
Neha Dhupia, Angad Bedi Blessed with Baby Boy: బాలీవుడ్ నటి నేహా ధూపియా ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను నేహా భర్త, నటుడు అంగద్ బేడీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. అయితే కొడుకు ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా మిన్నారం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన నేహా తర్వాత జపనీస్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో వచ్చిన 'నిన్నే ఇష్టపడ్డాను' చిత్రంతో టాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంది. అదే ఏడాది 'ఖయామత్: సిటీ అండర్ త్రెట్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. తర్వాత “క్యా కూల్ హై హమ్”, “షూట్ అవుట్ లోఖండ్‌వాలా” వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను తర్వాత విలన్, పరమవీర చక్ర వంటి సినిమాల్లోనూ నటించింది. 2018 మేలో నటుడు, మోడల్ అంగద్ బేడీని పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం నవంబర్‌లో మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment