సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా? | Actress Asmita Sood Married Businessman Sid Mehta | Sakshi
Sakshi News home page

Asmita Sood: గత కొన్నేళ్లుగా ప్రేమ.. ఇప్పుడు బిజినెస్‌మ్యాన్‌తో యంగ్ హీరోయిన్ పెళ్లి

Published Tue, Feb 6 2024 12:33 PM | Last Updated on Tue, Feb 6 2024 12:55 PM

Actress Asmita Sood Married Businessman Sid Mehta - Sakshi

పలువురు హీరోయిన్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో బ్యూటీ చేరిపోయింది. 'బమ్మిగాడి కథ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఏడడుగులు వేసేసింది. గోవాలో పలువురు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.

(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!)

హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిపెరిగిన అస్మితా సూద్.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. అలా 'బమ్మిగాడి కథ' సినిమాతో నటిగా జర్నీ షురూ చేసింది. 'ఆడు మగాడ్రా బుజ్జి', 'ఓకే', 'ఆ ఐదుగురు' లాంటి సినిమాలు చేసింది. వీటితో పాటు కన్నడ, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. సినిమాల పరంగా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం హిందీలో షోలు చేస్తూ బిజీగా ఉంది.

అస్మిత.. గత కొన్నాళ్లుగా గుజరాతీ వ్యాపారవేత్త సిద్ మెహతాతో ప్రేమలో ఉంది. గతేడాది సెప్టెంబరులో వీళ్ల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు గోవాలో జరిగిన పెళ్లి వేడుకతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. అయితే పెద్దగా హడావుడి లేకుండా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. దీని తర్వాత ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి.

(ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement