ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఇటీవల రష్యాలో జరిగిన అంతర్యుద్ధం, ఉక్రెయిన్ అంశాలపై చర్చించుకున్నారు. ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో మోదీ మద్దతు తెలిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. రష్యాలో శాంతి పరిరక్షణలు నెలకొని పౌరుల భద్రత కాపాడాలని మోదీ ఆకాంక్షించినట్లు పేర్కొంది. అమెరికా పర్యటన తర్వాత మొదటిసారి మోదీ, పుతిన్‌లు ఫోన్‌లో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యాలో ఇటీవల జరిగిన సంఘటనలను ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా జరుగుతున్న మార్పులు, పరస్పర సహకార అంగీకారాలపై ముచ్చటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలపై చర్చ జరిగిందని క్రెమ్లిన్ తెలిపింది.
జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లలో ఇరుదేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందాలపై కూడా మోదీ, పుతిన్ మాట్లాడుకున్నారు. అయితే.. ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా దేశం ఎప్పడూ లేనంత ఇబ్బందుల్లో పడిపోయింది. పుతిన్ అధికారంలోకి వచ్చిన రెండు దశాబ్ధాల్లో ప్రిగోజిన్ తిరుగుబాటే అతనికి అతి పెద్ద ఛాలెంజ్‌గా మారింది.
ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..
Comments
Please login to add a commentAdd a comment