విశాఖ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని ప్రకటించిన సీబీఐ
ఎన్నికల్లో ఓటర్లను మోసగించేందుకు టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన నౌకలో డ్రగ్స్ ఉన్నాయని గగ్గోలు
రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని ఎల్లో మీడియా రాద్ధాంతం
ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు తప్పుడు కథనాలు
ఇప్పుడు ఆ నౌకలో డ్రగ్స్ లేవంటూ సీబీఐ ప్రకటన
దీంతో తేలిపోయిన పచ్చకుట్ర
భూముల రీసర్వేపైనా అప్పట్లో విషం చిమ్మిన టీడీపీ..
ప్రజల భూములు కబ్జా చేస్తారంటూ ఊదరగొట్టిన ఎల్లో గ్యాంగ్
ఇప్పుడు మాట మార్చి.. రీసర్వే కొనసాగిస్తామన్న సీఎం చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని దుష్ప్రచారం
అప్పుడే అప్పుల వృద్ధి తక్కువ అని తెలిపిన ఆర్థిక శాఖ
ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారంతిరుమల లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ, కాకినాడ పోర్టులతో డైవర్షన్ పాలిటిక్స్
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్‌ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది.
అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి.
ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.
డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం
» చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు.
» చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్‌కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు.
అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను తీసుకువచ్చిన ‘ఎస్‌ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు.
» అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది.
» వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలే డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు.
» ఆ షిప్‌లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్‌ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే.
అందులో డ్రగ్స్ లేవు
విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్‌కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది.
కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు.
భూముల రీసర్వేపై కూడా విషప్రచారం
» భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్‌సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి.
» తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్‌సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది.
» ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది.
» తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా!
ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో..
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది.
» రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు.
కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment