
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్‌లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్‌లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.
తాజాగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ సడన్‌గా మ్యాచ్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్‌లో అభిమానులు వీక్షించారు.
అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్‌లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
తొలి సెలబ్రిటీ అంటూ..
భారత్- పాక్ మ్యాచ్‌లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్‌గా నిలిచింది.
#ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh
— Filmfare (@filmfare) February 24, 2025
Comments
Please login to add a commentAdd a comment