neha dhupia
-
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
నేహా ధూపియా అనుసరించే గ్లూటెన్-ఫ్రీ డైట్ అంటే..!
బాలీవుడ్ నటి నేహా ధూపియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మోడల్, ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. అలాగే 2002లో మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్య వహించింది. బాలీవుడ్లో అనేక బ్లాక్బాస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకోవడమే గాక అనేక రియాలిటీ షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ..విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆమె అంగద్ బేడీని 2018లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లకు జన్మనివ్వడంతో లావుగా అయిపోయారు. అయితే అనుకోకుండా ఒక రోజు మీడియా కంట పడటంతో..ఒక్కసారిగా ఆమె అధిక బరువు గురించి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏకంగా 23 కిలోలు బరువు తగ్గి ఇదివరకటి నేహాలా నాజుగ్గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది.పైగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే గాక..పలు ఆఫర్లను కూడా అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు తన అభిమానుతో తన వెయిట్ లాస్ జర్నీ గురించి, అందుకు సంబంధించిన చిట్కాలను కూడా షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆరోగ్య స్ప్రుహ కలిగించే నేహా తాజాగా డైట్‌కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం షేర్ చేసుకుంది. అదేంటంటే..డైట్ పాటించేటప్పుడూ కేవలం బరువు తగ్గేందుకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా గ్లూటెన్ ఫ్రీ డైట్‌ని అనుసరించమని చెబుతోంది. మంచి శరీరాకృతి తోపాటు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడమని ధీమాగా చెబుతోంది నేహా. దీన్ని అత్యంత రుచికరమైన రీతిలో తయారు చేసుకుంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌ని ఇష్టంగా తినగలుగుతారని అంటోంది. తాను అరటిపండ్లతో చేసిన పాన్కేక్, తాజా బెర్రీలు, లావెండర్ జామ్ వంటివి తీసుకుంటానని చెబతుతోంది. గ్లూటెన్ ఫ్రీ ఆహారపదార్థాలను ఎంపిక చేసుకుని మరీ డైట్‌ని ప్రారంభిస్తే మంచి ఫలితం ఉండటమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందని తెలిపింది. గ్లూటెన్ డైట్ అంటే..గ్లూటెన్ రహిత ఆహారంమే తీసుకోవడం. అందుకోసం గ్లూటెన్ లేని పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటిఆహారాలనే తీసుకుంటారు. అలాగే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ లేదా పాస్తా వంటివి కూడా తీసుకుంటారు. ఎవరికి మంచిదంటే..గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పడని వాళ్లకు, గోధుమ పిండితో చేసిన వంటకాలు తింటే ఎలెర్జీ లేదా జీర్ణశయాంతర సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ డైట్ మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణుల. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిదే. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీకి ప్రత్యామ్నాయంగా మంచి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత ఆరోగ్య నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం.(చదవండి: కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?) -
అప్పుడే దీపావళి షాపింగ్ షురూ చేసిన నటి (ఫొటోలు)
-
నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఏకంగా 14 గంటలు..!
మహిళలు ప్రసావానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు తల్లికి మహాకష్టం. వారు తమ పనులు తాము చేసుకునే స్థాయికి చేరుకునేంత వరకు కూడా పిలల సంరక్షణ తల్లిదే భాద్యత. అందువల్ల ఏ మహిళైన తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారిండం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా కొందరూ తగ్గగలుగుతారు. అదేమంతా అసాధ్యమైన విషయం కాదని బరువు తగ్గి మరి చూపించింది బాలీవుడ్ నటి నేహా ధూపియా. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ప్రసవానంతరం విపరీతమైన బరువు పెరిగిపోయింది. అయితే జస్ట్ ఒక్క ఏడాదిలోనే తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మరీ కిలోలు కొద్ది బరువు తగ్గింది. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది.బరువు తగ్గడం అనేది అంత సులభమైనది కాదు. అందులోనూ ప్రసవానంతర బరువు తగ్గడం అంటే ఇంకా కష్టం. కానీ నేహా తన సంకలప్పంతో బరువు తగ్గి మరీ చూపించింది. అలా ఆమె ఏకంగా 23 కిలోల వరకు బరువు తగ్గిపోయింది. 43 ఏళ్ల ధూపియా ఇదంతా అంత సులభమైనది కాదంటూ తన వెయిట్ లాస్జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ముందుగా బరువు తగ్గేందుకు చేసిన వర్కౌట్లు వంటి వాటితో విపరీతమైన అలసట, వొళ్లు నొప్పులు వచ్చేసేవి. ఆ తర్వాత తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టానంటు చెప్పుకొచ్చింది. తీసుకునే ఆహారంలో గ్లూటెన్ లేకుండా జాగ్రత్త పడింది. దాదాపు 14 గంటలు ఉపవాసం వంటివి చేసి 23 కిలోలు మేర బరువు తగ్గినట్లు తెలిపింది. అయితే ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం,డైట్ విషయంలో నియమాలు పాటించినట్లు వివరించింది. అందువల్ల సులభంగా బరువు తగ్గి, మంచి ఫిట్‌గా ఉండగలిగానని చెప్పింది నేహా. ఇక్కడ ఒక్కోసారి డైట్ లేదా వ్యాయామాలు స్కిప్ అయిన నిరాశపడొపోకుండా..తర్వాత రోజు నుంచి కొనసాగించడమే గాకుండా బరువు తగ్గుతాను అనే పాజిటివ్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటుంటే ఆటోమేటిగ్గా చక్కగా బరువు తగ్గిపోతారని చెబుతోంది నెహా ధూపియా. అంతేగాదు వాకింగ్, జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకుంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమంటూ పలు ఆసక్తికర విషయాలు ూడా చెప్పుకొచ్చింది.అవేంటంటే..సమతుల్య ఆహారం తీసుకోండిఅతిగా తినకుండా కొలత ప్రకారం తీసుకునేలా మైండ్ సిద్ధం చేసుకోండిలీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వండినీరు బాగా త్రాగండిచక్కెర పానీయాలు నివారించండిజంపింగ్, రన్నింగ్ లేదా డ్యాన్స్ వంటివి చేయండిపుష్ అప్స్, స్క్వాట్ల, ప్లాంక్‌లు వంటి వ్యాయామాలు చేయండికాస్త విరామం ఇచ్చి ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వండి. మైండ్‌ఫుల్ ఈటింగ్ వంటి టెక్నీక్లతో ఆకలిని నియంత్రించండి. తగినంత నిద్రపోండి.ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అయితే ఇంట్లోనే సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది నేహా ధూపియా.(చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!) -
23 కిలోలు తగ్గా.. అప్పటినుంచే ఎక్కువ ఆఫర్లు: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి, మోడల్ నేహా ధూపియా.. ఇద్దరు పిల్లల తల్లయినా ఫిట్‌నెస్‌లో అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రెగ్నెన్సీ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకుని మరింత ధృడంగా తయారైంది. గర్భం దాల్చిన రెండుసార్లు 23-25 కిలోల దాకా బరువు పెరిగినట్లు తెలిపింది. నేహా మాట్లాడుతూ.. మెహర్ పుట్టాక లాక్డౌన్ వచ్చిపడింది. ఇంటిదగ్గరే ఉన్నాం కాబట్టి డైట్ పాటించి బరువు తగ్గాను. ఇంతలో మూడేళ్లకే మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యా.. అలా బరువు పెరిగాను.23 కిలోలు తగ్గా..డెలివరీ తర్వాత నేనెంత లావు అవుతాను? ఎలా కనిపిస్తాననేది ఆలోచించలేదు. నా పిల్లలిద్దరికీ ఏడాది వయసొచ్చేదాకా పాలిచ్చాను. గతేడాది వరకు శరీరంపై ఫోకస్ పెట్టలేదు. ఎప్పుడైతే ఫిట్నెస్ ఆలోచన వచ్చిందే వెంటనే ఎక్సర్సైజ్, డైట్ వంటివి పాటించడం మొదలుపెట్టాను. అలా 23 కిలోలు తగ్గిపోయాను. అయినా ఇంకా నేను అనుకున్నంత బరువు తగ్గలేదు. త్వరలోనే ఆ లక్ష్యాన్ని చేరతాను.ఆఫర్లు తగ్గిపోయాయిసంతోషకరమైన విషయం ఏంటంటే.. ఈ బరువు తగ్గడమనేది నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది. వెయిట్ లాస్ అయినప్పటినుంచే నాకు ఆఫర్లు రావడం ఎక్కువయ్యాయి. బరువు తగ్గడం కోసం నేను మరీ అంత కఠిన ఎక్సర్సైజ్లు పాటించలేదు. రన్నింగ్ చేస్తాను, అప్పుడప్పుడు జిమ్‌కు వెళ్తాను. చక్కెర, గ్లుటెన్, ఫ్రై చేసిన పదార్థాలను తీసుకోవడం మానేశాను. రాత్రి ఏడింటికే డిన్నర్ ముగిస్తాను. ఇవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పుకొచ్చింది.సినిమాలుకాగా నేహా ధూపియా తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమవీరచక్ర సినిమాల్లో నటించింది. హిందీలో ఖయమత్, జూలీ, ఫైట్ క్లబ్, గరం మసాలా, ఢిల్లీ హైట్స్, చుప్ చుప్కే, రష్, బ్యాడ్ న్యూస్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: ప్రభాస్ కల్కి.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
‘కిల్’ ప్రీమియర్ షోలో మెరిసిన బాలీవుడ్ భామలు (ఫొటోలు)
-
ధోని షాట్లకు ఫిదా.. భయపెట్టేసింది! ఈమె ఎవరో గుర్తుపట్టారా?
ఐపీఎల్-2024.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ మ్యాచ్.. మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగగానే వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది. ముంబై ఇండియన్స్ అభిమానులు సైతం ఈ సీఎస్కే స్టార్ హిట్టింగ్ బాదితే చూడాలని తహతహలాడిపోయారు. వారి అంచనాలను నిజం చేస్తూ ధోని ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో (చివరి ఓవర్ మూడు, నాలుగు, ఐదో బంతికి) హ్యాట్రిక్ సిక్సర్లతో ధోని కనువిందు చేశాడు. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి.. గంతులేస్తూ ‘తలా’ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా అయితే ధోని బాదిన షాట్లకు ఫిదా అయింది. సంతోషం పట్టలేక పెద్దగా అరుస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు.. ‘‘వామ్మో.. నీ రియాక్షన్ భయపెట్టేలా ఉంది. మరీ అంత ఆనందమా?’’ అంటూ తమదైన శైలిలో నేహాను సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ముంబై- చెన్నై మ్యాచ్‌కు నేహా ధుపియా తన భర్త అంగద్ బేడి, స్నేహితులు కరీనా కపూర్, జాన్ అబ్రహంలతో కలిసి హాజరైంది. కాగా అంగద్ బేడి అండర్-19 స్థాయిలో ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత మోడల్‌గా మారి నటుడిగానూ ఎదిగాడు. ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లు ►వేదిక: వాంఖడే, ముంబై- ఆదివారం ►టాస్: ముంబై.. బౌలింగ్ ►చెన్నై స్కోరు: 206/4 (20) ►ముంబై స్కోరు: 186/6 (20) ►ఫలితం: 20 పరుగుల తేడాతో ముంబైపై చెన్నై విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీశ పతిరణ(4/28). చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Merry Christmas Movie Premiere: 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రీమియర్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఎవరూ నమ్మలేరు ఈ హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే
బాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మంచి అభిమానులను కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ చిత్రాలలో పనిచేశారని చాలా కొద్ది మందికి తెలుసు. మరోవైపు, పాకిస్థానీ నటలు కూడా బాలీవుడ్లో పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. పాకిస్థాన్ సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన కొంతమంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో మీరు తెలుసుకోండి. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. ఇండియాలో ఆమెకున్న పాపులారిటీ వల్ల పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. పాకిస్థానీ చిత్రం 'కభీ ప్యార్ నా కర్ణా'లో ఆమె ఐటెం సాంగ్‌లో కనిపించింది. ఈ చిత్రంలో పాకిస్థానీ నటీనటులు వీణా మాలిక్, మోఅమర్ రాణాతో పాటు జారా షేక్ ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ ఖేర్ ‘కిరణ్ ఖేర్’ అనే పేరు అందరికీ సుపరిచితమే. ఆమె 1985లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను వివాహం చేసుకుంది. ఆమె నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ నుంచి చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. 2003లో పాకిస్థాన్‌లో విడుదలైన చిత్రం 'ఖామోష్ పానీ'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటితో సహా ఈ చిత్రానికి కిరణ్ ఖేర్ అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు శ్వేతా తివారీ బాలీవుడ్ 'బిగ్ బాస్ 4' విజేత, ప్రసిద్ధ టీవీ షో 'కసౌతి జిందగీ కి' స్టార్ అయిన శ్వేతా తివారీ 2014లో విడుదలైన పాకిస్థానీ యాక్షన్ రొమాన్స్ చిత్రం 'సుల్తానాత్'లో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది పాకిస్థానీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పబడుతోంది. రూ. 22 కోట్ల బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడిస్తూ తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణులు కూడా కోరింది. అమృత అరోరా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోదరినే అమృతా అరోరా బాలీవుడ్లో నటిగా రాణించలేకపోయింది, అందుకే ఆమె హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే అమృత ఓ పాకిస్థానీ సినిమాలో పని చేసిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమృతా అరోరా 'గాడ్‌ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్తానీ ఉస్మాన్ అఫ్జల్ అనే క్రికెటర్‌తో డేటింగ్ చేసి 2009లో షకీల్ లడక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శిల్పా శుక్లా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'చక్ దే ఇండియా' సినిమాతో తనకు భారీగా గుర్తింపు దక్కింది. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శిల్పా శుక్లా పాకిస్థానీ సినిమాలో కూడా నటించింది. ఆమె పాకిస్థానీ చిత్రం 'ఖామోష్ పానీ'లో కిరోన్ ఖేర్‌తో కలిసి నటించింది. బాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువే అయినా 2014లో వచ్చిన B.A PASS సినిమాకు నేషనల్ అవార్డ్‌ను అందుకుంది. ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. గతేడాది ఏ థర్స్డే అనే చిత్రంలోనూ నటించింది. అయితే తాజాగా ఓ ఆన్ లైన్ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు) అయితే బాలీవుడ్ నటుడైన అంగద్ బేడీని మే 2018లో నేహా ధూపియా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొద్ది నెలలకే ఓ బిడ్డకు కూడా జన్మినిచ్చారు. దీంతో తమపై చాలా సార్లు ట్రోల్స్ వచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదని తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెళ్లికి ముందే తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వెల్లడించింది. (ఇది చదవండి: నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!) 72 గంటల్లోనే పెళ్లి: నేహా గర్భం ధరించిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో పెళ్లికి కేవలం 72 గంటల సమయమే ఇచ్చారని నేహా తెలిపింది. దీంతో ముంబయిలో కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే ప్రెగ్నెన్నీ విషయం బయటకు చెప్పేందుకు తాము చాలా ఉద్వేగానికి లోనయ్యామని వివరించింది. కాగా.. 2018లో ఒక్కటైన ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
మహిళల కోసం ఢిల్లీ కమిషన్ మెట్లెక్కిన హీరోయిన్లు
Yami Gautam Neha Dhupia Visit Delhi Commission For Women: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువైంది. బీటౌన్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం 'ఏ థర్స్డే' మంచి విజయాన్ని సాధించింది. ఇందులో లైంగిక వేధింపులకు గురైనా బాధితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులతోపాటు విమిర్శకులను సైతం మెప్పించింది యామీ గౌతమ్. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా అత్యాచార వేధింపులకు గురైన మహిళల భద్రత కోసం, వారికి పునరావాసం కల్పించేందుకు మజ్లీస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. చదవండి: సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్‌లో ఇలా ఈ క్రమంలోనే యామీ గౌతమ్ ఢిల్లీ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లింది. ఆమెతోపాటు సినిమాలోని తనతోపాటు నటించిన హీరోయిన్ నేహా ధూపియా కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఢిల్లీ మహిళా కమిషన్‌ను సందర్శించారు. కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్తోపాటు ఇతర అధికారులతో చర్చించారు. ఢిల్లీలో మహిళల భద్రత, భరోసా కోసం వారు చేపట్టిన వివిధ కార్యాక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మహిళలపై హింసకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఉన్న 181 హెల్ప్‌లైన్ నంబర్, దాని పనితీరు గురించి వివరంగా తెలుసుకున్నారు. చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్ ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సత్వర చర్యలు తీసుకునేందుకు పెట్రోల్ వ్యాన్లు పంపిస్తారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాలో చూపించినట్లు మహిళల భద్రత కోసం చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని యామీ తెలిపారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, ఇతర అధికారులను కలవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రత కోసం ఈ బృందం చూపిన చొరవపట్ల అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు యామీ గౌతమ్. కాగా యామీ గౌతమ్, నేహా ధూపియా నటించిన 'ఏ థర్స్డే' చిత్రం ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్టీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా, అంగద్ బేడీల మెహర్ కూతురు ఈ రోజుతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేహా ధూపియా తన కుమార్తె మెహర్‌కోసం ఒక అద్భుతమైన పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా మెహర్‌కు స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపింది. (Nayanthara Birthday Special: డేరింగ్ అండ్ డాషింగ్ నయన్ ‘తార’) రెండవ బిడ్డ కడుపులో ఉండగా నేహా ధూపియా మెహర్‌తో కలిసివున్న తన ప్రసూతి ఫోటోషూట్ ఫోటోను పోస్ట్ చేస్తూ ఇలా తెలిపింది, " మూడేళ్ల క్రితం ఇదే రోజు ఉదయం 11.25 గంటలకు... నా శరీరానికి ఆవల నా గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. నా బంగారు తల్లీ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రేమ అంటే ఏమిటో నువ్వేగా మాకు నేర్పించావు. నువ్వొక అద్భుతానికి.. ఎప్పుడూ లేనిది, మాటలు రావడం లేదు అమ్మకు’’ . కాగా నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులకు 2018లో నవంబర్ 18న మెహర్ పుట్టింది. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 3న తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నేహూ భర్త అంగద్ బేడి , పిల్లల చిత్రాలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తన కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, నటుడు అంగద్ బేడిని నేహా 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) -
మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి
Neha Dhupia, Angad Bedi Blessed with Baby Boy: బాలీవుడ్ నటి నేహా ధూపియా ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్ బేడీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. అయితే కొడుకు ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మిన్నారం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన నేహా తర్వాత జపనీస్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో వచ్చిన 'నిన్నే ఇష్టపడ్డాను' చిత్రంతో టాలీవుడ్లో లక్ పరీక్షించుకుంది. అదే ఏడాది 'ఖయామత్: సిటీ అండర్ త్రెట్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను తర్వాత విలన్, పరమవీర చక్ర వంటి సినిమాల్లోనూ నటించింది. 2018 మేలో నటుడు, మోడల్ అంగద్ బేడీని పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్‌లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ANGAD BEDI (@angadbedi) -
ప్రెగ్నెన్సీ వల్ల.. మూవీస్ నుంచి తొలగించారు
బాలీవుడ్ ఇండస్ట్రీలోని హ్యాపీ కపుల్స్‌లో నేహా ధూపియా, అంగద్ బేడి జంట ఒకటి. ఇద్దరూ యాక్టర్స్‌గా తమ కెరీర్‌ని సక్సెస్‌పుల్‌గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే మెహర్ అనే కూతురు ఉండగా, నేహా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో అంగద్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు. ‘నేహా రెండో సారి ప్రెగ్నెంట్ కావడంతో అనేక ప్రాజెక్టులను కొల్పోవాల్సి వచ్చింది. ఎవరు కూడా తనని అలాగే కొనసాగించడానికి ఇష్టపడలేదు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అనేక ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఈ ఇండస్ట్రీలో మనం చాలా ఏళ్లు ఉంటాం. అందువల్ల అవన్నీ మరిచిపోయి జీవితంలో ముందుకు సాగిపోవాలి. అలా నన్ను తీసేసిన తర్వాత అంతకంటే మంచి మనుషులు, క్రేజీ ప్రాజెక్టులలో పని చేసే అవకాశం లభించింది. అదే జీవితం అంటే’ అని అంగద్ తెలిపాడు. అయితే ప్రెగ్నెన్సీ మూలంగా ఎంతోమంది నేహాని సినిమాల నుంచి తీసేసినా, ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రం గురువారం డెరెక్టర్ బెహజాద్ ఖంబాట స్క్రీన్‌పై గర్భిణి పోలీసుగా తెరపై చూపించడానికి స్క్రిప్ట్‌లో మార్పులు చేశాడని సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి: నేను కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్ అలీ ఖాన్ View this post on Instagram A post shared by ANGAD BEDI (@angadbedi) -
బేబీ బంప్‌తో నటి.. ఫోటో వైరల్
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు వెల్లడించారు. బేబీ బంప్‌తో ఫోటోలను షేర్ చేస్తూ...'మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్' అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. నేహా ధూపియా పోస్ట్‌పై పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక నేహా ధూపియా.. నటుడు, మోడల్ అడంగ్ సింగ్ బేడీ అనే వ్యక్తిని 2018 మేలో పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్‌లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 'మిస్ ఇండియా: ది మిస్టరీ' అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా ధూపియా “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ నిన్నే ఇష్టపడ్డాను,విలన్, పరమవీర చక్ర వంటి చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) -
వైరల్: కన్నీరు పెట్టిస్తున్న రాజ్ కౌశల్ చివరి పోస్ట్
ప్రముఖ నటి, యాంకర్ మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌశల్ ఇవాళ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ ప్రముఖులు, సినీ నటీనటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చివరి పోస్టు వైరల్‌గా మారింది. ఈ ఆదివారం వీకెండ్ సందర్భంగా ఆయన స్నేహితులు, భార్య మందిర బేడీతో సందడి చేసినట్లు కౌశల్ తన చివరి పోస్టులో రాసుకొచ్చారు. ఇది చూసి ఆయన ఫాలోవర్స్, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆదివారం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఆయన భార్య సాగరిక ఘాట్కే, నటి నేహా దూపియా, అంగద్ బేడి, భార్య మందిరా బేడిలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘సూపర్ సండే, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫన్’ అంటూ షేర్ చేశారు. అది చూసి ‘మూడు రోజుల క్రితమే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన కౌశల్ ఇలా మృత్యువాత పడటం తీవ్రం కలచివేస్తోంది’, ‘ఇదే ఆయన చివరి పోస్టు అని తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఫొటోను నేహా దూపియా షేర్ చేస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. View this post on Instagram A post shared by Raj Kaushal (@rajkaushal) ‘రాజ్ ఈ ఫొటోను మనం ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం గుర్తుగా తీసుకున్నాము. కానీ నువ్వు మా మధ్య ఎప్పటికి ఉండవనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ మై స్ట్రాంగ్ లేడీ, ఈ సమయంలో నిన్ను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదంటూ మందిరా, ఆమె కుమారుడు వీర్, కూతురు తారాలను ఉద్దేశిస్తూ తన పోస్టులో రాసుకొచ్చారు. అదే విధంగా రాజ్ కౌశల్ తన కుమారుడు వీర్, కూతురు తారాలతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన కౌశల్ పోస్టులు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) చదవండి: Mandira Bedi: ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత -
హీరోయిన్స్‌కు పోటీ ఇస్తాడన్నారు: నటుడు
‘‘నిజానికి చిన్నపుడు నేను చాలా డ్యాన్స్ చేసేవాడిని. ఐటం సాంగ్స్‌కి కూడా నర్తించేవాడిని. అందరూ నా డాన్స్‌ను మెచ్చుకునేవాళ్లు. ఊళ్లో నాటకాలు వేసే సమయంలో ఎక్కువగా ఆడ వేషాలు వేసేవాడిని. ఇదంతా చూసిన మా ఊరి పెద్దాయన ఒకరు.. ‘‘ఇదిగో ఈ అబ్బాయి ముంబైకి వెళ్తే.. టాప్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేస్తాడు’’అని తరచూ అంటూ ఉండేవారు’’అంటూ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాను కచ్చితంగా హిందీ చిత్రసీమలో ప్రవేశిస్తానని అందరూ అనుకునే వారని, కానీ తాను మాత్రం ఎన్నడూ నటుడిని అవుతానని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.(చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్!) బరేలీ కీ బర్పీ, న్యూటన్, గుంజన్ సక్సేనా వంటి ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు, సాక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్ వంటి వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందాడు పంకజ్ త్రిపాఠి. నటి నేహా దుఫియా నిర్వహిస్తున్న ‘‘నో ఫిల్టర్ నేహా’’ చాట్ షోలో పాల్గొన్న అతడు తమ మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘మా గ్రామంలో నాటకాలు వేసేవాళ్లం. పదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి అమ్మాయి వేషం వేశాను. అప్పటి వరకు ఆ పాత్ర పోషించిన అబ్బాయి ఒకరు సిటీకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో నాటకం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ముందుకొచ్చి.. ఆ వేషం వేస్తా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మా డైరెక్టర్ రాఘవ్ చాచా అయితే, నాన్న దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకున్న తర్వాతే వేషం ఇస్తా అన్నారు. కోపంతో లాఠీ పట్టుకుని నా వీపు విమానం మోగిస్తారేమో అని భయపడ్డా. కానీ నాన్న అభ్యంతరం చెప్పలేదు. నాకు నచ్చిన పనిచేసే స్వేచ్చ ఉందన్నారు. తర్వాత నేను ఎన్నో నాటకాల్లో భాగస్వామ్యమయ్యాను. కానీ ముంబైకి వస్తానని, బాలీవుడ్లో నటుడిగా స్థిరపడతానని ఎన్నడూ అనుకోలేదు. అప్పుడు సరదా కోసం చేసి నటన, ఇప్పుడు జీవితంగా మారింది’’అని పంకజ్ పేర్కొన్నాడు. ఇప్పుడు తనకున్న ఆర్థిక పరిస్థితితో సంతృప్తికరంగా ఉన్నానని, ఇకపై ఎండార్స్మెంట్లు, సినిమా ఆఫర్లు రాకపోయినా పెద్దగా బాధపడనని చెప్పుకొచ్చాడు. ఇక మంచు విష్ణు దూసుకెళ్తా సినిమాలో విలన్‌గా పంకజ్ త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన సంగతి తెలిసిందే. -
‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’
ముంబై : నటి నీనా గుప్తా పేరు ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. నేహా ధుపియా నిర్వహిస్తున్న టెలివిజన్ ‘నో ఫిల్టర్ నేహా’ షోలో ఇటీవల నీనా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకవేళ మీరు యుక్త వయస్సులో ఉంటే మీకు మీరు ఇచ్చుకునే సలహా ఏంటని నేహా ప్రశ్నించగా... దీనిపై స్పందించిన నీనా ‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’ అంటూ సమాధానమిచ్చారు. అయితే నీనా ఇలా చెప్పడం మొదటి సారి కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. యువత సరైన దారిలో ఎలా నడుచుకోవాలో కూడా సందేశాలు ఇస్తూ ఉంటారు. (వివాహితుడిని ప్రేమించకండి: నటి) కాగా నేహా ధూపియా షో ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో నీనా గుప్తాతోపాటు, రానా దగ్గుబాటి, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ సైఫ్ అలీఖాన్, సోనూసూద్, అదితి రావ్ వంటి ప్రముఖులను కూడా ఇంటర్య్వూ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ షో ఆగస్ట్ 28న ప్రారంభం కాబోతుంది. (విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) View this post on Instagram 5 years of unfiltered fun. 5 years of your favorite celebrity talkshow! #NoFilterNeha Season 5 at Home Edition is finally here! Join us every week as we bring down the roof - of our very own homes, of course! Premiering exclusively on @JioSaavn Pro, co-produced by @wearebiggirl A post shared by Neha Dhupia (@nehadhupia) on Aug 25, 2020 at 12:51am PDT వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా వేరే వ్యక్తినిపెళ్లి చేసుకున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించిన ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. -
నా ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ అతనే..
లాక్డౌన్ వేళ సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక రోజువారి తమ వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. దీనిలో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటీ నేహా ధుపియా మే10 (ఆదివారం) మదర్స్ డే సందర్భంగా తన భర్త అంగద్ బేడీతో దిగిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘హ్యాపీ యానివర్సరీ మై లవ్.. మనం ఒకటై రెండేళ్లు అవుతోంది. అంగద్.. నా జీవితానికి ప్రేమ ఇచ్చిన వ్యక్తి . నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. మంచి తండ్రిగా ఉంటారు. నాకు ఆత్మీయ స్నేహితుడు. ఎప్పుడూ నాకు కోపం తెప్పించే సహచరి. ఇలా ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్‌ను అతనిలో నేను కలిగి ఉన్నాను. అది నా ఎంపిక’ అంటూ ఆమె కామెంట్ చేశారు. ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తాను’ అంటూ నేహా భర్త అంగద్ రిప్లే ఇచ్చాడు. Happy anniversary my love ... to two years of togetherness 💕... "Angad is like 1. The love of my life 2. a suport system 3. a great father,4. My best friend and 5. The most annoying roommate ever. It's like I have 5 bfs in one...it's my choice." #thosewhoknowknow @Imangadbedi pic.twitter.com/dmlZFW0IZ0 — Neha Dhupia (@NehaDhupia) May 10, 2020 ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ 2018లో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ జంట ఓ పాపకు జన్మనిచ్చింది. అదేవిధంగా భర్త అంగద్ తనతో సరదాగా గొడవ పడ్డా.. ఒకరినొకరం అర్థం చేసుకుంటామని ఆమె తెలిపారు. అంగద్ చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, పలు సందర్భాల్లో తన ఊహకు అందనంత ఫన్‌గా ఉంటారని నేహా చెప్పుకొచ్చారు. మదర్స్ డే రోజే నేహా, అంగద్ జంట రెండవ వివాహ వార్షికోత్సవం కావటం విశేషం. -
ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్: నటుడు
ముంబై: ట్రోలింగ్ బారిన పడిన తన భార్య నేహా ధుపియాకు నటుడు అంగద్ బేడీ అండగా నిలబడ్డాడు. ‘‘నా మాటలు వినండి... ఇదిగో నా ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్!’’ అంటూ నేహాతో ఉన్న ఫొటోలు షేర్ చేసి ట్రోల్స్‌కు ఘాటు కౌంటర్ ఇచ్చాడు. ప్రముఖ రియాలిటీ షో రోడీస్ రెవల్యూషన్లో లీడర్‌గా వ్యవహరిస్తున్న నేహా ధుపియా.. ఓ వ్యక్తిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన గర్ల్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టానన్న అతడి మాటలకు స్పందించిన నేహా.. అమ్మాయిని కొట్టడం తప్పని పేర్కొన్నారు. అయితే ఆమె తనను మోసం చేసిందని.. ఐదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకున్నందు వల్లే ఈ విధంగా చేశానని అతడు వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ అతడు చేసింది ముమ్మాటికీ తప్పేనని నేహా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. ‘‘నేహా.. ఫేక్ ఫెమినిస్ట్, అనైతిక సంబంధాలను ప్రోత్సహిస్తోంది’’ అంటూ నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు.(నటిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు!) ఈ క్రమంలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ నేహా ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. మోసం చేసేవాళ్లను తనెప్పుడూ సపోర్టు చేయనని, మహిళల భద్రత గురించి మాత్రమే నేను మాట్లాడానని పేర్కొన్నారు. నిజం వైపే నిలబడతానని, ఏదేమైనా శారీరక హింస, దాడి ఆమోదించదగ్గ విషయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక ఆమె భర్త అంగద్ బేడీ సైతం నేహాతో ఉన్న ఐదు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తనకు మద్దతుగా నిలిచాడు. కాగా అంగద్- నేహా 2018లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప సంతానం. View this post on Instagram Sun MERI baat.. here are my 5 girlfriends!!!! Ukhad lo jo ukhad na hai!!!! @nehadhupia ✊️✊️ #itsmychoice A post shared by Angad Bedi “ARVIND VASHISHTHH” (@angadbedi) on Mar 15, 2020 at 10:00pm PDT -
నటిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ నటి నేహా ధూపియాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ షోలో తను చేసిన వ్యాఖ్యలకుగాను సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా యువతే లక్ష్యంగా ఓ ఛానల్ ‘రోడీస్ రెవల్యూషన్’ అనే రియాలిటి షోను నిర్వహిస్తోంది. ఈ షోలో మొత్తం అయిదుగురు గ్యాంగ్ లీడర్లలో ఒకరైన నేహా ధుపియా.. యువ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను సంబంధిత ఛానల్ గురువారం విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఓ యువకుడు తనను మోసం చేసిన తన గర్ల్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు వెల్లడించాడు. తనతో ప్రేమలో ఉన్న సమయంలో ఒకేసారి మరో అయిదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకుందని.. అందుకే తనని చెంపదెబ్బ కొట్టానని చెప్పాడు.(‘అలాంటి వారు వస్తే... కంగనా నటన వదిలేస్తుంది’) ఆకలిగా ఉందన్నా పట్టించుకోలేదు: నటి #fakefeminism Memers To #NehaDhupia pic.twitter.com/4dSMVblp6Q — Shalini Shukla (@ShaliniShukla_) March 12, 2020 ఈ విషయంపై స్పందించిన నేహా.. ‘‘నువ్వు అలా చేయడం సరైనది కాదు. అమ్మాయి అయిదుగురు అబ్బాయిలతో కలిసి ఉండటం అనేది తన ఇష్టానికి సంబంధించిన విషయం’’ అంటూ సదరు యువకుడిపై విరుచుకుపడ్డారు. దీంతో నేహా వ్యాఖ్యలపై మండిపడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తనపై మీమ్స్ క్రియేట్ చేస్తూ.. ఆమె ‘ఫేక్ ఫెమినిస్ట్’ అని ట్విటర్లో షేర్ చేస్తున్నారు. అదే విధంగా.. ‘నేహా అదే తప్పునకు అయిదుగురు అబ్బాయిలను కొట్టినప్పుడు ఒకలా రియాక్ట్ అవుతారు... అదే తప్పు చేసిన ఒక అమ్మాయిని కొట్టినప్పుడు మరోలా స్పందిస్తూ.. లింగ భేదం చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక తను మాటలను అదుపులో పెట్టుకోకపోతే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక రోడీస్ షోలో నేహాతో పాటు రణ్విజయ్ సింఘా, ప్రిన్స్ నరులా, రాఫ్తార్‌తో పాటు నిఖిల్‌లు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో గత నెలలో ప్రారంభమైంది. Shame on people like @NehaDhupia, who show such double faces on equality !! https://t.co/z6XWMOFHIj — Baibhab Chakraborty (@Im_baibhab) March 12, 2020 -
షార్ట్ అండ్ స్ట్రాంగ్!
గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్. ఇప్పుడు మరో మీడియమ్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని టైటిల్ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్ అండ్ స్ట్రాంగ్‌గా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోందని సమాచారం. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్‌ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
ప్రేమ దొంగ
ప్రేమించినవాళ్ల కోసం చిన్నచిన్న దొంగతనాలు చేసిపెట్టడం అబ్బాయిలకు మామూలే. యంగ్‌హీరో ఇషాన్ ఖట్టెర్ కూడా శ్రీదేవిగారి అమ్మాయి జాహ్నవికోసం చిన్నపాటి దొంగతనం చేశాడు. అయితే ఆమె మీద ప్రేమతో ఆ దొంగతనం చేశాడా, లేక.. తన దొంగతనాన్ని గులాబీ పువ్వులా ఆమెకు అందజే సి ఇన్‌డైరెక్టుగా తన ప్రేమను జాహ్నవికి చెప్పాలనుకున్నాడా అన్నది తెలీదు. నటి నేహా ధుపియా చాట్ షోలో ఇషాన్ ఈ సంగతి చెప్పాడు. సినిమా షూట్ కోసం ఒమన్ వెళ్లినప్పుడు అక్కడి హోటల్లో కనిపించిన ఒక అందమైన దిండును దొంగిలించి ఎవరికీ కనిపించకుండా ప్యాక్ చేసి జాహ్నవికి గిఫ్టుగా ఇచ్చాడట. ‘‘ఎందుకు చేశావ్ ఆ పని!’’ అని నేహ అడిగితే.. ‘‘తను చెయ్యలేదుగా..’’అని చాట్ షోలో కూర్చొని ఉన్న జాహ్నవి వైపు చూసి నవ్వాడు. ‘‘సారా అలీఖాన్, జాహ్నవీ.. వీళ్లిద్దరిలో నీకు ఎవరి యాక్టింగ్ ఇష్టం?’’ అని నేహ ఇంకో ప్రశ్న అడిగింది. సారా అక్కడే ఉంది. అయినా.. ‘‘జాహ్నవి’’ అనే చెప్పాడు ‘‘జాహ్నవి యాక్టింగ్ ఇష్టమా? జాహ్నవి ఇష్టమా?’’ అని నేహ ఇంకో ప్రశ్నేమీ వెయ్యలే దు. అప్పటికే కుర్రాడు తడబడుతున్నాడు మరి. జాహ్నవి తొలి చిత్రం ‘ధడక్’లో హీరో అతడే. తాకితే చాలు పిల్లల్తో పాటు ఒక పిల్లీ ఇంట్లో ఉంటే భలే సందడిగా ఉంటుంది. అయితే ముద్దొచ్చిప్పుడే దాన్ని చేతుల్లోకి తీసుకుందామంటే ఒప్పుకోదు. తనకు ఇష్టమైనప్పుడు కూడా మనకు ముద్దు రావాలి. మామూలు పిల్లులతో ఇది అయ్యే పనేనా! అందుకే ‘ఎలిఫెంట్ రోబోటిక్స్’ అనే చైనా స్టార్టప్ కంపెనీ ఓ పిల్లి రోబోను తయారు చేసింది. దానికి ‘మార్స్ క్యాట్’ అని పేరు పెట్టి.. ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శిస్తోంది. ‘రన్’ అంటే పరుగెత్తడం, ‘కమ్ íß యర్’ అంటే దగ్గరకు రావడం.. ఇవి మాత్రమే ఆ పిల్లి రోబో ప్రత్యేకతలు కాదు. పక్కింట్లోంచి చుట్టపు చూపుగా వచ్చి వెళుతుండే నిజమైన పిల్లులతోటీ ‘మ్యావ్ మ్యావ్’మంటూ మాటలు కలుపుతుంది. వాటితో కలిసి ఆడుతుంది. బొమ్మల్తో కూడా బొమ్మలా కలిసిపోతుంది. ఇవన్నీ కూడా మనం కమాండ్స్ ఇవ్వకుండానే! అది యాక్టివేట్ అవడానికి చిన్న టచ్ చాలు. ముందు ముందు ఈ పిల్లిరోబో యజమానులు (రోబోను కొనుక్కున్నవారు) ఇచ్చే సూచనలు, సలహాలతో మార్స్ క్యాట్‌ని మరింత ఇంటెలిజెంట్ ఫోలోని చేయబోతున్నాం అని కంపెనీ వాళ్లు చెబుతున్నారు. -
ఆకలిగా ఉందన్నా పట్టించుకోలేదు: నటి
బాలీవుడ్ ప్రముఖ నటి నేహా ధూపియా దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ హీరోలకే తొలి ప్రాధాన్యమని, హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని పేర్కొన్నారు. తాజాగా ఓ షోకు హాజరైన ఆమె దక్షిణాదిలో హీరోయిన్లపై వివక్ష ఉందన్న విషయాన్ని అనుభవంతో సహా చెప్పుకొచ్చారు. ‘చాలాకాలం క్రితం జరిగిన సంఘటన ఇది. నేను ఓ దక్షిణాది సినిమా చేస్తున్నాను. ఓ రోజు షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు ఆకలి వేసింది. దీంతో అక్కడున్న వారికి ఆహారం సిద్ధం చేయమని చెప్పాను. కానీ వాళ్లు ముందు హీరోకు పెట్టాలని చెప్పారు. నాకు ఆకలిగా ఉందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ముందు హీరో తిన్న తర్వాతే నాకు తిండి పెడతామన్నారు.’ ‘థ్యాంక్ గాడ్.. ఇలాంటి అనుభవం మళ్లీ నాకు ఎదురుకాలేదు. అయితే ఈ విషయంపై నాకు ఏమాత్రం కోపం రాలేదు. పైగా నవ్వుకున్నాను కూడా’ అని నేహా ధూపియా చెప్పుకొచ్చారు. ‘నిన్నే ఇష్టపడ్డాను’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా తెలుగులో చివరగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘పరమ వీర చక్ర’ సినిమాలో కనిపించారు. 2018లో తన స్నేహితుడు, నటుడు అంగద్ బేడీని వివాహమాడారు. వీరికి మెహర్ అనే కూతురు ఉంది. కాగా నేహా ధూపియా ప్రస్తుతం బుల్లితెరలో వస్తున్న ప్రముఖ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. -
‘తల్లి అయ్యాక ఛాన్సులు రాలేదు: హీరోయిన్
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వాళ్లకు సరిగా సరిపోతుందేమో. ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ఉన్నప్పుడే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. పొరపాటున పెళ్లి అయితే హిట్ మాట అటుంచితే అసలు అవకాశాలు దక్కవు అనడంతో సందేహం లేదు. అదే మరి ఓ బిడ్డకు జన్మనిచ్చాక వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఛాన్సులు ఆ నటీమణుల దరిదాపుల్లో కనిపించవు. ప్రస్తుతం అదే సమస్యను ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి నేహా ధూపియా. బీఎఫ్ఎఫ్ విత్ వోఘ్ షోతో పేరు పొందిన నేహా.. తన బిడ్డకు జన్మనిచ్చాక ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని వాపోయారు. చివరగా నటించిన ‘తుమ్హారీ సులు’కు ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ సినిమా ఛాన్సులు రాలేదని ఆమె స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు అంగద్ బేడిని పెళ్లాడిన నేహాకు 2018లో పాప పుట్టిన విషయం తెలిసిందే. గత వారమే ముద్దుల తనయ మోహర్ పుట్టిన రోజున అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రెగ్నెన్సీ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే ఆ సమయంలో అనేక పత్రికలు నన్ను ట్రోల్ చేస్తూ తప్పుగా వార్తలు రాశాయి. అలాంటి వార్తలు రాయడం సరికాదు. అవును నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. అప్పటి నుంచి నాకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. ప్రసవానంతరం ప్రతి ఒక్కరు బరువు తగ్గాలని నేను అనడం లేదు. ఎవరి ప్రత్యేకత వారికీ ఉంటుంది. ప్రస్తుతం వెబ్ షో కోసం చర్చలు జరుపుతున్నాను. చూద్దాం.. ఇకనైనా పరిస్థితి ఎలా ఉంటుందో’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.