కర్నూలు, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్‌పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది.
తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరం. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదు. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరం.
.. ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. ఆ ఆరోపణలను నిరూపణ చేయాలి. ఈ అంశంపై దృష్టి పెట్టి కేసును అవసరమైతే సీబీఐకి అప్పచెప్పాలి. నిజంగానే లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షించాలి అని వీహెచ్‌పీ ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment