hospitalise
-
ఐదుగంటలపాటు దారుణం
న్యూఢిల్లీ: కేరళలో దారుణం చోటుచేసుకుంది. తమ తోటి విద్యార్థి అని కూడా చూడకుండా సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. వాళ్లు చేసిన ర్యాగింగ్ కారణంగా కిడ్నీలు కూడా పనిచేయని పరిస్థితికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ర్యాగింగ్ భూతంపై ప్రతి ఏటా ప్రతి విద్యాలయంలో, సమాజంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని త్రిశూర్‌లో ఓ 22 ఏళ్ల యువకుడు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. అతడిని మరో ఎనిమిది మంది విద్యార్థులను పిలిచి వారి బట్టలు విప్పేసి చేయకూడని పనులు చేశారు.. కొన్ని వారితో చేయించారు. 22 ఏళ్ల విద్యార్థికి మాత్రం దాదాపు ఐదుగంటలపాటు ఓ రకంగా శిక్ష మాదిరిగా అమలు చేశారు. దీంతో అది కాస్త కిడ్నీపై ప్రభావం చూపించి ఆస్పత్రి పాలయ్యాడు. ర్యాగింగ్ కారణంగా ఆ విద్యార్థి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయని వైద్యులు తెలిపారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
టికెట్ రాలేదని తిండిమాని ఆస్పత్రిపాలు
జీడిమెట్ల: గ్రేటర్ ఎలక్షన్లలో టీడీపీ టిక్కెట్ అశించి భంగపడిన రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆరోగ్యం క్షిణించి అస్పత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే జీడిమెట్ల జనప్రియ అపార్ట్మెంట్లో ఉండే సాయి తులసి గత 3 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 2016 గ్రేటర్ ఏన్నికల్లో సుభాష్‌నగర్ డివిజన్ మహిళా రిజర్వేష్‌న్ కాగా ఈ స్థానం నుండి ఆమె పార్టీ టికెట్ అశించారు. గత మూడు సంవత్సరాలుగా ఆమె డివిజన్లో పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ దఫా టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని ఆశించగా పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ కేటాయించారు. అయినప్పటికి పట్టు వదలకుండా పార్టీ ఆఫీస్ వద్ద ఆమె ధర్నా చేసి పోరాడారు. చిట్టచివరకు పొత్తు వికటించగా తనకే బీఫామ్ ఇస్తారని ఆశించగా అనూహ్యంగా టీడీపీ హైకమాండ్ టీడీపీ నేత రంగారావు సతీమణి సుజాతకు బీఫామ్ ఇవ్వడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పటి నుంచి తిండితప్పలు లేకుండా మదన పడుతూ వస్తోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాయితులసి కుప్పకూలి కింద పడిపోయింది. దీంతో కుమారుడు దీపక్, భర్త శ్రీనివాస్ లు వెంటనే సాయి తులసి ని ఐడీపీఎల్ లోని సౌజన్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
అశోక్ సింఘాల్‌కు అస్వస్థత
గుర్గావ్: విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను గుర్గావ్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంవల్లే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని, అయితే, తప్పనిసరిగా తమ పరిశీలనలో ఉండాలని చెప్పారు. నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ పట్టణానికి అశోక్ సింఘాల్ వెళ్లారు. హువాన్ పూజ జరుపుతున్న సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుందని ఆయన చెప్పిన వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా గుర్గావ్ ఆస్పత్రికి తరలించారు.