ఫ్యా'షైన్' | Youth follows a shine of fashion trend | Sakshi
Sakshi News home page

ఫ్యా'షైన్'

Published Sat, Feb 28 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

ఫ్యా'షైన్'

ఫ్యా'షైన్'

ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్.. ఇలా రెగ్యులర్ చదువులు. ఆ తరువాత టెన్ టూ ఫైవ్ రొటీన్ జాబ్స్.  ఆసక్తులతో ఏమాత్రం సంబంధం లేకుండా చేసే ఉద్యోగాలపై నగర యువత విముఖత చూపుతోంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా... యూనిక్‌నెస్ ఉంటే చాలు. ఈ రంగంలో దూసుకుపోవచ్చు. అందుకే చదువుతో పనిలేకుండా ఆసక్తి, సృజనాత్మకతతో ముడిపడిన ఫ్యాషన్ డిజైనింగ్‌వైపే యువత మక్కువ ప్రదర్శిస్తోంది. విద్యార్థుల అభిరుచులకు తగినట్టుగా విద్యాసంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అలాంటి కోవకు చెందిందే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. రెగ్యులర్ డిజైన్స్‌కి భిన్నంగా వేస్ట్ ప్రొడక్ట్స్‌ను వినియోగించి వండర్‌ఫుల్ డిజైన్స్ సృష్టిస్తున్నారు ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు.
- శిరీష చల్లపల్లి
 
 హైదరాబాదీస్ ఆర్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. ఫ్యాషన్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్స్‌ని అప్‌డే ట్ చేసుకుంటున్న నగరం ఈ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీ పడుతోంది. ఆ పోటీని తట్టుకోవడానికి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలా ప్రత్యేక ఎయిమ్‌తో ప్రారంభమైందే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. డి.రవీందర్‌రెడ్డి ఈ ఫ్యాషన్ స్కూల్‌కు డెరైక్టర్. అంతకుముందు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్ (ఐఐఎఫ్‌టీడీ) ఫ్రాంఛైజీగా ఉన్న ఈయన... ఫ్యాషన్ రంగంలో మరింత ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఐఎఫ్‌ఎస్‌ను స్థాపించారు.
 
 పురికొస, పేపర్‌ముక్కా...
 చైతన్యపురిలో ఉన్న ఈ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థులు వినూతన్నమైన డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు. పురికొస, పేపర్‌ముక్క, షర్ట్ బటన్... కాదేదీ డిజైనింగ్ కనర్హం అంటున్నారు. పనికి రాకుండా పడి ఉన్న పాత న్యూస్‌పేపర్, షర్ట్ బటన్స్, మిగిలిపోయిన బట్టముక్కలతో ఫ్యాషన్‌కు రిక్రియేషన్ చేస్తున్నారు. క్రియేటివిటీకి చదువుతో పనిలేదు. టాలెంట్‌కు ప్రియారిటీ ఉన్న ఫ్యాషన్ రంగంలో క్రియేటివిటీతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఉన్నత చదువులు అదనపు అర్హత మాత్రమే. అందుకే ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నవారు సైతం ఈ ఎవర్ ఎండింగ్‌ఫీల్డ్‌పై అంతులేని ఉత్సాహం చూపుతున్నారు. విద్యార్థుల ఉత్సాహాన్ని బట్టి ఈ రంగంవైపు రావాలనుకునేవారికి స్కాలర్‌షిప్స్ కూడా అందిస్తోంది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. అంతేకాదు సృజనాత్మకత ఉండి... ఆర్థిక స్థోమత లేని యువతకు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తోంది.
 
 ట్రెడిషన్ మిస్‌కాకుండా...
 ఫ్యాషన్‌రంగం కలర్‌ఫుల్ ఫీల్డ్. దీన్ని ఎంచుకునేవారు సైతం డిఫరెంట్ ఐడియాస్ ఉన్నవారే ఉంటారు. ఉన్నత చదువులు చదివినవారే కాదు... టెన్త్ చదివినా ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేద్దామనుకుంటే చాలు. అదే వారి అర్హత. వేరే ఫీల్డ్‌తో పోల్చుకుంటే అవకాశాలు కూడా ఎక్కువ. అమ్మాయిలు ఎక్కువగా ఈ ఫీల్డ్‌వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూనే మా ఇనిస్టిట్యూట్‌లో ట్రెడిషన్ మిస్ కాకుండా చూస్తున్నాం.
 - మోనికా, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్ ఫ్యాకల్టీ
 
 టెన్షన్ ఫ్రీ...
 డిగ్రీ చేశాను. టెన్ టు ఫైవ్ జాబ్స్ చేయడం నాకు నచ్చదు. అందుకే పెళ్లయినా చిన్నప్పటినుంచే ఇష్టపడిన ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నా. ఫ్యూచర్‌లో జాబుకు వెళ్లి వచ్చి, ఫ్యామిలీని చూసుకోలేక టెన్షన్ పడేకన్నా... హ్యాపీగా ఇంటిదగ్గరే నా సొంత కలెక్షన్‌తో బొటిక్ పెట్టుకుని సెటిలవ్వొచ్చు.
 - రమ్య, ఫ్యాషన్ స్టూడెంట్
 
 ఎవర్ ఎండింగ్...
 ఇదొక ఇన్నోవేటివ్ ఫీల్డ్. ఈ డిజైనింగ్ ఫీల్డ్ ఎవర్ ఎండింగ్ బిజినెస్. ఒకరి మీద ఆధారపడకుండా కేవలం మన టాలెంట్‌ని బట్టి ఎదిగే బిజినెస్. అందుకే ఎన్నో ఆప్షన్స్ ఉన్నా... ఈ డిజైనింగ్ ఫీల్డ్‌నే ఎంచుకున్నా.
 - విజిత, ఫ్యాషన్ స్టూడెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement