
మనుష్యులు ఈ లోకంలో ఎలా జీవించాలి అనే విషయంలో ఏసుప్రభువు కొండమీద ప్రసంగంలో ఈ విధంగా చెప్పారు. గాంధీజీ తన ఆత్మకథలో ‘సెర్మన్ ఆన్ ది మౌంట్’ పేరుతో ప్రసిద్ధి చెందిన యేసు క్రీస్తు‘కొండమీది ప్రసంగం’ తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని రాసుకున్నాడు. ఒకసారి ప్రభువు ఆ జనసమూహాలను చూసి కొండ యెక్కి కూర్చుని ఈ విధంగా బోధించాడు.
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వాస్తవంగా మనం ఇంతలో కనపడి అంతలోనే మాయమైపోవు మనుష్యులం. ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ దేహం మట్టి నుండి తీయబడింది. మంటిలోనే కలిసి΄ోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. కనుక మనుష్యులు ఆత్మ విషయమై దీనులైన వారికి దైవరాజ్యం/పరలోక రాజ్యం దక్కుతుంది. దుఃఖపడువారు ధన్యులు; వారు భూలోకంలో ఓదార్చ బడుదురు. సాత్వికులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు కనికరం పొందుతారు. హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూస్తారు. సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులుగా పిలవబడతారు. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు; పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి మీమీద అబద్ధంగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఇలా వారు మీకు పూర్వమందున్న ప్రవక్తను హింసించారు.
మీరు లోకానికి ఉప్పయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి, మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికీ పనికిరాదు. మీరు లోకానికి వెలుగై వున్నారు. కొండమీద వుండు పట్టణం మరుగై వుండ నేరదు. మనుషులు దీపం వెలిగిస్తారు. దీపçస్తంభం పైనే ఉంచుతారు. కానీ గంపకింద ఉంచరుకదా! ప్రజలు మీ సత్కార్యాలను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని సన్నుతించడానికి మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి’ అంటూ ఆ ప్రసంగంలో ’వ్యభిచారం చెయ్యవద్దు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడు అవుతాడు’ అంటాడు. 6,7 మత్తయి సువార్త అధ్యాయాలలో మనుష్యులు లోకంలో ఎలా జీవించాలో ప్రభువు బోధించాడు.
దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే సత్క్రియలను చేయడానికి సృష్టించాడు (ఎఫిíసీ 2:10), ఐక్యత కలిగి వుండటానికి సృష్టించాడు. ఈ విషయంలో దావీదు మహారాజు యాత్ర కీర్తనలో... సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతమేలు! ఎంత మనోహరం అంటూ 133: 1-3 వచనాలలో స్పష్టీకరించాడు. పడిపోయిన యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మాణ నిమిత్తం దేవుడు జెరుబ్బాబెలు అనేవాడు నియమింపబడ్డాడు. సత్క్రియలే కాదు, ఐక్యత కలిగి వుండాలి. ఐక్యత అంటే దేవునికి, మానవునికి సంబంధం కలిగి వుండాలి. అందుకోసమే ఒక బంగారు కడ్డీ నుండి ఏడు దీపస్తంభాలు, ఒక పక్క నుండి మూడు దీపస్తంభాలు, మరియొక పక్క నుండి మూడు దీపస్తంభాలు, మధ్యలో పెద్ద దీపస్తంభం మెస్సయ్యాకు సాదృశ్యంగా వున్నవి. మూడు ప్లస్ మూడు=ఆరు. దేవుడు మానవుని 6వ దినమున సృజించిన దానికి సాదృశ్యం. ఒక బంగారు కడ్డీ నుండి ఉన్న 7వ దీపస్తంభం ప్రభువైన దేవునికి సాదృశ్యం. ఏడు అనేది పరిపూర్ణ సంఖ్యకు సాదృశ్యం. నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిపి వుంచితే మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును (యోహాను 16 : 7). నూనె అభిషేకానికి సాదృశ్యం.
కనుక సంఘంలో ఐక్యత కలిగి వుండాలంటే భేదాలు వుండకూడదు. ఐక్యత ఎలా కలిగి ఉండాలంటే యేసుప్రభువు వైపు చూసినప్పుడే ఐక్యత కలిగి వుంటున్నాం. మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ధైర్యం ఎవరి వలన... ఎందువలన అంటే దేవుని వైపు చూడటం వల్లనే వారికి ధైర్యం వచ్చింది. ఐక్యతతో మనం వుంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఐక్యతతో చేసే పనివలన బలం, ఆరోగ్యం అనుగ్రహింపబడతాయి. కావున ఎల్లప్పుడూ మనం దేవుని వైపు చూసేవారమై వుందుముగాక. జెకర్యాకు చూపిన దర్శనం మెస్సయ్యకు సాదృశ్యం. (జెకర్యా 4 :1 –4)
– కోట బిపిన్ చంద్రపాల్
Comments
Please login to add a commentAdd a comment