Fastfood centers
-
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు
సాక్షి, విజయవాడ: విజయవాడ నగర యువత, చిన్నారులు బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. బిర్యానీతోపాటు, నాన్‌వెజ్ వంటకాలను తరచూ లాగించేస్తున్నారు. ఆహారంలో నూనె, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో చిన్న వయసులోనూ ఊబకాయులుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సు, వృద్ధులు సంప్రదాయ, ఆర్గానిక్ ఆహారానికి మళ్లుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్ స్టాళ్లు వెలుస్తున్నాయి. నగరంలో బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి. ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్లు వంటి వంటలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం విజయవాడ గాయత్రి నగర్లో ఏర్పాటైన ఆర్గానిక్ స్టోర్ ఒబెసిటీతో ప్రమాదం ఇటీవల 26 ఏళ్ల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చేరాడు. ఊబకాయం వల్ల మెటబాలిజం దెబ్బతిని, నియంత్రణ లేని మధుమేహం, అధికరక్తపోటు కారణంగా అతను బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నప్పటి నుంచి అధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా చాలా మంది ఊబకాయంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నవయస్సులో ఒబెసిటీ ఉన్న వారిలో మధ్య వయస్సు వచ్చేసరికి మధుమేహం, రక్తపోటు, డైస్టిపీడెమియా వంటి వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఒబెసిటీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొల్రస్టాల్ గడ్డలు ఏర్పడి బ్రెయిన్‌స్ట్రోక్, హార్ట్ ఎటాక్ కూడా రావచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. ఇలా చేస్తే మేలు విద్యార్థులకు పాఠాలతోపాటు యోగా, ధ్యానంపై రోజూ గంట శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. ఆర్గానిక్ ఆహారానికి గిరాకీ మధ్య వయసు, వృద్ధుల ఆహార పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారు పాత తరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో ఆర్గానిక్ పంటలు, ఆహార పదార్థాల స్టాళ్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా భుజిస్తున్నారు. -
బర్గర్ కింగ్ ఐపీవో ధర రూ. 59-60
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. డిసెంబర్ 2న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూ 4న(శుక్రవారం) ముగియనుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 59-60. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులను బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇదే గుణిజాల్లో రూ. 2 లక్షల విలువ మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. దేశీయంగా లిస్టయిన ప్రత్యర్ధి సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్థాయిలో బర్గర్ కింగ్‌కు ప్రీమియం విలువ లభించకపోవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సహచర ఈక్విటీ విశ్లేషకులు కేశవ్ లహోటీ ఐపీవో సందర్భంగా అంచనా వేశారు. జూబిలెంట్.. లాభాలు సాధిస్తున్నకంపెనీ కావడంతోపాటు పిజ్జా బ్రాండు దేశీయంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. -
వామ్మో.. చై'నో'..
సాక్షి,సిటీబ్యూరో: ఇందుగలదందు లేదని సందేహము వలదన్నట్టు ఎందెందు వెతికినా అందందే కలదేమో అన్నట్టు నగరంలో విభిన్న రకాలుగా అల్లుకుపోయిన ఒక విదేశీ సంస్కృతి క్రమక్రమంగా అదృశ్యమవుతున్న దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఆహారం నుంచి ఇంటికి మేలు చేసే వాస్తు దాకా అన్నింట్లో తానే అన్నట్టు మనతో కలగలసిపోయిన చైనా.. నిన్నటి సంగతి. కరోనా వైరస్ కావచ్చు.. ఆ దేశంతో వైరం కావచ్చు.. నాటి చైనా వైభవం ఇక అసంభవం. విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోతున్న క్రమంలో భిన్న సంస్కృతులు మేళవింపు సాధారణమైపోయిన పరిస్థితుల్లో.. చైనా సంస్కృతి మన నగరంతో రకరకాలుగా పెనవేసుకుపోయింది. మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా మన సంస్కృతితో మమేకమైన డ్రాగన్ కంట్రీ శరవేగంగా తన ప్రాభవం కోల్పోతోంది. ఫుడ్‌కి గుడ్‌బై.. చైనా ఫాస్ట్ ఫుడ్‌కి నగరంలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.. వాటితో మొదలై తర్వాత తర్వాత చైనీస్ వంటకాలకు ప్రత్యేకించిన రెస్టారెంట్స్ కూడా వెలిశాయి. సికింద్రాబాద్‌లోని ఒక చైనీస్ రెస్టారెంట్ అయితే వారాంతాల్లో ముందస్తు రిజర్వేషన్ లేకపోతే సీట్ దొరికేది కాదు. అలాంటి చైనీస్ రెస్టారెంట్స్ కరోనా దెబ్బకి కునారిల్లిపోయాయి. వైరస్ అక్కడి ఆహారపు అలవాట్ల ద్వారానే వ్యాపించిందనే సందేహాల మధ్య నగరవాసులు చైనీస్ రెస్టారెంట్స్‌కి గుడ్‌బై చెప్పేశారు. నగరంలో దాదాపు 10 దాకా ఉన్న చైనా రెస్టారెంట్స్‌లో కొన్ని మూతపడగా మరికొన్ని మల్టీక్యుజిన్ రెస్టారెంట్స్‌గా మారే క్రమంలో ఉన్నాయి. ఇక రెస్టారెంట్స్ మెనూలో చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అట్టడుగుకు చేరాయి. నామ్ బదల్‌గయా.. అదేవిధంగా తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్ తదితర వస్తువులకు పేరొంది, సిటిజనుల ఆదరణ చూరగొన్న చైనా బజార్లు కూడా తీరూ.. పేరూ మార్చేసుకున్నాయి. కొన్ని చైనా బజార్లు జనతా బజార్, ఇండియన్ బజార్.. తదితర పేర్లతో కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. దశాబ్ధాలుగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి షాపింగ్‌కి కేరాఫ్‌గా మారిన ఈ బజార్లు ఇప్పుడు చైనాని తలచుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. గృహాలంకరణలో భాగంగా ఒకప్పుడు చైనా ఉత్పత్తులను విరివిగా విక్రయించినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదు. హైదరాబాద్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ వ్యాస్ మాట్లాడుతూ డిసెంబరు నుంచే తాము చైనీస్ ఉత్పత్తులను కొనడం మానేశామన్నారు. దీనికి కరోనా వైరస్ ప్రధాన కారణమన్నారాయన. గిఫ్ట్ ఐటమ్స్, దుస్తులు, బ్యాగ్స్, వాచీలు, బెల్ట్సŠ, లగేజ్, కిచెన్ ఐటమ్స్, ఫుట్‌వేర్ తదితర చైనీస్ ఉత్పత్తులు 20–30శాతం వరకూ విక్రయించే స్టోర్లు నగరంలో 150 నుంచి 200 దాకా ఉన్నాయంటున్న ఆయన చైనీస్ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలనే నిర్ణయం ప్రభావం కనిపిస్తోందన్నారు. అయితే మార్కెట్ నుంచి అవి సంపూర్ణంగా అదృశ్యం కావాలంటే మాత్రం కాస్త టైమ్ పడుతుందని స్పష్టం చేశారు. వాస్తు, జ్యోతిషం.. వద్దే వద్దు.. కొంతకాలం క్రితమే నగరంలో ప్రవేశించిన చైనా వాస్తు అనూహ్యంగా సిటీలోని సంపన్నుల ఇళ్లలో కొలువుదీరిన సంగతి తెలిసిందే. చైనా కలెక్షన్లో భాగమైన లాఫింగ్ బుద్ధ, బాంబూట్రీ తదితరాలు లేని ఇళ్లు అరుదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు చాలా స్టోర్స్‌లో ఫెంగ్ షుయ్ విక్రయాలు పడిపోయాయి. మరోవైపు చైనీయుల జ్యోతిష శాస్త్రానికి కూడా సిటీలో మంచి పాప్యులారిటీ ఉండేది. చైనీయుల టారో కార్డ్స్ ఆధారంగా జోస్యం చెప్పే స్పెషలిస్ట్లకూ మంచి డిమాండ్ ఉండేది. అలాంటిది ఇప్పుడు వీరికీ సిటిజనుల నుంచి నిరాదరణే ఎదురవుతోంది. ఇదే విధంగా సిటీలో చైనీస్ ఆర్ట్‌ని నమ్ముకున్న ఆర్టిస్టులూ ఉన్నారు. వారికి కూడా ఇప్పుడు మొండి చెయ్యి ఎదురయ్యే పరిస్థితి ఉంది. అలాగే నగరంలోని చైనీస్ మెథడ్స్ ఉపయోగించి సౌందర్య చికిత్సలు అందించే కొన్ని చైనీస్ పార్లర్స్ కూడా తమ స్పెషలైజేషన్‌కి మంగళం పాడే పనిలో ఉన్నాయి. కరోనా వైరస్ రాకతో మొదలైన ఈ మార్పు చేర్పులు బోర్డర్లో ఆ దేశం మనతో కయ్యానికి కాలు దువ్వడంతో బాగా ఊపందుకున్నాయి. ఏదేమైనా ఈ పరిస్థితి కొనసాగితే ఎంతోకాలంగా నగరంలో భిన్నరూపాల్లో వేళ్లూనుకున్న చైనా కల్చర్ శరవేగంగా అంతర్ధానం అవడం ఖాయంగా కనిపిస్తోంది. -
బయటి తిండితో హార్మోన్ సమస్యలు
అవసరం కొద్దీ అనివార్యంగా కొందరు బయటి తిండి తింటుంటారు. ఇంకొందరు రుచుల కోసం బయటి తిండికి అలవాటు పడుతుంటారు. కారణాలు ఏవైనా సరే, బయటి తిండి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని ఒక తాజా అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినే తిండి వల్ల జీర్ణకోశ సమస్యలు, స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం, ప్యాకింగ్ కోసం వాడే పదార్థాల్లో ఉండే ఫ్తాలేట్స్ అనే రసాయనాలు ఆహారంలో కలుస్తాయని, ఇలాంటి చోట్ల ఆహారం తీసుకున్నట్లయితే, ఆ రసాయనాలు శరీరంలోకి చేరి, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పరీక్షల్లో తేలినట్లు ‘ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్’ జర్నల్ ఒక వ్యాసంలో వెల్లడించింది. -
పచ్చవెచ్చగా...
భోజనప్రియుులైన ‘సిటీ’జనుల జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు నగరంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు మెుదలుకొని ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకు చాలా కేంద్రాలు ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు, పిజ్జాసెంటర్లు వంటివి డోర్ డెలివరీ సేవలనూ అందిస్తున్నాయి. ఇవి సరఫరా చేసే వంటకాల రుచుల సంగతి సరే, మరి ఆరోగ్యం మాటేమిటి అని ఆందోళన చెందేవారూ లేకపోలేదు. ఆరోగ్య స్పృహ కలిగిన ఆహార ప్రియులు ఎలాంటి ఆందోళన లేకుండా ఆరగించగలిగే వంటకాలను కోరుకున్న చోటుకు తెచ్చి అందిస్తోంది ‘గ్రీన్‌బాక్స్’. వుధుమేహం, గుండెజబ్బులు గల వారికి ప్రత్యేకమైన భోజనాన్ని సైతం అందిస్తోంది. ఆరోగ్యకరమైన భోజనాన్ని ‘సిటీ’జనుల ఇంటి ముంగిటికి తెచ్చి అందించేందుకు వూదాపూర్లో గౌరవ్ శర్మ ‘గ్రీన్‌బాక్స్’ ప్రారంభించారు. ‘గ్రీన్‌బాక్స్’ ప్రత్యేకంగా ప్యాక్చేసిన వంటకాలు చాలాసేపటి వరకు వేడివేడిగానే ఉంటాయి. నిపుణుల సలహాతో వంటకాల తయారీ డైటీషియున్లు, ఆరోగ్య నిపుణుల సలహా సూచనల మేరకు తాజా పదార్థాలతో వంటకాలను కచ్చితమైన కేలరీల కొలతలతో తయూరు చేయుడం ‘గ్రీన్‌బాక్స్’ ప్రత్యేకత. వివిధ ప్రాంతాల రుచులు, ఆహారపు అలవాట్ల మేరకు నార్తిండియున్, సౌతిండియున్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందిస్తోంది. వుసాలా ఓట్స్‌తో వుసాలా ఫ్రెంచ్ మిసైల్, బేసన్ గోబీ చిల్లీ పరోటా, బేక్డ్ బీన్స్, టోస్ట్ బ్రెడ్స్, డైట్ షేక్స్, ఎగ్‌వైట్ స్పానిష్, వైట్ శాండ్విచ్, వీట్ ఆమ్లెట్, వీట్ డిన్నర్రోల్స్, ఇడ్లీ కొబ్బరి చట్నీ, ఊతప్పం, గార్డెన్ఫ్రెష్ సలాడ్, చికెన్ టిక్కా వుసాలా, చికెన్ చెట్టినాడు వంటి వెరైటీ రుచులను అందిస్తోంది. ‘గ్రీన్‌బాక్స్’ అందించే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ధరలు సైతం రెస్టారెంట్ల ధరలతో పోల్చుకుంటే తక్కువగానే ఉండటం విశేషం. - శిరీష చల్లపల్లి