సాక్షి, విశాఖపట్నం: టీటీడీ లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని వీహెచ్‌పీ నేత కోటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’తో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావన్నారు. న్యాయ విచారణ అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు.
లడ్డులో కొవ్వు పదార్థాలు కలిశాయనే ఆధారాలు మా దగ్గర లేవు. మీడియాలో వస్తున్న కథనాలు ప్రకారం మాట్లాడుతున్నాము. అసలు వాస్తవాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలి’’ అని కోటేశ్వర శర్మ చెప్పారు.
కాగా, తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.
ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు
ఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్‌సీపీ గవర్నర్‌కు ఫిర్యాదు కూడా చేసింది.
పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment