అశోక్ సింఘాల్కు అస్వస్థత | VHP leader Ashok Singhal hospitalised in Gurgaon | Sakshi
Sakshi News home page

అశోక్ సింఘాల్కు అస్వస్థత

Published Wed, Oct 21 2015 7:34 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

అశోక్ సింఘాల్కు అస్వస్థత - Sakshi

అశోక్ సింఘాల్కు అస్వస్థత

గుర్గావ్: విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను గుర్గావ్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంవల్లే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిమితంగానే ఉందని, అయితే, తప్పనిసరిగా తమ పరిశీలనలో ఉండాలని చెప్పారు.

నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పట్టణానికి అశోక్ సింఘాల్ వెళ్లారు. హువాన్ పూజ జరుపుతున్న సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందవుతుందని ఆయన చెప్పిన వెంటనే ఎయిర్ అంబులెన్స్ ద్వారా గుర్గావ్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement