armed
-
Pakistan: గిరిజన గ్రూపుల ఘర్షణ.. 36 మంది మృతి
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యాయి. దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో రెండు గిరిజన గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందారని, వందలాది మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్నవారు మారణాయుధాలు కూడా ఉపయోగించారని సమాచారం.పాకిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక భూమి స్వాధీనం కోసం రెండు గిరిజన గ్రూపుల మధ్య సాయుధ పోరాటం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసాయుతకాండలో 36 మంది మృతిచెందగా, 162 మంది గాయపడ్డారు. గ్రామంలో గతంలో కూడా వివిధ తెగలు, మత సమూహాల మధ్య ఘర్షణలు జరిగినట్లు అధికారులు తెలిపారు. తాజా ఘటన ఎగువ కుర్రం జిల్లా బొషెరా గ్రామంలో చోటుచేసుకుంది. -
కశ్మీర్లో ఉగ్రకాల్పులు... నలుగురు సైనికుల వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు. బాధగా ఉంది: రాజ్‌నాథ్ ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు. ఆర్మీ డే రోజు పుట్టాడు కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులుసాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.ఆ అమర సైనికునిది ఏపీసంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్‌ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి2024లో జమ్మూలో ఉగ్ర దాడులు... ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి. మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు. జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు. జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు. జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు. జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత. జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు. జూలై 15: దోడా ఎన్కౌంటర్లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం. -
మోదీ, పుతిన్ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో సంభాషించుకున్నారు. ఇటీవల రష్యాలో జరిగిన అంతర్యుద్ధం, ఉక్రెయిన్ అంశాలపై చర్చించుకున్నారు. ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో మోదీ మద్దతు తెలిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. రష్యాలో శాంతి పరిరక్షణలు నెలకొని పౌరుల భద్రత కాపాడాలని మోదీ ఆకాంక్షించినట్లు పేర్కొంది. అమెరికా పర్యటన తర్వాత మొదటిసారి మోదీ, పుతిన్‌లు ఫోన్లో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటనలను ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా జరుగుతున్న మార్పులు, పరస్పర సహకార అంగీకారాలపై ముచ్చటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలపై చర్చ జరిగిందని క్రెమ్లిన్ తెలిపింది. జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లలో ఇరుదేశాల మధ్య జరిగిన దౌత్య ఒప్పందాలపై కూడా మోదీ, పుతిన్ మాట్లాడుకున్నారు. అయితే.. ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా దేశం ఎప్పడూ లేనంత ఇబ్బందుల్లో పడిపోయింది. పుతిన్ అధికారంలోకి వచ్చిన రెండు దశాబ్ధాల్లో ప్రిగోజిన్ తిరుగుబాటే అతనికి అతి పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
రష్యా బలగాలను తరిమికొడుతున్న ఉక్రెనియన్లు! గోబ్యాక్ అంటూ నినాదాలు
Unarmed Ukranian People Are Ready To Do Anything: ఉక్రెయిన్‌పై గత మూడువారాలకు పైగా రష్యాయుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా సైన్యం ముందు ఏ మాత్రం సరితూగని చిన్న దేశం అయినప్పటికీ తమ గడ్డను దురాక్రమణకు గురవ్వనివ్వమంటూ ఉక్రెనియన్లు సాగిస్తున్న పోరు ప్రపంచదేశాల మన్ననలను పొందుతోంది. మహిళలు, వృద్ధుల, చిన్నపిల్లలు అని తేడా లేకుండా ఇది తమ భూమి.. దీన్ని రక్షించుకుంటామంటూ రైఫిల్స్ చేతబట్టారు. పైగా రష్యా బలగాలను చూసి ఏ మాత్రం జంకకుండా ఉత్త చేతులతో యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ల దేశభక్తిని చూసి.. రష్యా బలగాలు చలించడమే కాక వారు సైతం యుద్ధం చేసేందుకు వెనకడువేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!. అయితే ఇప్పుడూ మరోసారి అలాంటి తాజా ఘటన ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్‌లోని ఎనర్‌గోదర్ అనే నగరంలోకి రష్యా ఆర్మీ వాహనం ఒకటి వచ్చింది. అందులోంచి సైనికులు దిగుతున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. ఇది తమ దేశమని.. ఈ దేశాన్ని వదిపోవాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సైనికులను చుట్టుముట్టారు. ముందుకు వెళ్లడానికి వీలు లేదు.. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ రష్యా ఆర్మీ వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో రష్యన్ సైనికులు స్థానికులను భయపెట్టేందుకు గాల్లో గట్టిగా కాల్పుల కూడా జరిపారు. కానీ ఉక్రెనియన్ వాసులు ఏ మాత్రం భయపడకుండా కాల్పుల జరుపుతున్న సైనికుడిని తిడుతూ.. అతని మీదకి గుంపుగా నినాదాలు చేస్తూ వెళ్లారు. దీంతో రష్యాన్ సైనికులు చేసేదేమీ లేక వెంటనే అక్కడున్న వాహనం ఎక్కితిరిగి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In #Energodar, unarmed people are ready to do anything to defend their land They are not even frightened by gunfire. pic.twitter.com/ZOlIoSvg77 — NEXTA (@nexta_tv) March 20, 2022 (చదవండి: ఉక్రెయిన్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు మాతృభూమి కోసం సై అంటోంది మరి!) -
అస్సాం రైఫిల్స్‌పై మెరుపుదాడి
కోహిమా: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అబోయ్ ప్రాంతంలో గస్తీలో ఉన్న ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాపుకాసి దాడిచేశారు. దీంతో హవల్దార్ ఫతేసింగ్, సిపాయ్ హుంగ్నాగా కోన్యాక్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మిగిలిన వారికీ తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని అస్సాం రైఫిల్స్ పీఆర్వో వెల్లడించారు. గాయపడిన వారికి కోహిమా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. అయితే ఇది నాగా తిరుగుబాటు దారుల పనేనని భావిస్తున్నారు. జవాన్ల ప్రతిఘటనలోనూ నాగా తిరుగుబాటుదారులు గాయపడి ఉండొచ్చని భావిస్తున్నట్లు పీఆర్వో తెలిపారు. -
పాకిస్తాన్‌ను పణంగా పెడతారా?!
ఇస్లామాబాద్ : భారత్‌కు అమెరికా ఆర్మ్డ్ డ్రోన్లను విక్రయించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్‌కు శక్తివంతమైన ఆర్మ్డ్ డ్రోన్లను విక్రయించడం వల్ల.. ఆసియాలో ఆయుధ సమతుల్యం, శాంతి దెబ్బతింటాయని అమెరికాతో పాకిస్తాన్ పేర్కొంది. అంతేకాక సరిహద్దు దేశాలతో భారత్ ఆయుధ పెత్తనం చేసే అవకాశముందని పాకిస్తాన్ చెబుతోంది. ఆర్మ్డ్ డ్రోన్లను భారత్‌కు విక్రయించాలన్న ఆలోచనను పక్కన పెట్టాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ను పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా కోరారు. ఆసియాలోనూ, సరిహద్దు దేశాలతోనూ ప్రాంతీయ స్థిరత్వం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని జకారియా తెలిపారు. ఇప్పటికే సైనిక, ఆయుధ సంపత్తిలో ముందున్నభారత్.. ఆర్మ్డ్ డ్రోన్లను సమకూర్చుకుంటే.. అది పొరుగు దేశాలకు ఇబ్బందికరమని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ను జకారియా తెలిపారు. భారత్‌కు ఆర్మ్డ్ డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమీ (ఎంటీసీఆర్) టెక్నాలజీని సరఫరా చేసే విషయంలో అమెరికా.. బహుపాక్షిక ఎగుమతి పద్దతులను ఒక్కసారి పరిశీలించాలని ఆయన జకారియా డిమాండ్ చేశారు. భారత్‌కు ఆర్మ్డ్ డ్రోన్లు, ఎంటీసీఆర్ టెక్నాలజీని అందించడం అంటే.. పాకిస్తాన్‌ను పణంగా పెట్టడమేనని జకారియా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ను స్పష్టం చేశారు. -
భారత్ అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్ : రక్షణ రంగాన్ని మరింత బలోపేలం చేసేదిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను మరింత పఠిష్టం చేసుకున్న భారత్.. రక్షణ బంధాన్ని ధృఢతరం చేసుకుంటోంది. అమెరికా, ఫ్రాన్స్‌లతో ఇప్పటికే కీలక రక్షణ ఒప్పందాలను చేసుకున్న భారత్‌కు మరిన్ని సానుకూల సంకేతాలను ఆయా దేశాలు పంపాయి. ఫ్రాన్స్‌కు చెందిన శక్తివంతమైన రాఫెల్ యుద్ధవిమానాలను మరిన్ని భారత్‌కు అమ్మేందుకు ఫ్రాన్స్ అంగీకిరంచింది. అదే విధంగా ఆర్మ్డ్ డ్రోన్లను భారత్‌కు విక్రయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. భారత్-ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఫ్రాన్స్ రక్షణ శాఖమంత్రి ఫ్లోరున్స్ పార్లే వచ్చే వారంలో భారత్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది 36 రాఫెల్ విమానాలను భారత్‌కు విక్రయించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. ఈ 36 యుద్ధవిమానాలను భారత్ రూ. 59 వేల కోట్లతో కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తిని చూపింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వస్తున్న ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారమన్, ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సీమాంతర ఉగ్రవాదం ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను బలోపేతం చేసే దిశగా ఆర్మ్డ్ డ్రోన్లను అందించాలని భారత్ గతంలో అమెరికాను కోరింది. భారత ప్రభుత్వం ఆర్మ్డ్ డ్రోన్లపై కనబరిచిన ఆసక్తిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా పరిశీలిస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ఆర్మ్డ్ డ్రోన్లు రక్షణ శాఖలో చేరితో.. భారత వాయుదళం మరింత శక్తివంతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఆర్మ్డ్ డ్రోన్లుగా పిలిచే అవేంజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలనుకు సంబంధించి భారత్ ఈ ఏడాది అమెరికాకు లేఖ రాసింది. సుమారు 100 ఆర్మ్డ్ డ్రోన్లును విక్రయించాలని అందులో భారత్ కోరిందని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది జూన్ 26న వైట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా.. 22 గార్డియన్ డ్రోన్లకు భారత్‌కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే. -
ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారినుంచి తుపాకీ, 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల్లో ఒకరు విజయవాడ వాసి భరణకుమార్ కాగా.. మరొకరిని ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డిగా గుర్తించారు. -
సాయుధ దళాల సేవలు జాతి మరువదు
జేసీ సత్యనారాయణ కాకినాడ క్రైం: దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న వీరోచిత సేవలు జాతి ఎన్నటికీ మరువదని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని çపురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జెడ్పీ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద çపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణలో ఎంతోమంది వీరజవానులు తమ ప్రాణాలనుసైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తున్న సాయుధ దళాలు, అమర జవానుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అందరూ తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలు ఇచ్చే విరాళాలు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమం కోసం వెచ్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాయుధ దళాల సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం విద్యార్థులు, సిబ్బంది జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారి కపుల్ ఎస్కే యాదవ్, కేడెడ్ సార్జంట్ ఎస్.సాయిచరణ్రాజ్, కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, విశ్రాంత సైనికోద్యోగుల హెల్ప్‌లైన్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.శంకరరావు, ఏ. సూర్యారావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి ఎస్.రామారావు, కోశాధికారి బి.శంకర్ పాల్గొన్నారు. -
సాయుధ పోరాటంతోనే హైదరాబాద్ విలీనం
దుబ్బాక: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మచ్చ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన దుబ్బాకలోని పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ సంస్థానం భారత్ దేశంలో విలీన వారోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి సీపీఐ పోరాటాలు చేసిందని, ఫలితంగానే నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సెప్టెంబర్ 17న లొంగిపోవాల్సి వచ్చిందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న గజ్వేల్‌లో జరిగే వారోత్సవాల సభకు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరవుతున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల భరత్ కుమార్, గుండబోయిన నవీన్, సాయి, విక్కి తదితరులు పాల్గొన్నారు. -
మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది
మనకి తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువు కుక్క. మనుషులు కుక్కల్ని తమ కుటుంబసభ్యులతో సమానంగా చూడటం మనం రోజు చూస్తూనే ఉంటాం. కుక్కలు కూడా మనుషులను ఎంత ప్రేమిస్తాయో లేవీ అనే 15 ఏళ్ల పిట్ బుల్ జాతికి చెందిన శునకం మరోసారి నిరూపించింది. రెండేళ్ల కిందట యజమాని కుమారున్ని కాపాడి కాలును కోల్పోయిన లేవీ, ఇప్పుడు వారి కుటుంబాన్ని రక్షించడానికి ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టింది. వివరాలు.. వారం రోజుల కింద అమెరికాలో విస్కాన్సిన్లోని జానెస్విల్లేలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. గన్‌తో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు, యజమాని డార్సి చెర్రీ, ఆమె బాయ్ ఫ్రెండ్ బాబ్ స్టెంజెల్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. వాళ్లను భూమి మీద కూర్చోబెట్టి చేతులు తల వెనుక పెట్టుకోవాలని బెదిరించాడు. ఇదంతా గమనించిన లెవీ (మూడు కాళ్లతోనే) ఒక్కసారిగా అరుస్తూ.. మీద పడ్డంత పనిచేసింది. దీంతో ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ దుండగుడు గన్‌తో ఆ శునకాన్ని కాల్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బుల్లెట్ తలలో నుంచి శునకం ఎడమ కాలి వరకు దూసుకెళ్లింది. దీంతో లేవీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 2014లో కుటుంబసమేతంగా ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు చెర్రీ కుమారుడు కొండ చివరనుంచి పడిపోతుండగా లేవీనే కాపాడింది. అయితే ప్రమాదవశాత్తు కొండపైనుంచి లేవీ పడిపోవడంతో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. రెండేళ్ల కిందట కూడా వారి కుటుంబాన్ని ఒక భారీ చోరీ నుంచి లేవీ కాపాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లేవీ హీరోయిజం ముగియలేదని, ఇకముందు కూడా కొనసాగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. -
నలుగుర్ని అపహరించిన మావోయిస్టులు
ఖమ్మం జిల్లాలో నలుగురు గిరిజనుల్ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని చలమల గ్రామానికి చెందిన మడకం ముత్తయ్య, మడకం రాజశేఖర్, మడకం రమేష్, వాసం కన్నారావులను సాయుధులైన మావోయిస్టులు సోమవారం రాత్రి అపహరించుకు పోయినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. ఈ ఘటనని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.