
‘రామమందిరం కోసం మళ్లీ కొత్త ఉద్యమం’
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనను బీజేపీ స్వాగతించగా విశ్వహిందూ పరిషత్ మాత్రం తాము మరో సమరానికి సిద్ధమని ప్రకటించింది. మరో కొత్త ఉద్యమాన్ని రామాలయ నిర్మాణం కోసం ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా రెండు లక్షల గ్రామాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని 70 వేల గ్రామాల్లో రామ మహోత్సవం నిర్వహిస్తామని కూడా విశ్వహిందూ పరిషత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ జోనల్ అధ్యక్షుడు ఈశ్వరీ ప్రసాద్ చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లో రాముడు జన్మించిన భూమిలోనే రామమందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రాముడి జీవిత చరిత్రను ప్రజలే చెబుతారని, ఆయోధ్యలో రామమందిరం జరగాల్సిందేననే డిమాండ్‌ను తాము లేవనెత్తుతామని స్పష్టం చేశారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 వరకు రామమహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జల్లికట్టును ఆర్డినెన్స్ రక్షించగా లేనిది.. అదే ఆర్డినెన్స్‌తో రామమందిరాన్ని ఎందుకు నిర్మించి రక్షించకూడదని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత మరిన్ని కథనాలకోసం చదవండి..
బాబ్రీ మసీదు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు