
హిందువుకు ఐదుగురు పిల్లలు తప్పనిసరైంది: అశోక్ సింఘాల్
ప్రతీ హిందూ జంట ఐదుగురు పిల్లలకి జన్మనివ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని విశ్వ హిందూ పరిషత్ కన్వీనర్ అశోక్ సింఘాల్ అన్నారు.
భోపాల్: ప్రతీ హిందూ జంట ఐదుగురు పిల్లలకి జన్మనివ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని విశ్వ హిందూ పరిషత్ కన్వీనర్ అశోక్ సింఘాల్ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మత మార్పిడులను వెంటనే ఆపకపోతే దేశంలో హిందువులు మైనారిటీలుగా మారిపోయే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. బీజేపీతో వీహెచ్‌పీకి ఏమీ సంబంధం లేదని, అయినా లోక్‌సభ ఎన్నికల్లో తాము మోడీకి మద్దతిస్తామని సింఘాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మోడీపై ప్రసంశల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించారు. మోడీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం అమెరికాతో పాటు మరెవరి ఒత్తిడికి లొంగకుండా పనిచేస్తుందన్నారు.