పచ్చవెచ్చగా...
భోజనప్రియుులైన ‘సిటీ’జనుల జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు నగరంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు మెుదలుకొని ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకు చాలా కేంద్రాలు ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు, పిజ్జాసెంటర్లు వంటివి డోర్ డెలివరీ సేవలనూ అందిస్తున్నాయి. ఇవి సరఫరా చేసే వంటకాల రుచుల సంగతి సరే, మరి ఆరోగ్యం మాటేమిటి అని ఆందోళన చెందేవారూ లేకపోలేదు. ఆరోగ్య స్పృహ కలిగిన ఆహార ప్రియులు ఎలాంటి ఆందోళన లేకుండా ఆరగించగలిగే వంటకాలను కోరుకున్న చోటుకు తెచ్చి అందిస్తోంది ‘గ్రీన్‌బాక్స్’. వుధుమేహం, గుండెజబ్బులు గల వారికి ప్రత్యేకమైన భోజనాన్ని సైతం అందిస్తోంది. ఆరోగ్యకరమైన భోజనాన్ని ‘సిటీ’జనుల ఇంటి ముంగిటికి తెచ్చి అందించేందుకు వూదాపూర్‌లో గౌరవ్ శర్మ ‘గ్రీన్‌బాక్స్’ ప్రారంభించారు. ‘గ్రీన్‌బాక్స్’ ప్రత్యేకంగా ప్యాక్‌చేసిన వంటకాలు చాలాసేపటి వరకు వేడివేడిగానే ఉంటాయి.
నిపుణుల సలహాతో వంటకాల తయారీ
డైటీషియున్లు, ఆరోగ్య నిపుణుల సలహా సూచనల మేరకు తాజా పదార్థాలతో వంటకాలను కచ్చితమైన కేలరీల కొలతలతో తయూరు చేయుడం ‘గ్రీన్‌బాక్స్’ ప్రత్యేకత. వివిధ ప్రాంతాల రుచులు, ఆహారపు అలవాట్ల మేరకు నార్తిండియున్, సౌతిండియున్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందిస్తోంది. వుసాలా ఓట్స్‌తో వుసాలా ఫ్రెంచ్ మిసైల్, బేసన్ గోబీ చిల్లీ పరోటా, బేక్డ్ బీన్స్, టోస్ట్ బ్రెడ్స్, డైట్ షేక్స్, ఎగ్‌వైట్ స్పానిష్, వైట్ శాండ్‌విచ్, వీట్ ఆమ్లెట్, వీట్ డిన్నర్‌రోల్స్, ఇడ్లీ కొబ్బరి చట్నీ, ఊతప్పం, గార్డెన్‌ఫ్రెష్ సలాడ్, చికెన్ టిక్కా వుసాలా, చికెన్ చెట్టినాడు వంటి వెరైటీ రుచులను అందిస్తోంది. ‘గ్రీన్‌బాక్స్’ అందించే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ధరలు సైతం రెస్టారెంట్ల ధరలతో పోల్చుకుంటే తక్కువగానే ఉండటం విశేషం.
- శిరీష చల్లపల్లి