మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది | Three legged pitbull dog helps stop armed assault | Sakshi
Sakshi News home page

మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది

Published Thu, Jan 28 2016 2:56 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది - Sakshi

మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది

మనకి తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువు కుక్క. మనుషులు కుక్కల్ని తమ కుటుంబసభ్యులతో సమానంగా చూడటం మనం రోజు చూస్తూనే ఉంటాం. కుక్కలు కూడా మనుషులను ఎంత ప్రేమిస్తాయో లేవీ అనే 15 ఏళ్ల పిట్ బుల్ జాతికి చెందిన శునకం మరోసారి నిరూపించింది. రెండేళ్ల కిందట యజమాని కుమారున్ని కాపాడి కాలును కోల్పోయిన లేవీ, ఇప్పుడు వారి కుటుంబాన్ని రక్షించడానికి ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టింది.

వివరాలు.. వారం రోజుల కింద అమెరికాలో విస్కాన్సిన్లోని జానెస్విల్లేలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. గన్తో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు, యజమాని డార్సి చెర్రీ, ఆమె బాయ్ ఫ్రెండ్ బాబ్ స్టెంజెల్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. వాళ్లను భూమి మీద కూర్చోబెట్టి చేతులు తల వెనుక పెట్టుకోవాలని బెదిరించాడు. ఇదంతా గమనించిన లెవీ (మూడు కాళ్లతోనే)  ఒక్కసారిగా అరుస్తూ.. మీద పడ్డంత పనిచేసింది. దీంతో ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ దుండగుడు గన్తో ఆ శునకాన్ని కాల్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బుల్లెట్ తలలో నుంచి శునకం ఎడమ కాలి వరకు దూసుకెళ్లింది. దీంతో లేవీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

2014లో కుటుంబసమేతంగా ట్రెక్కింగ్కు వెళ్లినప్పుడు చెర్రీ కుమారుడు కొండ చివరనుంచి పడిపోతుండగా లేవీనే కాపాడింది. అయితే ప్రమాదవశాత్తు కొండపైనుంచి లేవీ పడిపోవడంతో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. రెండేళ్ల కిందట కూడా వారి కుటుంబాన్ని ఒక భారీ చోరీ నుంచి లేవీ కాపాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లేవీ హీరోయిజం ముగియలేదని, ఇకముందు కూడా కొనసాగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement