సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఆయన.. పలు రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు, తదితరులకు ట్యాగ్ చేశారు.
Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024
‘సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇస్తే.. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా? మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా?’ అంటూ నిన్న(శుక్రవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. శుక్రవారం ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా(హ్యాండిల్)లో చేసిన పోస్టింగ్స్ చూస్తే.. ‘తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అంటూ దుయ్యబట్టారు.
టీడీపీ అధికారిక ఖాతా నుంచి ‘ఎక్స్’లో చేసిన ఆ పోస్టింగ్స్‌లో ఏం రాశారన్నది చదివి వినిపిస్తూ ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అబద్ధం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’ అంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.
ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment