container
-
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. వీకెండ్సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. — SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024 -
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్‌ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్‌కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను తీసుకువచ్చిన ‘ఎస్‌ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్‌ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్‌ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్‌తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్‌కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్‌ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
అధికారం కోసం చంద్రబాబు గడ్డి కరుస్తారు
-
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. -
కంటైనర్ టెర్మినల్ మూసేయలేదు
నెల్లూరు (పొగతోట): కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదని యాజమాన్యం చెబుతున్నా.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హడావుడి చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం నెల్లూరులోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో కాకాణి మాట్లాడుతూ.. కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, అక్రమ టోల్గేట్లు పెట్టి సంపాదించుకుంటున్నారని విమర్శిస్తున్న సోమిరెడ్డి వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారారు. ఈ విషయంలో దమ్ముంటే విచారణ జరిపించాలని చాలెంజ్ చేశారు. అదానీని కలుస్తానని సోమిరెడ్డి చెప్పడం కలెక్షన్ల కోసమే అని ఆరోపించారు. సోమిరెడ్డికి కళ్లు కనిపించడం లేదని, కళ్లల్లో చుక్కల మందు వేసుకుని చూడాలని హితవు పలికారు. ‘ప్రస్తుతం సోమిరెడ్డి అధికారంలో ఉన్నారు. కంటైనర్ టెర్మినల్ విషయంలో ధైర్యం ఉంటే టోల్గేట్ ఎక్కడ పెట్టారో.. అక్రమంగా ఎవరు సంపాదిస్తున్నారో నిరూపించాలని.. లేదంటే అన్నీ మూసుకుని కూర్చోవాలి’ అని హితవు పలికారు. అ«ధికారంలోకి రాగానే ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపైనే దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టులో యాష్ పాండ్‌తోపాటు లే అవుట్ల యజమానుల నుంచి వసూళ్లు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం కాకుండా అవినీతి సంపాదన కోసం సోమిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చెప్పారు.‘మీరు శిలఫలాకాలు, విగ్రహాలు, ఆస్తులను కూల్చామని విర్రవీగుతున్నారు. మీరు ఎక్కడ ఏవేవి కూల్చారో వాటిని మీతోనే వాటిని పునరి్నరి్మంచే రోజు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల కోసం తాము వాచ్మెన్ డ్యూటీ చేస్తామని కాకాణి అన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా ఉండి అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా వచ్చి కార్యకర్తల వెన్నంటే ఉంటామని, అండగా నిలుస్తామన్నారు. -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్‌కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్‌లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. -
అది ప్యాంట్రీ కార్.. బే‘కార్’ రాతలేల రామోజీ
సాక్షి,అమరావతి/సాక్షి, నంద్యాల: 2024 మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించనున్నదన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు అందాయి. బయట సర్వేలే కాదు.. స్వయంగా ఈనాడు, ఈటీవీ కంట్రిబ్యూటర్లు నిర్వహించిన సర్వేలోనూ ఎంత తక్కువ అనుకున్నా వైఎస్సార్ సీపీ 150 సీట్లపై మాటే కైవసం చేసుకుంటుందని తేలడంతో ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. చంద్రబాబు కన్నా ముందే ఆయన భయంతో వణికిపోతున్నారు. ఉచ్ఛనీచాలు మరిచి కథనాలు రాస్తున్నారు. పైత్యం ఎక్కువై ఏమీ లేకున్నా.. అక్కడేదో ఉన్నట్లు, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారమే లక్ష్యంగా ఊహాగానాలతో అసత్యాలు అల్లుకుని యథేచ్ఛగా వార్తలు రాస్తున్నారు. ఇలాంటి పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. సీఎం క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది? అంటూ బుధవారం ఈనాడు కట్టుకథను అల్లింది. ప్యాంట్రీ కార్.. కంటెయినర్లా కనిపించిందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం పే రుతో బస్సుయాత్రను బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా దాదాపు మూడు వారాల (21రోజులు)పాటు ప్రజలోనే ఉండనున్నారు. దీంతో ముఖ్యమంత్రి కోసం ఆహారాన్ని వండేందుకు ఏపీ 16 జడ్ 0363 నంబర్ గల ప్యాంట్రీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనం మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామాన్లు తీసుకొచ్చింది. వాహనంలో వాటర్ బాటిళ్లు, వంటకు అవసరమైన కూరగాయలు, వంట సామగ్రి మాత్రమే ఉన్నాయి. ఈ వాహనం మంగళవారం తాడేపల్లి నుంచి బుధవారం ఉదయానికి వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలానికి చేరుకుంది. అక్కడే డీజిల్ కొట్టించుకుని సీఎం వైఎస్ జగన్ బస చేయనున్న ఆళ్లగడ్డకు మధ్యాహ్నానికి చేరుకుంది. చిన్నసైజులో ఉన్న ఈ ప్యాంట్రీ వాహనం ఈనాడుకు, రామోజీరావుకు ఓ పెద్ద కంటెయినర్‌గా కనిపించింది. అంతే ఈ కంటెయినర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏమి తెచ్చింది.. అంటూ నిస్సిగ్గుగా ఉన్మాదపు రాతలను ఆ పత్రిక అచ్చేసింది. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి ప్యాంట్రీ వాహనం విజువల్స్, ఫొటోలు తీసినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ఫొటోలు.. వీడియోలు తీయడం నిషిద్ధం. ఇది తెలిసినా ఈనాడు పత్రిక నిబంధనలు మీరి ఫొటోలు, వీడియోలు తీయడమే కాకుండా అడ్డగోలు రాతలు రాసింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈనాడు, ఈటీవీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా, అధికారులెవరినీ వివరణ అడగకుండా బురద జల్లేలా రాసిన రాతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఒక వార్త రాసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం జర్నలిస్టు విధుల్లో ఓ భాగం. కానీ, ఈనాడు అత్యుత్సాహానికి పోయి ఊహలతో అబద్ధాలు ప్రచురించింది. దీంతో ప్యాంట్రీ వాహనంలో ఏముందో సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ ఫొటోలతో సహా బహిర్గతం చేసింది. దీంతో ఈనాడు పరువు పోయింది. ఇవేం రాతలంటూ ఆ పత్రికను ట్రోలర్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. బెడిసికొట్టిన లోకేశ్ అతి టీడీపీ నేత నారా లోకేశ్‌కు తరచూ అభాసుపాలవ్వడం రివాజుగా మారింది. బుధవారమూ రొటీన్‌గా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీనికి ఈనాడు క్లిప్పింగ్‌ను జత చేశారు. అయితే వెంటనే స్పందించిన సోషల్ మీడియా లోకేశ్‌ను రీట్వీట్లతో ఓ ఆట ఆడుకుంది. వాహనంలో ఉన్న వస్తువులతోపాటు వాహన వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి చేద్దామనుకున్న ఆయన వ్యూహం బెడిసికొట్టింది. -
బకరాలైన లోకేష్, యెల్లో బ్యాచ్...
-
ఈనాడు అత్యుత్సాహం.. లోకేష్ సహా బకరాలైన యెల్లో బ్యాచ్
సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్లలో కంటెయినర్‌ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు. ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు. -
విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సీపోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి బ్యాగ్‌ల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్‌లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేపన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతోనే డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. లాసన్స్ బే కాలనీలో సంధ్యా అక్వా ఎక్స్ పోర్టు కార్యాలయం ఉంది. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్‌ను చేర్చగా, నిందితులుగా మరి కొంతమందిని చేర్చే అవకాశం ఉంది. 18న ఈ-మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్‌పోల్ గుర్తించింది. సీబీఐకి ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గట్టు రట్టయ్యింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్‌కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సీబీఐ పేర్కొంది. -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు!
..అవును, ఇళ్లు కదులుతాయి. ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలనో... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్ నిర్మించుకోవాలనో... ప్రతిచోటా ఆఫీస్ పెట్టడం కుదరడం లేదనో...ఎక్కడికంటే అక్కడికి ఆఫీస్‌ను తరలించే సదుపాయం ఉంటే బాగుండనో అనుకుంటారు. ఇలా ఆలోచించే వారి కోసమే ఈ కంటైనర్ హోమ్‌లు. కొన్నిరోజులు లేదా నెలలు ఒకే ప్రదేశంలో ఉండి తర్వాత ఉంటున్న ఇంటిని వేరే చోటుకు మార్చాలనుకునేవారికి కంటైనర్హోమ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెద్దగా నిర్మాణ వ్యయం లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే వీటిని నిర్మించుకునే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఎండా, వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా వీటిని తయారుచేస్తున్నారు. దాంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఫాంహౌస్‌లు, కాఫీషాపులు, టీస్టాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఇవి తారసపడుతున్నాయి. ఓ చోట పని ముగియగానే అక్కడి నుంచి వీటిని తరలించే వెసులుబాటు ఉండటం వీటిలో ప్రత్యేకం. ఖర్చు కూడా చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండటంతో చిన్నపాటి గూడును నిర్మించుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. తయారీ ఇలా.. కంటైనర్ హోమ్ అనగానే ప్రధానంగా ఇవి ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి. ఎండా, వానల నుంచి రక్షణ ఉంటుందా. పైకప్పు, ఫ్లోర్ తుప్పుపడతాయేమో..విద్యుదాఘాతం జరిగితే.. ఇలా అందరి మదిలో మెదిలే ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. వీటికి స్పష్టమైన సమాధానాలున్నాయని తయారీదారులు హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరని తయారీదారులు సూచిస్తున్నారు. సౌకర్యాలు ఇలా.. గాల్వనైజింగ్ స్టీల్, ఎండీఎఫ్ బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. గ్రిడ్ వేస్తూ బైసన్ బోర్డుతో మూడు లేయర్లుగా ఫ్లోర్‌ను తీర్చిదిద్దుతున్నారు. నచ్చినవారు టైల్స్ వేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా వాటర్‌ఫ్రూఫ్ మెటీరియల్ వేయడంతో నీటి వల్ల పాడైపోతుందనే సమస్య లేదు. అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సూచిస్తున్నారు. టీవీ యూనిట్, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్‌బోర్డులు, ఎల్ఈడీ బల్బులు అన్నింటినీ తయారీదారులే ఇవ్వడంతో కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగినట్టే. విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. షార్ట్సర్క్యూట్కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్ యూనిట్‌కు అనుసంధానిస్తున్నారు. పైన 50 ఎంఎం ఇన్సులేషన్ చేయడంతో షార్ట్సర్క్యూట్కి అవకాశం ఉండదు. నీటి ట్యాంక్ కోసం ప్రత్యేకమైన స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటైనర్ హోమ్‌లకు సుమారు రూ.2.5లక్షలు, వీటికి అదనంగా వాష్‌రూమ్, కిచెన్ అమర్చితే సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంకా అదనపు హంగులు జోడిస్తే అనుగుణంగా ధరలున్నాయని చెబుతున్నారు. పై అంతస్తులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మరికొంత మంది చెబుతున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. ఖర్చు తక్కువ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
కంటైనర్ ఢీ.. యువ ఇంజనీర్ తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా అతి వేగంగా రాంగ్రూట్లో వచ్చి బైక్‌పై వెళ్తున్న కొస్మెట్టి అఖిలేష్ (29)ను ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మావల పోలీసు స్టేషన్ పరిధిలో ని బైపాస్ జాతీయ రహదారి 44 బట్టిసావర్గాం శివారులో సోమవారం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న అఖిలేష్ విధి నిర్వహణలో భాగంగా బోథ్ మండల కేంద్రానికి బైక్‌పై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో బట్టిసావర్గాం శివారు ప్రాంతంలో కంటైనర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మావల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. తీరని శోకం.. ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జైరామ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. జైరామ్ పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. ఇవి చదవండి: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
ఎర్ర సముద్రంలో ఆగని హౌతీల దాడులు!
న్యూయార్క్: అమెరికా నేతృత్వంలో ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ చేపట్టిన తర్వాత కూడా ఎర్రసముద్రంలో తొలిసారి ఓ నౌకపై దాడి జరిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మెర్స్క్ హాంగ్జౌ అనే వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. హాంగ్జౌ నౌక డెనార్క్‌కు చెందిన నౌక. అయితే.. దాడి జరిగినప్పటికీ ప్రయాణానికి ఇబ్బంది కలగలేదని అమెరికా తెలిపింది ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ పేరిట అమెరికా, ఫ్రాన్స్, యూకేల నౌకలు ఎర్ర సముద్రంలో గస్తీ కాస్తున్నాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను అమెరికా నేతృత్వంలో చేపట్టాయి. డెన్మార్క్ కూడా ఈ కూటమిలో చేరింది. ఈ గస్తీ తర్వాత కూడా ఓ నౌకపై దాడి జరగడం గమనార్హం. అయితే.. ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి శత్రువులకు చెందిన 17 డ్రోన్లను, నాలుగు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి 1200 వాణిజ్య నౌకలను క్షేమంగా ఎర్ర సముద్రం దాటించామని అమెరికా నేవీకి చెందిన వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే హాంగ్జౌపై దాడి జరిగింది. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం నుంచే జరుగుతుంది. ఇంత కీలక రూట్లో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులకు దిగుతున్నారు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నట్లు మిలిటెంట్లు చెబుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతుందని అమెరికా బలంగా నమ్ముతోంది. ఇదీ చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ
భారతదేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు రెట్టింపవుతున్నాయి. దాంతోపాటు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు హెచ్చవుతున్నాయి. ఈ వస్తురవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. దేశంలో అధికంగా తీరప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కువ వస్తువులు జలమార్గంలో పోర్ట్‌ల ద్వారా రవాణా చేస్తున్నారు. తాజాగా ముంద్రాలోని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నవంబర్ నెలకుగాను గరిష్ఠంగా 3,00,000 కంటైనర్లను సరఫరా చేశారు. అదానీ పోర్ట్ సెజ్(ఏపీ సెజ్) టెర్మినల్ నవంబర్ 2023లో 97 నౌకల్లో 3,00,431 ట్వెంటీ ఫుట్ ఈక్వాలెంట్ యునిట్(టీఈయూ)లను సరఫరా చేసి జాతీయ రికార్డును సృష్టించింది. మార్చి 2021లో ప్రతిరోజూ దాదాపు 10,000 చొప్పున 2,98,634 టీఈయూలను నెలలో సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం తన రికార్డును తాజాగా 3 లక్షల కంటైనర్ల సరఫరాతో తనే బద్దలుకొట్టింది. అంతేకాకుండా, ఏపీ సెజ్‌కు చెందిన ధమ్రా, ఎన్నూర్ పోర్ట్‌లు కూడా అత్యధిక నెలవారీ వాల్యూమ్లను నమోదు చేశాయి. వరుసగా 3.96 ఎంఎంటీ, 65,658 టీఈయూలను సరఫరా చేశాయి. ఏపీ సెజ్ కార్గో వాల్యూమ్లలో 36 ఎంఎంటీతో 42 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. ఏపీ సెజ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో 275 ఎంఎంటీ కార్గోను నిర్వహించాయి. అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు ప్రారంభంలో 4.45 శాతం పెరిగి రూ.864.40 వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి, అదానీ గ్రూప్ సంస్థలో ప్రమోటర్లు 65.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ మినీ బస్సు ఓ కంటైనర్‌ను ఢీ కొట్టిన ఘటనలో 12 మంది మరణించారు. దాదాపు 23 మంది గాయాలపాలయ్యారు. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ ఘటన జరిగింది. 35 మందితో ప్రయాణిస్తున్న మినీ బస్సు సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి ప్రయాణిస్తుండగా ముంబయికి 350 కిలోమీటర్ల దూరంలో వైజపూర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అదుపుతప్పి కంటైనర్‌ను వెనక భాగంలో ఢీకొట్టాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 5గురు పురుషులు, 6గురు మహిళలు కాగా ఓ మైనర్ బాలిక కూడా ఉంది. 23 మంది క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలిచారు. మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: భారత్‌కు చేరిన మూడో విమానం -
ఎయిర్పోర్ట్ నుంచే గోల్డ్ కంటెయినర్ ఎత్తుకెళ్లారు
అట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడాలో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా ఎయిర్పోర్ట్ నుంచే బంగారంతో కూడిన ఓ కంటెయినర్‌ను మాయం చేశారు దుండగులు. కెనడా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అందులో 14.8 మిలియన్ డాలర్ల విలువైన బంగారంతో పాటు అదనంగా విలువైన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం బంగారం, విలువైన వస్తువులతో కూడిన కంటెయినర్ టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కార్గో సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చోటుకి దీనిని తరలించారు. అక్కడి నుంచి దానిని గమ్యస్థానానికి భద్రంగా చేర్చాలని ఏర్పాట్లు చేయబోయారు. ఇంతలోనే అది మాయం అయ్యింది. ఈ కంటెయినర్ ఎవరికి చెందిందనే వివరాలను, ఎక్కడికి చేరుకోవాలనే వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర అమెరికాలో ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న భారీ దోపిడీ ఇది. అలాగే.. కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీనిని అభివర్ణిస్తున్నారు అక్కడి అధికారులు. ఐదున్నర స్క్వేర్ ఫీట్స్‌తో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ కంటెయినర్‌ను అవలీలగా ఎత్తుకెళ్లిపోగా.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అన్ని చోట్లా గాలిస్తున్నట్లు పీల్ రీజినల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్ దుయివెస్టెయిన్ ప్రకటించారు. ఇది లోకల్ గ్యాంగ్‌ల పనే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. అది ఇంకా కెనడాలోనే ఉందా? లేదా కంటెయినర్‌ను దేశం దాటించారా? అనే విషయంపైనా పోలీసులకు స్పష్టత లేకుండా పోవడం గమనార్హం. గతంలోనూ కెనడా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనలే రెండు, మూడు జరిగాయి కూడా. -
AP: నేడు కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం.. ప్రమాదాల నివారణ దీని ప్రత్యేకత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్మించిన కంటైనర్ సబ్‌స్టేషన్‌ను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్డ్ టెక్నాలజీ)తో అతి తక్కువ స్థలంలో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ కె.పద్మజనార్దనరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్‌స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఈ కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాసనగర్‌లో ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సబ్‌స్టేషన్ ట్రయల్ రన్ ఇప్పటికే విజయవంతమైంది. ఈ సబ్‌స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవున ఉంది. అందులోనే సబ్ స్టేషన్‌కు సంబంధించిన పరికరాలు అన్నింటినీ ఏర్పాటు చేశారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా ఈ కంటైనర్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. దీని నుంచి ట్రాన్‌ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తారు. పూర్తి ఆటోమేషన్ విధానంలోనే ఈ కంటైనర్ సబ్ స్టేషన్ పనిచేస్తుంది. ఈ సబ్ స్టేషన్‌తో అర్బన్ ప్రాంతాల్లో బహుళ ప్రయోజనాలున్నాయి. ఎంతో ప్రయోజనకరం గొల్లపూడి ప్రజలకు ఈ కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం «శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిషత్తులో నిరంత విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ కంటైనర్‌లో సబ్ స్టేషన్‌ను నిర్మించారు. మా ప్రాంత విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన వెంటనే స్పందించారు. కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – కారంపూడి సురేష్, మార్కెట్ యార్డు చెర్మన్ గొల్లపూడి నిర్వహణ వ్యయం తక్కువ కంటైనర్ సబ్స్టేషన్ల ద్వారా డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. దీని నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. – వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ప్రయోజనాలు ఇలా.. కంటైనర్ సబ్‌స్టేసన్‌లో సమస్య తలెత్తితే వెంటనే సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా సబ్‌స్టేషన్ పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చి సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉంది. సబ్‌స్టేషన్ లోపల ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలో అయినా సమస్య తలెత్తితే సబ్‌స్టేసన్‌లో తెలుసుకొనే వీలుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని చోట రిమోట్ లోకేషన్ నుంచి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. -
దైవదర్శనానికి వెళ్లొస్తూ..
కామారెడ్డి క్రైం: వెనుకనుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఓ కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన రామారెడ్డి బైపాస్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన పుల్లూరి మహోదర్‌రావు (55), లక్కోడి మధుసూదన్‌రెడ్డి (58), ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణారావు కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో రామారెడ్డి బైపాస్కు కొద్ది దూరంలో వీరి కారును.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న మహోదర్‌రావు, మధుసూదన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న రామకృష్ణారావు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పతికి తరలించారు. కంటైనర్‌తో డ్రైవర్ అక్కడ నుంచి పరారు కాగా.. తూప్రాన్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. మహోదర్‌రావు సీఎం కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు సమీప బంధువని తెలిసింది. -
ప్రపంచంలోని టాప్ 10 బిజీయెస్ట్ కంటైనర్ పోర్ట్‌లు (ఫోటోలు)
-
కంటైనర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్
విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలంటే దాదాపు 20 సెంట్ల స్థలం అవసరం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో.. సబ్‌స్టేషన్ కాస్తా ఓ కంటైనర్లోనే ఇమిడిపోతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. సబ్ స్టేషన్లు నిర్మించాలంటే అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కంటైనర్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల.. స్థల భారం తప్పడంతోపాటు అనేక లాభాలుంటాయని విద్యుత్‌శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడలోని గొల్లపూడి వద్ద తొలి కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాధారణంగా నౌకల్లో సరుకుల్ని తరలించేందుకు కంటైనర్లను వినియోగిస్తుంటారు. ఇటీవల కాలంలో కంటైనర్ ఇళ్లు సైతం నిర్మిస్తున్నారు. తాజాగా కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాస నగర్లో రూ.5.50 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతం కాగా.. మార్చిలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవు ఉంది. అందులోనే సబ్‌స్టేషన్‌కు సంబంధించిన పరికరాలన్నీ అమర్చారు. అత్యాధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్ ఆధారంగా ఆపరేట్ చేసేలా దీనిని నిర్మించారు. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఇది∙పనిచేస్తుంది. తిరుపతి, విశాఖపట్నంలోనూ ఈ కంటైనర్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకతలు ఇవీ.. ► సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరం. కంటైనర్ సబ్‌స్టేషన్‌కు 2నుంచి 3 సెంట్ల జాగా సరిపోతుంది. ► సాధారణ సబ్‌స్టేషన్‌కు మూడు నెలలకొకసారి నిర్వహణ తప్పనిసరి. కంటైనర్‌కు నిర్వహణ వ్యయం అవసరం లేదు. విద్యుత్ పంపిణీ సాధారణ సబ్‌స్టేషన్ కంటే మెరుగ్గా ఉంటుంది. ► అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు వీలుంటుంది. బ్రేక్ డౌన్స్ ఉండవు. ఓఎన్ఎం సిబ్బందికి పూర్తి రక్షణ ఉంటుంది. ► రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్ ప్రాంతాల్లో సైతం వీటిని నిర్మించవచ్చు. అక్కడ అవసరం లేకపోతే మరో ప్రాంతానికి తరలించవచ్చు. ► వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనిచోట శివారు ప్రాంతాల నుంచి కూడా కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. సమస్య తలెత్తితే.. సబ్‌స్టేసన్‌లో సమస్య తతెత్తితే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. వీడియో కాల్ ద్వారా పరిశీలించి తగు సూచనలు ఇచ్చి పరిష్కరించే వెసులుబాటు ఉంది. లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లు తెగిన వెంటనే ట్రిప్ అయి సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. ఏ వీధిలోనైనా సమస్య తలెత్తితే సబ్స్టేసన్లోనే ఉండి తెలుసుకునే వీలుంది. ఎంతో ప్రయోజనం కంటైనర్ సబ్స్టేషన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించాం. వీటివల్ల డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. జనావాసాల్లో స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్ సబ్స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. – జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ గొల్లపూడి ప్రాంతానికి వరం గొల్లపూడి ప్రాంత ప్రజలకు కంటైనర్ సబ్ స్టేషన్ వరం లాంటిది. ఈ ప్రాంతం అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. నూతన గృహ, వాణిజ్య సముదాయాలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్‌లో వాటికి నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకు రావడానికి కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మించారు. విద్యుత్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీ, ఉమ్మడి కృష్ణా జిల్లా -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్‌లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్‌తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్‌లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు) -
APSRTC: కార్గో కొత్త పుంతలు.. 48 గంటల్లోపే సరకు డెలివరీ
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణాలో ఏపీఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు వినియోగదారుల ఆదరణను చూరగొంటూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కార్గో సేవలను మరింత విస్తృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 48 గంటల్లోపే సరకును డెలివరీ చేస్తోంది. కంటైనర్లలో రవాణా చేయడం వల్ల సరకు పాడవకపోవడమే కాదు.. కార్గో నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండదు. ఇది వినియోగదార్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఫ్లిప్‌కార్ట్, బిర్లా వైట్, ఇతర సిమెంట్ కంపెనీలతో పాటు బిస్కెట్లు, ఆహార పదార్థాల తయారీ, కెమికల్స్ తయారీ సంస్థలతోను ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా సంస్థలు, కంపెనీల సరకును కోరుకున్న చోటకు బల్క్ ఆర్డర్లతో కంటైనర్ల (డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు–డీజీటీల) ద్వారా రవాణా చేస్తున్నారు. అలాగే ప్లైవుడ్, బియ్యం, గోధుమ పిండి, మందులు, ఆటోమొబైల్స్ విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు వంటివి ఎక్కువగా వీటిలో రవాణా అవుతున్నాయి. సరికొత్తగా హౌస్ షిఫ్టింగ్‌కు కూడా ఆర్టీసీ కంటెయినర్లను (డీజీటీలను) సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్లో 42 కంటెయినర్ డీజీటీలున్నాయి. వినియోగదార్ల ఆదరణ బాగుండడంతో ఈ సంఖ్యను మరింత పెంచనున్నారు. ఆ బస్సుల్లో టన్ను సరకుకు జాగా అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఒక టన్ను లగేజీకి సరిపడేందుకు వీలుగా జాగాను కేటాయిస్తున్నారు. వీటిలో ఒక నెల రోజుల పాటు రెగ్యులర్‌గా సరకు రవాణా చేసే వారికి తక్కువ ధరకే అంటే.. కిలోమీటరుకు రూ.3–4 చొప్పున కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇతర సంస్థల సరకు రవాణా చార్జీల కంటే ఈ ధర తక్కువ. ఆర్టీసీ సరకు రవాణాతో పాటు పార్సిల్ డెలివరీలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో పార్సిల్/కొరియర్ బుకింగ్‌లు పెరుగుతూ ఆదాయాన్ని పొందుతోంది. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ వద్ద ఉన్న పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను 24 గంటలూ తెరిచి ఉంచేలా ఆర్టీసీ అధికారులు ఇటీవల చర్యలు తీసుకున్నారు. దీనికి స్పందన బాగుండడంతో త్వరలో మద్దిలపాలెం, విజయనగరం, శ్రీకాకుళంలో 24/7 బుకింగ్ కౌంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఆదాయం అదుర్స్ ఆర్టీసీ విజయనగరం కార్గో జోన్ పరిధిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే ఈ కార్గో జోన్ ఆదాయంలో అగ్రభాగాన ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు (ఆరు నెలల్లో) పార్సిల్స్ ద్వారా రూ.6.75 కోట్లు, సరకు రవాణా (డీజీటీ) ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయానికి గత ఏడాది పార్సిల్స్ ద్వారా రూ.4.67 కోట్లు, డీజీటీతో రూ.2.14 కోట్లను పొందింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే పార్సిల్స్‌లో రూ.2.18 కోట్లు, డీజీటీలో రూ.1.14 కోట్లు పెరిగింది. ఆర్టీసీ కార్గో సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని కార్గో బుకింగ్ పాయింట్లను, కంటెయినర్ డీజీటీలను పెంచుతామని విజయనగరం జోన్ డీసీఎం కణితి వెంకట్రావు ‘సాక్షి’తో చెప్పారు. (క్లిక్ చేయండి: విశాఖ నగర అందాలను చూస్తూ షిప్లో విహారం)