూడూరును దర్శకునిగా పరిచయం చేస్తూ సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, ‘‘ఐదుగురు పాండవులు, ఒక్కడే కృష్ణుడు... ఈ కాన్సెప్ట్‌తో ఈ కథ తయారు చేశాం. ఐదుగురు యువకులుగా కొత్తవారిని పరిచయం చేశాం. ఇక వీరిని నడిపించే పాత్రను వెంకట్ పోషించారు. నా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆ నలుగురు, వినాయకుడు. ఈ రెండూ నంది అవార్డులు అందుకున్నాయి. ఈ చిత్రంతో మూడోసారి నందిని అందుకోబోతున్నా’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్‌కుమార్. ఈ సినిమాలో ఓ కామెడీ పాత్ర చేశానని, ఇక నుంచి నటునిగా కూడా కొనసాగాలనుకుంటున్నానని ప్రేమ్‌కుమార్ చెప్పారు. ‘‘తెలుగు సినీ చరిత్రలోని టాప్ 100 చిత్రాల్లో నా ‘ఆ నలుగురు’ కూడా ఉంది. ఒక పాతాళభైరవి, ఒక శంకరాభరణం లాంటి క్లాసిక్స్‌తో పాటు నా ‘ఆ నలుగురు’ కూడా చెప్పుకుంటారు. ఒక నిర్మాతగా నాకిది చాలు. ఇక నుంచి కూడా విలువలతో కూడిన సినిమాలే తీస్తాను’’ అని ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. చిన్న సినిమాలకు పంపిణీదారుల నుంచి కూడా ప్రోత్సాహం అందడం లేదని, ఎదురు డబ్బులిచ్చి సినిమాలను విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొందని, అదే బూతు సినిమాలనైతే... పోటీ పడి మరీ విడుదల చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
అతడే సీఎమ్ అయితే?
ఆ నలుగురు, వినాయకుడు చిత్రాల ద్వారా ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రేమ్‌కుమార్ పట్రా. ఆయన సమర్ఫణలో అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వంలో సరితా పట్రా నిర్మించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. వెంకట్, అస్మితా సూద్, క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్‌రెడ్డి, కృష్ణతేజ, శశి ఇందులో ముఖ్య తారలు. ‘మంత్ర‘ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, డీయస్ రావు, శ్రీధర్ రెడ్డి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తన తండ్రి చనిపోవడం వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, ఈ నెల 20న లేక 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ పట్రా తెలిపారు. ఇందులో ఐపీయస్ అధికారి తోట చక్రవర్తిగా నటించానని, ఈ పాత్ర కోసం రెండు నెలలు పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నానని వెంకట్ చెప్పారు. ఈ కథ ప్రధానంగా ఐదు పాత్రలు చుట్టూ తిరుగుతుందని, ఆదర్శ భావాలున్న ఓ యువకుడు ముఖ్య మంత్రి అయితే ఏం చేస్తాడనేది ముఖ్య అంశమని దర్శకుడు అన్నారు. పాటలు రాయడంతో పాటు ఈ సినిమాకి మాటలు కూడా రాశానని, ఇది ప్రయోజనాత్మక సినిమా అని సుద్దాల అశోక్‌తేజ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్‌కుమార్ పట్రా. -
ఓట్లు వేయించే బాధ్యత యువతదే: అస్మితా సూద్
ఇప్పుడు ఎన్నికల్లో అందరి దృష్టి యువతపైనే.. కారణం దేశ జనాభాలో 60 శాతం యువతే కావడం.. అయితే చాలా మంది యువతీ యువకులు... వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.. దీన్నెవరూ ఏమీ చేయలేరు.. అనే నిరాశావాదంతో నిస్పృహతో రాజకీయాల గురించి మాట్లాడేందుకు, ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. కానీ మన తలరాతలు మార్చే రాజకీయ వ్యవస్థను శాసించేందుకు యువతే ముందుకు కదలాలి. ఏ ఒక్క ఓటూ వృథా కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి... - అస్మితా సూద్, హీరోయిన్ -
'ఆ ఐదుగురు' సినిమా స్టిల్స్
-
అదిరిందిరా బుజ్జి
-
సినిమా రివ్యూ: ఆడు మగాడే కానీ...
ఎస్సెమ్మెస్, ‘ప్రేమ కథా చిత్రం’తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే ఓ క్రేజీ, ఫ్యాన్సీ టైటిల్‌తో మరోసారి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ద్వారా కృష్టారెడ్డి గంగదాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైటిల్‌తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ ఏలాంటి టాక్‌ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం. సిద్ధు అల్లరి చిల్లరిగా తిరిగే ఓ తుంటరి యువకుడు. చిన్నతనం నుంచి అందర్ని కష్టాల్లో ఇరికించడం సిద్దూకి అలవాటు. సిద్దూ వ్యవహారం ఎలా ఉంటుందంటే.. సొంత తండ్రి ప్రసాద్ (నరేశ్) కూడా వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా భయపడేంత రేంజ్లో ఉంటుంది. సిద్దూ నుంచి ఎదురయ్యే కష్టాల్ని భరించలేక హాస్టల్ ఉంచి చదివిస్తుంటాడు. చాలా జాలీగా కాలం గడుపుతున్న సిద్దూ, ఇందూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇందూకి చెర్రి (రణధీర్) అనే ఓ అన్నయ్య ఉంటాడు. ఇందూ వైపు ఎవడైనా చూస్తే తాట తీయడం చెర్రీ పని. అయితే ఒకానొక కారణంగా శంకరన్న అనే రౌడీ పొలిటీషియన్‌ను సిద్దు విపరీతంగా కొడుతాడు. అయితే శంకరన్నకు ఎవరు కొట్టారనే విషయం తెలియదు. తనను కొట్టిన వ్యక్తిపై పగను పెంచుకొని అతని అంతు చూడటానికి వెతుకుతుంటాడు. కథ ఇలా సాగుతుంటే తన ప్రేమ కోసం సిద్దూ అదే కాలేజిలో చదువుతున్న శంకరన్న మరదలు అంజలీతో చెర్రీ ప్రేమలో పడేలా నాటకం ఆడుతాడు. అంజలీ ప్రేమ విషయం తెలుసుకున్న శంకరన్న చెర్రీపై దాడి చేస్తాడు. చెర్రీ, అంజలీలు విడిపోవడానికి సిద్దూనే కారణమని తెలుసుకున్న ఇందూ అతనికి దూరంగా ఉంటుంది. అయితే శంకరన్నను ఎదురించి విడిపోయిన చెర్రీ, అంజలీలను ఎలా కలిపాడు. వారి ప్రేమను పెళ్లిదాకా ఎలా తీసుకువచ్చాడు. అలాగే ఇందూను ప్రేమను సిద్దూ ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ చిత్ర కథ. లవ్, యాక్షన్, కామెడీ అంశాలకు తన ఎనర్జీని మేళవించి సుధీర్ ఆకట్టుకున్నాడు. టైమింగ్, మెచ్యురిటీ, డాన్స్ లతో సిద్దూ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. గత రెండు చిత్రాల్లోని ఫెర్ఫార్మెన్స్‌కు ధీటుగా తనదైన శైలిలో సుధీర్ బాబు మరోసారి నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. పాటల్లో సిక్స్‌ప్యాక్ బాడీతో సుధీర్ అదరగొట్టాడు. కథలను జాగ్రత్తగా ఎంచుకుని తన సినిమాలను చక్కగా ప్లాన్ చేసుకుంటే.. త్వరలోనే టాలీవుడ్ లో స్టార్‌గా ఎదగేందుకు అన్ని అంశాలు సుధీర్‌లో పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇందూ పాత్రలో అస్మితా సూద్ మంచి పాత్రే లభించింది. గ్లామర్‌తో ఆకట్టుకున్న కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో కొంత తడబాటుకు గురైంది. అయినా అస్మితా పర్వాలేదనింపించింది. అంజలీ పాత్రలో పూనమ్ కౌర్‌కు అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. ప్రధాన విలన్‌గా అజయ్ తనదైన మార్కును ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో అజయ్ మంచి పరిణతిని ప్రదర్శించాడు. శంకరన్న లాంటి పాత్రలను అజయ్ ఇప్పటికే ఎన్నో చేశాడు. అజయ్ కేరిర్‌కు అంతగా పేరు తీసుకురాకపోయినా.. విలన్ రేసులో తాను ఉన్నానని చెప్పుకోవడానికి పనికివచ్చే రేంజ్ మాత్రమే. సుమన్, నరేశ్‌లు అతిధి నటుల పాత్రకే పరిమితమయ్యారు. ఇక ఈ సినిమాలో కుక్క పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. పృథ్వీ, కృష్ణభగవాన్ కామెడీ కొంత ప్లస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకావాల్సిందేమైనా ఉందంటే అది డైలాగ్స్. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ. ’సంతానం కోసం సముద్ర స్నానం చేస్తే ఉప్పు నీళ్లతో ఉన్నది పొయింది’, కొడుకును ఇవ్వమంటే కసబ్ ను ఇచ్చావ్ లాంటి డైలాగ్స్ తోపా టు, మరికొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా పేలాయి. ఫోటోగ్రఫి కూడా అదనపు ఎస్సెట్. ఈ చిత్రంలో శ్రీ సంగీతం అంతగా ఆక ట్టుకోలేకపోవడం, పాటలు క్యాచీగా లేకపోవడం మైనస్. ఆడు మగాడ్రా బుజ్జీ అనే ఎనర్జీ ఉన్న టైటిల్‌తో దర్శకుడిగా పరిచయమైన కృష్ణారెడ్డి తొలి భాగంగా ఓకే అనిపించాడు. మంచి ఎంటర్టైన్మెంట్తో తొలి భాగంపై గ్రిప్‌ను సాధించినట్టు కనిపించినా.. అదే ఊపును ద్వితీయార్ధంలో కొనసాగించలేకపోయాడు. కుక్క ఎపిసోడ్, కృష్ణ భగవాన్ సీన్లు బాగా పండించాడు. తొలి భాగంలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంతోపాటు.. రెండవ భాగంపై ఆసక్తిని రేకేత్తించాడు. అయితే రెండవ భాగంపై ఆశలు పెంచుకున్న ప్రేక్షకులకు నిరాశను పంచాడు. తొలి చిత్రం ద్వారా రొటీన్ కథను ఎంచుకోవడం కృష్ణారెడ్డి కొంత సాహసామేనప్పటికి.. ఆడు మగాడ్రా బుజ్జీ టైటిల్లో ఉండే ఫోర్స్‌ను పూర్తి స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. -
నన్ను చూసి కాలేజీలో భయపడుతుంటారు!
దక్షిణాదిన అన్ని భాషల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు కథానాయిక అస్మితాసూద్. సుధీర్‌బాబుకి ఈ ముద్దుగుమ్మ జోడీగా నటించిన సినిమా ‘ఆడు మగాడ్రా బుజ్జి’. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మాతలు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అస్మిత విలేకరులతో మాట్లాడుతూ -‘‘ఇందులో నేను డాన్ చెల్లెల్ని. నా బ్యాగ్రౌండ్ చూసి నాతో మాట్లాడటానిక్కూడా కాలేజ్‌లో భయపడుతుంటారు. అలాంటి టైమ్‌లో మగాడిలా వస్తాడు సుధీర్. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటాడు. ఓవరాల్‌గా నా కోసం పోరాడే ఓ మగాడి కథ ఇది’’అని చెప్పారు. ఆమె ఇంకా మాట్లాడుతూ పోలీసుల్లా పనిచేసే అయిదుగురు సామాజిక కార్యకర్తల కథాంశంతో తెరకెక్కుతోన్న ‘ఆ అయిదుగురు’ చిత్రంలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా భిన్నమైన పాత్ర పోషిస్తున్నానని, ఫాజిల్ దర్శకత్వంలో అయిదు కథలతో తెరకెక్కిన ఓ మలయాళం చిత్రంలో నటించానని చెప్పుకొచ్చారు. ‘‘కన్నడ చిత్రం ‘విక్టరీ’ నా తొలి సినిమా. ఆ తర్వాత వరుణ్‌సందేశ్‌తో ‘బ్రహ్మిగాడి ప్రేమకథ’ సినిమా చేశాను. ప్రసుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తున్నాను. కెరీర్ గ్రాఫ్‌ని నెమ్మదిగా పెంచుకునే పనిలో ఉన్నాను’’ అని చెప్పారు.