గాజులంటే మోజు | Asmita sood chit chat with Sakshi cityplus | Sakshi
Sakshi News home page

గాజులంటే మోజు

Published Tue, Mar 17 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

గాజులంటే మోజు

గాజులంటే మోజు

అస్మితా సూద్... మోడల్ నుంచి నటిగా మారిన అమ్మాయి. దాదాపు 40 బ్రాండ్స్‌కి మోడల్‌గా చేసిన ఈ సిమ్లా యాపిల్... కామర్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. తెరపైన హాట్‌గా కనిపించినా... నేను చాలా సాఫ్ట్ అంటోందీ క్యూట్ గాళ్. సాధించాల్సిందెంతో ఉందంటున్న ఈ ముద్దుగుమ్మ... సిటీ గురించి చెబుతున్న ముచ్చట్లు.
- శిరీష చల్లపల్లి
 
 చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే కథక్ నేర్చున్నాను. బయట ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేదాన్ని. ఆ టైమ్‌లోనే నాకు క్లాస్‌మేట్స్ నుంచి ఫ్యాకల్టీనుంచి తెగ కాంప్లిమెంట్స్ వచ్చేవి. అంతే... మా పేరెంట్స్ కూడా నన్ను ఈ ఫ్యాషన్ అండ్ మోడలింగ్‌వైపు ఎంకరేజ్ చేశారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఎన్నో యాడ్స్ చేయగలిగాను. తరువాత ‘గెట్ గార్జియస్’ అనే రియాలిటీ షోలో చేశాను. ‘ఫెమినా మిస్ ఇండియా’ అందాల పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికయ్యాను. ఆ తరువాత కొద్దికాలానికే టాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి.
 
 ఆశ్చర్యపోయాను...
 బ్రహ్మిగాడి కథ సినిమాతో మొదటిసారిగా నేను హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడి స్టూడియోస్ నాకు అత్తవారిళ్లుగా అనిపించాయి. నేనెవరనేది సరిగ్గా తెలియనివారు కూడా నన్నో గాజుబొమ్మలాగా ట్రీట్ చేశారు. అంత మర్యాదగా ప్రవర్తించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా నా మొదటి సినిమాలో నన్ను నేను స్క్రీన్‌మీద చూసుకుని సంతోషించాను. ఆ తరువాత ‘ఆడు మగాడ్రా బుజ్జి’, ‘ఆ ఐదుగురు’ సినిమాల్లో చేశాను. టాలీవుడ్ పుణ్యమా అని మలయాళం, కన్నడ రంగాల్లో సైతం మంచి సినిమాలు చేశాను. ఇంకా కొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇప్పడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది. కృష్ణవంశీ, గౌతమ్ మీనన్‌ల దర్శకత్వంలో నటించాలని ఉంది.
 
 గారాబం ఎక్కువ...
 నేను పుట్టి పెరిగింది హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకు బిజినెస్ ఉంది. నాకో తమ్ముడు. ప్లస్‌టూ వరకు చదువంతా సిమ్లాలోనే సాగింది. డిగ్రీ మాత్రం ఢిల్లీలో చేశాను. చిన్నప్పటినుంచి చాలా సాఫ్ట్. అస్సలు అల్లరిచేసేదాన్ని కాదు. ఒక్క అమ్మాయినే కావడంతో పేరెంట్స్ కూడా బాగా గారాబం చేశారు. తమ్ముడికి, నాకు ఏజ్‌గ్యాప్ ఎక్కువగా ఉండటంతో కొట్టుకోవడం లాంటివేమీ ఉండేవి కాదు.
 
 చార్మినార్ బ్యాంగిల్స్...
 హైదరాబాద్‌కు వచ్చి నాలుగేళ్లు... ఈ పీరియడ్ తక్కువే అయినా ఎన్నో ఏళ్ల అనుబంధం ఏర్పడింది. నా మాతృభాష హిందీ అవ్వడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో భాష కాస్త ఇబ్బంది అయ్యింది. తరువాత తరువాత మేకప్‌మేన్ దగ్గరనుంచి ప్రొడక్షన్, కాస్ట్యూమ్, క్యారావాన్ వరకూ అంద రూ నాకు సపోర్ట్ చేసి తెలుగు నేర్పించారు. ఇప్పుడు బాగా మాట్లాడగలను. సిటీకి వచ్చిన కొత్తలో ఇక్కడి షాపింగ్ గురించి చాలా విన్నాను. అందుకే మొదటిసారి చార్మినార్‌కు వెళ్లాను. అక్కడ రకరకాల గాజుల సెట్స్ చూశాను. ఎంతో అందమైన రేర్ కలెక్షన్ ముత్యాల గాజులు, హ్యాండ్ మెయిడ్ బాంగిల్స్ కొన్నాను. అవి నాకు చాలా ఇష్టం. ట్రెడిషనల్‌గా తయారవ్వాల్సొస్తే... ఆ బ్యాంగిల్స్‌కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement