పవన్‌కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా? | Pawan insulted the courts in the name of Sanatana Dharma | Sakshi
Sakshi News home page

పవన్‌కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా?

Oct 3 2024 7:44 PM | Updated on Oct 3 2024 9:27 PM

Pawan insulted the courts in the name of Sanatana Dharma

తిరుపతి: సనాతన ధర్మాన్ని ముందు ఉంచి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఊగిపోయారు. గురువారం సాయంత్రం వారాహి డిక్లరేషన్‌ సభలో ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్లపై విచారణ నడుస్తున్న వేళ.. పవన్‌ తాజా వ్యాఖ్యలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.

‘‘నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ల పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారిని కోర్టులే రక్షిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు.

.. సనాతన ధర్మం వైరస్‌లాంటిదని, నాశనం చేస్తానని ఓ యువనేత అన్నారు. ఇలాంటి మాటలు ఇస్లాం గురించి అంటే తక్షణం కోర్టులు స్పందించేవి. వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించేవి. సనాతన ధర్మాన్ని తిట్టినా.. శ్రీరాముడిని, సరస్వతి దేవిని తిట్టినా.. దాడి చేసినా ఏ ఒక్కకోర్టు మాట్లాడదు. అలాంటి వారిని ఏమైనా అనాలంటే కోర్టులు భయపడతాయి. ఇది న్యాయానికి ఉదాహరణ.

.. నాకు ఏదో అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. జనసేన అధ్యక్షుడిగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పడడానికే వచ్చా. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా?. లడ్డూ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పవన్‌ అన్నారు.

ఈమధ్యకాలంలో కోర్టులు ఈ తరహా వ్యాఖ్యలను అస్సలు ఉపేక్షించడం లేదు. తమ తీర్పును రాజకీయాలకు ముడిపెట్టి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీరును తీవ్రంగా పరిగణించి సుప్రీం కోర్టు  మందలించింది. అలాగే లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయం కోసం చేసిన ప్రచారంపైనా మండిపడింది. ఇవేకావు.. బాధ్యతగల పదవుల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వాళ్లపట్ల న్యాయస్థానాలు అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది.. పవన్‌ నేరుగా కోర్టులపైనే బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా?. మొట్టికాయలు వేయకుండా ఉంటుందా?. 

::లోకేష్‌

ఇదీ చదవండి: చివరి నిమిషంలో లడ్డూ పిటిషన్ల విచారణ వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement