'సత్యసాయి ప్రవచనం నిజమవుతుంది' | India Will be Hindu Nation by 2020, Says VHP Leader Ashok Singhal | Sakshi
Sakshi News home page

'సత్యసాయి ప్రవచనం నిజమవుతుంది'

Published Sat, Jul 18 2015 7:22 PM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM

'సత్యసాయి ప్రవచనం నిజమవుతుంది' - Sakshi

'సత్యసాయి ప్రవచనం నిజమవుతుంది'

న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తుకు సంబంధించి భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన ప్రవచనం నెరవేరుతుందని, ఆ మేరకు పరిస్థితుల్లోనూ మార్పులు సంభవించాయని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత అశోక్ సింఘాల్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ మెజారిటీ సాధించడాన్ని విప్లవంగా అభివర్ణించిన ఆయన .. 2020లోగా భారత్ హిందూ దేశంగా రూపాంతరం చెందడం ఖాయమన్నారు.

శనివారం ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్, దివంగత సుదర్శన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సింఘాల్ ప్రసంగించారు. 'సత్యసాయి బాబా బతికున్న రోజుల్లో ఓ సారి నేను ఆయన ఆశ్రమానికి వెళ్లాను. 2020 నాటికి భారత దేశం సంపూర్ణ హిందూ దేశంగా మారుతుందని, 2030 నాటికి ప్రపంచం మొత్తం హిందూమయమవుతుందని బాబా నాతో అన్నారు. ఆయన మాటలు నిజం కాబోతున్నాయనడానికి నిదర్శనం నేటి బీజేపీ గెలుపు' అని సింఘాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement