
ఓటుతో బుద్ధి చెప్పండి
- 51 రోజుల్లో బడుగుల జీవితాలు మారనున్నాయి
- ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్
- మరచిపోలేనిది: రెహమాన్
- ఎమ్మెల్యే బొజ్జల ఖర్జ్జూరం వ్యాపారి: మధుసూదన్‌రెడ్డి
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ప్రజల వద్దనున్న ఓట్లు కత్తుల కన్నా పదునైన ఆయుధాలని, వాటితో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని వైఎస్‌ఆర్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటుని వినియోగించుకుని మళ్లీ రాష్ట్రంలో బడుగుల రాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మరో 51 రోజుల్లో రాష్ట్రంలో రాజన్న కాలంనాటి బడుగు, బలహీన వర్గాలవారి పరిపాలన రానుందని జోస్యం చెప్పారు. దీంతో పేదల బతుకులు మరోసారి చిగురిస్తాయని తెలిపారు. ఓట్లు వేసే సమయంలో ప్రతిఒక్కరు దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను గుర్తుంచుకోవాలని కోరారు.
ఆయన మరణానంతరం కాంగ్రెస్‌పార్టీతో టీడీపీ కుమ్మక్కై సీబీఐని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. బియ్యపు మధుసూదన్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఖర్జూరం వ్యాపారస్తుడని అభివర్ణించారు.
ఎక్కడ ఉత్సవాలు జరిగితే ఖర్జూరం వ్యాపారులు ఆ నాలుగు రోజులు అక్కడే ఉండి, ఉత్సవం కాగానే దుకాణాలు సర్దుకుని వెళిపోతారన్నారు. అలానే ఎన్నికల సమయంలో నాలుగు రోజు లు శ్రీకాళహస్తిలో ఓట్లు దండుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోవడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో టోపీల ఫ్యాక్టరీ నిర్మిస్తానని, అం దులో అందరికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారన్నారు.
ఆ తర్వాత ప్రజలకు కుచ్చు టోపి పెట్టారని తెలిపారు. 121 రోజులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం గా శ్రీకాళహస్తిలో ఉద్యమాలు జరిగాయని, నిరాహారదీక్షలు చేపట్టామన్నారు. అయితే తండ్రీకొడుకులు కంటికి కనిపించలేదన్నారు. గంగ కార్యాల యూలను తిరుపతికి బదిలీ చేస్తుంటే ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. కొట్టేడి మధుశేఖర్, సిరాజ్‌బాషా, నాని, సాగీర్‌బీ, పసల సురేష్ పాల్గొన్నారు.