Neha Dhupia Adorable Insta Post for her Daughter Mehr Birthday- Sakshi
Sakshi News home page

ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి

Nov 18 2021 4:12 PM | Updated on Nov 18 2021 4:52 PM

Neha Dhupia Adorable Insta Post for her Daughter Mehr Birthday - Sakshi

బాలీవుడ్‌ నటి హా ధూపియా, అంగద్ బేడీల కూతురు ఈరోజుతో మూడేళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా  నేహా ధూపియా తన కుమార్తె మెహర్‌కోసం ఒక అద్భుతమైన  పోస్ట్‌పెట్టింది.

సాక్షి, ముంబై:  బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, అంగద్ బేడీల మెహర్‌ కూతురు ఈ రోజుతో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేహా ధూపియా తన కుమార్తె మెహర్‌కోసం ఒక అద్భుతమైన పోస్ట్‌ పెట్టింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా మెహర్‌కు స్పెషల్‌గా  శుభాకాంక్షలు తెలిపింది. (Nayanthara Birthday Special: డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నయన్‌ ‘తార’)

రెండవ బిడ్డ కడుపులో ఉండగా నేహా ధూపియా మెహర్‌తో కలిసివున్న తన ప్రసూతి ఫోటోషూట్  ఫోటోను పోస్ట్ చేస్తూ ఇలా  తెలిపింది,  " మూడేళ్ల క్రితం ఇదే రోజు ఉదయం 11.25 గంటలకు... నా శరీరానికి ఆవల నా గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. నా బంగారు తల్లీ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రేమ అంటే ఏమిటో నువ్వేగా  మాకు నేర్పించావు.  నువ్వొక అద్భుతానికి.. ఎప్పుడూ లేనిది, మాటలు రావడం లేదు అమ్మకు’’ .

కాగా నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులకు 2018లో నవంబర్ 18న  మెహర్‌ పుట్టింది. అలాగే ఈ ఏడాది అక్టోబర్ 3న తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి  తెలిసిందే.

నేహూ భర్త అంగద్ బేడి , పిల్లల  చిత్రాలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తన కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, నటుడు అంగద్ బేడిని నేహా 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement