కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కాసిన్ని గంజినీళ్లు పోసినా కూడా చాలా కృతజ్ఞతతో ఉంటాయి. కళ్లలోనే ప్రేమను చూపిస్తూ మనిషితో చాలా స్నేహంగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో వీధికుక్కల దాడులు బాగా పెరగడం దడ పుట్టిస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఒక వృద్ధురాలిపై దారుణంగా కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి.
పంజాబ్‌లోని ఖన్నాలోని ధనిక నాయి అబాది ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిచేస్తున్న వృద్ధ మహిళపై కుక్కల గుంపు దాడి చేసింది. ఆ మహిళ కుక్కల నుండి తప్పించుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లినప్పటికీ, పాపం తప్పించు కోలేకపోయింది. సెకన్లలోనే, ఒక కుక్క ఆమె కాలు పట్టి లాగేసింది. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు కుక్కల ఒకేసారి ఆమెమీదకు లంఘించాయి కిందకు తోసి, చేయి , ముఖం మీద ఇష్టమొచ్చినట్టు కరిచాయి. ఈడ్చుకెళ్లిపోయాయి. అయితే ఈ సమయంలో, ఒక వ్యక్తి దూరంగా నుంచే ఒక వస్తువును విసిరాడు. దీంతో అవి కొద్దిగా వెనక్కు తగ్గాయి. మరి కాసేపట్లోనే కొంతమంది మహిళలు గుమిగూడి వాటిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన మహిళను రక్షించారు. కనీసం 15 చోట్ల గాయాలైనట్టు గుర్తించారు. గాయాలకు 40 కుట్టు వేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ వారంలో తనపై కుక్కలు దాడి చేయడం ఇది మూడోసారి అని చెప్పింది బాధిత మహిళ కన్నీళ్లతో. అదే ప్రాంతంలో నివసించే జోగిందర్ సింగ్‌ది ఇలాంటి అనుభవమే. ఈ ప్రాంతంలో కుక్కల దాడి పెరుగుతోందని, తనను నాలుగుసార్లు కరిచాయని తెలిపారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.
ఉన్నట్టుండి కుక్కలు (ఇతర జంతువులు) దాడి చేస్తే ఏం చేయాలి?
కుక్కలు కనిపించిన వెంటనే మనం పరుగులు పెట్టకూడదు.అక్కడే నిలబడి గట్టిగా అదిలించాలి. చేతిలో ఏది ఉంటే దానితో బెదిరించాలి.
కుక్కలు భయపెడుతూ, మొరుగుతున్నపుడు నడక ఆపి, అవి మొరగడంఆపాకనెమ్మదిగా అక్కడ నుంచి మెల్లిగా అక్కడినుంచి పక్కకి వెళ్లాలి.
కళ్లలోకి సూటిగా చూడకూడదు. లేదంటే వాటిని రెచ్చ గొడుతున్నట్లుగా, వాటికి హాని చేస్తున్నట్టుగా భావిస్తాయి.
మనం వేసుకున్న రంగులు వాటికి కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. ఇందులో మనం ధరించే విచిత్రమైన కలర్ దుస్తువులు, వస్తువులకు కూడా అవి రియాక్ట్ అవుతాయి. ఉదాహరణకు ఎర్ర చొక్కా, నల్ల టోపీ, కళ్లద్దాలు లాంటివి పెట్టుకున్న క్యాప్ తీసేయడం కళ్లద్దాలు తొలగించడం బెటర్.
ఇదీ చదవండి: దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
Comments
Please login to add a commentAdd a comment