23 కిలోలు తగ్గా.. అప్పటినుంచే ఎక్కువ ఆఫర్లు: బాలీవుడ్‌ నటి Neha Dhupia Getting More Work After 23 KGs Weight Loss | Sakshi
Sakshi News home page

Neha Dhupia: డెలివరీ తర్వాత లావయ్యా.. ఎప్పుడైతే బరువు తగ్గానో..

Published Thu, Jul 4 2024 4:31 PM | Last Updated on Thu, Jul 4 2024 5:21 PM

Neha Dhupia Getting More Work After 23 KGs Weight Loss

బాలీవుడ్‌ నటి, మోడల్‌ నేహా ధూపియా.. ఇద్దరు పిల్లల తల్లయినా ఫిట్‌నెస్‌లో అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రెగ్నెన్సీ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకుని మరింత ధృడంగా తయారైంది. గర్భం దాల్చిన రెండుసార్లు 23-25 కిలోల దాకా బరువు పెరిగినట్లు తెలిపింది. నేహా మాట్లాడుతూ.. మెహర్‌ పుట్టాక లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఇంటిదగ్గరే ఉన్నాం కాబట్టి డైట్‌ పాటించి బరువు తగ్గాను. ఇంతలో మూడేళ్లకే మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యా.. అలా బరువు పెరిగాను.

23 కిలోలు తగ్గా..
డెలివరీ తర్వాత నేనెంత లావు అవుతాను? ఎలా కనిపిస్తాననేది ఆలోచించలేదు. నా పిల్లలిద్దరికీ ఏడాది వయసొచ్చేదాకా పాలిచ్చాను. గతేడాది వరకు శరీరంపై ఫోకస్‌ పెట్టలేదు. ఎప్పుడైతే ఫిట్‌నెస్‌ ఆలోచన వచ్చిందే వెంటనే ఎక్సర్‌సైజ్‌, డైట్‌ వంటివి పాటించడం మొదలుపెట్టాను. అలా 23 కిలోలు తగ్గిపోయాను. అయినా ఇంకా నేను అనుకున్నంత బరువు తగ్గలేదు. త్వరలోనే ఆ లక్ష్యాన్ని చేరతాను.

ఆఫర్లు తగ్గిపోయాయి
సంతోషకరమైన విషయం ఏంటంటే.. ఈ బరువు తగ్గడమనేది నా కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది. వెయిట్‌ లాస్‌ అయినప్పటినుంచే నాకు ఆఫర్లు రావడం ఎక్కువయ్యాయి. బరువు తగ్గడం కోసం నేను మరీ అంత కఠిన ఎక్సర్‌సైజ్‌లు పాటించలేదు. రన్నింగ్‌ చేస్తాను, అప్పుడప్పుడు జిమ్‌కు వెళ్తాను. చక్కెర, గ్లుటెన్‌, ఫ్రై చేసిన పదార్థాలను తీసుకోవడం మానేశాను. రాత్రి ఏడింటికే డిన్నర్‌ ముగిస్తాను. ఇవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పుకొచ్చింది.

సినిమాలు
కాగా నేహా ధూపియా తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, విలన్‌, పరమవీరచక్ర సినిమాల్లో నటించింది. హిందీలో ఖయమత్‌, జూలీ, ఫైట్‌ క్లబ్‌, గరం మసాలా, ఢిల్లీ హైట్స్‌, చుప్‌ చుప్‌కే, రష్‌, బ్యాడ్‌ న్యూస్‌ వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

చదవండి: ప్రభాస్ కల్కి.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement