Vishva Hindu Parishad
-
‘సిట్’తో వాస్తవాలు బయటకు రావు’
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వీహెచ్‌పీ నేత కోటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’తో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.లడ్డులో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు మా దగ్గర లేవు. మీడియాలో వస్తున్న కథనాలు ప్రకారం మాట్లాడుతున్నాము. అసలు వాస్తవాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలి’’ అని కోటేశ్వర శర్మ చెప్పారు.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు.ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలుఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేసింది.పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం: వీహెచ్‌పీ
కర్నూలు, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్‌పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరం. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదు. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరం. .. ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. ఆ ఆరోపణలను నిరూపణ చేయాలి. ఈ అంశంపై దృష్టి పెట్టి కేసును అవసరమైతే సీబీఐకి అప్పచెప్పాలి. నిజంగానే లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షించాలి అని వీహెచ్‌పీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
Vishva Hindu Parishad: ధార్మిక సేవా అక్షౌహిణి!
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) .... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం! అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020) నాటికి అన్ని వర్గాల్లో చర్చకు మూలమైంది విశ్వహిందూ పరిషత్. 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీహెచ్‌పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేకమైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో వీహెచ్‌పీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉంటూ ధార్మిక, సామాజిక, సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పు తున్నది. 1983లో వీహెచ్‌పీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఏకాత్మకం యజ్ఞం’ నిర్వ హించింది. 1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఏకాత్మక యజ్ఞం, అయోధ్య రామమందిర ఉద్యమ నిర్వహణలో విజయం సాధించి హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించే ‘ఘర్ వాపసీ’ ఉద్యమాన్నీ నిర్వహిస్తోంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) – పగుడాకుల బాలస్వామి, వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్ (వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) -
వలస కార్మికులకు వీహెచ్‌పీ చేయూత
సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. రోజువారి జరిగే కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. దీంతో పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. లాక్డౌన్ విధించడంతో బస్సులు, రైళ్లు లేక సొంత ఊర్లకు వెళ్లలేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. వారందరూ పనిలేక, డబ్బులు లేక, ఆశ్రయం లేక ప్రతి రోజు పస్తులు ఉంటున్నారు. వారిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. (లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం) హైదరాబాద్ మసీదుబండలో నిర్మిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర పని చేస్తున్న బెంగాల్, అస్సాం వలస కార్మికులకు విశ్వహిందూ పరిషత్ ఆహారాన్ని, నిత్యవసర సరుకులను అందించింది. దాదాపు 2000 మంది కార్మికుల వరకు ఇక్కడ చిక్కుకుపోయామంటూ విశ్వహిందూ పరిషత్‌కు కొంతమంది ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లోని తమ సభ్యులను వెంటనే అక్కడికి వెళ్లి వారికి సాయాన్ని అందించాలని ఆదేశించింది. వారు వెంటనే కార్మికులు ఉంటున్న ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని చూసి వారికి ఆహారపు పొట్లాలను, నిత్యవసర సరుకులను అందించారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు తాము సాయం అందిస్తామని, లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరు పస్తులు ఉండటానికి వీల్లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు అన్నారు. దినసరి కూలీలు, పేదలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేసుకునే వలస కూలీలు ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నం పెట్టేందుకు విశ్వహిందూ పరిషత్ ఎల్లవేళలా ముందు ఉంటుందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేస్తే ఎప్పుడైనా తాము సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో రెండో విడతలో మొదటిరోజైన ఏప్రిల్ 15న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి 11 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు. రెండో విడతలో మొదటిరోజు కోటి, బషీర్ బాగ్, ఫిల్మ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలలో సరుకులు అందజేశారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) విశ్వహిందూ పరిషత్ హెల్ప్‌లైన్ నంబర్‌కు వస్తున్న కాల్స్ ఆధారంగా సరుకులు అందజేస్తున్నామని రాఘవులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి , కార్యదర్శి బండారి రమేష్, క్షేత్ర సామాజిక సమరసతా ప్రముఖ్ భాస్కర్ , రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి , ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివ రాములు పాల్గొన్నారు. (మానవత్వం చాటుతున్న వన్ వే మిషన్) -
అయోధ్య: రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు!
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రామ మందిరం నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ మందిరం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది..? నిర్మాణం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది..? ముఖ్యంగా మందిరం నిర్మాణం ఎలా ఉండనుంది..? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ సాయంతో మందిర నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ది రామ జన్మభూమి న్యాస్ భావిస్తోంది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటయ్యాక వీహెచ్‌పీ.. రామ జన్మభూమి న్యాస్‌తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్‌పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్‌పైనే దృష్టి కేంద్రీకరించింది. మొదటి అంతస్తుకు సర్వం సిద్ధం... ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్‌పీ(ఐవీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్‌కుమార్ వెల్లడించారు. -
‘అయోధ్య’పై ఎన్నో పార్టీలు ఎన్నో గొడవలు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ–రామ మందిరం వివాదం కేసుపై ఐదుగురు సుప్రీం కోర్టు జడ్జీల బెంచీ ముందు తుది విచారణ జరగుతున్న విషయం తెల్సిందే. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమై 38 రోజులకుపైగా కొనసాగిన విచారణ ఈ రోజుతో ముగుస్తుంది. ఇది కేవలం ముస్లిం, హిందువులకు మధ్య కొనసాగుతున్న వివాదంగా సామాన్య ప్రజలకు కనిపిస్తోంది. కానీ ఎన్నో పార్టీల ప్రమేయం ఎన్నో గొడవలు ఉన్నాయి. అటు ముస్లిం పార్టీల్లో, ఇటు హిందూ పార్టీల్లో పరస్పర విరుద్ధ వైఖరులు కూడా ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి 16వ శతాబ్దంలో బాబర్ మసీదు నిర్మించారని, ఆ స్థలంలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతించాలని ‘నిర్మోహి అఖారా’ సంస్థ ఆది నుంచి డిమాండ్ చేస్తోంది. ఆది నుంచి రాముడిని పూజించే సన్యాసులతో కూడిన బృందం. వివాదాస్పద స్థలాన్ని తమకు అప్పగించాలని అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తామని ‘రామ్ లల్లా’, ‘రామ్ జన్మస్థాన్’ సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రామ్ లల్లాలో ఎక్కువ మంది విశ్వహిందూ పరిషద్ సభ్యులు ఉండగా, రామ్ జన్మస్థాన్‌లో ఎక్కువగా ఆరెస్సెస్ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి న్యాస్’తో హిందూ మహాసభ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. తరతరాలుగా రాముడిని పూజించే హక్కు తమకే ఉందని, తామే నిజమైన ఆరాధకులమని, తమకే రామ జన్మభూమి స్థలం దక్కాలని ‘నిర్మోహి అఖారా’ వాదిస్తోంది. ఇందులో తమకు ఉందని వాదిస్తోన్న రామ్ లల్లా, రామ్ జన్మస్థాన్ సంఘాలతో అది తీవ్రంగా విభేదిస్తోంది. మరో పక్క ముస్లిం సంస్థల్లో కూడా పరస్పర విభేదాలు ఉన్నాయి. షియా, సున్నీ బోర్డులు వివాదాస్పద బాబ్రీ మసీదు తమదంటే తమదని వాదిస్తూ వస్తున్నాయి. షియా ముస్లిం వర్గానికి ‘అఖిల భారత షియా కాన్ఫరెన్స్’, ‘షియా వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిథ్యం వహిస్తున్నండగా, సున్నీ ముస్లింలకు ‘సున్నీ వక్ఫ్ బోర్డ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయోధ్య వివాదంలో మొదటి నుంచి ఉన్న ప్రధాన పార్టీ సున్నీ వక్ష్ బోర్డే. బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆది నుంచి డిమాండ్ చేస్తున్న ఆ మేరకు 1961లో కోర్టులు పిటీషన్ దాఖలు చేసింది. అది షియా మసీదని, తమకే చెందాలని షియా వక్ఫ్ బోర్డు విభేదించింది. ఆ తర్వాత షియా వక్ఫ్ బోర్డు తన వైఖరిని మార్చుకుంది. దేశ సామరస్య, సమగ్రతలను పరిరక్షించడం కోసం హిందూ పార్టీలకు స్థలాన్ని అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ మేరకు 2018లో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. మొదటి నుంచి ఉమ్మడిగా మసీదును నిర్మిద్దామని చెబుతున్న ‘అఖిల భారత్ షియా కాన్ఫరెన్స్’ ఆశ్చర్యంగా ‘సున్నీ వక్ఫ్ బోర్డు’కే ఇప్పటికీ అండగా నిలిచింది. 1992లో బాబ్రీ మసీదును కూల్చేసిన ప్రాంతంలోని 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేసి నిర్మోహి అఖారా, హిందూ సంస్థలు, సున్నీ వక్ష్ బోర్డుకు పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని అన్ని పార్టీలు సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తెల్సిందే. క్లిష్టంగా తయారైన ఈ వివాదంపై ఈ రోజు విచారణ ముగించే సుప్రీం కోర్టు తీర్పును ఎప్పుడు, ఎలా వెలువరిస్తుందో ఎదురు చూడాల్సిందే. -
బీజేపీకి వీహెచ్‌పీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ బీజేపీకి షాక్ ఇచ్చింది. రామమందిర నిర్మాణాన్ని మేనిఫెస్టోలో పెడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తామని స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న వీహెచ్‌పీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అలోక్ కుమార్.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమకు అన్ని దారులు మూసేసిందని.. రామ మందిరాన్ని మేనిఫెస్టోలో చేర్చగలిగితే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రామమందిరంపై చట్టం తీసుకురావాలంటూ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 31న వీహెచ్‌పీ ధర్మ సన్సద్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో...అలోక్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా వీహెచ్‌పీ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. అయోధ్య కేసును సుప్రీంకోర్టులో అడ్డుకుంటోంది కాంగ్రెస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్‌తో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్‌పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్‌ను నేను కోరుతున్నా’ అని గోపాల్‌దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్‌పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్‌గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్‌దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్‌పూర్‌లో అన్నారు. వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్‌పీ కార్యకర్తలు -
మళ్లీ మంటలు.. భద్రతా వలయంలో అయోధ్య!
అయోధ్య: లోక్‌సభ ఎన్నికల్లోపే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా గుడి కట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం అయోధ్యలో ధర్మ సభ పేరుతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. శివసేన పార్టీ కూడా ఆదివారమే అయోధ్యలో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. దీంతో అయోధ్యలో 1992 నాటి ముస్లింలపై దాడి ఘటనలు మళ్లీ పునరావృతమవ్వొచ్చనే ఆందోళనతో అనేక మంది ముస్లింలు తమ ఇళ్లలోని ఆడవాళ్లను, పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపించారు. కాగా, ఇవన్నీ బీజేపీ ఎన్నికల గిమ్మిక్కులనీ, లోక్‌సభ ఎన్నికలలోపు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాదు కాబట్టి హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అనుబంధ సంస్థలు ఇలాంటి చర్యలకు దిగుతున్నాయని కొందరు స్వామీజీలు సైతం విమర్శిస్తున్నారు. శారదా ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ మతపరమైన కట్టడాల నిర్మాణం ప్రభుత్వాల బాధ్యత కాదనీ, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధర్మ సభ విషయంలో జోక్యం చేసుకోవాలనీ, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించి భద్రత కల్పించాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టు ను కోరారు. అయోధ్యలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెంచుతున్న మూడో కార్యక్రమం ఇది. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చినప్పుడు, ఆ తర్వాత 2002 మార్చిలో మందిర నిర్మాణం కోసం శిలాదాన్ జరిగినప్పుడు కూడా అయోధ్యలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ధర్మసభకు మూడు లక్షల మందికి పైగా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు హాజరవుతారని సమాచారం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ధర్మసభ తర్వాత కూడా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేకుంటే జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో అలహాబాద్‌లో ధర్మ సంసద్‌ను నిర్వహించి మందిర నిర్మాణంపై కేంద్రంతో ఆరెస్సెస్ తాడోపేడో తేల్చుకోనుంది. కుంభకర్ణుడి నిద్ర నుంచి కేంద్రం లేవాలి: ఠాక్రే ధర్మసభ కోసం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘కలియుగ కుంభకర్ణుడు (ప్రధాని మోదీ లేదా ఆయన ప్రభుత్వం) నాలుగేళ్లుగా నిద్రపోతూనే ఉన్నాడు. నిద్ర నుంచి లేచి కేంద్రం వెంటనే రామాలయ నిర్మాణ తేదీలను ప్రకటించాలి. గుడి కట్టేందుకు చట్టమో, ఆర్డినెన్సో తేవాలి. అందుకు మా పార్టీ మద్దతు ఉంటుంది. ముందు తేదీ చెప్పిన తర్వాతే మిగతావి మాట్లాడాలి’ అని కోరారు. శివసే న మహారాష్ట్ర నుంచి దాదాపు 3,000 మంది కార్యకర్తలను అయోధ్యకు తీసుకొచ్చినట్లు సమాచారం. డ్రోన్లు, అదనపు బలగాలతో భద్రత ధర్మసభ నేపథ్యంలో అయోధ్య భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. పట్టణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్ల సాయంతో నిరంతర గస్తీ నిర్వహిస్తారు. 10 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 42 కంపెనీల పీఏసీ, ఐదు కంపెనీల ఆర్ఏఎఫ్, ఏటీఎస్ బలగాలను మోహరించినట్టు అయోధ్య ఏఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఒక అదనపు డీజీపీ, ఒక డీఐజీ, ముగ్గురు సీనియర్ ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలు, 21 మంది డెప్యూటీ ఎస్పీలు, 160 మంది ఇన్స్పెక్టర్లు, 700 మంది కానిస్టేబుళ్లు కూడా ప్రత్యేక విధుల్లో ఉన్నారు. సరయూ నది మీదుగా కూడా పరిస్థితుల్ని సమీక్షించడానికి బలగాల్ని మోహరించారు. ప్రశాంతంగా బతకనివ్వండి: ముస్లిం పిటిషనర్ ధర్మసభకోసం ప్రభుత్వం చేసిన భద్రతా ఏర్పాట్లు తనకు సంతృప్తినిస్తున్నాయని బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారీ అన్నారు. అయితే, ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి లక్నోకో, ఢిల్లీకో వెళ్లాలి. అయోధ్యలో ఏం పని? ఇక్కడి ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి’ అని అన్సారీ పేర్కొన్నారు. ‘అయోధ్యలోని 5 వేల మంది ముస్లింలలో 3,500 మంది ప్రాణభయంతో వెళ్లిపోయారు’ అని వెల్లడించారు. మరోవైపు రామాలయం అంశం ఇంకా కోర్టులో ఉన్నప్పటికీ వీహెచ్‌పీ ధర్మ సభ నిర్వహిస్తోందనీ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఆరెస్సెస్ నాలుగంచెల వ్యూహం లోక్‌సభ ఎన్నికల్లోపే రామాలయాన్ని నిర్మించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆరెస్సెస్ నాలుగు అంచెల వ్యూహాన్ని రచించింది. అవి.. మొదటి దశ: నవంబర్ 25న దేశవ్యాప్తంగా 153 ప్రాంతాల్లో సభలు. అయోధ్య, నాగపూర్, బెంగళూరులో ధర్మసభలు. రెండో దశ: ఆర్డినెన్స్ కోసం ఎంపీలపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంటు నియోజకవర్గాల్లో కార్యకర్తలు, సాధువులతో సభల ఏర్పాటు. మూడో దశ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు, డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ. నాలుగో దశ: డిసెంబర్ 18 నుంచి 27 వరకు మందిర నిర్మాణానికి దేశవ్యాప్త ఉద్యమం. యజ్ఞయాగాలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. అయోధ్య వీధుల్లో భద్రతా సిబ్బంది పహారా -
అయోధ్యలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు!
లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), శివసేన చేపట్టిన ధర్మసభ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. దాదాపు 30 వేల మంది కరసేవకులతో పాటు శివసేన చీఫ్ ఉద్దవ్‌ఠాక్రే శనివారం అయోధ్య చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగకుండా అక్కడి పరిసరాలల్లో పోలీస్‌శాఖ 144 సెక్షన్లు అమలుచేసింది. రామజన్మ భూమిని సందర్శించేందుకు ఇప్పటికే 25000 మంది శివసేన కార్యకర్తలు అయోధ్య రైల్వే జంక్షన్‌కు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్‌శాఖ ముందస్తూ చర్యలును చేపట్టి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. శివసేన ర్యాలీ సందర్భంగా అయోధ్యలో ఆర్మీ దళాలను దింపాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం సుప్రీంకోర్టును కోరారు. అయోధ్యలో ఉద్రిక్తమైన వాతావరణాన్ని బీజేపీ కోరుకుంటుందని.. సుప్రీం తీర్పులపై వారికి నమ్మకం లేదని ఆయన అన్నారు. కాగా రామాలయ నిర్మాణం కొరకు పార్లమెంట్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో సహా, హిందుత్వ పార్టీలు రామజపాన్ని అందుకున్నాయి. పార్లమెంట్ ఆర్డినెన్స్‌తో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామాలయ నిర్మాణం చేపడతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య వివాదంను సుప్రీం ధర్మాసనం విచారించనున్న విషయం తెలిసిందే. -
భక్తిలోనూ రాజకీయాలే!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి సుప్రీం కోర్టు తీర్పు మేరకు అన్ని వయస్కుల మహిళలను అనుమతించకుండా ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థల భక్తులు అడ్డుకుంటుండడంతో శుక్రవారం నాటికి కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయ్యప్ప ఆలయానికి సరిగ్గా 23 కిలోమీటర్ల ఈవల నీలక్కళ్ వద్దనే ఓ టెంట్ వేసి ‘శబరిమల ఆచార సంరక్షణ సమితి’ బ్యానర్‌తో భక్తులు అయ్యప్ప ప్రార్థనలు జరుపుతున్నారు. అయ్యప్ప ఆలయానికి మొదటి ప్రవేశ మార్గంగా భావించే నీలక్కళ్ వద్దనే భక్తులతో వస్తున్న బస్సులను, ఇతర వాహనాలను ఆరెస్సెస్ కార్యకర్తలు ఆపివేసి మహిళలను దించివేస్తున్నారు. నీలక్కల్ వద్దనే ఆరెస్సెస్ టెంట్ వేయడంతో 1982లో చర్చి నిర్మాణానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ నిర్వహించిన ఆందోళన గుర్తుకు వస్తోంది. నీలక్కల్‌లోని శివాలయానికి సమీపంలో చర్చి నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆ ఆందోళనకు నాయకత్వం వహించిన కుమ్మనమ్ రాజశేఖరన్ నేడు మిజోరమ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అప్పుడాయన కేరళ విశ్వహిందూ పరిషత్ ప్రధాని కార్యదర్శిగా పనిచేశారు. శివాలయానికి సమీపంలో శిలువ 1982కు కొన్నేళ్ల ముందు నీలక్కళ్ శివాలయానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో పెద్ద శిలువ దొరికిందన్న ప్రచారం జరిగింది. ఏసుక్రీస్తు 12 ముఖ్య ప్రచార బోధకుల్లో ఒకరైన థామస్ కొన్ని శతాబ్దాల క్రితం అక్కడ చర్చిని నిర్మించారని, ఆ చర్చిలోని శిలువే బయటకు వచ్చిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దాంతో శిలువ దొరికినట్లు భావించిన చోట క్యాథలిక్ చర్చి సభ్యులు చిన్న గుడిసె వేసి ప్రార్థనలు జరపడం ప్రారంభించారు. అక్కడ చర్చి పునర్నిర్మాణం కోసం క్యాథలిక్ చర్చి ‘నీలక్కళ్ కార్యాలయ సమితి’ని ఏర్పాటు చేసింది. ఈ చర్చి ఆందోళనను అడ్డుకోవడానికి సంఘ్ పరివార్ కొచ్చీలో హిందీ మహా సమ్మేళనాన్ని నిర్వహించింది. శివాలయం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదంటూ ఆ సమ్మేళనం హిందువులకు పిలుపునిచ్చింది. 1982, మే 19న చర్చికి స్థలం కేటాయింపు అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం ఇరు మతాల వారిని మంచి చేసుకోవడంలో భాగంగా శివాలయానికి నాలుగు కిలీమీటర్ల దూరంలో చర్చి నిర్మాణాకి ఓ హెక్టార్ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా వీహెచ్‌పీ నాయకుడు రాజశేఖరన్ నాయకత్వాన ఆరెస్సెస్ కార్యకర్తలు తిరువనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారన్న కారణంగా వెయ్యి మంది ఆరెస్సెస్ కార్యకర్తలు నాడు అరెస్టయ్యారు. అయినా చర్చి నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారు. ‘ఆ చర్చి ప్రభుత్వం మతతత్వ వాదానికి ప్రతీక, ఓట్ల కోసం ఆడిన నాటకం’ అని నాడు రాజశేఖరన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వమర్శించారు. నాటి ఆందోళనతో కేరళలో హిందూ సంఘాలు కాస్త బలపడ్డాయి. మద్దతిచ్చి మాటమార్చిన ఆరెస్సెస్, బీజేపీ అయ్యప్ప ఆలయంలోని అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సెప్టెంబర్ 28వ తేదీన సుప్రం కోర్టు ఇచ్చిన తీర్పును అదే రోజు ఆరెస్సెస్, బీజేపీ పార్టీలు స్వాగతించాయి. లింగ వివక్ష లేకుండా భక్తులందరికి సమాన హక్కులు ఉంటాయని, అందుకే కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఆరెస్సెస్ రాష్ట్ర కార్యదర్శి పీ గోపాలన్కుట్టీ వ్యాఖ్యానించారు. ఆలయ ప్రవేశం విషయంలో లింగ వివక్షను ఎంత మాత్రం అనుమతించేది లేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వ్యాఖ్యానించారు. అక్టోబర్ మూడవ తేదీ నాటికి కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తుల ఆందోళన తీవ్రతరం కావడంతో ఇద్దరు మాట మార్చేశారు. ఆరెస్సెస్ ప్రత్యక్షంగా ఆందోళనలోకి దిగి భక్తుల ఆందోళనకు నాయకత్వం వహిస్తోంది. ఎవరిది మాత్రం ఓట్ల రాజకీయం కాదు? -
కేంద్రానికి వీహెచ్‌పీ డెడ్‌లైన్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం అంశంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) గళం పెంచింది. కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ ఏడాది చివరిలోగా రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తేకుంటే తమకు వేరే ప్రత్యామ్నాయాలున్నాయంటూ హెచ్చరికలు చేసింది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన వీహెచ్‌పీ ఉన్నత స్థాయి కమిటీ రామ్ జన్మభూమి న్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో చర్చలు జరిపింది. అనంతరం వీహెచ్‌పీ ప్రముఖులంతా రాష్ట్రపతి కోవింద్‌కు∙తీర్మాన ప్రతిని ఇచ్చారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ మాట్లాడారు. ‘ప్రభుత్వం స్పందించకుంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయి. వచ్చే ఏడాది మహాకుంభమేళా సందర్భంగా సాధువులతో జరిగే ధరమ్ సన్సద్ సమావేశంలో నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ‘ఈ మధ్య జంధ్యం ధరించిన కొందరు నేతలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. వారూ మాకు మద్దతివ్వాలని రాహుల్‌గాంధీనుద్దేశించి అన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..‘ఇప్పటికే చాలా ఏళ్లపాటు ఎదురు చూశాం. ఇప్పుడిక వేచి చూడలేం’ అని‡ అన్నారు. ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్న వీహెచ్‌పీ నేతలు -
ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్
సాక్షి, విజయవాడ : పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయటాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. గురువారం విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, హిందుత్వ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వరకు వారు ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రామవరప్పాడుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ.. గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌లు నగర దిగ్భందం చేశాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విశ్వసిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వారు తప్పు పట్టారు. గురువారం గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై వీహెచ్‌పీ రాస్తారోకో చేపట్టింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆయనపై ఉన్న బహిష్కరణను రద్దు చేయాలంటూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు కూకట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. -
పరిపూర్ణానందస్వామి అరెస్ట్ సరికాదు
యాదగిరిగుట్ట (ఆలేరు) : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని అరెస్ట్, నగర బహిష్కరణ చేయడం బాధకరమని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు పుల్ల శివ, విశ్వహిందూపరిషత్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తోట భానుప్రసాద్ అన్నారు. స్వామీజీని వెంటనే విడుదల చేసి, ఎక్కడ ఉన్నారో చెప్పాలని కోరుతూ బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు యాదగిరిగుట్టలో బీజేపీ, హెచ్‌డీపీఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. శాంతియుతంగా చేపట్టిన ధర్మాగ్రహయాత్రను అడ్డుకొని, స్వామీజీని ఎవరికి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లడం శోచనీయమన్నారు. హిందూ దేవుళ్లను, ఆచారాలను గౌరవించే స్వామీజీలను అరెస్ట్ చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. స్వామీజీకి ప్రభుత్వం రక్షణ కల్పించి, పాదయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్, హెచ్‌డీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె పవీణ్, నవీన్ ఠాగూర్, నర్సింహారావు, లెంకలపల్లి శ్రీనివాస్ ఉన్నారు. -
అల్లర్ల కేసు నిందితులను జైల్లో కలిసిన కేంద్ర మంత్రి
పట్నా : వ ముస్లిం వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులకు ఘనస్వాగతం పలికి కేంద్రమంత్రి జయంత్ సిన్హా విమర్శలు ఎదుర్కొంటున్న వివాదం మరవకముందే మరో కేంద్ర మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. అల్లర్ల కేసులో జైల్లో ఉన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం కలిశారు. బిహార్‌లోని నవడా జైలులో ఉన్న బజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలను కలిసిన ఆయన.. సుమారు 30 నిమిషాల పాటు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. 'జీతూ జీ, కైలాష్ జీని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. 2017లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రక్తతలు తలెత్తినప్పుడు వారు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అక్బర్పూర్లో దుర్గామాత విగ్రహాన్ని విధ్వసం చేసినప్పుడు కూడా ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నమే చేశారు. అలాంటి వారిని అల్లరి మూకలు అని ఎలా నిందిస్తారు ’ అని నిందితులను సమర్థించారు. హిందువులను అణిచివేయడం ద్వారా మత సామరస్యాన్ని కాపాడగలమని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ధోరణిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని గిరిరాజ్ అన్నారు. 2017 అల్లర్ల కేసులో బజరంగ్ దళ్ కన్వీనర్ జితేంద్ర ప్రతాప్‌ను ఈ నెల 3న అరెస్టు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే జితేంద్ర ప్రతాప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గిరిరాజ్ ఆరోపణలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం విషయాల్లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నేరస్థునికి రక్షణ కల్పించదని పేర్కొన్నారు. -
మందిర్ తీర్పులో జాప్యం సహించం..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ సంవత్సరాంతానికి రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యేలా రామ జన్మభూమి వివాదంపై విచారణను వేగవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అయోధ్య కేసును త్వరితగతిన విచారించాలని ఈ కేసులో వీహెచ్‌పీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడితే ఈ ఏడాది చివరిలో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఇక బాబ్రీ విధ్వంసం కేసుకు, మందిర్ నిర్మాణానికి సంబంధం లేదని చెప్పారు. ఒకటి క్రిమినల్ కేసు కాగా, మరొకటి భూ యాజమాన్య హక్కులకు సంబంధించినదన్నారు. అయోధ్య వివాదానికి సంబంధించి కోర్టు తీర్పులో జాప్యం జరిగితే హిందూ సన్యాసులు, ప్రముఖుల సూచనలతో ముందుకు వెళతామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా, వీహెచ్‌పీని మతపరమైన ఉగ్రవాద సంస్థగా సీఐఏ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ అమెరికన్ ఏజెన్సీ చర్యపై తాము ఆందోన చెందడం లేదని, ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకువెళ్లాలని తాము కోరుతున్నామన్నారు. -
‘రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం’
ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్ : మరో నాలుగు నెలల్లోపు రామమందిరం నిర్మాణం చేపట్టకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు విశ్వ హిందూ పరిశత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తోగాడియా. రామ మందిర నిర్మాణం, గో రక్షణ వంటి అంశాల కోసం పని చేయడానికి బుధవారం ఫైజాబాద్‌లో ‘అంతరాష్ట్రీయ హిందు పరిషత్’ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాట మార్చి రామ మందిర నిర్మాణ అంశాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటున్నారు. ఇలా మాటా మార్చడం పార్టీకే మంచిది కాదని తోగాడియా హెచ్చరించారు. ‘అక్టోబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలి. అలా చేయని పక్షంలో దేశంలోని హిందువులందరూ రోడ్లపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తార’ని హెచ్చరించారు తోగాడియా. అంతేకాక ‘ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మసీదులను సందర్శించడానికి తీరిక ఉంటుంది. కానీ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించడానికి మాత్రం తీరిక లేదు. మోదీ ఇలా మసీదులను సందర్శిస్తూ హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నార’ని తొగడియా విమర్శించారు. ‘ఎందుకు మోదీ రామ మందిరం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారని’ ప్రశ్నించారు. ‘నేను బీజేపీకి ఒక్కటే చెప్పదల్చుకున్నాను. రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం. దేశంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను మనం గౌరవించాలి. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది నిజంగా మన పార్టీకి చాలా గొప్ప విజయం అవుతుంది అన్నారు తోగాడియా. అయితే తోగాడియా వ్యాఖ్యల గురించి మాజీ బీజేపీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు వినయ్ కటియార్ ‘రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వీహెచ్‌పీకి ధన్యవాదాలు. రామ మందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు 2019 నాటికి తన నిర్ణయాన్ని తెలపకపోతే అప్పుడు మోదీనే మందిర నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేస్తార’ని తెలిపారు. -
తొగాడియా కొత్త హిందూ పార్టీ
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్‌పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు. యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు. -
‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) పేర్కొంది. అరెస్ట్ చేసిన వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్‌తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ సీఐఏ రిపోర్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది. హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ పేర్కొనందుకు భారత సమాజానికి అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) ప్రతి సంవత్సరం వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల్పడే సంస్థలుగానూ, ఆర్ఎస్ఎస్ను జాతీయ సంస్థగా ప్రకటించింది. -
తాజ్‌మహల్ గేటు ధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ: 400 ఏళ్లనాటి శివాలయం లోకి అనుమతించే దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చారిత్రాత్మక కట్టణం తాజ్‌మహల్ పశ్చిమ ద్వారాన్ని (బసాయి ఘాట్) ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తాజ్‌మహల్‌కు సమీపంలోని పురాతన శివాలయానికి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మూసివేస్తోందని వీహెచ్‌పీ సభ్యుల ప్రధాన ఆరోపణ. సిద్ధ్వేశ్వర మహాదేవ్ దేవాలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా నినాదాలతో దూసుకు వచ్చిన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్‌మహల్, సహేలీ కా బుర్జ్ టిక్కెట్ల సేకరణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఐరన్రాడ్లతో దాడిచేశారు. గేట్‌ను తొలగించి, అక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల దూరానికి విసిరి పారేశారు. ఏఎస్ఐ ఏర్పాటు చేసిన సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేలకు వారిని నిరోధించిన తాజ్ మహల్ సిబ్బంది వారిని అదుపులోకి కున్నారని తాజ్ భద్రతా అధికారి ప్రభాత్‌కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ సభ్యులు రవిదుబే, మదన్‌వర్మ, మోహిత్ శర్మ, నిరంజన్ సింగ్ రాథోడ్, గుల్లా సహా మరో 30మంది పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 ప్రకారం ఫిర్యాదు దాఖలు చేశామని ఏఎస్ఐ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. తాజ్‌మహల్ చుట్టూ ఉన్న హిందూసంస్కృతికి సంబంధించిన అంశాలను ఏఎస్ఐ నాశనం చేస్తోందని విహచ్పీ ప్రతినిధి దుబే ఆరోపించారు. దాదాపు 15సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ సత్సంగ్ నిర్వహించుకునే వారని దాన్ని నిలిపివేశారన్నారు. అలాగే దసరా ఉత్సవాలను కూడా ఆపివేశారని మండిపడ్డారు. ఆమ్లా నవమిని నిర్వహించుకునే ఉసిరి చెట్టును ఏఎస్ఐ నరికివేయించిదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ 14-15 సంవత్సరాల క్రితం సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో స్వస్తి చెప్పారు. అయినా ఇకముందు ఇలా జరగడానికి తాము అంగీకరించమని దుబే వాదించారు. -
తిరుమల పరిణామాలపై స్వామీజీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ముప్పేట దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు జరిపిన స్వామిజీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా స్వామీజీలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియా, మీడియా ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణనంద స్వామి, కమలానంద భారతి స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు. -
ఆ సినిమాను విడుదల కానివ్వం: వీహెచ్‌పీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. ఇదంతా ఎందుకంటారా.. తాజాగా ‘లవోరాత్రి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సినిమా పేరును ‘లవోరాత్రి’ అని నిర్ణయించారు. ఈ విషయం గురించి విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేశారు. ఈ సినిమాను దేశంలో ఎక్కడా ప్రదర్శించడానికి వీలులేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినాలని మేం కోరుకోవడం లేదు. కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటా’మని తెలిపారు. ‘సుల్తాన్’, షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’, చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అభిరాజ్ మినావాలా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయుష్ శర్మకు జోడీగా నటిస్తున్న వారినా హుస్సెన్‌కు కూడా ఇండస్ట్రీకి తొలి పరిచయం కావడం గమనార్హం. -
సాధ్వి సరస్వతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జంషెడ్పూర్ : గోవధను నిరోధించేందుకు జీవితఖైదుతో కూడిన కఠిన చట్టాన్ని తీసుకురావాలని వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోవధను నియంత్రిస్తూ పలు రాష్ట్రాలు చట్టాలు చేసినా జాతీయస్థాయిలో కేంద్రం సరైన చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని ఆమె కోరారు. కేరళలో హిందూ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై ఏప్రిల్ 30న కేసు నమోదు చేసినా తాను తన కార్యకలాపాలను కొనసాగిస్తానని సాధ్వి సరస్వతి స్పష్టం చేశారు. కేరళలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి సరస్వతి తనపై కేసులున్నా తనను అవి నిరోధించలేవన్నారు. బీఫ్ తినడంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తన ఫేస్బుక్ పేజీలో 600 మందికి పైగా వ్యక్తులు తనను ట్రోల్ చేశారని చెప్పారు. జాప్యం నెలకొన్నా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.