Varun Sadensh
-
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. పడ్డానండీ ప్రేమలో మరి(2015) సినిమా నుంచి వివాహబంధంలో అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలైన మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలాకాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారి సరికొత్త జర్నీని కొనసాగించింది.ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక. అందుకు సంబంధించిన పలు విషయాలను ఆమె తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయింది. 'పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలోని చిన్నపిల్లలను అందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 2016లో పెళ్లైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడకు వెళ్లాం. అక్కడే కొంతకాలం ఉన్నాం. ఈ క్రమంలో 2018లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేశాం. సంబరాలు చేసుకున్నాం. కానీ, కొద్దిరోజుల్లోనే గర్భస్రావం అయింది. ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చేశాం. ఇక్కడకు వచ్చాకా రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ చేప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. కొద్దిరోజుల క్రితమే గర్భస్రావం అయిన విషయాన్ని చెప్పాను. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని చెప్పారు. మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారు. అని వితికా ఎమోషనల్ అయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత తామిద్దరం బిగ్ బాస్‌కు వెళ్లడం.. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్‌లతో మళ్లీ ఫైనాన్సియల్‌గా సెటిల్ కావడం జరిగిందని ఆమె తెలిపింది. దేవుడు కరుణిస్తే పిల్లిలు వద్దనుకునేవాళ్లు ఎవరుంటారని ఆమె చెప్పింది. నిజంగానే తమ జీవితంలోకి ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని వితికా చెప్పుకొచ్చింది. వితికా ఇప్పుడు తమ ఫ్యామిలీలో వరుణ్‌తో పాటుగా తను కూడా ఒక ఫ్యామిలీస్టార్గా ఉంది. రీసెంట్గా తన చెల్లి పెళ్లి కూడా చేసింది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంది. తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు. -
16 ఏళ్ల వయసులో ఛాన్సుల కోసం వెళ్తే.. అమ్మ ముందే ఇలా అడిగారు: వితికా
టాలీవుడ్లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ వితికా షెరు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. భీమవరంలో జన్మించిన ఈ బ్యూటీ మొదట కన్నడ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట 2008లో 'అంతు ఇంతు ప్రీతి బంతు' (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడ చిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో రాణించాలని టాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. తనకు 16 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్తే తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.కన్నడ సినిమా తర్వాత తెలుగులో అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు అప్పటి రోజులను వితికా గుర్తుచేసుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇన్‌స్టాలో ఫోటోలు,రీల్స్ పెట్టినా ఛాన్సులు వస్తున్నాయని ఆమె తెలిపింది. కొంతమంది తన కలర్ తక్కువని కూడా రిజక్ట్ చేశారని ఇలా తెలిపింది. 'నా పేరు వితికా షెరు.. వినగానే కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో అందరూ నన్ను నార్త్ అమ్మాయి అనుకుని ఆడిషన్స్‌కు పిలిచేవారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత ఓహ్.. తెలుగు అమ్మాయివేనా అంటూ కాస్త చులకన చేసి మాట్లాడేవారు. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్సు కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతని ముందుకు వచ్చాను. కమిట్మెంట్ అంటున్నారు ఎంటో తెలియడం లేదు మాట్లాడు అని నాతో అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్‌కు నేను నో చెప్పాను. సార్, రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్ ఇవ్వండి అని కోరాను. కానీ, ఇలాంటి కమిట్మెంట్ వంటి కండీషన్‌కు ఒప్పుకోను అని చెప్పాను. అలా 16 ఎళ్ల వయసులోనే నేను ఇలాంటి సంర్భాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ల సినిమా ఆఫీస్ కూడా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లోనే ఉండేది. మాకు బాగా తెలిసిన వారే నన్ను కమిట్మెంట్ అడిగారు.' అని వారి పేర్లు చెప్పకుండా వితికా దాటవేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరం అయినట్లు ఆమె పేర్కొంది. కొంత కాలం తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి 2016, ఆగస్టు 19న వితిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్ చేస్తుంది. -
పెళ్లికి సిద్ధమైన వరుణ్ సందేశ్ హీరోయిన్..!
కొత్త ఏడాదిలో బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇప్పటికే స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసేందుకు రెడీ అయిపోయింది. 2011లో టాలీవుడ్లో చిత్రం బ్రమ్మిగాడి కథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ అస్మితా సూద్. ఆ తర్వాత ఫిర్ భీ నా మానే...బడ్తమీజ్ దిల్ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అస్మితా తన ప్రియుడు సిద్ధ్ మెహతాను పెళ్లాడనుంది. త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన వ్యాపారవేత్త సిధ్ మెహతాతో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది. ఈ జంట ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో అస్మిత, సిద్ధ్ మెహతాతో కలిసి వేకేషన్ వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అప్పట్లో ఆమె ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఏడాదిన్నర కాలంగా డేటింగ్లో ఉన్నా ఈ జంట.. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకుంది.కాగా.. అస్మితా సూద్ చివరిగా ‘జనమ్ జనమ్ కా సాత్’లో కనిపించింది. View this post on Instagram A post shared by Asmita Sood (@asmita_s)