Madhusudan Reddy
-
ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ఏర్పాటుకు చర్యలు
గుంటూరు (ఎడ్యుకేషన్): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎన్సీసీ ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఎన్సీసీ గ్రూప్ వార్షిక తనిఖీల కోసం ఆయన గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా శ్యామలానగర్‌లోని ఎన్సీసీ కార్యాలయంలో మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, విశాఖలలో ఎన్సీసీ గ్రూప్‌లు ఉన్నాయని, వీటిలో గుంటూరు ఎన్సీసీ గ్రూప్ అతి పెద్దదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా విద్యాసంస్థలు ఎన్సీసీ శిక్షణ గుర్తింపును కలిగి ఉండగా, మరో 1,600 విద్యాసంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఎన్సీసీ శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత, గౌరవం పెరుగుతాయని, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఎన్సీసీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎన్సీసీ గ్రూప్‌లను విస్తరించి, మరింత విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్సీసీ గ్రూప్ కలిగి ఉన్నట్లు కేవలం బోర్డులకే పరిమితమై, విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇవ్వని విద్యాసంస్థలకు ఎన్సీసీ గుర్తింపు రద్దు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కడప జిల్లాలోని ఎన్సీసీ గ్రూప్ అకాడమీ స్థాయిలో సేవలు అందిస్తోందన్నారు. విశాఖలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మధుసూదన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు పరిశీలన చేశామని, త్వరలోనే గవర్నర్‌తోపాటు జూన్ 4వ తేదీ తర్వాత కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో సీఎం, సీఎస్‌లను కలిసి వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో ఎన్సీసీ ప్లానింగ్ అండ్ కో–ఆర్డినేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ సంజయ్‌గుప్తా, గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్‌రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్‌లో టి.మధుసూదన్‌రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్‌రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్‌లో ఉండడంతో మధుసూదన్‌రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్‌తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్‌రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్‌రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్‌రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్‌సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్‌చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్‌రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్‌రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్‌రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం
షాద్‌నగర్ (హైదరాబాద్)/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు. డ్రైవర్ ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్‌ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు. ‘కాంగ్రెస్ సర్కార్ ఆయా.. ఏ సబ్ కా సర్కార్ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
అభివృద్ధిని అంకెలతో సహా చెబుతాం..కాదనగలరా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో అంకెలతో సహా చెబుతామని, కాదని టీడీపీ సభ్యులు నిరూపించగలరా అని ఎమ్మెల్యే కొటారు అబ్యయ్య చౌదరి సవాల్ చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం ఏ రంగంలో ఎంత మార్పు వచ్చిందో నిరూపిస్తామన్నారు. టీడీపీకి స్పీకర్‌పైన, అసెంబ్లీపైన గౌరవం లేదని, కుర్చిలపై వ్యామోహం మాత్రమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నాక ప్రతి కుర్చీ లాక్కోవాలని చూస్తున్నారన్నారు. తొడలు కొడితే కుర్చిలు రావడానికి ఇది సినిమా కాదని ఎద్దేవా చేశారు. ‘రా కదిలిరా’ అంటే జనం రావడంలేదని చెప్పారు. స్పీకర్‌పై పేపర్లు విసిరి దాడి చేయడం బాధాకరమని చెప్పారు. అబ్బ య్య చౌదరి మంగళవారం శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గిందని సాక్షాత్తు నీతి ఆయోగ్, యూఎన్డీపీ నివేదికల్లో పేర్కొనడం అభినందనీయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పేదలు – ధనవంతుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారానే పేదరికం పోతుందని నమ్మారని, అందుకే విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. అందరికీ ఆరోగ్యం అన్నది అమెరికా వంటి దేశాల్లో కూడా లేదని, కానీ ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారన్నారు. సంక్షేమాన్ని పేదల ఇంటికి చేర్చారని అన్నారు. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్నే పేదల వద్దకు తీసుకెళ్లారన్నారు. దాదాపు 550 సేవలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణంతో పాటు 53 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించారని చెప్పారు. టీడీపీ పాలన ఐదేళ్లలో కేవలం 34,108 ఉద్యోగాలిస్తే, సీఎం జగన్ 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కలి్పంచారని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో పేదల పక్షాన నిలబడిన విధానం, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారో గవర్నర్ ప్రసంగంలో వివరించారని తెలిపారు. 99 శాతం హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్‌ను అభినందించడం నిజంగా గర్వంగా ఉందన్నారు. నిజమైన నాయకుడు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారని అన్నారు. రూ.404 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్, నిర్మించామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామాజికంగా మన రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకంటే చాలా వెనుకబడి ఉన్నట్టుగా సీఎం జగన్ గుర్తించారని, ఆ పరిస్థితిని మార్చి పేదలకు అండగా నిలవాలని నవరత్నాలను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు. బాబు మోసాల రాజకీయంపై పుస్తకమే రాయొచ్చు: బియ్యపు మధుసూదన్ రెడ్డి దేవుడి లాంటి అంబేడ్కర్ గురించి మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు తట్టుకోలేక పోతున్నారని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు విజయవాడలో పైన అమ్మవారు.. కింద అంబేడ్కర్ కన్పిస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో సీఎం జగన్ చేసి చూపించారని, రెండోసారి కూడా ఆయనే సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల దీవెనలతో మళ్లీ జగన్ సీఎంగా వస్తున్నారని చెప్పారు. మోసాలతో రాజకీయాలు ఎలా చేయొచ్చో చంద్రబాబుపై ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చని చెప్పారు. చంద్రబాబులా రాజకీయాలు చేయకూడదని పాఠ్యాంశంలో చేర్చవచ్చన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేరన్నారు. సైకిల్ పోవాలి.. జగన్ మళ్లీ రావాలని అన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకున్నారా!?
సాక్షి, అమరావతి : దేశంలో ఎక్కడాలేని విధంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు నైపుణ్య శిక్షణలో కొత్తగా క్యాస్కేడింగ్ స్కిల్ ఎకో సిస్టమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తే ఈనాడు రామోజీరావు కళ్లకు గంతలు కట్టుకుని నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లల్లో అకడమిక్, నాన్ అకడమిక్ విభాగాల్లో 12,59,451 మందికి శిక్షణనిస్తే రాష్ట్రంలో ‘నైపుణ్యం ఏది.. ఎక్కడా?’.. అంటూ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించడంపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ‘సాక్షి’తో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకురావడమే కాక దానికి అనుగుణంగా స్కిల్ ఎకో సిస్టమ్‌ను అమలుచేస్తుంటే యువతను భయాందోళనకు గురిచేసే లక్ష్యంతో ఈనాడు విషాన్ని కక్కుతోందంటూ విమర్శించారు. పైగా.. మైక్రోసాఫ్ట్ సంస్థ లక్షా 60వేల మందికి శిక్షణనివ్వడమే కాక వారందరికీ సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేసిన విషయం తెలీదా అని ఆయన ప్రశ్నించారు. 192 స్కిల్ హబ్స్ ఉన్న విషయం తెలీదా? ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం ఉండే విధంగా 192 స్కిల్ హబ్స్‌ను ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఏర్పాటుచేసిన సంగతి వాస్తవం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే, ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 26 స్కిల్ కాలేజీలు ఏర్పాటుచేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే ఈనాడు రామోజీరావు పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను ప్రజలపైకి వదులుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజీలు ద్వారా 22 రంగాలకు చెందిన 100కి పైగా జాబ్రోల్స్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయిలో మొత్తం నైపుణ్య శిక్షణ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తున్నామని ఇందుకోసం తిరుపతిలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాక పనులు కూడా కొనసాగుతున్నాయని మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. వీటికి అదనంగా పులివెందులలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, పరిశ్రమల ప్రాంగణంలో స్కిల్ స్పోక్‌ను ఏర్పాటుచేశామన్నారు. జాబ్‌మేళాలూ కనిపించడంలేదా? ఇవికాక.. విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెలా 52 జాబ్ మేళాలు నిర్వహిస్తున్న విషయం కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పలు సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు వీలుగా 50కుపైగా బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే తమ నాయకుడు స్కిల్ స్కాంలో ఇరుక్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో ఈనాడు వికృత రాతలు రాస్తోందన్నారు. -
ప్రజల సంతోషాన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు
► జనసేన నాయకుడు చిలకం మధుసూదన్‌రెడ్డి సమీప బంధువైన రాజారెడ్డికి, ఈడిగ వినయ్తేజ్ గౌడ్ అనే వ్యక్తికి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలోనే రాజారెడ్డి గాయపడ్డారు. గొడవ విషయం తెలిసిన 2 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్న రూరల్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ క్షతగాత్రుడిని స్వయంగా పోలీసు వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స చేయించారు. తన ప్రాణాలు కాపాడారని బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జరిగింది ఇదయితే.. చిలకం మధుసూదన్ రెడ్డి మాత్రం కొత్త పల్లవి అందుకున్నాడు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై బురద జల్లేందుకు యత్నించాడు. ధర్మవరం: పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వ లేక నానా యాగీ చేస్తున్నారు. ప్రజల్లో ఉనికి చాటుకునేందుకు వ్యక్తిగత దూషణలకూ పాల్పడుతున్నారు. ‘చిలక’ పలుకులు.. జనం నవ్వులు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ సీటు ఆశిస్తున్న చిలకం మధుసూదన్ రెడ్డి ఎలాగైనా ప్రజలను ఆకర్షించాలని రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో అశాంతి నెలకొల్పేందుకు నానా యాగీ చేస్తున్నారు. ఎక్కడ చిన్న గొడవ జరిగినా ఎమ్మెల్యేకు ఆపాదించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల తన బంధువైన ఓ వ్యక్తి వ్యక్తిగత కారణాలతో మరో వ్యక్తితో గొడవ పడితే దాన్నీ ఎమ్మెల్యేపై రుద్దేందుకు యత్నించాడు. అయితే, వాస్తవాలు బయటకు రావడంతో జనం ఎదుట నవ్వులపాలయ్యాడు. ఇలాగే, కొన్ని రోజుల క్రితం ధర్మవరం పట్టణంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటైతే.. చిరు వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటాయంటూ రభస చేసే ప్రయత్నం చేశాడు. అయితే, కుట్ర విషయం గ్రహించి వ్యాపారులు సహకరించకపోవడంతో ఆ ప్లాన్ కూడా బెడిసికొట్టింది. అభివృద్ధితోనే సమాధానం.. ప్రతిపక్షాల కుట్రలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతున్నారు. నిత్యం ‘గుడ్‌మార్నింగ్’ పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలోనే రూ. 2,283 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయించి రికార్డు సృష్టించారు. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నిధులతో ఆర్ఓబీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, నాడు–నేడు, డబుల్‌లైన్ రహదారులు, నేషనల్ హైవే, రిజర్వాయర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు ప్రతిపక్షాలు ఎంతలా రెచ్చగొడుతున్నా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం కోల్పోకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత టీడీపీ హయాంతో పోలిస్తే నియోజకవర్గంలో నేడు గణనీయంగా తగ్గిన నేర గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు ధర్మవరం డివిజన్లో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంది. శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇటీవల పట్టణంలో రాజారెడ్డిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు సత్వరం స్పందించి ప్రాణాలు కాపాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు వినయ్తేజ్గౌడ్, విష్ణు, హరినాథ్‌తో సహా 10 మందిపై కేసు నమోదు చేశాం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నాయకులు పోలీసులు పట్టించుకోలేదని రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు. – టి. శ్రీనివాసులు, డీఎస్పీ, ధర్మవరం -
బాబూ.. మీ తమ్ముడెక్కడ ఉన్నాడో చెప్పు! ఆయనకు స్లో పాయిజన్ ఇచ్చి
సాక్షి, తిరుపతి: ‘చంద్రబాబూ.. వైఎస్సార్ కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పగలవా? ఆస్తి కోసం నారా రామ్మూర్తినాయుడుకి స్లో పాయిజన్ ఇచ్చి బయటకు రాకుండా దాచి పెట్టలేదా?’.. అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి పర్యటనలో సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి, తనపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆదివారం మీడియా సమావేశంలో మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శ్రీకాళహస్తిలో చంద్రబాబు, బొజ్జల సు«దీర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. ‘శివుడి సాక్షిగా చెబుతున్నా.. నాలుగేళ్ల అభివృద్ధి, నలభై ఏళ్లు అభివృద్ధిపై చర్చిద్దాం రండి.. దమ్ము ధైర్యం ఉంటే.. శ్రీకాళహస్తి శివయ్య సన్నిధిలో ప్రమాణం చేద్దాం’.. అని సవాల్ విసిరారు. శ్రీకాళహస్తిలో పవన్‌తో అరాచకాలు చేయించాలని బాబు కుట్రచేశాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకున్న బాబే బాలాజీ రిజర్వాయర్ ముందు సెల్ఫీ దిగుతున్నారని ఆరోపించారు. కిమ్ లాంటి వాడు చంద్రబాబు తనకు ప్రత్యర్థి ఉండకూడదని తన అంకుల్ని, సోదరుడ్ని కిమ్ చంపితే.. సీఎం పదవి, పార్టీని లాక్కునేందుకు పిల్లనిచి్చన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూడా కిమ్ లాంటి వాడేనని బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ప్రాచుర్యం పొందిన వంద పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ మధుసూదనరెడ్డి తెలిపారు. జిల్లాలోని అరకు, మారేడుమిల్లి, రంపచోడవరం, గుడిసె, చింతపల్లి తదితర ప్రాంతాలను ఆయన బుధవారం సందర్శించారు. స్థానిక అటవీక్షేత్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యవంతమైన కాటేజీలు, ట్రెక్కింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీల సేవలు ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పర్యాటక ప్రదేశాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పెద్ద పులుల స్థావరంగా నల్లమల: శ్రీశైలం ప్రాజెక్టు పరిసరాల్లో నల్లమల అడవులు పెద్ద పులుల స్థావరంగా మారిందని చెప్పారు. గతంలో ఇక్కడ 45 పులులు మాత్రమే ఉండగా, ఇప్పుడు వీటి సంఖ్య 75కు పెరిగిందన్నారు. పాపికొండల ఏరియాలో గతంలో రెండు పులులు ఉండగా, ప్రస్తుతం మరో రెండు పులులు చేరాయన్నారు. మారేడుమిల్లి, రంపచోడవరం తదితర అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారం బాగా పెరిగిందని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. స్క్వాడ్ డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి, స్థానిక ఫారెస్ట్ రేంజర్ అబ్బాయిదొర పాల్గొన్నారు. -
లైఫ్‌స్టైల్ గ్రూప్ డైరెక్టర్ ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా మూడోరోజూ ఐటీ దాడులు కొనసాగాయి. అయితే శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మర్రి జనార్ధన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు లైఫ్‌స్టైల్ గ్రూప్ కంపెనీల డైరెక్టర్ గజ్జల మధుసూదన్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం నాటి సోదాల్లో మొత్తం 70 బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మధుసూదన్‌రెడ్డి చేసిన భూ లావాదేవీలు, ఇందుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారా లపై ఐటీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎల్బీనగర్లో 23 ఎకరాల ప్రాజెక్ట్ విషయంలో జరిగిన భారీ నగదు లావాదేవీపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మధుసూధన్ రెడ్డితో పాటు అతడి భార్య, కుమారుడిని సైతం ప్రశ్నించినట్టు తెలిసింది. లైఫ్‌స్టైల్ గ్రూప్ కంపెనీల్లో మధుసూదన్‌రెడ్డి కుమారుడు సుదేశ్రెడ్డి ౖడైరెక్టర్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి వీరంతా సిండికేట్‌గా రియల్ ఎస్టేట్ వ్యా పారాలు చేస్తున్నట్టు లభించిన ఆధారాల మేరకు సోదాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇలావుండ గా వైష్ణవి గ్రూప్ స్థిరాస్థి సంస్థ, హోటల్ ఎట్ హోం, వాటి అనుబంధ సంస్థల్లోనూ ఐటీ సోదా లు జరిగాయి. మరోవైపు ఐటీ అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేని చూపించాలని అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆయన బాల్కనీలోకి వచ్చి కా ర్యకర్తలకు అభివాదం చేశారు. ఇంటి వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
దైవదర్శనానికి వెళ్లొస్తూ..
కామారెడ్డి క్రైం: వెనుకనుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఓ కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన రామారెడ్డి బైపాస్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కరీంనగర్‌కు చెందిన పుల్లూరి మహోదర్‌రావు (55), లక్కోడి మధుసూదన్‌రెడ్డి (58), ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణారావు కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో రామారెడ్డి బైపాస్కు కొద్ది దూరంలో వీరి కారును.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న మహోదర్‌రావు, మధుసూదన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న రామకృష్ణారావు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆస్పతికి తరలించారు. కంటైనర్‌తో డ్రైవర్ అక్కడ నుంచి పరారు కాగా.. తూప్రాన్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. మహోదర్‌రావు సీఎం కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు సమీప బంధువని తెలిసింది. -
ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కేతిరెడ్డి
-
చంద్రబాబు, పవన్ పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదిరిపోయే పంచులు
-
శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పుట్టినరోజు వారోత్సవాలు
-
లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి నివాసంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మలక్‌పేటలోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, వికారాబాద్ సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు మధుసూదన్‌రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకూ జరిపిన సోదాల్లో సుమారు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకూ సోదాలు కొనసాగనున్నాయి. మరోవైపు వికారాబాద్‌లో న్యాయవాది సుధాకర్ రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు జరుపుతోంది. -
వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్న వయస్సులోనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇది గొప్ప విషయమని, ఈ చట్టం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కేటాయించడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. మనస్సాక్షి లేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తన హయాంలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని విమర్శించారు. ఈ బిల్లులోని నిబంధనలు ఉల్లంఘించినవారిపై పెనాల్టీ విధించేలా చట్టంలో చేర్చాలని కోరారు. ఈ బిల్లు అమలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశముండాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు సబ్సిడీ అందించాలని కోరారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలతో నిరుద్యోగ యువత వలసలు ఇకపై ఉండబోవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. పేదలపై సీఎం వైఎస్ జగన్‌కసు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. లక్షలాది ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, చంద్రబాబు చేసిన తప్పులు యువతకు శాపంగా మారాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం మంచి నిర్ణయమని కొనియాడారు. ప్రజలకు మేలు చేసే మంచి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నా.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. -
ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రపతి మెడల్
సాక్షి, న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన (మెరిటోరియస్) పోలీసులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఏసీబీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం దక్కింది. మరో 13 మందిని ప్రతిభా పురస్కారాలు వరించాయి. పతకాలకు ఎంపికైన అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట, 15 మందికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి స్పెషల్ ఇంటెలిజెన్స్(బీఆర్ఏ) ఎస్పీ అడ్డాలవెంకటరత్నం, విశాఖ డీఎస్పీ కె.వెంకటరామకృష్ణప్రసాద్లను రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి. తెలంగాణ నుంచి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన వారు.. ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ, సంగారెడ్డి; ఎం.నారాయణ, ఏఐజీ శాంతిభద్రతలు; సంగిపాగి ఫ్రాన్సిస్, అస్సాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్; బి.రామ్‌ప్రకాశ్, కమాండెంట్ టీఎస్ఎస్పీ, ఖమ్మం; ఇ.రామచంద్రారెడ్డి, ఎస్పీ ఎన్సీ, రాచకొండ; డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ, కొత్తగూడెం; ఎస్. ప్రభాకర్‌రావు, డీఎస్పీ, (ఫింగర్‌ప్రింట్స్); వి.సూర్యచంద్ర రావు, డీఎస్పీ, ఎస్సీఆర్బీ; ఖాజా మొయినుద్దీన్, ఎస్ఐ, హైదరాబాద్; సయ్యద్ మక్బూల్ పాషా, ఎస్ఐ, వరంగల్; మహ్మద్ ఆలీఖాన్ ముక్తార్, ఏఆర్ఎస్ఐ, హైదరాబాద్; జి.లక్ష్మీనరసింహారావు, హెడ్‌కానిస్టేబుల్, హైదరాబాద్; మహ్మద్ అజీజుద్దీన్, హెడ్‌కానిస్టేబుల్, ఏసీబీ వరంగల్. ఏపీ నుంచి ప్రతిభా పురస్కారాల గ్రహీతలు.. ఎస్.హరికృష్ణ, ఎస్పీ ఇంటెలిజెన్స్, విజయవాడ; వి.సత్తిరాజు, డీఎస్పీ (ఏఆర్), రాజమహేంద్రవరం; కేఎస్.వినోద్‌కుమార్, డీఎస్పీ, కర్నూలు; కె.జనార్దననాయుడు, డీఎస్పీ, ఇంటెలిజెన్స్, తిరుపతి; పి.మోహన్ ప్రసాద్, అదనపు కమాండెంట్, విశాఖపట్నం; పి.కిరణ్‌కుమార్, అస్సాల్ కమాండర్ గ్రేహౌండ్స్, హైదరాబాద్; వి.వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీఐ సెల్, విజయవాడ; బి.రాజశేఖర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పీటీసీ), ఒంగోలు; ఎం.వెంకటగణేశ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏసీబీ, విశాఖపట్నం; ఎన్.గుణశేఖర్, ఎస్ఐ, రోడ్ సేఫ్టీ, బంగారుపాళ్యం; షేక్ ముస్తాక్ అహ్మద్ బాషా, ఏఆర్ఎస్ఐ ఎస్ఏఆర్ సీపీఎల్, హైదరాబాద్; జి.వెంకటరామారావు, హెడ్‌కానిస్టేబుల్, విశాఖపట్నం; గోపిశెట్టి సుబ్బారావు, హెడ్‌కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్, విజయవాడ; వై.వీరవెంకట సత్యసాయిప్రకాశ్, హెడ్‌కానిస్టేబుల్, పోరంకి; జి.వెంకటేశ్వరరావు, రైల్వే పోలీస్ కానిస్టేబుల్, విజయవాడ. తెలంగాణ నుంచి జైళ్ల శాఖలో ముగ్గురికి.. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైళ్ల శాఖ అధికారులకు కేంద్రం ‘కరెక్షనల్ సర్వీస్ మెడల్స్’ ప్రకటించింది. తెలంగాణ నుంచి ముగ్గురు.. ఏపీ నుంచి ముగ్గురు అధికారులను పతకాలు వరించాయి. తెలంగాణ నుంచి చీఫ్ హెడ్ వార్డర్లు ఎస్.వెంకటేశ్వర్లు (మహబూబాబాద్), జి.ముక్తేశ్వర్ (రిటైర్డ్, నల్లగొండ), సయ్యద్ ఖాజాపాషా (చర్లపల్లి)లకు పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి సబ్‌జైలు హెడ్‌వార్డర్ వేమూరి వెంకటకోటి వీరదుర్గాప్రసాద్కు విశిష్ట సేవా పతకం లభించింది. ఏపీ నుంచి జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్ధన్‌కు, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ గంగ సాయిరామ్ ప్రకాశ్లకు ప్రతిభా పురస్కారాలు వరించాయి. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిక
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ఇనగలూరు గ్రామంలో శుక్రవారం వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. ఇనగలూరు గ్రామంలో యువ వ్యాపారవేత్త మల్లంపల్లి శివకుమార్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేసి 127 మంది అనుచరులతో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ముఖ్యుల్లో మల్లంపల్లి ప్రభాకర్‌రెడ్డి, మల్లంపల్లి ఈశ్వర్‌రెడ్డి, మల్లంపల్లి సుబ్బరామిరెడ్డి, దూడల అనీల్‌రెడ్డి, జడపల్లి వెంకటముని, సుబ్బరాయలు, రాఘవులు, దేవరాజులరాయల్ కుటుంబీకులు, ఆంజనేయపురానికి చెందిన సుబ్బరాయలు చంద్ర, శేషయ్య, వాసు, శ్రీను, రాజేష్, రవి ఉన్నారు. మాజీ సర్పంచ్ నేతృత్వంలో... బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్, బీసీ టీడీపీ మండల సీనియర్ నాయకుడు పులికొండ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 82 మంది అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో ప్రముఖులు చిన్నయ్య, చెంచురమణయ్య, చింతయ్య, సురేష్, పొండయ్య, కృష్ణమూర్తి, వెంకటమునిలక్ష్మయ్య, పెంచలయ్య, చిన్నబ్బయ్య, చెంచుకృష్ణ, వెంకటయ్య, చిరంజీవి, మూగయ్య, శేషాధ్రి తదితరులు ఉన్నారు. పాతగుంట గ్రామానికి చెందిన మనవాసి శ్రీనివాసులు యాదవ్, భీమవరం గ్రామానికి చెందిన చెరుకూరు చిన్నంనాయుడు అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ ఆధిపత్యానికి ఇక చెక్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇనగలూరు గ్రామం ఆ పార్టీకి కంచుకోట. ఇక్కడ ఉన్న నాయకుడు మంత్రికి సమీప బంధువు కావటమేగాక తిరుగులేని ఆధిపత్యం చలాయించేవారు. ఎన్నికల సమయంలో ఇక్కడ వేరే పార్టీకి ఏజెంట్‌ను పెట్టాలన్నా దొరికేవారు కాదు. దీనికి చెక్ పెట్టాలనుకుని యువతంతా ఏకమై వైఎస్సార్సీపీలో చేరారు. -
నకిలీబాబా శివ రిమాండ్
లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డిని మోసం చేసిన కేసు హైదరాబాద్: పూజల పేరుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డిని మోసం చేసి రూ.1.33 కోట్లతో ఉడాయించి అరెస్ట్ అయిన నకిలీ బాబా బుడ్డప్పగారి శివ(34)ను బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. శివకు సహకరించిన మరో ఇద్దరు నిందితులు ఈగ దామోదర్(44), గడప శ్రీనివాస్‌రెడ్డి(41)లను కూడా రిమాండ్‌కు తరలించారు. వీరందరినీ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి చంచల్‌గూడ జైలుకు తరలించారు. నింది తులు ఈ నెల 15న బంజారాహిల్స్ రోడ్‌నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే ప్రముఖ వ్యాపారి గజ్జెల మధుసూదన్‌రెడ్డి అలియాస్ లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి నివాసంలో లక్ష్మీపూజ చేస్తే రెట్టింపు డబ్బులవుతాయంటూ పూజల్లో రూ.1.33 కోట్ల నగదు కట్టలు పెట్టించి.. ఆయన కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించారు. 17న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు, అతడికి సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేశారు. బెంగళూరు శివారుల్లో ‘విల్లా’ కోసమే! సాక్షి, హైదరాబాద్: బెంగళూరు శివారు ప్రాంతంలో ఓ పెద్ద విల్లాను కొనుగోలు చేయడమే లక్ష్యంగా బుడ్డప్పగారి శివ భారీ మోసాలకు తెర తీశాడని పోలీసు విచారణలో వెల్లడైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన శివ...తన ఊరికి దగ్గర్లో ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు నగర శివారుల్లో భారీ విల్లాను కొనుగోలు చేసి సెటిల్ అవుదామనుకుని గత ఏడేళ్లలో రూ.4.25 కోట్లకుపైగా మోసాలు చేసిన శివ.. లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి ఉదంతంలో పోలీసులకు దొరికిపోవడంతో ఆ కోరికకు బ్రేక్ పడినట్టైంది. నిందితుడు ప్రస్తుతం కుటుంబంతో బెంగళూరు శివారు సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లే అవుట్లో ఓ అద్దె గదిలో ఉంటున్నట్టు పోలీసు విచారణలో వెల్లడించాడు. అయితే తాను అనుకున్న ప్రకారం మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదును తీసుకుని దేవాలయాల చుట్టూ కారులో తిప్పేందుకు ఓకే అనడంతో పెద్ద ముప్పే తప్పినట్టైంది. లేకపోతే మత్తుమందు ఎక్కువ డోస్‌లో ఇచ్చి చంపాలనుకుని ప్లాన్ చేసినట్టు సమాచారం. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సోమవారం జరగనుంది. -
ఆ కుటుంబాన్ని చంపాలనుకున్నా: బురిడీ బాబా
డబ్బు కోసం తాను మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని చంపాలనుకున్నానని బురిడీ బాబా శివ వెల్లడించాడు. బంజారాహిల్స్ పోలీసుల విచారణలో అతడీ విషయం చెప్పాడు. తనకు శ్రీనివాసరెడ్డి, దామోదర్ సహకరించినట్లు తెలిపాడు. పూజలో పెట్టిన రూ. 1.30 కోట్లను పది కోట్ల రూపాయలుగా చేస్తానని వాళ్లను నమ్మించానన్నాడు. మధుసూదన్ రెడ్డిని తనకు మొదట్లో పరిచయం చేసిన మోహన్‌రెడ్డి.. తన వద్ద రూ. 20 వేలు తీసుకున్నాడని చెప్పాడు. రైస్ పుల్లింగ్, డబ్బును డబుల్ చేయడం, బ్లాక్ మ్యాజిక్ పేర్లతో తాను ఇన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించాడు. దొంగబాబా శివను ఐదురోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును బంజారాహిల్స్ పోలీసులు కోరారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
బురిడీ బాబా.. ముగ్గురు దొంగలు!
- శివ, మరో ఇద్దరు అరెస్ట్..పరారీలో మరో నిందితుడు - రూ.1.19 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని గోల్ఫ్ కోర్టులో మొదటి పూజ.. రూ.లక్షను రూ.2 లక్షలు చేసేశాడు.. బాబాపై మధుసూదన్‌రెడ్డికి నమ్మకం కుదిరింది.. ఆ నమ్మకాన్నే సొమ్ము చేసుకుందామనుకున్నాడు దొంగబాబా.. ‘డబుల్’ ఆశ చూపి ఏకంగా 1.33 కోట్లతో ఉడాయించాడు.. ఈ ఘరానా మోసానికి పాల్పడిన బురిడీ బాబా శివానందస్వామి అలియాస్ శివ 24 గంటల్లోనే బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. ఈ మోసంలో శివకు సహకరించిన మరో ఇద్దరిని పట్టుకున్నామని, ఇంకో నిందితుడు పరారీలో ఉన్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి, అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డిలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బురిడీ బాబా మోసానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 1616 నాటి కాయిన్ ఉందంటూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డికి తన స్నేహితుడు మోహన్‌రెడ్డి ద్వారా శివ పరిచయమయ్యాడు. వరంగల్, కరీంనగర్‌కు చెందిన రియల్టర్లు దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలు కూడా మోహన్ ద్వారా శివకు పరిచయమయ్యారు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను ఏడాదిన్నర క్రితం మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి కలిశారు. అక్కడ ఓ గోల్ఫ్ కోర్ట్‌లో ‘ప్రత్యేక లక్ష్మీ పూజ’ చేసిన శివ... మధుసూదన్‌రెడ్డి తీసుకువచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలుగా చేసి చూపాడు. ఇందుకు దక్షిణ మినహా అదనంగా పైసా కూడా తీసుకోకపోవడంతో మధుసూదన్‌రెడ్డికి బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇటీవల మధుసూదన్‌రెడ్డిని సంప్రదించిన శివ... తన వద్ద 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే ఇరిడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని నమ్మించాడు. ఈ కాయిన్‌తో పాటు డబ్బునూ రెట్టింపు చేయడం కోసం ఇంట్లో పూజ చేద్దామని చెప్పాడు. అందుకు బుధవారం ముహూర్తంగా నిర్ణయించిన శివ మంగళవారమే నగరానికి చేరుకొని ఓహిరీస్ హోటల్లో బస చేశాడు. డబ్బాలో నాణెం ఉందని నమ్మించి.. పూజ సమయంలో రైస్‌పుల్లింగ్ కాయిన్ చూపించమని మధుసూదన్‌రెడ్డి శివను కోరాడు. పకడ్బందీగా పార్శిల్ చేసిన ఓ డబ్బాను చూపించిన శివ.. కాయిన్ అందులోనే ఉందని నమ్మించి పూజలో పెట్టాడు. దాని విక్రయానికి సంబంధించి ఓ నకిలీ అగ్రిమెంట్ డాక్యుమెంట్‌ను చూపాడు. పూజయ్యే సమయానికీ శివస్వామి చెప్పినట్లు రూ.1.33 కోట్లు రూ.10 కోట్లు కాకపోవడంతో మధుసూదన్‌రెడ్డి కుటుంబంలో ఉత్కంఠ పెరిగింది. దీంతో ఉమ్మెత్త గింజలు, సీసం కలిపిన ‘ప్రసాదం’ పెట్టిన శివ.. కొన్ని దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలంటూ భార్యాభర్తల్ని వదిలి వారి కుమారుడిని తీసుకుని వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఓహిరీస్ హోటల్‌కు రావడం, నగదు ఉన్న బ్యాగ్‌ను తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చుకోవడం చేసేశాడు. ఆపై మధుసూదన్‌రెడ్డి కుమారుడిని ఏమార్చి తన ట్యాక్సీలో ఉడాయించాడు. దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలను జీవీకే మాల్ దగ్గరకు పిలిచి రూ.12 లక్షలు ఇచ్చాడు. అక్కడ్నుంచి తన ట్యాక్సీ వదిలి ఆటోలో ఆరామ్‌ఘర్ చౌరస్తాకు వెళ్లిన శివ.. బ్యాగులు కొని డబ్బు వాటిలో సర్దుకుని బస్సులో బెంగళూరు పారిపోయాడు. పూజలో పెట్టింది ఎంత? శివను విచారించిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి రూ.1.19 కోట్లు నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మోహన్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం పూజలో ఉంచింది రూ.1.33 కోట్లు కాగా.. శివ మాత్రం ఆ మొత్తం రూ.1.28 కోట్లని పోలీసులకు చెప్పాడు. తదుపరి విచారణలో పూర్తి నిజాలు తెలుస్తాయని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మధుసూదన్‌రెడ్డి అత్యాశే ఈ మోసానికి కారణంగా కనిపిస్తోందని, ఇతర వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు రూ.1.33 కోట్ల ఈ మోసం వెలుగుచూడగానే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసుల్ని సంప్రదించారు. ప్రస్తుతం తాము స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టుకు అప్పగిస్తామని, ఐటీ అధికారులు న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటారని కమిషనర్ తెలిపారు. దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిల నుంచి మరికొంత మొత్తం రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. డబ్బుతో మూడు గుళ్లు తిప్పించాడు మధుసూదన్‌రెడ్డి తనయుడు సందేశ్రెడ్డి హైదరాబాద్: ఇంట్లో వాస్తుపూజ కోసమే శివానంద బాబాను తన తండ్రి పిలిపించారని లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డి తనయుడు సందేశ్రెడ్డి తెలిపారు. అయితే వాస్తుపూజతోపాటు లక్ష్మీపూజ చేస్తే దోష నివారణతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరుతాయని బాబా చెప్పడంతో తన తండ్రి అంగీకరించారన్నారు. శుక్రవారం ఆయన అపోలో ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంట్లో ఉన్న నగదు అంతా పూజలో పెడితే రెండింతలవుతుందని నమ్మించాడు. దీంతో డబ్బును బ్యాగులో సర్ది పూజలో దేవుడి ముందుంచారు. పూజ తర్వాత మత్తుమందు కలిపిన చక్కెర పొంగలి ఇచ్చాడు. దీంతో అమ్మానాన్న సృ్పహ కోల్పోయారు. అప్పుడే వచ్చిన నాకు కూడా ప్రసాదం ఇవ్వడంతో ఏం చేస్తున్నానో తెలియలేదు. పూజ తర్వాత డబ్బుతో మూడు ఆలయాలు తిప్పించాడు. హోటల్‌కు వెళ్లిన తర్వాత ధ్యానం చేయమని చెప్పి, అంతలోనే కిందకు వెళ్లి కారు లోంచి నగదు బ్యాగును అతడి కారులోకి పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్దామని చెప్పి కొద్ది దూరం వరకు నన్ను అనుసరించి ఆ తర్వాత మాయమయ్యాడు’’ అని వెల్లడించారు. తాను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, ఇలాంటివి ఒక్కోసారి నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు. హ్యారీపోటర్ పుస్తకాన్నీ వదల్లేదు తొలుత తనకు రూ.1.5 లక్షలు ఇస్తే పూజ తర్వాత ఆ మొత్తానికి మూడు నాలుగు రెట్లు ఇస్తానని దామోదర్, శ్రీనివాస్‌రెడ్డిలకు శివ చెప్పాడు. దీంతో వీరిద్దరూ హోటల్‌కు వెళ్లి ఆ మొత్తం అందించారు. మోహన్‌రెడ్డి కూడా హోటల్‌కు వచ్చి శివకు ఖర్చుల కోసం రూ.70 వేలు ఇచ్చి వెళ్లాడు. బుధవారం ఉదయం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ... ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్ని ఉంచాడు. అదేమంటే మహిమలకు అతడు ప్రతీక అంటూ మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని నమ్మించాడు. పూజలో మధుసూదన్‌రెడ్డి తొలుత రూ.1.5 లక్షలు ఉంచగా.. కొద్దిసేపటికే చాకచక్యంతో దామోదర్, శ్రీనివాస్‌రెడ్డి నుంచి తీసుకున్న రూ.1.5 లక్షలు జోడించి ‘రెట్టింపు’ చేశాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి రెండో దశ పూజలో ఏకంగా రూ.1.33 కోట్లు కుమ్మరించాడు. -
గురువుతో కలిసే తొలి బురిడీ!
కేపీహెచ్బీలో తొలిసారి నకిలీ బాబా శివ మోసం ఇప్పటికి ఆరుసార్లు అరెస్టు, మూడింట్లో వాంటెడ్ నాలుగు ఠాణాల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు ఏడేళ్లలో రూ.4.25 కోట్లకు పైగా మోసాలు సిటీబ్యూరో: ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డిని ‘రెట్టింపు’, ‘రైస్‌పుల్లింగ్ కాయిన్’ పేర్లతో బురిడీ కొట్టించిన బుడ్డప్పగారి శివ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగర పోలీసులు ఇతడితో పాటు సహకరించిన దామోదర్, శ్రీనివాసరెడ్డిల్నీ శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ‘తొలి పూజ’ను తన గురువుతో కలిసే చేసినట్లు వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి రమణ విద్యుత్ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందారు. 1996లో ఇంటర్నీడియట్ చదువును మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి బెంగళూరు చేరాడు. ఉద్యోగం... ఏజెన్సీ... ‘ఆశ్రమావతారం’... బెంగళూరులో రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతడి ద్వారా శివ శాంతి సాగర్ హోటల్లో ఉద్యోగంలో చేరాడు. ఆపై అక్కడి తిప్పసముద్రం ప్రాంతంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా విద్యుత్, పారిశుద్ధ్య కార్మికుల్ని పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకూ ఈ పనీ మానేసిన శివ బెంగళూరులోని శివ సాయిబాబ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. అక్కడ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పేడులో ఉన్న మరో ఆశ్రమానికి వచ్చినా... మళ్లీ పాత ఆశ్రమానికే చేరాడు. కొన్నాళ్లు అక్కడ పని చేసిన తర్వాత తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి హ్యూమన్ బాడీ లాంగ్వేజ్, ఆయుర్వేద వైద్యం అంశాలు నేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఇతరులకు మత్తు ఇవ్వచ్చనే విషయం తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ శివ సాయిబాబ ఆశ్రమానికే చేరాడు. గురువుతో కలిసి కేపీహెచ్బీలో పంజా.... ఈ ఆశ్రమంలో శివకు అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే లక్ష్మీ పూజలతో నగదు రెట్టింపు, అష్టదిగ్భంధనమంటూ మోసం చేయడం ఎలానో నేర్చుకున్నాడు. ఆపై 2009లో ఈ గురువుతోనే కలిసి నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశారు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చమ్రాజ్నగర్లో రూ.10 లక్షలు పట్టుకుపోయాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ ఆపై తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. శివ తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, తంతు ముగిసే సమయానికి ఆ మొత్తం రెట్టింపు అవుతుం దని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచి న నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. ఆపై రెట్టింపు మొత్తాన్ని భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఆపై ఈ బురిడీ బాబా అసలు కథ ప్రారంభించి అందినకాడికి దండుకుంటాడు. రెండు నెలల నుంచీ ప్రిపరేషన్... ఏడాదిన్నరగా ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డితో పరిచయం కొనసాగిస్తున్న, గతంలోనే రూ.లక్ష ‘లాభం’ చేకూర్చిన శివ రెండు నెలల క్రితమే ‘ముగ్గులో దించేందుకు’ పథకం వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అన్నీ ‘కొత్తవి’ సిద్ధం చేసుకున్నాడు. రెండు నెలల క్రితమే బెంగళూరు శివార్లలోని సజ్జాపురంలో ఉన్న పిల్లారెడ్డి లేఔట్లో కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ‘ఆపరేషన్ మధుసూదన్‌రెడ్డి’ తర్వాత ఇక్కడే తలదాచుకోవాలనే ఉద్దేశంతో ఈ చిరునామా తన స్నేహితులు, బంధువులు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. సిమ్‌కార్డులు, ఫోన్లు సైతం కొత్తగా ఖరీదు చేసి పక్కా పథకం ప్రకారం రంగంలోకి దిగాడు. బుధవారం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ‘పూజ’ తర్వాత ఆయన కుమారుడితో పాటు రూ.1.33 కోట్ల నగదునూ తీసుకుని దేవాలయాలకు తిప్పాడు. అప్పటికే ‘ఉమ్మెత్త మత్తు’లో ఉన్న మధుసూదన్‌రెడ్డి కుమారుడిని చేతులు కడుక్కోవాలంటూ బస చేసిన ఓరిస్ హోటల్లోని తన గదికి తీసుకువచ్చాడు. ‘ధ్యాన’మంటూ తాళాలు కాజేశాడు... ఆ సమయంలో డబ్బుతో కూడిన సంచి మధుసూదన్‌రెడ్డి కుమారుడి కారు డిక్కీలో, కారు తాళం ఆయన దగ్గరే ఉంది. ఇక్కడా బురిడీ స్వామి తెలివిగానే వ్యవహరించాడు. డబ్బు రెట్టింపు కావడానికి ధ్యానం చేయాల్సి ఉందంటూ మధుసూదన్‌రెడ్డి కుమారుడికి చెప్పాడు. గదిలో ధ్యానంలో కూర్చునే ముందు నీ దగ్గర ఎలాంటి లోహపు వస్తువులూ ఉండకూడదు అంటూ చెప్పి కారు తాళాలతో సహా అన్నీ పక్కన పెట్టిం చాడు. ఆపై చాకచక్యంగా కారు తాళాలు తీసుకుని పార్కింగ్‌లోకి వెళ్లిన శివ... నగదు సంచిని తాను వచ్చిన ట్యాక్సీలోకి మార్చేసి తాళాలు యథాస్థానంలో ఉంచేశాడు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్‌రెడ్డి కుమారుడు ఇంటికి చేరుకునే వరకు డిక్కీలోని నగదు పోయిన విషయం గుర్తించలేదు. ఏడేళ్లల్లో రూ.4.25 కోట్ల మోసాలు.... బురిడీ బాబా శివ 2009 నుంచి ఇప్పటి వరకు 10 ఉదంతాల్లో రూ.4.25 కోట్ల మేర స్వాహాలకు పాల్పడ్డాడు. మధుసూదన్‌రెడ్డి కేసుతో సహా రూ.2.05 కోట్లకు సంబంధించి బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టయ్యాడు. రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్‌లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ఈ ఘరానా నేరగాాడిపై రాజంపేట, నెల్లూరు, కుంబులుగుడ్డు, కేపీహెచ్పీ ఠాణాల్లో నాలుగు నాన్-బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నాయి. వెలుగులోకి రావాల్సిన మోసాలు మరిన్ని ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఈ అంశాలపై దృష్టి పెట్టనున్నారు. -
రూ. 1.30 కోట్లను శివ ఎలా కొట్టేశాడంటే..!
బురిడీ బాబా శివను పిలిపించి, తన ఇంట్లో పూజ చేయించినది లైఫ్‌స్టైల్ భవన యజమాని మధుసూదన్ రెడ్డేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శివతో పాటు ఈ కేసులో అరెస్టుచేసిన మరో ఇద్దరిని మీడియా ముందు శుక్రవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. మోహన్ రెడ్డి అనే మరో వ్యక్తికి కూడా ఈ కేసులో సంబంధం ఉందని, అసలు అతడే తొలుత శివను మధుసూదన్ రెడ్డికి పరిచయం చేసి, అతడికి అతీంద్రియ శక్తులు ఉన్నట్లు చెప్పాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో గాలిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో బెంగళూరు గోల్ఫ్ క్లబ్బులో కలిసినప్పుడు శివ లక్ష రూపాయలను రెండు లక్షలుగా చేసినట్లు మభ్యపెట్టి మధుసూదన్ రెడ్డిని నమ్మించాడన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఘటన ఇలా జరిగింది... బెంగళూరు గోల్ఫ్ క్లబ్ ఘటన తర్వాత నుంచి ఇద్దరి పరిచయం కొనసాగింది. లక్ష్మీపూజ ద్వారా డబ్బును డబుల్ చేస్తానని, రైస్ పుల్లింగ్ కాయిన్ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ చెప్పాడు. దాంతో బాగా నమ్మిన మధుసూదన్ రెడ్డి తన ఇంట్లో పూజ చేయించుకోడానికి 14వ తేదీన బెంగళూరు నుంచి టాక్సీ బుక్ చేసి అక్కడి నుంచి శివను రప్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఓహ్రీ హోటల్లో రూం బుక్ చేశారు. మధుసూదన్ రెడ్డికి తెలియకుండానే మరో ఇద్దరు రంగప్రవేశం చేశారు. దామోదర్, శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరూ 1.75 లక్షలు తెచ్చి శివకు ఇచ్చారు. పూజ తర్వాత వాళ్లకు 3 నుంచి 4 రెట్లు డబ్బు ఇస్తానని శివ వారికి చెప్పాడు. వాళ్లిద్దరూ కూడా ఓహ్రీస్ హోటల్లోనే రూం తీసుకున్నారు. 14వ తేదీన మధుసూదన్ రెడ్డి శివను తీసుకుని, ఎంజే మార్కెట్లో పూజ సామగ్రి తీసుకుని, అక్కడి నుంచి ఉదయం 10.30 -11 గంటల మధ్యలో ఇంటికి తీసుకెళ్లారు. ముందుగా పూజలో 1.5 లక్షలు పెట్టించాడు. దానికి దామోదర్, శ్రీనివాసరెడ్డి ఇచ్చిన డబ్బును కలిపి, 3 లక్షలుగా చూపించాడు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు పెడితే చాలా రెట్లు అవుతుందని చెప్పాడు. దాంతో, ఈ పూజ కోసమే తాను తెప్పించిన రూ. 1.30 కోట్లను మధుసూదన్ రెడ్డి పూలరేకుల వద్ద పెట్టారు. పూజ మధ్యాహ్నం వరకు కొనసాగినా డబ్బు మాత్రం రెట్టింపు కాలేదు. దాంతో మరో పూజ చేయాల్సి ఉంటుందని, ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని, దగ్గరలోని ఆలయానికి డబ్బు తీసుకెళ్లి పూజ చేయాలన్నాడు. బయటకు వెళ్లేముందు మధు సూదన్ రెడ్డికి, ఆయన భార్యకు, కుమారుడు సందేశ్ రెడ్డికి అక్కడ తాను తయారుచేసిన ప్రసాదాన్ని పంచాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఉమ్మెత్త ఆకులు, సీసం లాంటి పదార్థాలతో దాన్ని తయారుచేశాడు. దంపతులను ఇంట్లోనే ఉంచి, కేవలం సందేశ్‌రెడ్డిని మాత్రం తనవెంట తీసుకెళ్లాడు. అక్కడ పూజ చేసిన తర్వాత తన చేతులు కడుక్కోవాలని అతడిని హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. వాళ్లిద్దరూ పైకి వెళ్లినప్పుడు సందేశ్ రెడ్డి కారు లాక్ చేశారు. పైకి వెళ్లిన తర్వాత డబ్బు ఎలా తీసుకోవాలన్న ఆలోచనతో.. కాసేపు మెడిటేషన్ చేద్దాం, అందుకోసం మెటల్ వస్తువులు ఏమైనా ఉంటే అన్నీ తీసి పక్కన పెట్టాలన్నాడు. దాంతో సందేశ్ రెడ్డి కారు తాళాలు, ఫోను, ఇతర వస్తువులన్నీ పక్కన పెట్టారు. కాస్త మగతగా ఉన్న అతడిని ఏమార్చి కారు తాళాలు తీసుకుని, నేరుగా కిందకు వచ్చి కారులో ఉన్న రూ. 1.30 కోట్ల మొత్తాన్ని టాక్సీలోకి మార్చేశాడు. తర్వాత కారు తీసుకుని సందేశ్ రెడ్డి వెళ్లిపోయారు. కాసేపటికి శివ పైకి వెళ్లి గది ఖాళీ చేసి టాక్సీ ఎక్కి, వేరే వైపు వెళ్లిపోయాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత సందేశ్ రెడ్డి చూసుకుంటే కారులో డబ్బు లేదని తెలిసింది. లోపల తల్లిదండ్రులు ఇద్దరూ స్పృహతప్పి ఉండటంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శివ తాను బయల్దేరిన టాక్సీలోనే కొంతదూరం వెళ్లి, దామోదర్, శ్రీనివాసరెడ్డిలను జీవీకే మాల్ వద్దకు పిలిపించాడు. తనవద్ద ఉన్న రూ. 1.30 కోట్ల లోంచి రూ. 12 లక్షలు తీసి వాళ్లకు ఇచ్చాడు. తర్వాత అక్కడినుంచి ఆటోలో ఆరాంగఢ్ చౌరస్తాకు వెళ్లాడు. అక్కడ బ్యాగులు కొనుక్కుని, డబ్బు వాటిలో ప్యాక్ చేసి బెంగళూరుకు బస్సులో వెళ్లిపోయాడు. -
పరమాన్నం తినిపించి పంగనామం!
ప్రసాదం తిన్నాక ధ్యానంలోకి వెళ్తారన్న దొంగ బాబా ప్పృహ కోల్పోయిన తర్వాత చేతికి పని హైదరాబాద్: దొంగ బాబా శివస్వామి(33)తో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ మధుసూదన్‌రెడ్డికి గత నవంబర్ లో పరిచయం ఏర్పడింది. రెండు, మూడుసార్లు బెంగళూరులో అతడిని కలిశాడు. ఆ సందర్భంగా కొంతకాలంగా సమస్యలు ఎదురవుతున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటోందని, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటూ మధుసూదన్‌రెడ్డి గోడు వెల్లబోసుకున్నాడు. వీటన్నింటికి పూజలు ఒక్కటే మార్గం అంటూ శివ నమ్మించాడు. ఇందులో భాగంగానే బెంగళూరు నుంచి మంగళవారం హైదరాబాద్ చేరుకొని ఓ హోటల్లో బస చేశాడు. బుధవారం ఉదయం మధుసూదన్‌రెడ్డి తన స్కోడా కారులో శివను తీసుకొని పూజకు కావాల్సిన సామగ్రి కోసం మొజంజాహి మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు వేసి నిమ్మకాయలు, తమలపాకులు అమర్చి దేవుడి పటం ముందు డబ్బు పెడితే రెండింతలు అవుతుందని చెప్పాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి రూ.1.33 కోట్ల నగదును బ్యాగులో ఉంచి ముగ్గులో ఉంచారు. ఈ సమయంలో డ్రైవర్లు, పని మనుషులెవరూ ఉండవద్దంటూ అందరినీ బయటకు పంపించేశాడు. డ్రైవర్‌కు ఒక టార్చిలైట్ ఇచ్చి ఇలాంటిదే మరో టార్చ్‌లైట్, అందులో బ్యాటరీ కొనుక్కొని రావాలని పంపాడు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మధుసూదన్‌రెడ్డి, విద్యావ తి దంపతులకు పూజ అయిపోయిందంటూ పరమాన్నం తినిపించాడు. ఇది తిన్న తర్వాత ధ్యానంలోకి వెళ్లిపోతారంటూ చెప్పాడు. కానీ కాసేపటికే వారిద్దరూ సృ్పహ కోల్పోయారు. అదే సమయంలో మధుసూదన్‌రె డ్డి కొడుకు సందేశ్ ఇంటికి రాగా ఆయనకు కూడా ప్రసాదం ఇచ్చాడు. మైకం కమ్ముతున్న సమయంలో సందేశ్‌రెడ్డిని డబ్బులున్న బ్యాగును తీసుకొని రావాలని చెప్పడంతో అతడు బ్యాగును తెచ్చి కారు డిక్కీలో ఉంచాడు. మూడు ఆలయాల్లో పూజలు చేసుకొని వస్తే రెండింతలవుతుందన్నాడు. కారులోంచి డబ్బు ఏ‘మార్చాడిలా..’ మొదట జగన్నాథ టెంపుల్, తర్వాత కనకదుర్గ దేవాలయం, ఆ తర్వాత కమాన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి కొద్దిసేపు ధ్యానం చేయాలంటూ ఓహిరీస్ హోటల్‌కు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ధ్యానంలోకి వెళ్లి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలంటూ సందేశ్‌కు సూచించాడు. అప్పటికే మత్తులోకి వెళ్లిన సందేశ్ జేబులోంచి కారు తాళం చెవులు తీసుకున్న దొంగ బాబా కిందకు వచ్చి స్కోడాలో నుంచి నగదు ఉన్న బ్యాగును తీసి తన కారులో వేసుకున్నాడు. ఆ వెంటనే పైకి వచ్చి ధ్యానం నుంచి బయటకు రావాల్సిందిగా సందేశ్‌కు సూచించి కిందికి తెచ్చాడు. ‘నేను ట్యాక్సీలో వస్తా.. నువ్వు నీ కారులో ముందు వెళ్లు..’ అని చెప్పాడు. సందేశ్ అలాగే తన కారులో ముందు వెళ్తుండగా శివ కొద్ది దూరం వరకు అనుసరించి మినిస్టర్ క్వార్టర్స్ యూటర్న్ వద్ద మెహిదీపట్నం వైపు వెళ్లిపోయాడు. మెహిదీపట్నం బ్రిడ్జి కింద కారు ఆపి రాత్రి 8 గంటలకు తాను వస్తానని అప్పటి వరకు ఇక్కడే ఉండాలని తన కారు డ్రైవర్‌కు చెప్పి బ్యాగుతో ఉడాయించాడు. ఇంటికి వచ్చిన సందేశ్‌కు... తన తల్లిని డ్రైవర్ ఎత్తుకొస్తుండటం కనిపించింది. ఏమైందని ప్రశ్నించగా.. తల్లిదండ్రులిద్దరూ అపస్మారక స్థితికిలోకి వెళ్లారని డ్రైవర్ చెప్పాడు. బాబా కారు ఎంతకీ రాకపోవడం, డిక్కీలో నగదు బ్యాగులేకపోవడంతో మోసపోయామని సందేశ్ తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి కోలుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరమాన్నం మధుసూదన్ ఇంటి నుంచి పోలీసులు పరమాన్నంతోపాటు బూంది లడ్డు, విభూది, తీర్థం, తదితర సామాగ్రిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పూజా సామగ్రిని కూడా భద్రపరిచారు. ఘటనా స్థలంలో ఓ విషం బాటిల్ కూడా దొరికినందున అన్నంలో అది కలిపాడా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో బాబాడ్రైవర్
- మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో పట్టుకున్న పోలీసులు - మత్తు’లో ముంచేందుకు ముందే స్కెచ్ ఇటిక్యాల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి కుటుంబానికి మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన దొంగబాబా కారుడ్రైవర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలో స్థానిక పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు మత్తుమందు కలిపిన భోజనం ఇచ్చి చేసి రూ.1.33కోట్లతో బాబా పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ రెమా రాజేశ్వరి బెంగళూరుకు వెళ్లే అన్ని మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేయాలని పోలీసుల వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అనుమానాస్పదంగా వేగంగా వెళ్తున్న ఓ ఇన్నోవా వాహనాన్ని పెబ్బేరు ఎస్ఐ రమేష్ నిలిపేందుకు యత్నించారు. కానీ ఆపకుండా వేగంగా వెళ్లడంతో తన సిబ్బందితో వాహనాన్ని వెంబడించారు. వెంటనే ఇటిక్యాల ఎస్ఐ సురేష్‌కు సమాచారం ఇవ్వడంతో చివరికి ఎర్రవల్లి చౌరస్తా వద్ద పెబ్బేరు, ఇటిక్యాల ఎస్ఐలు ఇన్నోవా (కేఏ03డి 7982) వాహనాన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. కారు డ్రైవర్ షాజహాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే..! మంగళవారం ఉదయం బెంగళూరులో ట్యాక్సీని హైదరాబాద్‌కు వెళ్లేందుకు అద్దెకు మాట్లాడుకున్నారని, రూ.16వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బుధవారం హైదరాబాద్‌లోని వెళ్లిన బాబా బృందం లైఫ్‌స్టైల్’ భవన యజమాని మధుసూదన్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారికి మాయమాటలు చెప్పి మత్తు’లో ముంచి నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. నేరుగా ఓ పెద్ద హోటల్‌కు వెళ్లగా.. మరో వాహనం అతడి వద్దకు వచ్చింది. అక్కడ దొంగబాబా ఆ వాహనంలోని వ్యక్తులకు కొంతమేర డబ్బుల కట్టలను అందించాడు. వస్త్ర దుకాణాల్లో చేతికర్రలు ఉన్న బ్యాగులు కొని ఆ డబ్బుల కట్టలను కొన్నింటిని అందులో పేర్చి తన వాహనంలో వెనకసీట్లో బాబా కూర్చున్నాడని ట్యాక్సీడ్రైవర్ తెలిపినట్లు సమాచారం. అనంతరం మరోపెద్ద హోటల్‌కు వెళ్లి రెండుబ్యాగులతో వాహనం దిగి డ్రైవర్‌కారును పార్కింగ్ చేసి రమ్మని చెప్పినట్లు తెలిసింది. అదివరకే మార్గమధ్యంలోనే తనకారు అద్దెను రూ.16వేలను డ్రైవర్‌కు ఇచ్చినట్లు సమాచారం. ట్యాక్సీ డ్రైవర్ కారును పార్కింగ్ చేసి వచ్చేలోపే దొంగబాబా కనిపించలేదని, సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్చాఫ్ చేశాడని కారు డ్రైవర్ వివరాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌కు ట్యాక్సీ డ్రైవర్ ఎర్రవల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్‌ను, వాహనాన్ని ఇటిక్యాల, పెబ్బేరు పోలీసులు బుధవారం రాత్రే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఇటిక్యాల, పెబ్బేరు పోలీసుల చాకచక్యంతో ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో దొంగతనం కేసుదాదాపు పూర్తి కావచ్చినట్లేనని తెలిసింది. తనిఖీల్లో కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్‌రెడ్డి, రాజు, ఇటిక్యాల పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘ముగ్గు’లోకి దించి కోటి కొట్టేశాడు!
- హైదరాబాద్‌లో దొంగ బాబా ఘరానా మోసం - బాధితుడు ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్: ఓ దొంగ బాబా.. భార్యా, పిల్లలతో ఓ అమాయకుడు.. మంత్రాలతో ఉన్న బంగారాన్ని రెండింతలు చేస్తానంటూ బాబా మాయమాటలు.. నెక్ట్స్ సీన్.. గోల్డ్ బాబా చేతికి.. చిప్ప బాధితుడి చేతికి! - ఇది రీల్ కథ కర్ణాటక నుంచి ఓ దొంగ బాబా.. యజమాని ఆహ్వానం మేరకే ఇంటికొచ్చాడు.. కుటుంబానికి పట్టిన కీడు తొలగిస్తానన్నాడు.. ముగ్గులేసి ఏవేవో పూజలు చేశాడు.. ఇంట్లో ఉన్న సొమ్మంతా తెచ్చి పెట్టమన్నాడు.. ఒకటి కాదు రెండు కాదు.. రూ.కోటి 30 లక్షలు తెచ్చి పెట్టారు.. కాసేపటికి బాబా ప్రసాదం పెట్టాడు.. అది తిన్న యజమాని, భార్య, కొడుకు స్పృహ కోల్పోయారు.. ఇంకేముంది ఆ డబ్బుతో బాబా పరార్!! - ఇది ‘రియల్’ మోసం అచ్చూ సినీపక్కీలో జరిగిన ఈ ఘరానా మోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చి దొంగ బాబా రూ.కోటి ముప్పై లక్షలతో ఉడాయించాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన తన కుటుంబానికి పట్టిన కీడు తొలగిపోవాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని కర్ణాటకకు చెందిన ఓ బాబాను సంప్రదించాడు. తాను పూజలు చేస్తే ఎంతటి కీడైనా తొలగిపోతుందని, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని బాబా నమ్మించాడు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మధుసూదన్‌రెడ్డికి సూచించారు. మంగళవారం ఉదయం కర్ణాటక నుంచి వచ్చిన బాబాకు మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో బస కల్పించారు. పూజకు కావాల్సిన సామగ్రిని మంగళవారమే కొనుగోలు చేయించారు. బుధవారం ఉదయం.10.30 గంటలకు మధుసూదన్‌రెడ్డి ఇంటికి వచ్చిన బాబా హాల్లో ముగ్గులు వేసి నిమ్మకాయలతో అలంకరించాడు. మధుసూదన్‌రెడ్డితో పాటు ఆయన భార్య విద్యావతి, కొడుకు సందేశ్‌రెడ్డిలను పూజల్లో కూర్చోబెట్టాడు. డబ్బు ఎంత ఉంటే అంత పూజ దగ్గర పెడితే అంతా మంచి జరుగుతుందని, దోషాలు తొలగిపోతాయని, గ్రహాలు అనుకూలిస్తాయని చెప్పాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి తన వద్ద ఉన్న రూ.కోటి 30 లక్షల నోట్ల కట్టలను ముగ్గులో పేర్చాడు. ప్రసాదం తినగానే కుప్పకూలిన వైనం.. మధ్యాహ్నం దాకా బాబా ఏవేవో పూజలు చేశాడు. 3.30 గంటల ప్రాంతంలో పూజలు అయిపోయినట్లు ప్రకటించిన బాబా మధుసూదన్‌రెడ్డికి, ఆయన భార్య, కొడుకుకు ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం తిన్న కొద్ది క్షణాలకే ఆ ముగ్గురూ కుప్పకూలారు. వాళ్లు కింద పడిపోగానే బాబా తన చేతికి పని చెప్పాడు. ముగ్గులోని నగదును బ్యాగులో సర్దుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటికి పని మనుషులు, డ్రైవర్ లోనికి వచ్చారు. ముగ్గురూ కిందపడి ఉండటం చూసి అపోలో ఆస్పత్రికి తరలించారు. తేరుకున్న సందేశ్ జరిగిన విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మధుసూదన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చారు. విద్యావతి, సందేశ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మధుసూదన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి కోలుకుంటే ఈ దొంగ బాబాకు సంబంధించిన మరింత సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. బాబా కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. బాబా కారు డ్రైవర్ శివను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాబా జాడ కోసం రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో నిఘా ఉంచారు. బెంగళూరు రహదారిలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది.