CALL
-
కాల్ మెర్జింగ్‌తో కాజేస్తారు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.కాల్ మెర్జింగ్ స్కాం అంటే? ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. -
కొత్త స్కామ్.. ఓటీపీ చెప్పకపోయినా ఖాతా ఖాళీ!
సైబర్ మోసాలు (Cyber Scam) రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకూ చేతికి చిక్కిన ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని అప్రమత్తంగా ఉండకపోతే మన వంతు వచ్చినప్పుడు మోసపోయి బాధపడక తప్పదు.కాల్ మెర్జింగ్ స్కామ్ (Call Merging Scam) అనేది ఇప్పుడు ఒక కొత్త రకమైన సైబర్ మోసం. దీనిలో స్కామర్లు కాల్స్‌ను మెర్జ్ చేసి బాధితులు ఓటీపీలు (OTP) చెప్పకపోయినా వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టి వారి ఖాతాలు ఖాళీలు చేస్తున్నారు. మోసగాళ్ళు బ్యాంక్ ప్రతినిధులు లేదా స్నేహితులు వంటి విశ్వసనీయ వ్యక్తులుగా నటిస్తూ బాధితులను మూడవ కాల్‌ను మెర్జ్ చేయమని అభ్యర్థిస్తారు. ఈ కాల్ సాధారణంగా ఆటోమేటెడ్ ఓటీపీ సర్వీస్. స్కామర్లు దీనిని బాధితుడి బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ (UPI) వాలెట్‌కు అనధికార యాక్సెస్ పొందడానికి ఉపయోగిస్తారు.ఇలా స్కామ్ చేస్తున్నారు.. » స్కామర్ బాధితుడికి ఫోన్ చేసి స్నేహితుడు, కంపెనీ లేదా బ్యాంకు ప్రతినిధినని నమ్మిస్తారు.» వెంటనే మరొక కాల్లో (కాల్ మెర్జ్) చేరమని బాధితులను అడుగుతారు.» రెండవ కాల్ ఆటోమేటెడ్. ఇది లావాదేవీకి ఓటీపీని అందిస్తుంది.» స్కామర్ ఓటీపీ విని బాధితుడి ఖాతాలోకి ప్రవేశిస్తాడు. » బాధితుడు అప్రమత్తం అయ్యేలోపే ఖాతా ఖాళీ అవుతుంది.వాస్తవ సంఘనలుఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెరుగుతున్న కాల్ మెర్జింగ్ స్కామ్‌ల గురించి సోషల్ మీడియాలో హెచ్చరించింది. మెర్జ్ కాల్స్ ద్వారా తమకు తెలియకుండానే ఓటీపీలు వెల్లడి కావడం వల్ల చాలా మంది బాధితులు వేలాది రూపాయలు కోల్పోతున్నారని పేర్కొంది.ఇదీ చదవండి: త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్‌తో..ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తకు బ్యాంకు మోసాలను గుర్తించే బృందం నుంచి అంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి బాధితుడిని మాటల్లో పెట్టి ఓటీపీని వెల్లడించే మరో కాల్కి మెర్జ్ చేయించాడు. నిమిషాల్లోనే అతని ఖాతా ఖాళీ అయింది.స్కామ్‌లకు గురికాకుండా చేయవలసినవి» కాల్‌ను మెర్జ్ చేయమని అడుగుతున్న వ్యక్తి ఐడెంటిటీని పరిశీలించండి.» ఎవరైనా ఊహించని విధంగా కాల్‌ను మెర్జ్ చేయమని అడిగితే, వెంటనే తిరస్కరించండి.» మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలో ట్రాన్సాక్షన్ అలర్ట్స్‌ను యాక్టివేట్ చేయండి.» స్కామ్ కాల్ అని అనుమానం వస్తే 1930 ( సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ) కు కాల్ చేయండి లేదా మీ బ్యాంకుకు తెలియ జేయండి.చేయకూడనివి» తెలియని నంబర్లతో కాల్స్‌ను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. ఈ స్కామ్‌లో ఉపయోగించే ప్రాథమిక ట్రిక్ ఇది.» ఓటీపీలను షేర్ చేయవద్దు. ఏ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ కాల్ ద్వారా ఓటీపీని అడగదు.» తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఫిషింగ్ లింక్‌లను మోసగాళ్ళు పంపవచ్చు. ఇది భద్రతను మరింత దెబ్బతీస్తుంది.» కాలర్ ఐడీలను గుడ్డిగా నమ్మవద్దు. స్కామర్లు చట్టబద్ధంగా కనిపించే స్పూఫ్డ్ నంబర్లను ఉపయోగించవచ్చు. -
షారుఖ్ ఖాన్‌కూ బెదిరింపులు
ముంబై/రాయ్‌పూర్: బాలీవుడ్‌లోని మరో ప్రముఖ నటుడికి చంపేస్తామంటూ బెదిరింపు అందింది. సల్మాన్ ఖాన్‌కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే ఈసారి షారుఖ్ ఖాన్‌కు వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు. బలవంతపు వసూళ్లు సహా వివిధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్లో జరిగే విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసిచ్చారు. ‘షారుఖ్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు మెసేజీపై విచారణ కోసం ముంబై పోలీసులు గురువారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చారు. బెదిరింపు మెసేజీ ఫైజాన్ పేరుతో రిజిస్టరైన ఫోన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆ మేరకు రాయ్‌పూర్‌లోని పండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఫైజాన్ ఖాన్‌కు నోటీసు అందజేశారు’అని రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ సంతోష్ సింగ్ చెప్పారు. అయితే, ఆ మెసేజీ తాను పంపలేదని, తనపై ఎవరో కుట్ర చేస్తున్నారనిఫైజాన్ ఖాన్ తెలిపారు. -
హీరోయిన్ ఆడియో క్లిప్ లీక్.. మండిపడుతున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109లోనూ కనిపించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్లో ఆమెజేఎన్యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రంలో నటిస్తోంది.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా తన మేనేజర్‌తో మాట్లాడుతున్న కాల్ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన మేనేజర్‌తో ఇటీవల బాత్రూమ్ వీడియో లీక్ కావడంపై ఆమె మాట్లాడింది. అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆ వీడియో మీరు చూశారా? అని ఊర్వశి రౌతేలా ప్రశ్నించింది. దీనిపై మేనేజర్ స్పందిస్తూ.. మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కాల్ రికార్డ్ సైతం నెట్టింట లీక్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. వీడియోతో పాటు కాల్ రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఇదంతా ఊర్వశి రౌతేలా పబ్లిషిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీప్‌గా పబ్లిషిటీ స్టంట్స్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. త్వరలోనే జేఎన్‌యూ మూవీ రిలీజ్ ఉండడంతో ఇదంతా ప్రమోషన్లలో భాగమేనని భావిస్తున్నారు. అయితే ఆడియో లీక్ కావడంపై ఊర్వశి రౌతేలా ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లాల్ చౌక్‌లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం!
దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కశ్మీర్లో వినూత్న ఉదంతం చోటుచేసుకుంది. గతంలో కశ్మీర్ లోయలో ఎన్నికలు ప్రకటించినప్పుడు వేర్పాటువాదులు బహిష్కరణకు పిలుపునిచ్చేవారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎలాంటి బహిష్కరణ పిలుపు లేకుండా ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ రాజకీయ నినాదాలతో మారుమోగుతోంది. క్లాక్ టవర్ ఎన్నికల సభలకు వేదికగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల బంద్ పిలుపులు, రాళ్లదాడులు, ఎన్కౌంటర్లు, ఊరేగింపులకు అడ్డాగా నిలిచిన క్లాక్ టవర్ ప్రాంతంలో ఇప్పుడు వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపు లేకుండా వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి.దీనిని 2019 తరువాత వచ్చిన భారీ మార్పుగా పరిగణిస్తున్నారు. స్థానికుడు సుహైల్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్లో గత కొన్నేళ్లలో వేర్పాటువాదులపై ఎన్ఐఏ తదితర ఏజెన్సీలు చర్యలను కఠినతరం చేశాయి. వేర్పాటువాదులలోని కొందరు గృహనిర్బంధంలో ఉండగా, మరికొందరు జైలులో ఉన్నారని తెలిపాడు. మరో యువకుడు జహూర్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో బహిష్కరణ పిలుపు ఇచ్చేవారికి భయపడి ఓట్లు వేసేవారు కాదని, అయితే ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉందని, ఈసారి తామంతా తమ హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.అల్తాఫ్ ఘంటాఘర్, నౌహట్టా, జామియా మసీదు, గోజ్వారా, రాజౌరి కడల్, సిమెంట్ కడల్, ఈద్గా తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎటువంటి భయం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు అశాంతితో అట్టుడికిపోయే లాల్ చౌక్‌లో ప్రస్తుతం రాజకీయ నేతలు శాంతి సందేశం ఇస్తూ, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. -
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్
సాక్షి, ఆదిలాబాద్: ‘నన్ను ఆదరించి గెలిపించిన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తా. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ వార్డులో స్వయంగా పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటా. ఎమ్మెల్యే నిధులతో పాటు అవసరమైతే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యేతో సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది ఫోన్ చేసి సమస్యలను ఎమ్మెల్యేకు నివేదించారు. వాటిని ఓపిగ్గా ఆలకించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. ప్రశ్న: మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, ఎన్టీఆ ర్ చౌక్ ప్రాంతాల్లో తోపుడు బండ్లు రోడ్డుకు దగ్గరగా ఉంచడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..? (చంద్రశేఖర్, రిటైర్డ్ టీచర్, న్యూహౌసింగ్ బోర్డు) ఎమ్మెల్యే: పట్టణంలో ఈ సమస్య ఉన్నది వాస్తవమే. గత పాలకుల హయాంలో రోడ్లు ఇరుకుగా నిర్మించారు. దీంతో చిరు వ్యాపారులు తో పుడు బండ్లను రోడ్లపైకి తీసుకొచ్చి విక్రయాలు జరిపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులతో మాట్లాడుతాను. ప్రశ్న: తిర్పెల్లి కాలనీ సమీపంలో జాతీయ రహదా రిపై మురుగునీరు ప్రవహించడంతో పాటు గుంతలు ఉన్నాయి. దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది. (కళ్యాణ్, శ్రీరాంకాలనీ) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కరించేలా చూస్తాను. ప్రశ్న: టాక్లీ నుంచి బేల వరకు గల రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. మహారాష్ట్రకు చెంది న లంబాడాలు బేలలోని పలు గ్రామాలకు వలసవచ్చి రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి అడ్డదారిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం పొందుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు.. (సంతోష్, టాక్లీ) ఎమ్మెల్యే: ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహించి వాటి పరిస్థితులను తెలుసుకుంటాను. అలాగే నకిలీ ధ్రువీ కరణ పత్రాలను జారీచేయకుండా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తా. ప్రశ్న: నాకు నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. రూ.10లక్షలు ఖర్చైంది. ఉన్న ప్లాటు అమ్మేశాను. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా సాయం అందలేదు. (సాయికుమార్, హౌసింగ్‌బోర్డు ) ఎమ్మెల్యే: కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేశాక వాటి ప్రకారం ఆర్థిక సాయమందించేందుకు తప్పకుండా కృషి చేస్తాను. ప్రశ్న: రాత్రి సమయంలో వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి వెళితే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లమని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. (హిదాయత్ పఠాన్, బొక్కల్గూడ) ఎమ్మెల్యే: రిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి, రాత్రి డ్యూటీలో డాక్టరేవరున్నారో, అక్కడి సమస్యలేంటో తెలుసుకుని ఇంకోసారి జరుగకుండా తగు చర్యలు తీసుకుంటాను. ప్రశ్న: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ పంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పడిన చిన్నమారుతిగూడలో తాగునీరు, రోడ్లు, కరెంట్ వంటి వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. సౌకర్యాలు కల్పించేలా చూడాలి.(గణపతి, సురేష్, సిడాం మారుతీ, చిన్నమారుతీగూడ, అంకాపూర్) ఎమ్మెల్యే: త్వరలోనే మండల అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శిస్తాను. అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సాధ్యమైనంతవరకు కృషి చేస్తాను. ఇప్పటికే పాయల్ పౌండేషన్ ద్వారా బోరు వేయించాము. ప్రశ్న: మాకు ప్రభుత్వమిచ్చిన ప్లాట్లలో సీపీఐ నాయకులు గుడిసెలు వేయించారు. వాటిని తొలగించాలని కమిషనర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. (గాలిపెల్లి నాగన్న, మావల) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకునేలా చూస్తాను. ఈ నెల చివరిలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ప్రశ్న: ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మా పల్లెకు బస్సులు రావడం లేదు..? (సురేష్, అంకాపూర్ జీపీ) ఎమ్మెల్యే: ఈ విషయమై ఆర్టీసీ అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహిస్తాం. రహదారి సౌకర్యం ఉండి ఆర్టీసీ సదుపాయం లేని గ్రామాలకు బస్సులు నడిపించేలా చర్యలు చేపడతాం. అన్ని గ్రామాలకు బస్సులు వచ్చేలా చూస్తాను. ప్రశ్న: టీచర్స్ కాలనీలోని అడాణేశ్వర్ మందిర్ ప్రాంతంలో రహదారి, నీటి సమస్య తీవ్రంగా ఉంది..? (మధుకర్, టీచర్స్‌కాలనీ) ఎమ్మెల్యే: మీ కాలనీ సమస్యలు ఇదివరకే నా దృష్టి కి వచ్చాయి. ఇటీవలే మున్సిపల్ అధికారులతో మాట్లాడాను. రోడ్ల నిర్మాణంతోపాటు నీటి సరఫరా అయ్యేలా చర్యలు చేపడతాం. ప్రశ్న: పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. దీంతో పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించాలి.. (కేతిరెడ్డి గంగారెడ్డి, కై లాస్‌నగర్) ఎమ్మెల్యే: ఈ విషయమై పోలీసు, మున్సిపల్ అధి కారులతో సమీక్ష నిర్వహిస్తాం. వారం పది రో జుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఆక్రమణల విషయమై, వీధి వ్యాపారుల సముదాయం గురించి కూడా రివ్యూచేస్తాం. ప్రశ్న: మా కాలనీలో సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రహదారి సమస్యతో సతమతం అవుతున్నాం... (రాంరెడ్డి, టీచర్స్ కాలనీ) ఎమ్మెల్యే: త్వరలోనే వార్డును విజిట్ చేసి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా. ప్రశ్న: మా కాలనీతో పాటు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో జనం రోగాల బారిన పడుతున్నారు..?(శ్రీనివాస్, శాంతినగర్) ఎమ్మెల్యే: పట్టణంలోని శాంతినగర్‌తో పాటు అన్ని వార్డుల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా మున్సిపల్ అధికారులను ఆదేశిస్తాం. అదనపు సిబ్బందిని సైతం నియమించైనా సమస్యను పరిష్కరిస్తాం. ప్రశ్న: కాలనీకి సంబంధించిన మురుగు నీరంతా నా ఇంటి ముందు వచ్చి చేరుతోంది. వాసన భరించలేకపోతున్నాం. మున్సిపల్ అధికారుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..( కార్తికేయ, కేఆర్కే కాలనీ) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులతో మాట్లాడతాం. కేఆర్కే కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ సమస్యలు తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రశ్న: కాలనీలో ఎవరైన మరణించినప్పుడు అంతి మ యాత్ర కోసం అవస్థలు ఎదురవుతున్నా యి. శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు పక్క న దహన సంస్కారాలు చేయాల్సి వస్తోంది.. ?(దోని జ్యోతి, శ్రీరాంకాలనీ) ఎమ్మెల్యే: కాలనీలో శ్మశానవాటిక ఏర్పాటు కోసం అధికారులతో మాట్లాడతాం. దీనికి సంబంధించి స్థల సేకరణ చేపట్టి నిర్మాణం కోసం కృషి చేస్తా. ప్రశ్న: మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో చాలా ఇబ్బందవుతుంది. కొత్త రోడ్డు నిర్మించాలి (రవీందర్, చిచ్దరి ఖానాపూర్) ఎమ్మెల్యే: సంబంధిత శాఖల అధికారులతో మాట్లా డి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా. త్వరలోనే రోడ్డును కూడా పరిశీలిస్తా. ఇవి చదవండి: ఇటు సీతక్కకు, అటు దుద్దిళ్లకు సవాలుగా లోక్‌సభ ఎన్నికలు! -
రతన్ టాటాకు బెదిరింపులు
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బెదిరింపులు వచ్చాయి. రతన్ టాటా ప్రాణానికి ముప్పు పొంచి ఉందని దుండగుడు హెచ్చరించాడు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. టాటా భద్రతను పెంచాలని లేదంటే ఆయనకు సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని బెదిరించినట్లు వెల్లడించారు. బెదిరింపులు రావడంతో రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నిందితుడు పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్తీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్తీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
ఆస్ట్రేలియా వెళ్తున్నా.. నా కోసం వెతకొద్దు
హైదరాబాద్: ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు.. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి వైద్యురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహియా తరన్నం (24) ఈ నెల 3న ఎప్పటిలాగే ఉదయం సబ్జా కాలనీలోని తన నివాసం నుంచి విధులకు వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి మహ్మద్ గఫార్‌కు వాట్సాప్ కాల్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని తన కోసం వెతకవద్దంటూ చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. గత 8 నెలలుగా ఆమెతో పాటు వైద్యుడిగా పని చేస్తున్న నదీమ్‌తో.. పరిచయం ఏర్పడిందని.. బిహార్‌కు చెందిన అతను మాయమాటలు చెప్పి మహియా తరన్నంను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'చనిపోతున్నానంటూ తల్లికి వాట్సాప్ కాల్..' విషాద ఘటన..
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తాళలేక తాను చనిపోతున్నానని తల్లికి వాట్సాప్ కాల్ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.సతీష్‌కుమార్(42) ఫిలింనగర్ రోడ్ నెం.9లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17న తన తల్లి అనసూయకు వాట్సాప్ కాల్ చేసిన అతను ఇంట్లో వేధింపులు ఎక్కువయ్యాయని ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి తోడయ్యాయని తాను చనిపోతున్నానని చెప్పాడు. తన కుమారుడు లిఖిత్తో పాటు అన్న కొడుకు వీరేంద్ర చౌదరి బాధ్యతలు తీసుకోవాలని తల్లికి కోరాడు. దీంతో ఆందోళనకు గురైన అనసూయ ఈ నెల 20న నగరానికి వచ్చి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక బామ్మకు సంబంధించిన వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో బామ్మ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె మాటలను విన్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఆ బామ్మ హరియాణాకు చెందినది. వీడియోలో బామ్మ ఏమి మాట్లాడుతున్నదో తెలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వీడియోలో కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అని దానిలో వినిపిస్తుండగా, ఆ వాయిస్ విన్న బామ్మ కోపంతో తన ధోరణిలో మాట్లాడుతుంటుంది. వీడియోలో ముందుగా బామ్మ ఫోన్ చేస్తూ కనిపిస్తుంది. అటువైపు నుంచి రింగ్ వినిపిస్తుంది గానీ, ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంతలో కంప్యూటర్ రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంటూ బామ్మకు ఒక యువతి గొంతు వినిపిస్తుంది. అంతే ఆ బామ్మ ఆగ్రహంతో ఆ కంప్యూటర్ వాయిస్ నిజమైనదేనని భావిస్తూ క్లాస్ పీకుతుంది. ఇది విన్న ఎవరైనా తమ నవ్వును అదుపుచేసుకోలేరు. అయితే ఆ బామ్మకు అసలు విషయం తెలియక ఫోనులో ఎవరో యువతి మాట్లాడుతున్నదని భావిస్తూ, ఆపకుండా మాట్లాడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ChatBot भाई, संभलकर आइयो India में, अम्मा तुमको भी ना छोड़ने वाली हैं. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/YKjGC5ajoW — Rahul Prakash, IPS (@rahulprakashIPS) March 18, 2023 ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
మోదీ, పుతిన్ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఇటీవల రష్యాలో జరిగిన అంతర్యుద్ధం, ఉక్రెయిన్ అంశాలపై చర్చించుకున్నారు. ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో మోదీ మద్దతు తెలిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. రష్యాలో శాంతి పరిరక్షణలు నెలకొని పౌరుల భద్రత కాపాడాలని మోదీ ఆకాంక్షించినట్లు పేర్కొంది. అమెరికా పర్యటన తర్వాత మొదటిసారి మోదీ, పుతిన్‌లు ఫోన్లో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటనలను ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా జరుగుతున్న మార్పులు, పరస్పర సహకార అంగీకారాలపై ముచ్చటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలపై చర్చ జరిగిందని క్రెమ్లిన్ తెలిపింది. జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లలో ఇరుదేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందాలపై కూడా మోదీ, పుతిన్ మాట్లాడుకున్నారు. అయితే.. ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా దేశం ఎప్పడూ లేనంత ఇబ్బందుల్లో పడిపోయింది. పుతిన్ అధికారంలోకి వచ్చిన రెండు దశాబ్ధాల్లో ప్రిగోజిన్ తిరుగుబాటే అతనికి అతి పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
ఆధార్ బిగ్ అప్డేట్ ఒక్క ఫోన్ తో ఆధాార్ సమస్యలకు చెక్
-
మాదాపూర్ కొత్తగూడెం TCS ఆఫీసుకు బాంబు బెదిరింపు
-
సీఎం యోగిని చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్లో ప్రేమకోణం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రేమ కోణం ఉన్నట్లు విచారణలో తేలింది. తాను ప్రేమించిన యువతి తండ్రిపై కోపంతో ఓ యువకుడు అతని ఫోన్ దొంగిలించి సీఎంకు చంపేస్తానని కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ప్రేయసి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపాలని పథకం పని యువకుడు ఈ పని చేసినట్లు వెల్లడించారు. అతడిపై ఫోన్ చోరీ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడ్ని 18 ఏళ్ల అమీన్‌గా గుర్తించారు. ఏం జరిగిందంటే..? మంగళవారం ఉదయం 112 నంబర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. యూపీ పోలీసుల హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్‌కు కూడా ఈ సందేశాన్ని పంపాడు. దీంతో అప్రమత్తమైనా పోలీసులు ఆ నంబర్‌ను ట్రేస్ చేశారు. లక్నోలో ఉంటున్నాడని తెలిసి వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే తన ఫోన్‌ను రెండు రోజుల క్రితమే ఎవరో దొంగిలించారని, ఈ కాల్ తాను చేయలేదని సజ్జాద్ హుస్సేన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పొరుగింటి వారిని పోలీసులు వాకబు చేశారు. అప్పుడే అమీన్ గురించి వాళ్లు చెప్పారు. హుస్సేన్‌ను ఇరికేందుకు అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. వెంటనే పోలీసులు అమీన్ వద్దకు చేరుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ కూతుర్ని తాను ప్రేమించానని, ఆయన తమ ప్రేమకు ఒప్పుకోలేదనే ఇలా చేసినట్లు విచారణలో తెలిపాడు. హుస్సేన్‌పై ప్రతీకారంతోనే ఫోన్ దొంగిలించి సీఎం యోగిని చంపేస్తానని బెదిరింపు కాల్ చేసినట్లు అంగీకరించాడు. చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం.. కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..? -
యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా..
► ఏప్రిల్ 14న అనంతపురంలోని ఓ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న విక్రమ్‌కు వీడియోకాల్ వచ్చింది. ఆన్ చేయగానే యువతి నగ్నంగా కనిపించింది. ఇంకేముంది విక్రమ్ ఆసక్తిగా మాట్లాడాడు. కాల్ పూర్తయ్యాక వీడియో రికార్డింగ్ మొత్తం మొబైల్‌కు వచ్చింది. తర్వాత ఆ యువతి డబ్బు డిమాండ్ చేసింది. ► అనంతపురం సాయినగర్‌లో కేఫ్ యజమానికీ ఇలాగే కాల్ రావడంతో మాట్లాడాడు. అమ్మాయి మాటలు నమ్మి ఇంటి చిరునామా, పర్సనల్ మొబైల్ నంబర్ అన్నీ ఇచ్చాడు. మాట్లాడిన వీడియోలు పంపుతూ టార్చర్ పెడుతోందని వాపోయాడు. మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతానంటూ కూడా భయపెడుతోందని తెలిపాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏదో రకంగా డబ్బు సంపాదించాలి.. కష్టపడకుండానే డబ్బు వచ్చి ఒళ్లో వాలిపోవాలి. చుక్క చెమట పట్టకుండా లక్షాధికారులు కావాలి.. పెడదారిలో వెళుతున్న యువత ఆలోచనలు ఇవీ. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత బ్లాక్‌మెయిలింగ్ మరింతగా పెరిగింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మాయ చేసి మోసగిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన కొన్ని ఘటనలతో కుర్రాళ్లు బెంబేలెత్తుతున్నారు. ఆశ పడితే.. అధోగతే! కొంతమంది అమ్మాయిలు వీడియోకాల్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే నగ్నంగా కనిపిస్తారు. వెంటనే ఫోన్ కట్ చేస్తే ఫరవాలేదు. కొంతమంది కుర్రాళ్లు ఇలాంటి దృశ్యాలు చూసి ‘ఆశ’గా మాటలు కలుపుతారు. కుర్రాళ్లను కూడా బట్టలు లేకుండా వీడియోకాల్‌లోకి రావాలని కోరుతారు. ఈ వీడియోను రికార్డింగ్ చేస్తారు. ఇలా మాట్లాడుతుండగానే ఫోన్‌కట్ అవుతుంది. ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేస్తారు. బ్లాక్మెయిల్ ఇలా చేస్తున్నారు.. ఎవరైతే వీడియోకాల్‌లో మాట్లాడారో ఆ వీడియోను మొబైల్‌కు పంపిస్తారు. అనంతరం డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే ఈ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వీడియోలో ఇరువురి ఫొటోలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా అబ్బాయిలు కలవరపాటుకు గురవుతారు. ఎంతోకొంత ఫోన్ పే చేసి వదిలించుకుంటారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఇది ఒకరకంగా హనీట్రాప్ లాంటిదని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తం సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. మనకు తెలియని వ్యక్తులు వీడియోకాల్ చేసినా, లింక్‌లు పంపినా వాటిని క్లిక్ చేయొద్దు. చాలామంది మొబైల్స్‌లో ఇలాంటి లింకులతో కొత్త యాప్ చేరి మన ఆధారాలన్నీ దొంగల చేతికి వెళుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము పోవడానికీ ఇదే కారణం. మొబైల్లో ఉన్న ఇలాంటి దొంగ యాప్‌లను తొలగించడం కూడా చాలామందికి తెలియదు. అందుకే పోలీసులతోనే వీటిని మొబైల్‌నుంచి ఎలా తొలగించాలో ప్రొజెక్టర్ల ద్వారా చూపించి చేయాలని నిర్ణయించాం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొబైల్స్‌లో ప్రమాదకర యాప్‌లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నాం. – ఆర్ఎన్. అమ్మిరెడ్డి, డీఐజీ, అనంతపురం రేంజ్ -
అది నిజమని నిరూపిస్తే..రాజీనామా చేస్తా! దీదీ సవాల్
తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అదే గనుక నిజమైతే తాను రాజీనామా చేస్తానని సవాలు కూడా విసిరారు మమత. ఎన్నికల సంఘం తృణమూల్ పార్టీ అర్హతను సమీక్షించిన తర్వాత జాతీయ పార్టీ హోదాను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మమతపై సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు కాల్ చేసి మమత అభ్యర్థించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మమత..నేను అమిత్ షాకు ఫోన్ చేసి అడిగినట్లు నిజమైతే ఈ క్షణమే నా పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలను విని తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానన్నారు. సువేందు అబద్ధాలు చెబుతున్నాడంటూ విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న యత్నాల గురించి కూడా వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు మౌనం చాలా గొప్పదని, ప్రతిపక్షాలు కలవవని అనుకోవద్దన్నారు. మేమందరం ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నామని, అది ఒక్కసారిగా గాలివానాల వస్తుందని అన్నారు. అంతేగాదు స్వలింగ వివాహ చట్టం గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా సున్నితమైన విషయం అని, ప్రజల నాడి తోపాటు కోర్టు ఆదేశాలను కూడా చూసి ఒక అభిప్రాయానికి రావాలన్నారు. (చదవండి: భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..) -
భార్య దూరమైందనే బాధలో కోపంతో....
సైదాబాద్: తన భార్య దూరమైందనే బాధ... ఆమెను తన వద్దకు చేర్చట్లేదని పోలీసులపై కోపం...ఈ పరిస్థితులే ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేసేలా చేశాయి. అతగాడు మంగళవారం రాత్రి చేసిన ఆ కాల్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ను ఉరుకులు, పరుగులు పెట్టింది. బుధవారం అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 18 రోజుల జైలు శిక్ష విధించింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడి కథనం ప్రకారం... సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎండీ అక్బర్‌ఖాన్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. వివాహమైనప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. దీనికి సంబం«ధించి అతడి గతంలో పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు. అయితే అక్బర్ ప్రవర్తనతో విసిగిపోయానని, తాను అతడితో కలిసి ఉండలేనంటూ ఆమె పోలీసులకు స్పష్టం చేసింది. ఓపక్క తన భార్య దూరమైందనే బాధ, మరోపక్క పోలీసులు ఆమెను తీసుకువచ్చి తనకు అప్పగించట్లేదనే ఆవేదన అతడిలో ఎక్కువ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో అతగాడు తన ఫోన్ నుంచే నేరుగా సైదాబాద్ ఠాణాకు ఫోన్ కాల్ చేశాడు. ఐఎస్‌సదన్‌లోని మసీద్ మందిర్ చౌరస్తాలో కొందరు బాంబు పెట్టనున్నారంటూ చెప్పాడు. ఈ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లను పిలిపించారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో అణువణువూ గాలించారు. చివరు అది బెదిరింపు కాల్‌గా తేల్చారు. ఈ ఉదంతంపై సైదాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఫోన్ నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు బుధవారం ఉదయం అక్బన్ ఖాన్‌ను పట్టుకున్నారు. ఈ నిందితుడిపై ఐపీసీలోని 182, 186తో పాటు సిటీ పోలీసు యాక్ట్‌లోని 70 (బీ) సెక్షన్ కింద ఆరోపణలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం అక్బర్ ఖాన్‌కు 18 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సైదాబాద్ పోలీసులు అతనినిన చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..) -
బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
Kolkata Model Pooja Sarkar Suicide After Boyfriend Call: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదం నెలకొంటోంది. అనారోగ్య సమస్యలతో కొందరు మరణిస్తే, ఆత్మహత్యలకు పాల్పడుతూ పలువురు తనువు చాలిస్తున్నారు. వీరిలో కొందరు మోడల్స్ సైతం ఉంటున్నారు. తాజాగా కోల్‌కతాలో పూజా సర్కార్ (21) అనే మోడల్ విగతజీవిగా కనిపించింది. తను నివసిస్తున్న అద్దె ఇంట్లో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూజా సర్కార్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో మొదటి సంవత్సరం చదువుతోంది. సౌత్ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసిస్తోంది. శనివారం (జులై 16) సాయంత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది పూజా. రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూజాకు ఒక కాల్ వచ్చింది. దాని తర్వాత గదిలోకి పరిగెత్తి లోపలి నుంచి తాళం వేసుకున్న పూజా.. ఆమె ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. దీంతో పూజా స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందని పూజా స్నేహింతులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్.. కాగా గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్ బలవన్మరణం చెందారు. బిదిషా డే మజుందార్ అనే కోల్‌కతా మోడల్ మే 24న డమ్‌డమ్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయింది. తర్వాత పరిశ్రమలోని బిదిషా స్నేహితురాలు మోడల్ మంజుషా నియోగి కూడా మే 27న పటులిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ మోడల్స్ ఇద్దరూ రిలేషన్షిప్తోపాటు సరైనా అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. (మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com) -
కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...
నేటి యువత ప్రస్తుత టెక్నాలజీ మాయలో పడి తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం తల్లిదండ్రులుగా వారికి మందలించే హక్కు కూడా లేదనే చెప్పాలి. ఆస్తి కోసమో లేక వారికి నచ్చింది చేయడం లేదనో కన్న తల్లిదండ్రుల పైనే కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. మరికొంతమంది ప్రబుద్ధులైతే తల్లిదండ్రులనే కడతేర్చేందుకు రెడీ అయిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడోక దుర్మార్గుడు కన్నతల్లిదండ్రులను చంపి, సోదరికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. వివరాల్లోకెళ్తే.... మహారాష్ట్రలోని థానే జిల్లాలోని టిట్వాలా ప్రాంతంలో 37 ఏళ్ల అన్మోల్ భోంస్లే తన కన్న తల్లిదండ్రలనే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి మరీ విషయం చెప్పాడు. దీంతో అతని సోదరి హుటాహటినా ఇంటికి వచ్చి చూడగా...తల్లిదండ్రులిద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఇల్లంతా దుర్వాసన రావడమే కాకుండా అన్మోల్ కూడా ఆ మృతదేహాల పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈ మేరకు ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో దంపతులను కత్తితో పొడిచి చంపినట్లు తెలిసింని పోలీసులు చెప్పారు. మృతులు అశోక్ భోంస్లే (55), ఆయన భార్య విజయ భోంస్లే (50)గా గుర్తించామని తెలిపారు. (చదవండి: అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా) -
'యాస్' తుపాను అప్రమత్తతపై మంత్రి వెల్లంపల్లి సూచనలు
సాక్షి, విజయనగరం: ‘యాస్’ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అదేశించారు. ఈ మేరకు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్‌కు ఫోన్లో సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. చెరువులకు గండ్లు కొట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చదవండి: అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు -
cyber crime: కాల్ చేసి కాజేస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ఎర వేసి సిటీకి చెందిన ఇద్దరి నుంచి రూ.2.07 లక్షలు కాజేశారు. బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఫలక్‌నుమ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షల వ్యక్తిగత రుణం మంజూరైందని చెప్పారు. ఆ మొత్తం తీసుకోవడానికి కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, వీటిలో కొన్ని రిఫండ్ వస్తాయంటూ నమ్మబలికారు. ఇలా మొత్తం రూ.1.03 లక్షలు కట్టించుకుని మోసం చేశారు. కార్వాన్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు హైపీ అనే తమ వెబ్సైట్ నుంచి వస్తువులు ఖరీదు చేయాలని, అలా చేస్తే భారీ మొత్తం కమీషన్‌గా వస్తుందని నమ్మబలికారు. కొన్న వస్తువుల్ని అమేజాన్, ఫ్లిప్‌కార్డ్ ద్వారా డెలివరీ చేస్తామన్నారు. ఈ యువకుడు తొలుత కొన్ని వస్తువులు కొనగా..వాటితో పాటు కమీషన్ కూడా వచ్చింది. దీంతో పూర్తిగా నమ్మిన ఇతగాడు రూ.1.04 లక్షలు షాపింగ్ చేశాడు. ఆ తర్వాత వస్తువులు, కమీషన్ రెండూ రాకపోవడంతో తనను సంప్రదించిన వారికి ఫోన్ చేశాడు. అవన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. (చదవండి: ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు కాల్.. తీరా చేస్తే.. ) -
హలో.. బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా..
ముమ్మిడివరం (తూర్పుగోదావరి): ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను.. మీ ఖాతాకు ఆధార్ లింకు కానందువల్లే ప్రధాన మంత్రి స్కీమ్ రూ.10 వేలు మీ ఖాతాకు జమ కాలేదు.’’ అంటూ ఓ ఖాతాదారుడి బ్యాంకు వివరాలు తెలుసుకుని అతడి ఖాతా నుంచి రూ.94వేలు కాజేసిన ఉదంతమిది. ముమ్మిడివరం ఎస్సై కేవీ నాగార్జున కథనం ప్రకారం.. కొత్తలంక పంచాయతీ శివారు తోట్ల పాలానికి చెందిన ఈతకోట మణిరాజు కొత్తపేట లేబర్ ఆఫీసులో సబార్డ్‌నేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈనెల 7వ తేదీన సెల్: 7908490408 ద్వారా ఫోన్ వచ్చింది. ‘‘నేను బ్యాంకు మేనేజర్‌ను నీకు ప్రధాన మంత్రి స్కీమ్ ద్వారా వచ్చే రూ.10వేలు ఈ ఖాతాకు ఆధార్ లింక లేకపోవడం వల్ల జమ కాలేదు’’ ఈ మొత్తం జమ కావాలంటే నీ ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పాలి అని మణిరాజును అవతలి వ్యక్తి కోరాడు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును పై మొబైల్ నంబర్‌కు గూగుల్ పే చేయాలని సూచించాడు. దీంతో మణిరాజు తన ఖాతాలో ఉన్న రూ.94 వేలు గూగుల్ పే చేసి ఫోన్ చేశాడు. నీకు పది నిమిషాల్లో నీ సొమ్ము రూ.94 వేలతో పాటు ప్రధాన మంత్రి స్కీమ్ రూ.10వేలు కలిపి రూ.1,04,000 నీ ఖాతాలో జమవుతాయని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నంబర్‌కు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని మణిరాజు తెలిపాడు. బ్యాంకుకు వెళ్లి చూడగా తాను మోసపోయాయని తెలిసి గురువారం ముమ్మిడివరం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కేవీ నాగార్జున తెలిపాడు. -
సీఎం ఇంటికి బెదిరింపు కాల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపునకు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 4.45 గంటలకు చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్దిసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ నిపుణులు సీఎం పళనిస్వామి ఇంట్లో గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా బాంబు లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా తాంబరం సమీపంలోని సేలయూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని ఆటో డ్రైవర్ వినోద్‌కుమార్‌గా గుర్తించారు. తాగిన మత్తులో భార్యతో గొడవపడి పొరపాటున ఫోన్ చేశానని అతడు పేర్కొన్నాడు. అయితే గతంలోనూ ఇదే విధంగా ఫోన్ చేయగా వార్నింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే వినోద్ భార్య దివ్య కూడా ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు వివరించారు. (అందరూ దొంగలే.! ) -
కరోనా లక్షణాలు ఉంటే కాల్ చేయండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అను మానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ చెప్పా రు. దగ్గు, జ్వరం, జలుబు, పదార్థాల రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కలిగిన వారంతా 9963112781 నంబ రుకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ♦ అనంతరం ఎస్ ఎం ఎస్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ కస్టమర్‌కు అందుతుందన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు వెబ్ లింక్ http://covidandhrapradesh. veeraheathcare.comద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ♦ వైద్యపరీక్షలు నిర్వహించేందుకు 10 మొబైల్ ఐ మాస్క్ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి జిల్లాలోని 10 ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి బస్సులో 10 ప్రత్యేక కౌంటర్లు ఉంటా యని చెప్పారు. విజయవాడ నగరంలో కృష్ణలంక, గాంధీ స్కూల్, ఇందిరాగాంధీ స్టేడియం, బసవపున్నయ్య స్టేడియం, గుణదల మేరీమాత టెంపుల్, రైల్వే స్టేషన్ వద్ద, జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, ఇబ్రహీం పట్నంలో ఐ మాస్క్ బస్సులను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమా వేశంలో జేసీ (రెవెన్యూ) కె మాధవీలత, డా. రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 64,110 మందికి కరోనా పరీక్షలు ♦ జిల్లాలో ఇప్పటివరకు 64,110 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో మొత్తం 1115 కేసులు నమోదు కాగా వారిలో 684 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 455 మాత్రమే ఉన్నాయన్నారు. ♦ 61.35 శాతం మంది ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. 5 క్వారంటైన్ సెంటర్లలో 317 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అవసమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. -
నమస్కార్ జీ.. మై మోదీ!
హన్మకొండ: బీజేపీ సీనియర్ నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు. జనసంఘ్ కాలం నుంచి ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగుతున్న నాయకులతో మోదీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చందుపట్ల జంగా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డితో బుధవారం ప్రధాని మాట్లాడారు. కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించడంతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ మేరకు జంగారెడ్డి పార్టీ అభివృద్ధిలో సీనియర్ నాయకుల పాత్రను వివరించడంతో పాటు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తెలిపారు. ఇక సత్యనారాయణరెడ్డికి ఫోన్ చేయగా... ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. ఇప్పుడు ప్రధాని హోదాలో మీరు మాట్లాడారని చెప్పారు. అనంతరం ఇరువురు నాయకుల ఆరోగ్యంపై ఆరా తీసిన మోదీ లాక్డౌన్ అమలుపై ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జంగారెడ్డి, సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నుంచి ఫోన్ రావడంతో తాము ఆశ్చర్యపోయాయని.. ఇది తమకు మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ నుంచి... బీజేపీ నాయకులకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సీనియర్ నాయకులకు ఫోన్ చేసి కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంది.. జిల్లాల్లోని పరిస్థితులు ఆరా తీసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నారని తెలుసుకున్నారు. బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డితో పాటు పలువురికి ఆయన ఫోన్ చేశారు. -
నర్స్ ఛాయకు ప్రధాని ఫోన్
-
నా కొడుకు ఎక్కడ సారూ..?
కృష్ణ జిల్లా, విస్సన్నపేట (తిరువూరు) : పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో అండదండలుగా ఉంటారని ఎన్నో ఆశలతో తల్లితండ్రులు ఉంటారు. అయితే, కన్న కొడుకు పదేళ్లుగా ఉన్నాడా లేడా, ఉండి తమతో మాట్లాడటం లేదా అనే ఆవేదనతో ఓ మాతృమూర్తి హృదయం తల్లడిల్లుతోంది. తనను కొడుకు చూడనవసరం లేదయ్యా.. తనకు భర్త తరఫున పెన్షన్ వస్తోంది.. దాంతోనే తాను సుఖంగా జీవిస్తున్నాను. తమ తదనంతరం ఆస్తిపాస్తులు వాడికి అప్పగిస్తే బాధ్యత తీరుతుంది.. అని చెబుతోంది కన్న తల్లి ఉపద్రష్ట కామేశ్వరి. స్థానిక శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే ఉపద్రష్ట సుబ్బారావు టెలికం డిపార్ట్మెంట్లో ఉద్యోగం నిమిత్తం గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి విస్సన్నపేట వచ్చి చాలా ఏళ్లుగా స్థిరపడ్డారు. వీరి కుమారుడు ఉపద్రష్ట కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం 15 ఏళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ నోవా ఐటీ కన్సల్టింగ్ కంపెనీలో లీడ్ ఐటీ కన్సల్టెంట్‌గా పని చేసేవాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రానురాను ఫోన్ చేయటం మానేశాడు. పదేళ్ల కిత్రం తండ్రి సుబ్బారావు మరణించాడని అతడి ఫోన్‌కు మెసేజ్ పంపినా స్పందించలేదు. ఆ తర్వాత అతని సోదరుడు మరణించాడు. ఆ వార్త తెలిపినా అతీగతీ లేదు. అయితే, తన కొడుకు ఫోన్ నెంబరుకు కాల్ చేస్తే పలకటం లేదని, మెసేజ్‌లు పంపితే స్వీకరించినట్లు వస్తోందని కామేశ్వరి చెబుతోంది. ఎలాగైనా తన కొడుకును ఒక్కసారి మాట్లాడించాలని వేడుకుంటోంది. ఇదే విషయంపై గతంలో మీ కోసంలో కలెక్టరు కార్యాలయంలో అర్జీ కూడా ఇచ్చింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తన గోడు ‘సాక్షి’కి చెప్పుకుంది. ఎలాగైనా తన కొడుకుతో మాట్లాడించాలని వేడుకుంటోంది. -
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
-
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ఒక వైపు దేశంలో డీమానిటైజేషన్ కష్టాలు కొనసాగుతుండగానే బ్యాంకు ఉద్యోగులు బాంబు పేల్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహా వివిధ బ్యాంకులు, వారి ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 28న భారీ ఎత్తున ఆందోళన నిర్వహించనున్నాయి. అనంతరం డిసెంబర్ 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి. ఇదే అంశమై 2017 జనవరి 2, 3 తేదీల్లో కూడా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి. ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటాచలం, బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎస్ నాగార్జున ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు. తమ సంస్థల పిలుపు మేరకు, ఇప్పటికే తమ యూనిట్లు అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు కార్యక్రమం చేపట్టి, స్తానిక ఆర్బీఐ అధికారులకు మెమోరాండం అందించినట్టు తెలిపారు. తాము సరిపడా నగదు సరఫరా చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ను కోరామనీ, కానీ ఆర్ బీఐ విఫలమైందని ఆరోపించారు. నగదు అందుబాటులో లేనపుడు ఆయా కార్యాలయల్లో లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. భారీ ఎత్తున కొత్త నోట్లు పట్టుబడ్డ కొంతమంది వ్యక్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతోపాటు డీమానిటైజేషన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు సిబ్బంది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం దాదాపు 9 లక్షల బ్యాంక్ ఉద్యోగుల్లో రెండు సంఘాలు 5.50 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. రద్దయిన పాత నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్30 తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
28న జరిగే బంద్‌ను విజయవంతం చేయండి
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : నోట్ల రద్దు అనంతరం సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దేశవ్యాప్తంగా ఈ నెల 28న జరగనున్న బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దేశవ్యాప్త బంద్‌కు తమ పార్టీ కూడా మద్దతునిస్తోందన్నారు. నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు తీసుకునే అన్ని చర్యలకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తోందని కన్నబాబు స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదనేది తమ పార్టీ అభిమతమని స్పష్టం చేశారు. రూ.వెయ్యి, రూ.500లు నోట్లను అకస్మాతుగా రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడి చేసిన ప్రకటన అనంతరం సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికీ ఎంతో మంది సామాన్యులు చేతిలో చిల్లిగవ్వలేక దైనందిన జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చిరుద్యోగులు, చిన్నవ్యాపారులు, కూలీలతో సహా ఎంతో మంది రోజుగడవని పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారని కన్నబాబు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్ది నోట్ల రద్దు సమస్యను గాడిలోపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నల్లధనాన్ని బయటకు తేవడంలో కేంద్రాన్ని సమర్థిస్తూనే ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారికి అండగా నిలవాలన్నదే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్లే విపక్షాలు చేపట్టిన భారత్ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. బంద్‌కు సహకరించండి జిల్లాలో ఈ నెల 28న జరిగే భారత్ బంద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణ సహకారం అందించాలని కన్నబాబు పిలుపునిచ్చారు. వాణిజ్య, వ్యాపారవర్గాలు ఇందుకు మద్దతునివ్వాలన్నారు. మెడికల్, ఆర్టీసీతో పాటు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందన్నారు. జిల్లాలోని పార్టీ శ్రేణులు, ఇతర వర్గాలు రాజకీయ పార్టీలు ఇందుకు అనుగుణంగా సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ చేపట్టే ఇతర వర్గాలతో కలిసి విజయవంతానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ శ్రేణులు తోడ్పడాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా చేయండి : ఎమ్మెల్సీ బోస్ రామచంద్రపురం : ఈ నెల 28 న దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసనను స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బ్యాంకుల సేవలకు ఎటువంటి అంతరాయం తలపెట్టకుండా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు స్వచ్ఛందగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బోస్ పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన జరిగే భారత్‌బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు సహకరించి విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నల్లధనాన్ని బయటపెట్టేందుకు తీసుకునే చర్యలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతునిస్తున్నారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా చేసిన నోట్ల రద్దు ప్రకటన వల్ల రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందన్నారు. ప్రజల కష్టాలను పరిష్కరించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని, అందువల్లే ప్రజల పక్షాన పోరాడే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తమ పార్టీ భారత్‌బంద్‌కు మద్దతునిస్తున్నదన్నారు. జిల్లాలోని యువకులు, విద్యార్థులు, వివిధ సంఘాలతోపాటు వైఎస్సార్ సీపీ యువజన విభాగానికి చెందిన ప్రతి కార్యకర్త భారత్ బంద్ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. -
‘కాల్ నాగుల్’ అరెస్ట్
ఖమ్మం: కాల్ మనీ వ్యవహారంలో పలు కేసులు నమోదు చేయబడి పలుమార్లు అరెసై్టన మాజీ పోలీస్ కానిస్టేబుల్ నాగులును మెదక్ జిల్లా సంగారెడ్డి పోలీసులు శనివారం అరె‹స్ట్ చేశారు. జిల్లాలోని తల్లాడ మండల కేంద్రానికి చెందిన నాగులు 1989 బ్యాచ్‌కు చెందిన సివిల్ కానిస్టేబుల్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. అయినా అతనిలో మార్పు రాకపోవటంతో పోలీసులు సర్వీస్ నుంచి తొలగించారు. ఆ తర్వాత రియల్ వ్యాపారం చేసిన నాగులు కాల్‌మనీ దందాకు తెరదీశాడు. జిల్లాకు చెందిన రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు వ్యాపారం నిమిత్తం రూ.24 లక్షలు నాగులు వద్ద అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ కింద రూ.కోటి వరకు చెల్లించాడు. అయినా మరో కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తుండటంతో గత్యంతరం లేక హైదరాబాద్ వెళ్లిపోయాడు. అయినా వదలకుండా తన మనుషులతో హైదరాబాద్ వెళ్లి మరీ బెదిరిస్తుండటంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చే శాడు. కాల్ మనీ కింద నాగులుపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతని కోసం వెదుకుతుండగా మెదక్ జిల్లా సంగారెడ్డి పోలీసులకు శనివారం చిక్కాడు. నాగులుపై ఖమ్మం వన్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. మొత్తం అతనిపై ఆరు కేసులున్నట్లు తెలిసింది. -
హెల్త్ కాల్ ఇచ్చే రింగ్
టెక్ టాక్ ఆరోగ్యమే మహాభాగ్యం. కాదనేవారెవరూ లేరుగానీ...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తింటున్నాం? తిన్నది శరీరంలోకి ఎలా చేరుతోంది? దానివల్ల లాభనష్టాలేమిటి? అన్నది తెలియాలి. ఈ పనుల్లో కొన్నింటిని చేసిపెట్టేందుకు మార్కెట్లో చాలా పరికరాలున్నాయి. ఫొటోలో కనిపిస్తున్న బయో రింగ్ వీటితోపాటు మరికొన్ని పనులూ చేసిపెడుతుంది. స్వీడన్‌కు చెందిన ఔత్సాహిక శాస్త్రవేత్తలు కొందరు దీన్ని రూపొందించారు. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్ల మోతాదులను లెక్కకట్టడం... మొత్తం కేలరీలు, మీరు ఖర్చుపెట్టినవి వంటి అన్ని వివరాలూ అందిస్తుంది. ఆహారం తీసుకున్న తరువాత మన శరీర కణాల్లోకి చేరే గ్లూకోజ్ మోతాదులను బయో ఇంపెడెన్స్ సెన్సర్ ద్వారా లెక్కకట్టవచ్చు. ప్రత్యేకమైన అల్గారిథమ్‌ల ద్వారా ఆ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్‌కు పంపుతుంది. ఏవైనా పరిమితికి మించి ఉన్నాయని తేలితే వెంటనే ఈ రింగ్‌లోని రెండు వైబ్రేటర్లు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. మీ ఎత్తు, బరువులతోపాటు కొన్ని ఇతర వివరాలను అందిస్తే చాలు. మీరు వేసే అడుగులను లెక్కపెట్టేందుకు మూడు అక్షాంశాలపై పనిచేసే యాక్సెలరోమీటర్, గుండెకొట్టుకునే వేగం కోసం చిన్న ఎల్ఈడీ బల్బును ఉపయోగిస్తుంది. ప్రస్తుతానికి దీని ధర 300 డాలర్లు. ఇండిగెగో వెబ్సైట్ ద్వారా ప్రీఆర్డర్ చేయవచ్చు. ఈ ఏడాది నవంబరు నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. -
జైలు నుంచి యాసిన్ భత్కల్ ఫోన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎమ్) చీఫ్ యాసిన్ భత్కల్ ను ఐఎస్ఐఎస్, అనసర్ ఉద్-తవ్హీద్ ఫీ బిలాద్ అల్ హింద్(ఏయుటీ) సంస్థలకు చెందిన నేతలు కలిశారా? అనే వార్తలకు అవుననే! సమాధానం వినిపిస్తోంది. జైలు నుంచి భత్కల్ తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. గత జూన్ లో తన భార్యతో మాట్లాడిన భత్కల్ త్వరలో దామస్కస్ నుంచి సాయం అందుతుని చెప్పినట్లు భారత ఐసిస్ రిక్రూటర్ లుగా ఉన్న ఆషీక్ అహ్మద్ అలియాస్ రాజా, మహ్మద్ అబ్దుల్ అహద్, మహమ్మద్ అఫ్జల్ లు తెలిపారు. దీంతో అలర్ట్ అయిన ఇంటిలిజెన్స్ అధికారులు భత్కల్ అరెస్టు తర్వాత ఇప్పటివరకు అతన్ని కలిసిన వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. -
'సంఘ్ రహిత భారత్'కు నితీశ్ పిలుపు
పట్నా: 'అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సమర్థులను ఉద్దేశపూర్వకంగా పక్కకుతప్పించి ఇప్పుడు బీజేపీని తమ చేతల్లోకి తీసుకున్న నేతలంతా సెక్యులరిజంపై విశ్వాసంలేనివాళ్లే. అనుకోని విధంగా అధికారం వారి చేతికే దక్కింది. దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే సంఘ్ శక్తుల నుంచి భారత్ ను కాపాడుకోవాలి. సెక్యూలర్ పార్టీలంతా ఏకమై 'సంఘ్ ముక్త్ భారత్'(సంఘ్ రహిత భారత్) కోసం కృషిచేయాలి' అని జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలలోగా లౌకిక పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి కృషి జరగాలని నితీశ్, ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక గూటికి చేరాలని పిలుపునిచ్చారు. వ్యక్తి గతంగా తాము ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం కానప్పటికీ సంఘ్ పరివార్ వేర్పాటువాద భావాలను తప్పకుండా నిరసిస్తామన్నారు. -
రైల్వేస్టేషన్లో బాంబు పెట్టాం!
ఆకతాయి ఫోన్‌కాల్ పోలీసులు ఉరుకులు, పరుగులు సికింద్రాబాద్: ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టాం.. మరి కొద్ది సేపట్లో పేలుతుంది. జాగ్రత్త’’... అంటూ...ఫోన్ చేసి ఓ ఆకతా యి పోలీసుల ను ఉరుకులు, పరుగులు పెట్టించాడు. వివరాలు... గురువారం మధ్యాహ్నం 2.30కి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టామని, కొద్దిసేట్లో పేలుపోతుందని హెచ్చరించాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది సమాచారం మేరకు అప్రమత్తమైన జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు రైల్వేస్టేషన్లో తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్‌ఫామ్‌లు, వెయిటింగ్ హాళ్లు, స్టేషన్ పరిసరాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఎవరో అకాతాయి ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపం నుంచే ఈ కాల్ వచ్చిందని, సదరు ఫోన్‌మాత్రం రాజేంద్రనగర్‌కు చెందిన నరేష్‌దని గుర్తించారు. చిరునామా అధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు జీఆర్పీ బృందాలు బయలుదేరాయి. కాగా, సదరు ఆకతాయిని పోలీసులు గురువారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
కాల్‌మనీ వ్యవహారంలో కొత్త కోణాలు
-
అంతరిక్షం నుంచి రాంగ్ కాల్...!
మొబైల్ ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రాంగ్ కాల్స్ రావడం మామూలై పోయింది. ఒకరికి చేరాల్సిన కాల్ మరొకరికి చేరడమూ... ఒక కాల్ మాట్లాడుతుండగా మధ్యలో ఇంకొకరి మాటలు వినిపించడమూ సర్వ సాధారణమైపోయింది. అయితే ఇతర నగరాలు, రాష్ట్రాలు, దేశాలే కాదు... ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ అదే అనుభవం ఎదురైందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం... ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి పలువురు సభ్యుల బృదం తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరందరినీ కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ కాప్సూల్ ద్వారా ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరు నెలల పాటు ఉండే అంతరిక్ష యాత్రకు ఈ వ్యోమగాములు వెళ్ళారు. అయితే ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్ టిమ్ పీక్ కు ఇదే తొలి స్పేస్ జర్నీ. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి బ్రిటన్ దేశస్థుడు కూడ ఆయనే. ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న టిమ్ పీక్ భూమిపై ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయన ఫోన్ చేస్తే... అది... నంబర్ తప్పు డయల్ కావడంతో రాంగ్ కాల్ వెళ్ళిందట. ''ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అంటూ అడిగిన కిమ్ కు ఆశ్చర్యం కలిగిందట. అట్నుంచి ఓ మహిళ స్వరం వినిపించడంతో '' హలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అని మరోసారి అడిగారట. తీరా తర్వాత అసలు విషయం అర్థమైందట. పొరపాటున రాంగ్ నంబర్ చేశానని కిమ్ గ్రహించారు. ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు కారణమైందని, ఆ మహిళకు క్షమాపణలు చెప్తూ కిమ్ పీక్ ట్వీట్ చేశారు. 43 ఏళ్ళ హెలికాఫ్టర్ పైలట్ అయిన కిమ్ పీక్ ఈ యాత్ర కోసం సుమారు 28నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా 173 రోజులు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు. -
రూటర్...
మెట్రో కథలు ఏంట్రా... ఏంటి? ఏమంటావ్? నే వెళుతున్నా. వెళ్తావా? ఇక నాకు కాల్ చేయకు. రిస్క్‌లో పడేశావ్. దేవుడా.. రేయ్... పరిగెత్తి బైక్ సపోర్టింగ్ రాడ్ పట్టుకుంది. వదులు. నన్నేం చేయమంటావ్? నన్నడిగితే? విదిలించుకుని వెళ్లిపోయాడు. రొప్పుతూ ఏడుపొస్తున్నట్టుగా అవుతూ ఏం తోచనట్టుగా దిక్కులు చూస్తూ బస్టాప్‌లో కూలబడింది. రూట్ బస్సులు తిరగడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు వాడు కాల్ చేస్తే? ఇప్పుడు కావాలి రా అంటే? ఎందుకైనా మంచిదని సెల్ ఆఫ్ చేసింది. చేశాక దానివైపు చూసుకుంది. దరిద్రం. అంతా దీని వల్లే వచ్చింది. ఏంటమ్మా... ఏదైనా ప్రాబ్లమా? అబ్బే... ఏం లేదండీ... తెలిసిన అబ్బాయే. ఏంటో... ఈ కాలం పిల్లలు... బస్సొస్తే ఎక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు బస్టాప్‌లో ఎవరూ లేరు. మధ్యాహ్నం మూడంటే పెద్దగా ఎవరూ ఉండే టైమ్ కాదది. సాయంత్రం దాకా క్లాసులున్నాయి. మాట్లాడాలని బైక్ ఎక్కి తీసుకు వచ్చింది. తీరా సంగతి చెప్పాక పారిపోయాడు. వెధవ. ఇప్పుడు ఎవడు కాపాడతాడు? ఎదురుగా పెద్ద బిల్డింగ్ మీద చాలా పెద్ద హోర్డింగ్ కనిపిస్తూ ఉంది. రూ.599కి ఒక ప్యాకేజ్ అట. రూ.999కి ఇంకో ప్యాకేజ్ అట. రూ.1199 కడితే ఇక తిరుగే లేదట. ఏమైనా చేసుకోవచ్చట. మొదట తమ్ముడు మొదలెట్టాడు. తర్వాత తను వెంటపడింది. హాల్లో అందరికీ కనిపించేలా ఉన్న కంప్యూటర్‌కి నెలకు ఆరు వందల ప్యాకేజీలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. కొత్తల్లో అంతా బాగుంది. మెయిల్స్ చూసుకునేవారు. యూ ట్యూబ్‌లో సినిమాలు చూసుకునేవారు. చదవుకోవడానికి మెటీరియల్- తమ్ముడికి ఇంటర్ సంగతేమోగాని తనకు బి.టెక్కు చాలా అవసరమే పడింది. నాన్నకు ఫేస్బుక్ పరిచయం చేశారు. అమ్మ ఫస్ట్‌టైమ్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇద్దరు పిల్లల పేర్లను కలిపి పాస్‌వర్డ్‌గా పెట్టుకుంది. ఇరుగూ పొరుగూ ఫ్లాట్స్ వారికి కూడా సంతోషమే. ఇల్లంటే ఏమిటి? టూ బెడ్రూమ్స్, కిచెన్, స్విఫ్ట్ కారు, కంప్యూటర్, ఇంటర్నెట్.... కాని కాదని కాలక్రమంలో తేలింది. స్మార్ట్‌ఫోన్స్ లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద వెలితి అది. తండ్రి మరీ అంత స్పీడ్ మీద ఉండే మనిషి కాదు. అలాగని ప్రతిదాన్నీ నిరోధించేవాడూ కాదు. లోటు చేయకుండా ఇంట్లో ఉన్న నలుగురికీ రెండు మూడు వేలు పెట్టి నోకియాలు తీసుకున్నాడు. బయట, ఆఫీసులో రింగ్ వస్తే జేబులో నుంచి దానిని బయటకు తీస్తే అందరూ చిత్రంగా చూడటం ఇబ్బందిగా ఉన్నా పిల్లలు దానిని భరించలేకపోతున్నారని త్వరగానే అర్థం చేసుకున్నాడు. మరీ పదిహేనువేలూ పద్దెనిమిదివేలూ పెట్టి సామ్‌సంగ్‌లు సోనీలు కాదు వేరేవి ఆలోచించండి అంటే ఆరేడు వేలకు బ్రహ్మాండమైన చైనా ఫోన్లు వచ్చాయి. కావల్సిందేమిటి? ఫేస్బుక్, వాట్సప్. అవి బాగా పని చేస్తాయి. కొత్తల్లో పిల్లలిద్దరికీ చెరి నూటేభై రూపాయలు శాంక్షన్ చేశాడు ఇంటర్నెట్ డేటా కోసం. అది ఏ మూలకు? నలుగురితో చాట్ చేస్తే నాలుగు డౌన్లోడ్లు చేస్తే చిటికెలో బేలెన్స్ అయిపోయేది. మళ్లీ డబ్బులడగాలంటే లేని కుటుంబం కాదుగాని కలిగిన కుటుంబం కూడా కాదు. పెద్ద ఇబ్బందే. రూటర్ పెట్టించండి నాన్నా అంది ఒకరోజు. మంచి విరుగుడు. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తెప్పిస్తే ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ మీద ఇంట్లో అందరికి వైఫై వస్తుంది. అందరి ఫోన్లూ హ్యాపీగా పని చేస్తాయి. అన్‌లిమిటెడ్‌గా నెట్ వాడుకోవచ్చు. అన్నింటికంటే మంచి విషయం ఏమిటంటే ఇంతకు ముందులా హాల్లో కూచుని ఏం చేస్తున్నా నలుగురికీ తెలిసిలా చేసే బాధ తప్పడం. ఆడపిల్ల అని ఒక బెడ్ రూమ్ ఇచ్చారు. వాడు గొడవకు దిగితే డైనింగ్ ఏరియాను ఖాళీ చేసి ప్లైవుడ్ కొట్టి వాడికో గదిలాంటిది తయారు చేశారు. సరే వీళ్లకూ మాస్టర్ బెడ్రూమ్ ఎలాగూ ఉంది. ఇప్పుడు ఇరుగూ పొరుగూ వాళ్లు నిజంగా సంతోషించారు. నలుగురి చేతుల్లో నాలుగు స్మార్ట్ఫోన్లు. నలుగురూ ఇంట్లో ఉంటారు. నలుగురూ ఫోన్లో ఉంటారు. ఇంతకు మించి ఏం కావాలి? మొదట రణ్‌బీర్ కపూర్‌ని ఇష్టపడే క్లాస్మేట్స్ అంతా వాట్సప్‌లో ఒక గ్రూప్ అయ్యారు. ఎక్కువగా అమ్మాయిల గ్రూపే. కాని అబ్బాయిలు దూరకుండా ఉంటారా? ఆ తర్వాత ఒన్ టు ఒన్ చాటింగ్ మొదలయ్యింది. తొమ్మిదికల్లా పుల్కాలు తిని పాలు తాగి ఒక ఆపిలో కాసిని అనాసముక్కలో తీసుకుని గదిలో దూరితే అమ్ములు చదువుకుంటోందని ఒకటే మురిపెం. కాని తలుపు గట్టిగా బిడాయించుకుని మూడ్ కోసం బెడ్‌లైట్ వేసుకుని ఆ నీలి వెలుతురులో గుట్టు చప్పుడు కాకుండా స్క్రీన్ మీద అక్షరాలను బ్లింక్ చేస్తూ పోతూ ఉంటే గంటలు గంటలు... డబ్బులవుతాయన్న బాధే లేదు. రూటర్ ఉందిగా. ఒకరోజు మాట మారింది. ఒక దారి నుంచి ఇంకో దారిలోకి మళ్లింది. బాగా నిద్ర పట్టి తెల్లారి ఆలస్యంగా నిద్ర లేచింది. కాలేజ్ చేరుకున్నాక క్లాసుల హడావిడిలో ఫోన్ ఎప్పుడు తీసుకున్నాడో చాటింగ్ ఎప్పుడు చూశాడో ఎప్పుడు మెయిల్ చేసుకున్నాడో తెలియదు. చాట్ చేసినవాడు ఫ్రెండే. దానిని కాపీ చేసుకున్నవాడూ ఫ్రెండే. చాట్ హిస్టరీని డిలీట్ చేయకపోవడం వల్ల దొరికిపోయింది. ఒక బెడ్ మీద లేరన్నమాటేగానీ తక్కినవన్ని జరిగాయిగా అన్నాడు మరుసటి రోజు నవ్వుతూ. హాస్యం అనుకుంది. కాదు. మెయిల్లో ఉన్నదంతా చూపించాడు. వాడు సరే... నువ్వు మరీ రెచ్చిపోయావుగా. పాదాలు చల్లగా అయిపోయాయి. గ్రూప్‌లో షేర్ చేస్తా. లేదంటే మీ నాన్నకు మెయిల్ చేస్తా. వాడి బాబుకు కూడా. కలో క్రైమ్ సినిమాయో అయితే బాగుండనిపించింది. కాని కాదు. నేను చాటింగ్‌కే చొంగ కార్చుకునే బ్యాచ్ కాదు. అసలుది కావాలి. కాల్ చేస్తా. వెళ్లిపోయాడు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. గొంతు పట్టేసినట్టుగా అనిపించింది. మాటిమాటికి దప్పికేస్తున్నట్టుగా అనిపించింది. ఇదంతా ఈ క్షణంలో అబద్ధం అయిపోవాలని అనిపించింది. కాని కాదు. నిజమే. ఎదుర్కోవాలి. కూడగట్టుకుని ధైర్యం తెచ్చుకుని క్లాస్‌లో నుంచి అర్జెంట్‌గా లేవదీసి బయటకు తీసుకొచ్చి విషయం చెప్తే తన కంటే ఎక్కువగా బెంబేలు పడిపోయాడు. ఎలా... ఎలా? చాట్ చేసేటప్పుడు ఉండాలి ఈ భయం. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ ఉదయం లేస్తే అమ్మా నాన్నా అని చక్కగా కనిపించే పిల్లలే. పెద్దవాళ్లను విష్ చేయడం... అంకుల్ ఆంటీ అంటూ మర్యాద ఇవ్వడం... కాలేజ్‌లో కూడా మంచి పేరే ఉంది. కాని ఆ సమయంలో ఆ క్షణంలో ఏం మాట్లాడుకున్నారో తెలిస్తే అదంతా ఏం కాను? నాన్న బతుకుతాడా? తను బతుకుతుందా? పోనీ పోలీసులకు చెప్తే? హు. అదంతా చదివి ముఖాన ఊయరూ? మంచి ర్యాంక్ తెచ్చుకుని మంచి బ్రాంచ్‌లో చేరిందే... ఇప్పుడు చదువు మాన్పిస్తారా? తన్ని మూలన కూచోబెడతారా? మాటల్లో దించినవాడు పారిపోయాడు. తను మాత్రం అసలుది ఇవ్వాలట. ఇచ్చి? ఒకసారితో ఆగుతుందా... ఒకరితో ఆగుతుందా? కణతల దగ్గర నొప్పి. మెల్లగా మొదలై పెద్దగా అవుతూ. ఆత్మహత్య చాలా సులువైన పరిష్కారం అనిపించింది. అవును. అదే సరైన పరిష్కారం. తిరిగి కాలేజ్‌కు వెళ్లి లైబ్రరీ బిల్డింగ్ ఎక్కి పై నుంచి దూకేస్తే చాలు. ఈ బాధలన్నింటి నుంచి బయటపడిపోవచ్చు. నిర్ణయం తీసుకున్నాక రిలీఫ్‌గా అనిపించింది. కాని ఒక్క నిమిషమే. మళ్లీ భయం వేసింది. పోనీ ఒక్క తప్పే కదా. ఇంటికెళ్లి చెప్పేస్తే అమ్మా నాన్నా అయ్యో... అమ్ములూ అని కడుపులో పెట్టుకోరూ? జరగాల్సింది చూడరూ? కాని ధైర్యంగా ఎలా చెప్పడం. పాడు పని చేసిందే. పిడికిట్లో సెల్ నలుపుతూ కూచుని ఉంది. ఇంటికా? కాలేజ్కా? నెమ్మదిగా రూట్ బస్సులు మొదలవుతూ ఉన్నాయి. చూసింది. కాలేజ్‌కు తీసుకెళ్లే బస్సు ఇంటి మీదుగా వెళ్లే బస్సు ఒకదానికి ఒకటి తోకలా అంటుకుని వస్తూ ఉన్నాయి. లేచి నిలబడింది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
‘పోస్ట్’ పోయే.. ఫోన్ వచ్చే..
అనంతపురం కల్చరల్: ‘‘పోస్ట్... అంటూ వినిపించే మధుర కంఠం గురించి ఆసక్తిగా ఎదురు చూసే కాలం దాదాపుగా మరుగున పడిపోయింది. మారుతున్న కాలగమనంలో అందంగా ప్రవేశించిన మొబైల్ ఫోన్ మానవుని జీవితాన్ని సుఖమయం చేసింది. క్రమంగా తపాలా వ్యవస్థలోని పోస్టుకార్డుల వ్యవస్థ అంతర్థానమయ్యే స్థితికి చేరుకుంది. సమాచారాన్నందించడంలో అమోఘమైన పాత్ర పోషించిన పోస్ట్ కార్డు చిన్నబోతూ క్రమంగా పక్కకు తప్పుకుంటుంటే ఆ స్థానాన్ని మొబైల్ ఫోన్ భర్తీ చేస్తోంది. 150 ఏళ్ల పోస్టు కార్డు కుదేలు ఆంగ్లేయులు తపాలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే పోస్ట్‌కార్డు పుట్టింది. అణా నుంచి 50 పైసల వరకు సాగిన కార్డు ప్రస్థానం 150 ఏళ్లు దాటిన తరుణంలో, ‘సెల్’ దెబ్బకు కుదేలైంది. ఒకనాడు బంధువులను, స్నేహితులను పలకరిం చాలన్నా, ఉద్యోగాలకు ఇంట ర్వ్యూ లేఖలు పంపాలన్నా పోస్టు కార్డే వారధిగా ఉండేది. మధురమైన భావాలు మరిం త అందంగా చెప్పించడానికి కార్డు అవకాశం కల్పించేది. తిరిగి కార్డు వచ్చే వరకు ఎదురు చూడడమనేది అందమైన అనుభూతిగా మిగిలిపోయేది. ఫోన్ల రాకతో తపాలా ప్రాధాన్యత తగ్గిపోయింది. సెల్ వెంటనే అనారోగ్యం ప్రస్తుతం బిక్షగాడి నుంచి ధనికుల వరకు విద్యార్థుల నుంచి ఉన్నతోద్యోగుల వరకు అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారి చేతిలో మొబైల్ ఉంటుంది. దీంతో ఇప్పుడు వారు ఒక గంట సెల్‌ఫోన్ విడిచి ఉండలేని పరిస్థితి నెలకొంది. సెల్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో.... అంత అనారోగ్యం దాని వెంటనే పొంచి ఉంది. ఈనాటి మొబైల్ ఫోన్లు పోస్టల్ జీవి తాన్ని కబళిస్తున్నా... ఆనాటి పోస్ట్‌కార్డు అందించే మధుర స్మృతులు ఇన్ని అన్ని గావు. దాచుకున్న ఆనాటి కార్డులను వీలున్నప్పుడు చదువుతుంటే పాత జ్ఞాపకాలు ఆనంద డో లికల్లో ముంచెత్తుతాయి. సెల్ ధ్వనులు లేని ప్రపం చం రావాలని చాలామం ది కోరుకుంటున్నారు. ‘సెల్’ ప్రపంచం 80వ దశకంలో అడుగుపెట్టి సెల్ ప్రస్థానం, ఇప్పుడు విశ్వ వ్యాప్తమై సార్వజనీయమైంది. ఇప్పుడు సమాచారం పంపడం ఎంత తేలికంటే అనంతలో ఉన్నా అమెరికాలో ఉన్నా క్షణాల్లోనే. సెల్‌తో పాటు నెట్, ఇంటర్నెట్, వాట్సాప్, మెయిల్స్ చేస్తున్న వింతలు ఎన్నో ఎన్నెన్నో. విలాస వస్తువుగా ప్రారంభమై, అవసరంగా మారిపోయిన సెల్ఫోన్లు ఆకర్షణీయమైన రూపాల్లో అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ రోజుల్లో సమాచార వ్యవస్థకు పునాది అయిన తపాలాను అసలు వాడని వారున్నారు. ఇది వేగంగా మారుతున్న కాలానికి దర్పణం పడుతుంది. ఈతరం విద్యార్థులు పాఠాలలో మినహా పోస్టుకార్డులు వాడే, లేఖలు రాసే సంస్కృతికి దాదాపు దూరంగా ఉన్నారు. -
తిరుపతిలో టాక్సీడ్రైవర్స్ భారి ర్యాలీ