భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడని, మంచి మనిషి అని కొనియాడారు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రంపచ నాయకుల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘మోదీ నాకు స్నేహితుడు. మంచి మనిషి. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించక ముందువరకు భారత్ పరిస్థితి అస్థిరంగా ఉండేది. చూడటానికి అతను మీ తండ్రిలా కనిపిస్తాడు. చాలా మంచివాడు. అని అన్నారు.
ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరులో అమెరికాలోని టెక్సాస్ వేదికగా నిర్వహించిన ‘హౌడీ మోదీ’కార్యక్రమాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. అప్పటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 80 వేలమంది వచ్చారని, అది ఎంతో ఉత్సాహంగా సాగిందని చెప్పారు. మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. కాగా హ్యూస్టన్ నగరంలోని ఎన్‌ఆరజీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌క పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్‌లు హజరవ్వగా వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించి మోదీతో జరిపిన సంభాషణను ప్రస్తావిస్తూ..‘కొన్ని సందర్భాల్లో భారత్‌ను బెదిరించేందుకు ఓ దేశం యత్నించింది. ఇలాంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో నాకు అనుభవం ఉందని, ఈ విషయంలో సాయం చేస్తానని మోదీతో చెప్పాను. దానికి ఆయన చాలా దూకుడుగా స్పందించారు. ‘ఈ వ్యవహారాన్ని నేను చూసుకోగలను. అవసరమైతే ఏ చర్యలు తీసుకునేందుకైనా సిద్ధమే. వందల సంవత్సరాలుగా వారిని మేము ఓడించాం’ అని మోదీ అన్నారు. ఇది విన్న నేను ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment