Human being
-
థాట్ రీడింగ్ మెషీన్ గురించి విన్నారా? ఇది నిజమేనా?
డాక్టర్ గారూ... మా ఊర్లో ఇటీవల థాట్ రీడింగ్ మెషీన్స్ వచ్చాయి. కొందరు వాటిని నా మీద ప్రయోగించి, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల బతికుండగానే నరకం అనుభవిస్తున్నాను. ఒకసారి ఆత్యహత్యా ప్రయత్నం కూడా చేశాను. నేను ఈ బాధలు తట్టుకోలేక డైరెక్టుగా వారిని కలిసి అడిగితే, మాకేం తెలియదని బుకాయిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో మీరైనా సలహా ఇవ్వగలరు – రఘురామ్, గుంతకల్లుమీ మానసిక వేదన అర్థమైంది. ప్రపంచంలో ఇంతవరకు మీరు చెప్పిన లాంటి థాట్ రీడింగ్ మెషీన్ ఎక్కడా రాలేదు. అది జరగని విషయమే. కేవలం ఒక మెషిన్ ద్వారా ఒకరి ఆలోచనలను ఇంకొకరు తెలుసుకోగలిగితే, ప్రపంచంలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవి. అదేవిధంగా మరికొన్ని కొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చి ఉండేవి. నిజంగా మీరు చెప్పిన మెషీన్లు గనక వస్తే, మనుషుల మధ్య స్పర్ధలు, అ΄ోహలు, గొడవలే కాకుండా సమాజంలో కూడా అశాంతి, అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. అలాంటి మెషీన్స్ కేవలం రచయితల కల్పనలే. అవి సినిమాలకు, నవలలకు మాత్రమే పరిమితం. కానీ వాస్తవం కానే కాదు. పారనాయిడ్ సైకోసిస్ అనే మానసిక వ్యాధికి గురైన వ్యక్తులు, ఒక్కోసారి ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనయ్యే అవకాశముంది. లేనివి ఉన్నట్లుగా భావించి, నిజమని నమ్మి, తాము మనోవేదనకు గురి కావడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. (‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా? )ఎంత తార్కికంగా వీరికి నచ్చజెప్పచూసినా, వీరు ఆ మూఢ నమ్మకాలనుంచి బయట పడలేరు. ఇలాంటి భావనలను హెల్యూజన్స్ ఆఫ్ పర్‌సెక్యూషన్ అని అంటారు. ఎవరో వైర్లెస్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా తమ మైండ్‌ను కంట్రోల్ చేస్తున్నారనే కొందరి భావనలు కూడా ఈ కోవకు చెందినవే! మెదడులోని డోపమైన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థంలోని సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి భ్రమలు– భ్రాంతులు కలుగుతాయి. మీకు నేనిలా సలహా చెబుతున్నానని అన్యధా భావించక వెంటనే మీకు దగ్గరలోని సైకియాట్రిస్టును సంప్రదించి, మీకున్న ఈ ఇబ్బందికి తగిన చికిత్స తీసుకుంటే మీకొచ్చిన ఇలాంటి భ్రమలు, ఆలోచనలు పటాపంచలై మీరు వీటిలోనుంచి పూర్తిగా బయట పడి, మనశ్శాంతిగా ఉండగలరు. ఆల్ ది బెస్ట్! -
నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్ ప్రశంసలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడని, మంచి మనిషి అని కొనియాడారు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రంపచ నాయకుల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘మోదీ నాకు స్నేహితుడు. మంచి మనిషి. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించక ముందువరకు భారత్ పరిస్థితి అస్థిరంగా ఉండేది. చూడటానికి అతను మీ తండ్రిలా కనిపిస్తాడు. చాలా మంచివాడు. అని అన్నారు.ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరులో అమెరికాలోని టెక్సాస్ వేదికగా నిర్వహించిన ‘హౌడీ మోదీ’కార్యక్రమాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. అప్పటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 80 వేలమంది వచ్చారని, అది ఎంతో ఉత్సాహంగా సాగిందని చెప్పారు. మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. కాగా హ్యూస్టన్ నగరంలోని ఎన్ఆరజీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్క పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్లు హజరవ్వగా వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించి మోదీతో జరిపిన సంభాషణను ప్రస్తావిస్తూ..‘కొన్ని సందర్భాల్లో భారత్‌ను బెదిరించేందుకు ఓ దేశం యత్నించింది. ఇలాంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో నాకు అనుభవం ఉందని, ఈ విషయంలో సాయం చేస్తానని మోదీతో చెప్పాను. దానికి ఆయన చాలా దూకుడుగా స్పందించారు. ‘ఈ వ్యవహారాన్ని నేను చూసుకోగలను. అవసరమైతే ఏ చర్యలు తీసుకునేందుకైనా సిద్ధమే. వందల సంవత్సరాలుగా వారిని మేము ఓడించాం’ అని మోదీ అన్నారు. ఇది విన్న నేను ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. -
ఆడ కాదు.. ఈడ కాదు అన్నింటిలో ప్లాస్టిక్కే! ఈ లెక్కలు చూడండి!
ఇక్కడా అక్కడా అని లేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. చివరికి ఇది మన శరీరంలోనూ పేరుకుపోతోందని.. రక్తంలో కూడా అతిసూక్ష్మ (మైక్రో) ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయని ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. పీల్చేగాలి నుంచి తినే ఆహారం ద్వారా అనేక రకాలుగా ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తోందని ప్రకటించారు. మరి మన శరీరంలోకి ఏయే మార్గాల ద్వారా.. ఎంతెంత ప్లాస్టిక్ చేరుతోందో చెప్పే లెక్కలివీ.. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేగజైన్ విడుదల చేసిన ‘హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ నివేదిక ప్రకారం.. సగటున ఏటా ఒక్కోవ్యక్తి శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్ రేణువుల సంఖ్య 74 వేల నుంచి లక్షా 21 వేల వరకు ఉంటుందని అంచనా. – సాక్షి సెంట్రల్‌డెస్క్ చదవండి 👉🏼Russia Ukraine War: తస్మాత్ జాగ్రత్త! 👉🏼గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
మధుర భాషణం.. నిజమైన భూషణం
మాటే మంత్రము.. అవును.. మాట మంత్రమే కాదు.. మనకు, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే, కార్యసాధనకు ఉపకరించే అద్భుతమైన తంత్రం కూడా..!! పక్షులు కిలకిలా రావాలే చేయగలవు. కొన్ని జంతువులు భయంకరంగా గర్జించగలవు, కొన్ని జంతువులు జలదరించే తీరులో ఘీంకరించగలవు, కొన్ని జంతువులు కేవలం మొరగడం మాత్రమే చేయగలవు తప్ప మాట్లాడలేవు. ఏ జీవరాశికీ లేని వాక్కు అనే సంపద మానవులకు మాత్రమే ఉంది. వాక్కు అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం. అరుదుగా లభించినవాక్కు అనే వరాన్ని వివేచనతో, విచక్షణతో ఉపయోగిస్తూ, సందర్భోచితంగా సంభాషిస్తూ మన్నన పొందడం విజ్ఞత కలిగిన మానవుని లక్షణం. కిరీటాలు, భుజకీర్తులు, సువర్ణహారాలు, పరిమళభరిత ద్రవ్యాలతో చేసే స్నానం, చందన సుగంధ ద్రవ్యాలు శరీరానికి అద్దుకోవడం, సువాసనాభరితమైన పుష్పహారాలు ధరించడం లేదా చిత్ర విచిత్ర రీతుల్లో కురులను దువ్వుకోవడం అనేవి మానవునికి అలంకారాలుగా అందాన్నివ్వవు. ఉత్తమ సంస్కారం చేత అలవడిన మధురమైన వాక్కు ఒక్కటే అద్వితీయమైన అలంకారమై ప్రకాశిస్తుంది. ఒక మనిషిని సంఘంలో గౌరవించే విధానికి చాలావరకు మాటతీరు లేదా వాక్చాతురి కారణమౌతుంది. మృదువుగా సంభాషించే సౌజన్యశీలితో మాట్లాడడానికి సంఘంలో ఎవరైనా ఇష్టపడతారు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎదుటివారిపై హుంకరిస్తున్న విధాన మాట్లాడితే, ఆ వ్యక్తి చెంత ఎవరూ చేరరు కదా..!! ‘‘మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది’’ అన్నది చిరకాలంగా మనకు తెలిసిన ఆర్యోక్తే కదా.. హితకరమైన మాటలు మాట్లాడే వ్యక్తి చాతుర్యం అన్ని సమయాల్లోనూ కార్యసాధకమై రాణిస్తుంది. మృదుభాషణం కలిగినవారు తమ మాటలతో ఎదుటివారిని నొప్పించకుండానే తమకు కావలసింది సాధించుకుంటారని చరిత్ర ఘంటాపథంగా చెబుతోంది. అయితే, మాటతీరు అన్నివేళలా మృదువుగా ఉంటే సరిపోదు. సందర్భాన్ని బట్టి, ఒక్కొక్కసారి అవతలివారితో మనం సంభాషించే విధానంలో కొంత గట్టిగానూ మాట్లాడవలసి రావచ్చు. వాగ్గేయ శిరోమణి త్యాగరాజు చెప్పినట్లు ‘సమయానికి తగు మాటలాడి’ అన్నచందాన సంభాషించి, ఎదుటివారిని మెప్పించగలగాలి. అయితే, సంభాషణా వైఖరి వారిని గాయపరిచేది గానూ, నొచ్చుకునేదిగానూ ఉండ కూడదు. విషయం వారికి అర్థమై, మన మనోగతాన్ని వారు గుర్తెరగాలి. ఏది ఏమైనా తూటాలవంటి మాటలకంటే, తేనెలు నిండిన తేటలతో మాట్లాడే మాటలే మన గెలుపును శాసిస్తాయి. అందరితో మిత్రత్వాన్ని సాధిస్తాయి. మనిషి మాటతీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. నోటినుంచి వచ్చే మాట ద్వారానే మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటలతో మనం సాధించ వలసిన కార్యాన్ని కూడా సులువుగా సాధించవచ్చు. మృదుభాషి, మితభాషి అందరికీ అనాదిగా అలవాటున్న పదాలే! మృదుభాషి అంటే మృదువుగా మాట్లాడేవాడనీ, మితభాషి అంటే అవసరమైతేనేగానీ నోరు విప్పడనీ అందరికీ అవగతమే. అయితే, చిరకాలంగా, ఎంతోమందిని గొప్పవారిగా, సంస్కారవంతులుగా నిలబెట్టిన అరుదైన సంభాషణా లక్షణం మరొకటి ఉంది. వాళ్ళంతా పూర్వభాషిగా భాసించడమే వారికున్న ప్రత్యేక గుణం. పూర్వభాషి అంటే, తానే ఎదుటివారితో చొరవ తీసుకుని ఆహ్లాదకరమైన తీరులో భాషించడం. ఎదుటివ్యక్తి తనకు అంతగా తెలియకపోయినా, ఎంతో చక్కటి వాక్కులతో అతన్ని ముందుగా మర్యాదగా పలకరించి, తరువాత అతనితో విషయాన్ని మృదువుగా వివరించడమే పూర్వభాషి లక్షణం. ఈ రకమైన మాటతీరు ఉన్నవారు అత్యంత ప్రతిభా వంతులుగా తమను తాము నిరూపించు కున్నట్లు చరిత్ర తెలియజేస్తోంది. ఆనాటి శ్రీరాముని నుంచి నేటి తరంలో విజయవంతమైన నాయకుల్లో అధిక శాతం పూర్వభాషులే. ఎటువంటి భేషజాన్నీ తనతో మాట్లాడేవారితో ప్రదర్శించని వ్యక్తిగా పూర్వభాషి గుర్తించబడతాడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతి పదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకో లేమన్నది సత్యమైన విషయమే కదా..!! మాట్లాడే విధాన్ని బట్టి అది ఎదుటివారి మానసాన్ని గెలిచే విజయ సూచికగా పనిచేయగలదు. ఎందుకంటే మాట అనేది మనసుని తాకుతుంది. అది సుతారంగా, ఎదుటివారిని గౌరవించేలా ఉండాలి గానీ, వారి మనోభావాలను గాయపరిచేదిగా ఉండకూడదు. మాటే మనిషికి అనుకోకుండా ఎదురైన కష్టాన్నీ పోగొడుతుంది. ఎవరినైనా తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం అడుగవలసి వచ్చినప్పుడు, వారితో లలితమైన రీతిలో సంభాషిస్తే, తోచినంత సహాయాన్నీ, తోడ్పాటును అవతలి వ్యక్తి మనకు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా, మాటే మనిషికి కష్టాన్నికూడా తీసుకురావచ్చు. అహంకారంతో కూడిన సంభాషణా శైలి ఎప్పుడైనా సరే మనకు కష్టాలనూ తెచ్చిపెడుతుంది, మనకు శత్రువులనూ పెంచుతుంది. గొడ్డలితో నరకబడ్డ వృక్షమైనా మళ్ళీ చిగురిస్తుంది, కానీ, మాటలచేత మనసు ముక్కలైతే, మళ్ళీ పూర్వస్థాయిలో అనుబంధం పెరగదనేది ఋజువైన విషయమే కదా.. మనం మాట్లాడే మాట కోమలంగా ఉంటే ఎదుటివారి ఎదను పువ్వులా తాకుతుందని, అదే కటువుగా ఉంటే, కత్తిమొనలా వారిని గాయపరచి, వారితో ఉన్న స్నేహాన్నీ, సాన్నిహిత్యాన్నీ కూడా దూరం చేస్తుందన్న గౌతమ బుద్ధుని వాక్కులు అక్షర సత్యం. పదునైన ఈటెల పోటు కన్నా, కరుకైన మాటల పోటు ఎదుటివారి హృదయాలకు లోతైన గాయాన్ని చేస్తుంది. భారతదేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించిన ఘనులు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఎంతో ప్రతిభాశాలిగా ఎన్నో విజయాలను సాధించడంలో ఆయన సంభాషణాశైలి ఉపకరించిందని సన్నిహితులు చెబుతారు. అమెరికా అధ్యక్షుల్లోనే అగ్రగణ్యునిగా వినుతికెక్కి, అప్రతిహత విజయాలను సాధించిన అబ్రహం లింకన్ కూడా మృదుభాషేనన్న విషయం గమనార్హం. మనిషి ఉత్థాన పతనాలను వారు మాట్లాడే మాటలే శాసిస్తాయి. ఉత్తమరీతిలో జీవన ప్రస్థానం సాగడానికి మంచి ఉపకరణంగా భాసిస్తాయి. నాలుకపై మాట్లాడే ప్రియమైన మాటలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. మనల్ని మెచ్చుకునేలా చేస్తాయి. మనిషికి నలుగురిలో గౌరవాన్ని సంతరించేది సమయోచిత భాషణం..!! అదే, అందరినీ సన్నిహితులను చేసి, అలరించే విలువైన భూషణం..!! – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతిపదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకోలేమన్నది సత్యమైన విషయమే కదా..!! -
Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ
బీజింగ్: ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్‌లో కొత్త స్ట్రెయిన్ మనుషులకి సోకడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. చైనాలో ఈ వైరస్ తొలిసారిగా ఒక వ్యక్తికి సోకిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో 41 ఏళ్ల వ్యక్తికి మే 28న బర్డ్ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్10ఎన్3 రకం’ సోకినట్టుగా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అయితే అతనికి వైరస్ ఎలా సోకింది? ఎక్కడ్నుంచి వచ్చింది వంటివేవీ ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. హెచ్10ఎన్3 వైరస్ మనుషులకి సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారిని మాత్రం పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌తో వచ్చే ప్రమాదం ఏమీ లేదంటూ తక్కువగా చేసి చూపించే ప్రయత్నాలు డ్రాగన్ దేశం మొదలుపెట్టింది. పక్షుల నుంచి మనుషులకి ఈ వైరస్ చాలా అరుదుగా సోకుతుందని వెల్లడించిన ఆరోగ్య శాఖ వైరస్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రేపో మాపో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్ టీవీ వెల్లడించింది. ఇప్పటివరకు కోళ్లకు, ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారిన హెచ్5ఎన్8 రకం మనుషులకి సోకే ప్రమాదం చాలా తక్కువ. కోళ్ల ఫామ్స్‌లో పని చేసే వారికి మాత్రమే ఈ వైరస్ ముప్పు ఉండేది. ఇప్పుడు హెచ్10ఎన్3 రకం వైరస్ సోకడం ఆందోళన రేపుతోంది. జ్వరం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. -
అన్నీ ఆయన కోసమే..
మానవుడు ఈ ప్రపంచంలో అనేక వాటిని ప్రేమిస్తాడు. కొన్నింటిని చాలా ప్రియమైనవిగా భావిస్తాడు. తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని, బంధుమిత్రుల్ని ప్రేమిస్తాడు. తనఇంటిని, తన ఊరును, తన దేశాన్ని, తన జీవనసామగ్రిని, పెంపుడు జంతువుల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్ని జ్ఞాపకాలను ప్రేమిస్తాడు. ఇది మానవ సహజం. ఆయా పరిధుల్లో ధర్మసమ్మతం. అయితే ఇవన్నీ దేవుని ప్రేమకు, ఆయన ప్రవక్తపై ప్రేమకు లోబడి ఉండాలి. దీన్నే ఈమాన్ (విశ్వాసం) అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైనా ఈ రెండింటి మధ్య ఎదురుబొదురు వ్యవహారం సంభవిస్తే.. దేవుడు, దేవుని ప్రవక్త ప్రేమ మాత్రమే ఆధిక్యం పొందాలి. మిగతా ప్రేమలన్నీ తరువాతనే.ఒక వ్యక్తి దేవుని ప్రేమలో నిమగ్నమైనప్పుడు, దైవస్మరణ, చింతనలో లీనమైనప్పుడు, ఆరాధనలో, సేవలో రేయింబవళ్ళు గడినప్పుడు, కృతజ్ఞతా భావంతో అతని ఆత్మ తన్మయత్వం చెందుతున్నప్పుడు, దైవ మార్గంలో కష్టాలు, కడగండ్లు భరిస్తున్నప్పుడు దేవుని కరుణా కటాక్ష వీక్షణాలు అతనిపై ప్రసరిస్తాయి. దైవం అతణ్ణి తన ప్రత్యేక అనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తాడు. ఈవిధంగా ఒక బలహీనుడైన మనిషి తన చిరు ప్రయత్నంతో దేవుని ప్రేమను పొందగలుగుతాడు. ఆయన కారుణ్యం అతనిపై కుండపోతగా వర్షిస్తుంది. అంటే సర్వకాల సర్వావస్థల్లో దైవ ప్రేమ, దైవప్రవక్త ప్రేమ ఉఛ్ఛ్వాస నిశ్వాసలుగా ఉండాలి. ఏపని చేసినా, చేయక పోయినా దైవ ప్రేమకోసం మాత్రమే కావాలి. ప్రవక్తమహనీయుల వారు ఇలా చెప్పారు. ‘ఎవరైతే అల్లాహ్ కొరకే ప్రేమిస్తారో, అల్లాహ్ కొరకే ద్వేషిస్తారో, ఇచ్చినా ఆయన కోసమే, ఇవ్వకున్నా, నిరాకరించినా ఆయన కోసమే చేస్తారో అలాంటి వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్న వారవుతారు’.అంటే, మానవ సంబంధాలు కూడా దేవుని ప్రేమ బద్ధమై ఉండాలి. ఎటువంటి ప్రాపంచిక ప్రయోజనాలు కాని, భౌతిక అవసరాలు కాని వీటికి ప్రేరణ కాకూడదు. ఎవరిపట్లనైనా ప్రేమానురాగాలు కలిగి ఉన్నామంటే, లేక ఎవరితోనైనా విభేధిస్తున్నామంటే దైవ సంతోషమే దానికి పునాది కావాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా అది కూడా దైవం కోసమే కావాలి. ఒక నిరుపేదకు ఫలానా సాయం చేయడం వల్ల దేవుడు నన్ను ప్రేమిస్తాడు అన్నభావనే పునాదిగా ఉండాలి. ఎంతగొప్ప పని చేసినా, ఎంతమంచి పని చేసినా దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి. దాని వెనుక మరే ప్రయోజనమూ ఉండకూడదు. ఏదో ఆశించి చేయకూడదు. నలుగురూ చూడాలని, తనను పొగడాలని ప్రదర్శనా బుద్ధితో చేస్తే అది ఎంత గొప్ప సత్కార్యమైనా బూడిదలో పోసిన పన్నీరే. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మూన్ టు మార్స్
అడిలైడ్: ఎన్నో ఏళ్లుగా విశ్వాంతరంలో గ్రహాంతరవాసుల ఉనికి కోసం మానవుడు అన్వేషిస్తున్నాడు. ఇలాంటి తరుణంలోనే తానే గ్రహాంతరవాసిగా మారుతాడని బహుశా అతను ఊహించి ఉండడు! ఇతర గ్రహాలపై మానవుడు కాలనీలు కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస అంతరిక్ష పరిశోధనలు.. ఆ రోజు మరెంతో దూరంలో లేదని చెప్పకనే చెబుతున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, నానాటికీ పెరుగుతున్న జనాభా, కమ్ముకొస్తున్న అణు యుద్ధ భయాలు, విజృంభిస్తున్న కొత్త వ్యాధులు.. ఇవన్నీ భూగోళాన్ని నివాసానికి పనికిరాని గ్రహంగా మార్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మానవుడికి దిక్కు ఏమిటి? అని అందరూ ఆలోచిస్తుండగా పక్క గ్రహాల నుంచి మానవుడికి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. మరి మానవుడు మరో గ్రహానికి వెళ్లి నివసించడం సాధ్యమా? చంద్రుడిపైకి వెళ్లాలా, అంగారకుడి మీదకెళ్లాలా? అనే ఎన్నో అనుమానాలు, అభిప్రాయాలు తలెత్తుతున్నాయి. రానున్న కొన్నేళ్లలో చంద్రుడిపై మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగితే తర్వాత లక్ష్యం మాత్రం అంగారకుడే (మార్స్) అవుతుంది. భూమితో పలు రకాల పోలికలు ఉండటమే దానికి కారణం. ఈ నేపథ్యంలో చంద్రుడిపై శాశ్వతంగా నిర్మించే కుగ్రామం అంగారక గ్రహాన్ని చేరుకోడానికి తొలిమెట్టు అవుతుందని ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వెల్లడించింది. అంగారక గ్రహానికి చేరుకుని అక్కడ కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. తమ తొలి లక్ష్యం చంద్రుడిపై శాశ్వత గ్రామాలను ఏర్పరచడం అయితే అంతిమ లక్ష్యం మాత్రం అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడమేనని ఈఎస్ఏ తెలిపింది. మానవ మనుగడ విస్తరణకు చంద్రుడు ఒక చక్కని ప్రదేశమని అడిలైడ్‌లో 4 వేల మంది అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులతో జరిగిన వార్షిక సమావేశంలో ఈఎస్ఏ పేర్కొంది. ‘ఓ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని 17 ఏళ్లుగా నివసిస్తున్నాం. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత, అనువైన గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాం. అలాగే అంగారక గ్రహంపైకి తొలి హ్యూమన్ మిషన్ ప్రారంభించే దశలో ఉన్నాం’అని ఈఎస్ఏకు చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. ‘చంద్రుడిపైకి వచ్చే పదేళ్లలో కొన్ని మిషన్లకు ప్రణాళికలు తయారు చేశాం. ఈ మిషన్లు ఓ ఉద్యమాన్ని లేవనెత్తి చంద్రుడిపై శాశ్వత గ్రామాన్ని నిర్మించేందుకు అవసరమైన సమాచార సంపదను సృష్టిస్తాయి’అని వివరించారు. మరోవైపు 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా శాశ్వత లూనార్ కాలనీ (చంద్ర గ్రామం)ని ఏర్పాటు చేసేందుకు స్పేస్ ఏజెన్సీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ‘డీప్ స్పేస్ గేట్‌వే’అనే కార్యక్రమంలో భాగంగా తొలి లూనార్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించే ప్రాజెక్టును నాసా (నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్) చేపట్టింది. ఈ లూనార్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి రష్యా స్పేస్ ఏజెన్సీ, నాసా ఇటీవల సహకార ఒప్పందం కూడా చేసుకున్నాయి. -
అభిమానులకి సల్లుభాయ్ బర్త్ డే ఆఫర్
-
మరణానంతరం.. ‘జీవన’ దానం
జీజీహెచ్‌లో ఉచితంగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు శనివారం ఆర్గాన్ డొనేషన్ డే మనిషి చనిపోయాక తనతోపాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అయితే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాతా జీవించవచ్చు. అవయవాలన్నీ వేరొకరి శరీరంలో ఉండటం వల్ల చనిపోయినా జీవించినట్లే లెక్క. విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా.. అవయవ దానంపై రోజురోజుకూ పెరుగుతున్న అవగాహనతో కొత్త అధ్యాయాలు ఆవిష్కతమవుతున్నాయి. ఈనెల 13న ఆర్గాన్ డొనేషన్ డే నిర్వహించనున్న నేపథ్యంలో అవయవ దానంపై ప్రత్యక కథనం. గుంటూరు మెడికల్ : మనిషి మరణానంతరం కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ఫ్రాంకియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెత్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెత్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. ఎంత సమయం పడుతుంది.. బ్రెయిన్ డెత్ వ్యక్తి నుంచి అవయవాలు బయటకు తీసేందుకు సుమారు ఐదు గంటల సమయం పడుతుంది. గుండె, లంగ్స్‌ను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్‌ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో సేకరించిన అవయవాలు పని చేయకుండాపోతాయి. కళ్ళు (కార్నియా) చాలా కాలం నిల్వ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవ భాగాలను ‘యూడబ్ల్యూయూ సొల్యూషన్’ అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్ బాక్సుల్లో భద్రం చేసి అవసరమైన వారికి అమరుస్తారు. ఎలా రిజిష్ట్రరు కావాలి.. అవయవదానం చేయాలనుకునేవారు ముందస్తుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారందరికి విషమయాన్ని తెలియజేయాలి. దీనివల్ల అతను చనిపోయాక అవయవదానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్‌ధాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెత్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. అవయవాలు కావాల్సి వస్తే.. అవయవాలు కావాల్సిన రోగులు కూడా ప్రభుత్వ జీవన్‌ధాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నెంబరు ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నెంబరు ప్రకారం అవకాశం కల్పిస్తారు. గుంటూరులో కేంద్రం.. జీవన్‌ధాన్ పథకం గుంటూరు జీజీహెచ్‌లో, మంగళగిరి రోడ్డులోని వేదాంత హాస్పటల్లో అందుబాటులో ఉంది. అవయవాలు కావాలనుకునేవారు అక్కడికి వెళ్ళి తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చు. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో, విజయవాడ అరుణ్ కిడ్నీసెంటర్లో జీవన్‌ధాన్ పథకం అమలులో ఉంది. అవగాహన కల్పించాలి.. అనేక అపోహలతో అవయవ దానానికి ముందుకు రావడం లేదు. పురాణాల్లో, ఇతర మత గ్రంథాల్లో కూడా అవయవ దానం చేసిన ఆధారాలు ఉన్నాయి. దీనిపై ప్రచారం లేకపోవడంతో అవగాహన పెరగడం లేదు. దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెత్ అవుతున్నారు. వీరిలో కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో భారత దేశంలో ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. వీరికి బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించినవి అమర్చి మరణాలను పూర్తిగా ఆపవచ్చు. డాక్టర్ చింతా రామకృష్ణ, నెఫ్రాలజిస్ట్ జీజీహెచ్‌లో ఐదుగురికి కిడ్నీ ఆపరేషన్లు.. బ్రెయిన్ డెత్ కేసుల నుంచి సేకరించిన కిడ్నీలను అమర్చేందుకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. గుండెను అమర్చేందుకు 3 గంటలు, లివర్‌కు 4 గంటలు, కళ్ళను అమర్చేందుకు కేవలం అర గంట సమయం పడుతుంది. కుటుంబ సభ్యులు ఇవ్వటం వల్ల జీజీహెచ్‌లో ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశాం. చనిపోయిన వారి నుంచి కిడ్నీలు సేకరించి ఆపరేషన్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అపోహలు వీడి స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి. డాక్టర్ గొంది శివరామకృష్ణ, నెఫ్రాలజిస్ట్ -
ఈ భూమ్మీద అంతకంటే నరకం ఏముంటుంది!
ముంబై: ఎంతో కష్టపడి నటించిన సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిలైతే తట్టుకోవడం చాలాకష్టమన్నాడు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. తన సినిమా బాక్సాఫీసు దగ్గర ఓటమిని చవిచూస్తే చాలా బాధగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక్కసారి సినిమా ఫెయిల్ అయితే ఇక జనం మనతో మాట్లాడ్డం తగ్గిస్తారన్నాడు. ఆ సమయంలో అసలు నువ్వు ఎవరి కొడుకు లాంటివేవీ పనిచేయవని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు బిగ్ బి వారసుడైన అభిషేక్. ఎంత నిబద్ధతతో పనిచేసినా ఫలితం నెగెటివ్‌గా ఉంటే కస్టమేనన్నాడు. ఎన్నో ఆశలతో తీసిన సినిమా సక్సెస్ కాకపోతే ఈ భూమ్మీద అంత కంటే నరకం మరోటి ఉండదని అభిప్రాయపడ్డాడు. అది మనల్ని పట్టి పీడిస్తుందని, మనిషిగా చంపేస్తుందన్నాడు. మర్నాడు ప్రపంచం మొఖం చూడటం చాలా కష్టమని తెలిపారు. ఈ ఫీలింగ్ మనిషిలోని అంతర్గత సామర్ధ్యాన్ని కుంగదీస్తుందని అయినా తలవంచక తప్పదన్నాడు. చాలా మంది నటులు సినిమా వైఫల్యానికి అనేక కారణాలు వెతుకుతారని కానీ తాను అలా కాదన్నాడు. ఎక్కడా ఆవేశ పడకుండా వాస్తవాన్ని అంగీకరించాలన్నాడు.. సినిమాల కోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నమాట నిజమేనని, ఏ నటుడూ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోడని వ్యాఖ్యానించారు. తను సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. బాలీవుడ్లో వరుస ఫ్లాప్ లతో ఏటికి ఎదురీతుతున్న హీరో ఎవరంటే అది కచ్చితంగా అభిషేక్ బచ్చనే అంటాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నటి జయాబచ్చన్ ల కుమారుడైన అభిషేక్ కెరీర్లో హిట్ ల కంటే ఫట్ లే ఎక్కువ. మేష్ శుక్లా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆల్ ఈజ్ వెల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అభిషేక్. -
శునక బాంధవ్యం..!
వేమనపల్లి : ఇదేంటీ ఎడ్లబండి మధ్యలో కుక్క ఉంది అనుకుంటున్నారా..! అవును ఆ బండి మధ్యలో కుక్క ఉంటేనే ఎడ్లకూ మనిషికీ ధైర్యం మరి. మనిషికి కూడా కుక్కకు ఉన్న విశ్వాసం ఉండదంటారు. యజమాని పెట్టే బుక్కెడు బువ్వకు ఆ కుక్క కాపలా ఉంటూ విశ్వాసం చూపుతోంది. మండల కేంద్రమైన వేమనపల్లికి చెందిన పర్షబోరుున బాపు ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్కతో ఇంటి వారికి విడదీయరాని అనుబంధం ఉంది. రాత్రింబవళ్లు ఇంటి వద్ద కాపలా ఉంటోంది. ఎవరు ఉన్నా లేకున్నా కాపలా కాస్తుంది. కుక్కను మల్లేషు అని పిలుచుకుంటారు. ఇంటి వాళ్లు పిలవగానే క్షణాల పరుగెత్తుకుంటూ వస్తుంది. అడవిలో ఎలుగుబంట్లు, వన్యమృగాల భయం ఎక్కువగా ఉండడంతో బాపు వంట చెరుకు కోసం అడవికి వెళ్తే వెంట వెళ్తుంది. ఇలా ఎడ్లబండి మధ్యలో ఎప్పుడూ ప్రయూణిస్తూనే ఉంటుంది. -
ముంగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర తనను గురించి తాను తెలుసుకోవాలనే కుతూహలంలేని మానవుడు ప్రపంచంలో పుట్టి వుండడు. మనిషికి తెలీకుండానే అది ఎదలో పుట్టుకొచ్చే కోరిక. ఆ కోరికే మానవుని ప్రత్యేకత. చరిత్ర గురించి ఆలోచించడం చేతయ్యేది ఒక్క మనిషికి మాత్రమే. మన కళ్ళముందు మెదిలే జంతువులన్నిటికీ ఆలోచన ఉంటుంది. ‘తిండి ఎక్కడ దొరుకుతుంది’, ‘సుఖంగా పడుకునేందుకు చోటు ఎక్కడ దొరుకుతుంది’, ‘ప్రమాదమా కాదా’ అనే పరిమితమైన పరిధిలో మాత్రమే అవి ఆలోచించగలవు. ‘నేను ఎవరు’, ‘ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను’, ‘నా అమ్మా నాన్నా ఎవరు’, ‘ఈ వర్షం ఇలానే కురుస్తూ పోతే ఏం జేయాలి’ వంటి భూత భవిష్యత్తులకు సంబంధించిన ఆలోచనలు జంతువులో ఉండవు. ‘నిటారుగా నడవడం, మాట్లాడడం వంటి కొన్ని లక్షణాలు అదనంగా వున్నా మనిషి గూడా ఒక జంతువే’ అని ఎవరైనా అంటే, అతడు శాస్త్రజ్ఞుడైనా సరే, అది ఎంత వాస్తవమైనా సరే, వినేందుకు మనకు కష్టంగా ఉంటుంది. ఈ ఇరకాటం ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిందే. మన పూర్వీకులకు తమను జంతువుతో బేరీజు వేసుకునే అవసరమూ కలుగలేదు, ఆలోచనా పుట్టలేదు. మానవజన్మ ఎంతో విశిష్టమైనదనీ, దేవుడు మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడనీ వాళ్ళ అభిప్రాయం. హిందువుల ఇతిహాసాల మొదలు పాశ్చాత్యుల ‘బైబిల్’ దాకా ఈ విషయాన్ని ఘంటాపథంగా ప్రకటించాయి. బైబిల్ ప్రకారం ఈ చరాచర ప్రపంచం దేవుని సృష్టి. మొట్టమొదట ఆయన వెలుగు ప్రవేశించేలా ఆజ్ఞాపించి, వెలుతురును పగలుగానూ చీకటిని రాత్రిగానూ విభజించాడు. ఒక పగలూ ఒక రాత్రీ కలిసి ఏర్పడిన సమయాన్ని ‘దినము’ అన్నాడు. అది ఆయన మొదటిరోజు కార్యక్రమం. రెండవరోజు ఆకాశాన్నీ, మూడవరోజు భూమినీ సృష్టించాడు. భూమిమీద చెట్లూ చేమలూ మొలకెత్తేలా ఆజ్ఞాపించాడు. అవి విత్తనాల ద్వారా ఉత్తరోత్తరా స్వయంసమృద్ధి పొందేలా ఏర్పాటు చేశాడు. నాలుగవరోజు సూర్యచంద్రులనూ నక్షత్రాలనూ ఆకాశంలో నిర్మించాడు. ఐదవ రోజు రకరకాల పక్షులనూ జంతువులనూ సృష్టించాడు. ఉత్తరోత్తరా అవి సంతానోత్పత్తితో భూమి మీద విస్తరించేలా దీవించాడు. ఆరవరోజు తనకు ప్రతిబింబంగా మనిషిని సృష్టించాడు. మిగతా జీవకోటి మీద మనిషికి పెత్తనం అప్పగించాడు. ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత, మనిషి ఒంటరితనం పోగొట్టాలనుకున్నాడు. పురుషుని పక్కటెముక తీసి, దాన్ని స్త్రీగా రూపొందించాడు. ఆ ఇరువురిని సంతానోత్పత్తితో విస్తరించేలా దీవించాడు. ఇక హిందువుల విశ్వాసానికి వస్తే - ఆదిమధ్యాంత రహితుడైన పరమాత్ముని బొడ్డులోనుండి పద్మం మొలిచింది. ఆ పద్మంలో పుట్టిన బ్రహ్మ ఈ చరాచర ప్రపంచాన్ని నిర్మించాడు. అందువల్ల బ్రహ్మ మొట్టమొదటి ప్రజాపతి. ఆ పద్మమే భూమి. విషయాంతరాలు అనేకంగా ఉన్నా, సనాతనుల్లో అధికసంఖ్యాకులు అంగీకరించేది ఈ వాదాన్నే. మహాభారతం ఆదిపర్వంలో సృష్టిని వివరించే సందర్భం ఒకటుంది. దాని ప్రకారం, (అలా పద్మంలో ఉద్భవించిన) బ్రహ్మకు మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు ప్రజాపతులు మానస పుత్రులుగా జన్మించారు. వీళ్ళుగాక, కుడిబొటనవేలు నుండి దక్షుడనే ప్రజాపతి, ఎడమ బొటనవేలి నుండి ధరణి అనే స్త్రీ పుట్టుకొచ్చారు. కుడిచేతి నుండి ‘ధర్మువు’అనే కుమారుడు మనువుగా జన్మించాడు. ఆ మనువుకు సహాయంగా ధాత, విధాత అనే మరో ఇద్దరు పురుషులు బ్రహ్మకు జన్మించారు. హృదయం నుండి భృగుమహర్షి జన్మించాడు. దక్షునికి ధరణి ద్వారా యాభైమంది (భాగవతంలో అరవైమంది) కుమార్తెలు పుట్టగా, వాళ్ళల్లో పదిమందిని ధర్మువుకూ, ఇరవయ్యేడు మందిని చంద్రునికీ, పదముగ్గురిని మరీచి కుమారుడైన కశ్యపునికీ ఇస్తాడు. వాళ్ల సంతానం ద్వారా మానవజాతి విస్తరిస్తుంది. కశ్యవుని సంతానంలో దేవతలూ, రాక్షసులూ, పక్షులూ, పాములూ, రకరకాల జంతువులూ ఉండడం విశేషం. ఇలా ప్రపంచంలోని ఏ ప్రాచీన సాహిత్యం చూసినా, ఏ ప్రాంతంలోని దేవుళ్ళు ఆ ప్రాంతంలోని మానవులను సృష్టించినట్టు కనిపిస్తుంది. పైన వివరించిన బైబిల్ సమాచారానికీ మహాభారత సమాచారానికీ మధ్య కొద్దిపాటి తేడాలు కనిపించినా, మనిషి ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని చెప్పడం వరకు తేడాలేదు. అంతేగాదు, మనిషి పుట్టుకకు ముందు విధిగా భూమి పుట్టుకను గురించి ప్రస్తావించడంలో గూడా తేడాలేదు. సృష్టి సమస్తానికి భూమి కేంద్రమనీ, ఆ భూమి మనిషి కోసం ఏర్పడిందనీ, సూర్యచంద్రులు భూమిచుట్టూ తిరుగుతూ పగటినీ రాత్రినీ కలిగించే ప్రకృతిశక్తులనీ ఆనాటి విశ్వాసం. ఇటీవలి కాలంలో భూమిని మనం గోళంగా చెప్పుకుంటున్నాంగానీ, ప్రాచీనుల అభిప్రాయంలో ఇది బల్లపరుపుగా ఉండే ప్రదేశం. పురాతన భారతీయ సాహిత్యంలో గూడా ‘భూవలయం’, ‘ఇలాతలం’ వంటి మాటలే కనిపిస్తాయిగానీ, ‘గోళం’గా సూచించిన ఆధారాలు కనిపించవు. సాంకేతిక పరికరాల సహాయం లేకుండా భూమిని గోళంగా భావించడం తేలికైన ఆలోచన కాదు. ఎంతదూరం పయనించినా కంటిచూపుకున్న పరిమితులు భూమిని బల్లపరుపుగా భావించేందుకే అనుకూలిస్తాయి. అందువల్ల, ‘మిట్టలూ పల్లాలూ ఉంటాయేతప్ప, స్థూలంగా భూమి చదునుగా విస్తరించిన ప్రదేశం’ అనుకోవడంలో ఆనాటి మానవునికి ఎలాంటి సందేహం కలుగలేదు. గోళంగా ఉందేమోననే సందేహం మీద క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాలకు ముందే గ్రీకు తత్త్వవేత్తలు చర్చించినట్టు తెలిసినా, మతగ్రంథాలు బల్లపరుపుగా ఉన్నట్టు చెబుతుండడంతో చాలాకాలం దాకా అది విభేదించేందుకు ఏమాత్రం వీలుపడని విశ్వాసంగా కొనసాగింది.