దేశవ్యాప్తంగా నిర్మిస్తామన్న వీహెచ్‌పీ
లక్నో/మీరట్: దేశంలోని ప్రతి గ్రామంలో రామాలయాన్ని నిర్మిస్తామని వీహెచ్‌పీ ప్రకటించింది. అయోధ్యలో రామాలయ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా అయోధ్యలో నిర్మాణం మొదలవుతుందని.. అయితే అది అందరి ఏకాభిప్రాయం, కోర్టు అనుమతితోనే జరుగుతుందని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇటీవలే వ్యాఖ్యానించారు కూడా. తాజాగా సోమవారం ఈ అంశంపై వీహెచ్‌పీ ప్రతినిధి శరద్ శర్మ లక్నోలో, మరో నేత సాధ్వీ ప్రాచి మీరట్‌లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 25వేల గ్రామాల్లో రామాలయాలు నిర్మించాలని వీహెచ్‌పీ నిర్ణయించినట్లు శర్మ చెప్పారు.
ఏప్రిల్ 15వ తేదీన శ్రీరామనవమి నుంచి వారం రోజులపాటు రామ మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కొన్నేళ్లుగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 75 వేల గ్రామాలకు దీనిని తమ సంస్థ చేరవేసిందని చెప్పారు. ఈసారి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వీటిని నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతి గ్రామంలో రామాలయం
Published Tue, Jan 12 2016 1:00 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement
Advertisement