దైవదర్శనానికి వెళ్లొస్తూ..  | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వెళ్లొస్తూ.. 

Published Mon, Mar 6 2023 5:01 AM

Two died in a road accident - Sakshi

కామారెడ్డి క్రైం:   వెనుకనుంచి వేగంగా వచ్చిన కంటైనర్‌ ఓ కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన రామారెడ్డి బైపాస్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన పుల్లూరి మహోదర్‌రావు (55), లక్కోడి మధుసూదన్‌రెడ్డి (58), ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణారావు కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

తిరుగు ప్రయాణంలో రామారెడ్డి బైపాస్‌కు కొద్ది దూరంలో వీరి కారును.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కంటైనర్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న మహోదర్‌రావు, మధుసూదన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి.

డ్రైవింగ్‌ చేస్తున్న రామకృష్ణారావు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పతికి తరలించారు. కంటైనర్‌తో డ్రైవర్‌ అక్కడ నుంచి పరారు కాగా.. తూప్రాన్‌ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.  మహోదర్‌రావు సీఎం కేసీఆర్‌ బావమరిది శ్రీనివాస్‌రావు సమీప బంధువని తెలిసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement