
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ఆ ఎన్నికల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని, అక్రమాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఎంపీ గురుమూర్తి సహా పలువురుపై దాడికి పాల్పడిన సందర్భాన్ని సుబ్రహ్మణ్యస్వామి లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఈనెలలో జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.
మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు.
Comments
Please login to add a commentAdd a comment