కొత్త ఏడాదిలో బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసేందుకు రెడీ అయిపోయింది. 2011లో టాలీవుడ్‌లో చిత్రం బ్రమ్మిగాడి కథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్. ఆ తర్వాత ఫిర్ భీ నా మానే...బడ్తమీజ్ దిల్ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అస్మితా తన ప్రియుడు సిద్ధ్ మెహతాను పెళ్లాడనుంది.
త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త సిధ్ మెహతాతో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది. ఈ జంట ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.
కాగా.. గతేడాది అక్టోబర్‌లో అస్మిత, సిద్ధ్ మెహతాతో కలిసి వేకేషన్ వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అప్పట్లో ఆమె ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఏడాదిన్నర కాలంగా డేటింగ్‌లో ఉన్నా ఈ జంట.. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకుంది.కాగా.. అస్మితా సూద్ చివరిగా ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment