బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109లోనూ కనిపించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్లో ఆమెజేఎన్యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రంలో నటిస్తోంది.
అయితే తాజాగా ఊర్వశి రౌతేలా తన మేనేజర్‌తో మాట్లాడుతున్న కాల్ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన మేనేజర్‌తో ఇటీవల బాత్రూమ్ వీడియో లీక్ కావడంపై ఆమె మాట్లాడింది. అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆ వీడియో మీరు చూశారా? అని ఊర్వశి రౌతేలా ప్రశ్నించింది. దీనిపై మేనేజర్ స్పందిస్తూ.. మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కాల్ రికార్డ్ సైతం నెట్టింట లీక్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. వీడియోతో పాటు కాల్ రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఇదంతా ఊర్వశి రౌతేలా పబ్లిషిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీప్‌గా పబ్లిషిటీ స్టంట్స్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. త్వరలోనే జేఎన్‌యూ మూవీ రిలీజ్ ఉండడంతో ఇదంతా ప్రమోషన్లలో భాగమేనని భావిస్తున్నారు. అయితే ఆడియో లీక్ కావడంపై ఊర్వశి రౌతేలా ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment