![AP Students special Wishes to actor Sonu Sood on his birthday](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/30/sood.jpg.webp?itok=obp6oGOo)
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇవాళ 51వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినీతారలు, టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు విషెస్ తెలిపారు. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్.. బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ఆయన ముందున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ స్థాపించిన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.
తాజాగా ఇవాళ సోనూ పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆయన రూపంలో నిలబడి విషెస్ చెప్పారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే రియల్ హీరో అంటూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధంగా కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత, ఉత్సాహాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కాగా.. ఇటీవలే సోనూసూద్ ఏపీకి చెందిన విద్యార్థికి చదువుకు సాయమందించిన సంగతి తెలిసిందే.
నటుడు @SonuSood పుట్టినరోజు సందర్భంగా అద్భుత రీతిలో శుభాకాంక్షలు తెలిపిన కుప్పం విద్యార్థులు
సోను సూద్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శన
హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం#sonusoodbirthday #Kuppam pic.twitter.com/tGLKlhF7ym— Telugu Galaxy (@Telugu_Galaxy) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment