
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది.
గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం వారం రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వీక్ డేస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కి.. వీకెండ్‌లో మరింత భారీగా రాబట్టే అవకాశముంది. ఇదే జోరు కొనసాగితే కల్కి కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment