పూణే-సాతార రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
ముంబై: పూణే-సాతార రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కొందరు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక ఖండాల పోలీసుల కథనం ప్రకారం సాతార నుంచి పుణే దిశగా చక్కెర సంచుల లోడుతో వస్తున్న కంటెయినర్ పార్గావ్-ఖండాల గ్రామం వద్ద అదుపు తప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై పడింది.
ఎదురుగా వస్తున్న బస్సుకు సైడు ఇచ్చేందుకు కంటెయినర్ డ్రైవర్ ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటెయినర్ కింద పడి ఎనిమిది మంది అక్కడిక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తరువాత కంటెయినర్ డ్రైవర్ పారిపోయాడు.
**