rahman
-
ఓటీటీలో అథర్వ, శరత్‌కుమార్ థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్‌లో ఈ ఏడాదిలో విడుదలైన 'నిరంగల్ మూండ్రు' అనే సినిమా మూడు విభిన్న కథలతో తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ నరేన్ ప్రతిభకు తమిళ్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై కోలీవుడ్‌లో చాలామంది ప్రశంసలు కురిపించారు.తమిళ్లో నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రంలో అథర్వ మురళి, నిక్కీ గల్రాని,అభిరామి, రెహమాన్, శరత్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన 'నిరంగల్ మూండ్రు' ఇప్పుడు తమిళ్ ఆహా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది. అయితే, తెలుగులో కూడా అదే రోజు విడుదల కావచ్చని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.'నిరంగల్ మూండ్రు' చిత్రాన్ని మొదట తమిళ్ వర్షన్‌తో పాటే టాలీవుడ్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దీంతో ఓటీటీలో మాత్రం రెండు భాషలలో ఒకేసారి డిసెంబర్ 20న స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. -
బిగ్‌బీతో వర్క్ చేయడం నా అదృష్టం: సీనియర్ హీరో
నటుడు రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందారు. తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అమితాబచ్చన్‌తో కలిసి నటించడం విశేషం. ఇకపోతే ఈయన నటుడిగా నాలుగు వసంతాలు పూర్తి చేసుకోవడం మరో విశేషం. కళాశాల విద్య పూర్తి కాగానే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వరించింది. అలా 1983లో కూడే వీడే అనే మలయాళ చిత్రంతో రెహమాన్ తన నట జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నటుడిగా ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తమిళంలోనూ కె. బాలచందర్, సురేష్ కృష్ణ వంటి పలువురు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అదేవిధంగా తెలుగులో రాగలీల అనే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి మన్మథ సామ్రాజ్యం, చిన్నారి స్నేహం, భార్యలు జాగ్రత్త ,భారత్ బంద్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. విశేషమేమిటంటే మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మధురాంతకన్ రాజాగా నటించి ఆ పాత్రకు హుందాతనం చేకూర్చారు. ఇకపోతే ఈయన కథానాయకుడిగా నటించిన సమరా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. తాజాగా గణపథ్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లో రంగ ప్రవేశం చేశారు. ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. ఇది ఈనెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు రెహమాన్ శనివారం సాయంత్రం చైన్నెలో విలేకరులతో ముచ్చటించారు. అమితాబచ్చన్‌తో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో తన గెటప్ చాలా కొత్తగా ఉంటుందని బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో భారీ ఫైట్ సన్నివేశాల్లో పోటీపడి నటించినట్లు చెప్పారు. కాక తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా వచ్చిందన్నారు. ఈమేరకు కథను కూడా సిద్ధం చేసుకుని ఈడెన్ గార్డెన్ అనే టైటిల్ ను కూడా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే నటుడిగా పేరుప్రతిష్టలు, డబ్బు వస్తుంటే ఇప్పుడు దర్శకత్వం ఎందుకని తన భార్య చెప్పడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు రెహమాన్ తెలిపారు. చదవండి: బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? -
రిలీజ్‌కి రెడీ అయిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన చిత్రం 'సమరా'. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికికి చార్లెస్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ మీర్ సర్వార్ విలన్‌గా నటించాడు. (ఇదీ చదవండి: వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్!) సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమాలో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని డైరెక్టర్ చెప్పాడు. ఈచిత్రానికి దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న సమరా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
రెహ్మాన్, భరత్ కలిసి నటించిన తాజా చిత్రం సమరా. పీకాక్ ఆర్ట్ హౌస్ పతాకంపై ఎంకే.సుభాకరన్, అనూస్ వర్గీస్ విల్యాడత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి చార్లెస్ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. బజరంగీ భాయిజాన్, జాలి ఎల్ఎల్బీ 2, విశ్వరూపం -2 చిత్రాలతో ఫేమస్ అయిన నటుడు మీర్ సర్వార్ ప్రతి నాయకుడిగా నటించారు. చిత్ర పురాణం దర్శకుడు మాట్లాడుతూ.. రెహ్మాన్ వైవిధ్య కథ పాత్రలను ఎంచుకొని నటిస్తున్నారని కొనియాడారు. అలా ఆయన నటించిన తాజా చిత్రమే సమరా అని పేర్కొన్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించిన ఇందులో రెహ్మాన్ పాత్ర అన్ని వర్గాలను అలరిస్తుందని అన్నారు. ఈచిత్రానికి శీను శతాబ్దం, దీపక్ వారియర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని గోపిసుందర్ అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో ఇంతకుముందు లాక్ డౌన్ నైట్స్ చిత్రాన్ని నిర్మించిన 2 ఎం సినిమా సంస్థ అధినేత వినోద్ శబరీస్ విడుదల చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలో టామ్ కాడ్ బిజాల్ ప్రసన్న, కేనల్ మ్యాథ్వీ జార్జ్, సోనాలి సుడన్, టీనీజ్ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్ ముఖ్యపాత్రలు పోషించారు. -
చౌద్వీ కా చాంద్ హో
‘చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో’... ఈ చందమామ తెలుగు నేల మీదే ఉదయించింది. ‘ఏరువాక సాగారోరన్నో చిన్నన్న’... తప్పెట దరువుకు ఆ పాదాలు ఈ నేల మీదే చిందేశాయి. ‘మారాయ్.. మారాయ్... మారాయ్..రోజులు మారాయ్’... తెలుగువారి పుణ్యాన ఒక మహత్తు జరిగి వహిదా రెహమాన్ రోజులే మారిపొయాయి.భారతీయ వెండితెర సౌందర్యమేమారిపొయింది. తనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారని తెలిశాక ఆ మురిపమైన నటి అనుకునే మాట ఒకటే– ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై.. విశాఖపట్నంలో ఈపాటికి సంబరాలు జరగాలి.తమ ఊరి నటికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినందుకు.ఆ సంగతి వారికి తెలుసో లేదో. తెలుగు వారికి వహిదా రెహమాన్ తమ నటి అని తెలుసో లేదో.వహిదా రెహమాన్‌కు పదీ పదకొండేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి రెహమాన్‌కు మునిసిపల్ కమిషనర్‌గా విశాఖ ట్రాన్స్ఫర్ అయ్యింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉద్యోగి అయిన రెహమాన్ తమిళనాడు, ఆంధ్రాల్లో పని చేసిన దక్కన్ ముస్లిం. ఆమె తల్లిది ఉత్తరాంధ్ర కావచ్చు. ఆమె మేనమామ డాక్టర్ ఫిరోజ్ అలీ గంజాంలో పేరు మోసిన డాక్టరు, సామాజిక కార్యకర్త. సినిమా నటిగా అవకాశం పొందే వరకు అంటే తన 17వ ఏట వరకూ వహిదా రెహమాన్ తొలిప్రాయపు రోజులు విశాఖలోనే గడిచాయి. అక్కడి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకుంది. అది కాదు– ఆమె జీవితాన్ని మార్చిన ఘటన అక్కడే జరిగింది. అదీ– నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజ గోపాలాచారి విశాఖ రావడం. ఆ సందర్భంగా వహిదా రెహమాన్ నాట్య ప్రదర్శన ఇవ్వడం. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏవో ఒక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. నాటి వాల్తేరు కలెక్టర్ తన సహోద్యోగైన రెహమాన్‌ను ‘నీ కుమార్తెలు భరతనాట్యం చేస్తారు కదా. వారి ప్రదర్శన ఏర్పాటు చేద్దాం’ అని కోరాడు. అందుకు రెహమాన్ అంగీకరించాడు. అప్పటికే వహిదా, ఆమె సోదరి సయిదా భరతనాట్యం నేర్చుకున్నారు. మొత్తం నలుగురు కూతుళ్లలో అందరి కంటే చిన్నది వహిదా. భరతనాట్యం నేర్చుకోవాలని పట్టుపట్టి నేర్చుకుంది. అయితే గురువు ఆమెకు అంత సులువుగా నేర్పలేదు. ‘ముసల్మానులు ఈ విద్య నేర్చుకోగలరా? ΄రాణిక సందర్భాలను అభినయించగలరా?’ అని సందేహం వ్యక్తం చేశాడు. అయినా వహిదా పట్టు విడువలేదు. మరోవైపు ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటని అయినవారి ఎత్తి పొడుపులు. ‘కళకు మతం లేదు’ అని తేల్చిన రెహమాన్ కుమార్తెలను భరత నాట్యానికి ప్రోత్సహించాడు. కాని గురువు వినడే. చివరకు వహిదా మొండిపట్టు చూసి ‘నీ జాతకం పట్టుకురా’ అన్నాడు. ముస్లింలలో జాతకాలు ఉండవని తెలిశాక, పుట్టిన రోజు... సమయం తెలుసుకుని ఆ గురువే జాతకం రాసి ఆశ్చర్యపొయాడు. ‘ఈ అమ్మాయి నా చివరి గొప్ప శిష్యురాలు అవుతుంది’ అని ఆ జాతకంతో తేల్చి పాఠాలు నేర్పించాడు. అనుకున్నట్టుగానే జరిగింది. సి.రాజగోపాలాచారి సమక్షంలో వేదిక మీద వహిదా, సయిదాలు అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసేసరికి శాస్త్రాలు ఎరిగిన అంతటి రాజగోపాలాచారి కూడా తబ్బిబ్బయ్యి మెచ్చుకున్నాడు. ఆ వార్త మరుసటి రోజు అన్ని ముఖ్యమైన పేపర్లలో మొదటి పేజీల్లో వచ్చింది. వహిదా రెహమాన్ అనే పేరు కళా జగత్తుకు తెలిసింది. సినిమా జగత్తుకు కూడా. వహిదా రెహమాన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి జబ్బు చేసి మరణించాడు. అతని సమాధి విశాఖలోనే ఉంది. ఇటీవలే వహిదా ఆ సమాధిని దర్శించింది కూడా. తండ్రి జీవించి ఉండగా సినిమా అవకాశాలు వస్తే ‘చిన్నపిల్ల... సినిమాలేమిటి’ అని సున్నితంగా తిరస్కరించాడు కాని వహిదాకు 16 ఏళ్లు వచ్చేసరికి, అప్పటికే ఆమె నాట్యకళకారిణిగా కొనసాగుతూ ఉండటంతో సినిమా అవకాశాలు వస్తూనే ఉండేవి. భర్త అండలేని తల్లి భయంతో వాటిని తిరగ్గొట్టేది. అయితే వహిదాను సినిమా తెరకు పరిచయం చేసే అవకాశం తెలుగువారి ఖాతాలో ఉంటే ఆ విధిని ఎవరు కాదనగలరు? బాంబేలో ఎల్వీ ప్రసాద్‌తో పాటు సినిమా కళను ఆకళింపు చేసుకున్న నిర్మాత సి.వి.ఆర్. ప్రసాద్ మద్రాసు వచ్చి ‘రోజులు మారాయి’ సినిమా తీయదల్చుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. అయితే సినిమా అంతా పూర్తయ్యే సమయానికి ఇందులో ఒక సంబరాల పాట ఉండాలి... పల్లెతనపు చిందు ఉండాలి అనిపించిందతనికి. దానికి మంచి డాన్సర్ కావాలంటే వహిదా రెహమాన్ పేరు తెలిసింది. అదృష్టవశాత్తు అంతకు ముందే రెహమాన్‌తో ప్రసాద్‌కు పూర్వ పరిచయం ఉంది. ‘మీవారు నాకు తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషిని. మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేజ్ మీద చేసే డాన్సు కెమెరా ముందు చేయడమే’ అని వహిదా తల్లిని ఒప్పించాడు. ‘రోజులు మారాయి’లో ‘ఐటమ్ సాంగ్’. కొసరాజు రాశాడు. మాస్టర్ వేణు బాణి కట్టాడు. జిక్కి పాడింది. విశాఖ నుంచి మద్రాసు వెళ్లిన వహిదా రెహమాన్ అద్భుతంగా డాన్స్ చేసింది. దేహంతో పాటు హావభావాలను కూడా కదిలించింది. మెరుపు వలే మెరిసింది. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’... సూపర్‌డూపర్ హిట్. ప్రేక్షకులు చిల్లర ఎగరేసిన పాట అది. సినిమా అయిపొయాక ఆపరేటర్ చొక్కా పట్టుకుని మళ్లీ ఆ పాట వేయించుకువారు. గువ్వలాంటి ఆ అమ్మాయి ఎవరు? వహిదా రెహమాన్! ఇంటింటి పేరయ్యింది. నటి సావిత్రి అదృష్టం బాగుంది. వహిదా రెహమాన్ తెలుగు నుంచి పొటీలో తప్పుకుని హిందీలో వెళ్లింది. లేకుంటే ఒకవైపు సావిత్రి, మరోవైపు వహిదా రెహమాన్ తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపుతుంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మనం తన్నుకు చచ్చుండేవాళ్లం. 1955 జనవరిలో ‘మిస్సమ్మ’ విడుదలైంది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ‘రోజులు మారాయి’. ‘మిస్సమ్మ’ సూపర్ హిట్. ‘రోజులు మారాయి’ కూడా. ‘మిస్సమ్మ’ హైదరాబాద్‌లో నెలల తరబడి ఆడుతూనే ఉంటే ఒక డిస్ట్రిబ్యూటరు దాని హిందీ రీమేక్ కోసం దర్శకుడు గురుదత్‌ని బొంబాయి నుంచి హైదరాబాద్‌కు పిలిపించాడు– సినిమా చూడటానికి. మిస్సమ్మ గురుదత్‌కు నచ్చలేదు. కాని వహిదా రెహమాన్‌ను అదే సమయంలో రోజులు మారాయి ప్రమోషన్ కోసం మద్రాసు నుంచి పిలిపిస్తే ఆమె కారు చుట్టూ మూగిన జనాన్ని చూసి ఆశ్చర్యపొయాడు. ‘ఎవరు ఈ అమ్మాయి’ అని అడిగితే ‘వహిదా రెహమాన్’ అని చె΄్పారు. గురుదత్ ఆమెను అదే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో కలిశాడు. ‘ఉర్దూ తెలుసా’ అని మాత్రమే అడిగాడు. ‘తెలుసు’ అంది వహిదా. మూడు నెలల తర్వాత బొంబాయి నుంచి పిలుపొచ్చింది. వెళితే రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ గురుదత్ బేనర్లో. నెలకు జీతం– 2,500 రూపాయలు. మొదటి సినిమా ‘సి.ఐ.డి’. ‘హీరో ఎవరండీ’ అడిగింది వహిదా రెహమాన్. గురుదత్ జవాబు– దేవ్ ఆనంద్. ‘కహి పే నిగాహె కహిపే నిషానా’... ‘సి.ఐ.డి’ సినిమాలో కొంచెం వేంప్ తరహా వేషం. చిన్న వేషం. కాని ఒక్కపాటతో మొత్తం పేరు కొట్టుకెళ్లింది వహిదా. సి.ఐ.డిలో అసలు హీరోయిన్ షకీలా. ఆమె తుడుచుకునిపొయి వహిదా నిలబడింది. కొద్దిగా మెల్ల కన్ను, లాగేసే చూపు, ఈడ్చేసే నవ్వు... ఈ అమ్మాయిని తీర్చిదిద్దవచ్చు అనుకున్నాడు గురుదత్. వెంటనే ‘ప్యాసా’లో లీడ్ రోల్ ఇచ్చాడు. గురుదత్ ఆమెలోని నటిని చాలా సమర్థంగా తీర్చిదిద్దాడు. తనలాగే అధిక ప్రసంగం చేయకుండా గాఢమైన భావాలను ఎలా పలికించవచ్చో నేర్పించాడు. ప్యాసా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత గురుతద్, వహిదా కలిసి ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్వీ కా చాంద్‘, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ సినిమాలలో నటించారు. గురుదత్ ఆగిపొయాడు. వహిదా సాగిపొయింది. సునిల్దత్తో చేసిన ‘ముఝే జీనే దో’, బిశ్వజిత్‌తో ‘బీస్ సాల్ బాద్’ పెద్ద హిట్స్. దిలీప్ కుమార్‌తో ‘దిల్ దియా దర్ద్ లియా’, ‘ఆద్మీ’, ‘రామ్ ఔర్ శ్యామ్’ చేసింది వహిదా. కాని దేవ్ ఆనంద్ మరోసారి ఆమెకు సవాలు విసిరే పాత్రను ఇచ్చాడు ‘గైడ్’లో. ఆర్.కె.నారాయణ్ రాసిన ఈ ప్రఖ్యాత నవలను హాలీవుడ్ వెర్షన్‌గా, బాలీవుడ్ వెర్షన్‌గా తీయాలనుకున్నప్పుడు హిందీ వెర్షన్‌కు చేతన్ ఆనంద్ దర్శకుడు. కాని చేతన్‌కు వహిదా ఇష్టం లేదు. దేవ్ ఆనంద్‌కు వహిదాను తీయడం ఇష్టం లేదు. చేతన్‌ను తీసి విజయ్ ఆనంద్‌ను దర్శకుడిగా పెట్టాడు. విజయ్ ఆనంద్ ‘గైడ్’లో క్లాసిక్‌గా తీర్చిదిద్దాడు. నిజానికి ఆనాటి హీరోయిన్లు ఎంపిక చేసుకునే విలువలున్న పాత్ర లాంటిది కాదు ‘రోజీ’. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపొయే పాత్ర అది. శ్రేయోభిలాషులు చేయొద్దన్నారు. వహిదా రెహమాన్ చేసింది. ఆమెలోని నాట్యాన్ని, నటనను, అభినయ గాఢతను అంత గొప్పగా పట్టి ఇచ్చిన సినిమా మరొకటి లేదు. ‘పత్థర్ కె సనమ్’, ‘నీల్ కమల్’ వంటి హిట్స్ చూసిన వహిదా ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. రాజ్ కపూర్‌తో ‘తీస్రి కసమ్’, సునిల్దత్తో ‘రేష్మా ఔర్ షేరా’, రాజేష్ ఖన్నాతో ‘ఖామోషీ’, అమితాబ్ బచ్చన్‌తో ‘కభి కభి’... ఆమెను మెల్లగా హీరోయిన్ దశ నుంచి తప్పించాయి. వీటి నడుమ అక్కినేనితో ‘బంగారు కలలు’లో తెలుగువారిని పలుకరించింది. వహిదా రెహమాన్ హిందీ సినిమా రంగంలో సాధించిన స్థానం, ఏర్పరుచుకున్న గౌరవం, పొందిన సత్కారాలు, గెలుచుకున్న అభిమానులు తక్కువ కాదు. హుందాగా ఉంటూ, అదే సౌందర్యంతో ఆమె ఆ తర్వాతి రోజుల్లో కూడా అడపా దడపా నటిస్తూనే వచ్చింది. ఆమె నవ్వుకు ఫిదా అయ్యే ప్రేక్షకులను కనికరిస్తూనే ఉంది.గొప్ప ప్రయాణం ఆమెది. ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని గాయాలు. నాటి రోజులు మళ్లీ రావు. ఈ ఉత్సవ సమయంలో ముసురుకునేది సువర్ణ తలపొతలే. వక్త్ నే కియా క్యా హసీ సితమ్ తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్ జీవితాలను కాల్చిన ప్రేమ వహిదా రెహమాన్, గురుదత్‌ల మధ్య బంధం, అనుబంధం, సంబంధం గురుదత్ జీవితంలో సంక్షోభం తెచ్చింది. వహిదాను హిందీ పరిశ్రమకు పరిచయం చేసిన గురుదత్ ఆమె పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. వహిదా కూడా గురుదత్ రెక్కల చాటునే ఉండటానికి ఇష్టపడేది. అయితే ఇదంతా గురుదత్ భార్య, ప్రఖ్యాత గాయని గీతా దత్‌ను చాలా గట్టి దెబ్బ తీసింది. గురుదత్, గీతాదత్‌ల మధ్య వహిదా ప్రమేయం వల్ల చాలా ఎడం వచ్చింది. గురుదత్, గీతాదత్లు ఇద్దరూ తాగుడుకు బానిసయ్యారు. అప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న గురుదత్ ఆత్మహత్య చేసుకు మరణించాడన్నది ఒక కథనం. నిద్రమాత్రలు ఎక్కువై మరణించాడని మరో కథనం. ఏమైనా అతని జీవితం అర్థంతరంగా ముగిసింది. ఆ తర్వాత గీతాదత్ కూడా నానా బాధలు పడుతూ తాగుడుకు బానిసై మరణించింది. వహిదా ఒకనాటి నటుడు కమల్జిత్ను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు. బెంగళూరులో చాలా కాలం ఉన్నాక భర్త మరణం తర్వాత ముంబై వచ్చి నివసిస్తోంది. వహిదా రెహమాన్ హిట్స్ 1. భవరా బడా నాదాన్ హై – సాహిబ్ బీబీ ఔర్ గులామ్ 2. జానే క్యా తూనే కహి – ప్యాసా 3. కహీ దీప్ జలే కహి దిల్ – బీస్ సాల్ బాద్ 4. సాంర్nు ఢలీ దిల్ కి లగీ – కాలా బజార్ 5. ఏ నయన్ డరే డరే – కొహ్రా 6. గాతా రహే మేరా దిల్ – గైడ్ 7. మెహబూబ్ మేరె మెహబూబ్ మేరె – పత్థర్ కె సనమ్ 8. తుమ్ పుకార్ లో తుమ్హారా ఇంతెజార్ హై – ఖామోషీ 9. రంగీలారే తేరె రంగ్ మే – ప్రేమ్ పూజారి 10. జాదుగర్ తెరె నైనా – మన్ మందిర్ పేరు మార్చుకోని నటి ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో నటీనటులు కొత్త తరహా పేర్లు పెట్టుకునేవారు. యూసఫ్‌ఖాన్ దిలీప్ కుమార్ అయ్యాడు. మెహజబీన్ మీనా కుమారి అయ్యింది. అలాగే వహిదా రెహమాన్‌ని కూడా పేరు మార్చుకోమని గురుదత్ సూచించాడు. గురుదత్ అసిస్టెంట్లు కూడా పేరు మార్పుకోసం పట్టుబట్టారు. వహిదా రెహమాన్ పేరులో గ్లామర్ లేదని, మధుబాల లాగా ఏదో ఒక బాల వచ్చేలాగా పెట్టుకోమని కోరారు. అయితే ‘మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు నేను మార్చుకోను. దానితోనే కొనసాగుతాను. మీకిష్టమైతే తీసుకోండి, లేకుంటే మానుకోండి’ అని వహిదా రెహమాన్ హఠం చేసింది. చివరకు అందరూ దిగిరాక తప్పలేదు. వహిదా రెహమాన్ తన పేరుతోనే ఖ్యాతి గడించింది. వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగంలో విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 2021 సంవత్సరానికి సుప్రసిద్ధ నటి వహిదా రెహమాన్ (85)ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ మంగళవారం ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వార్త విన్న వెంటనే వహిదా రెహమాన్ ‘దేవ్ ఆనంద్ శతజయంతి నాడు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ అవార్డు ఆయనకు అందాలి. నాకు అందింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటిలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రసేజ్జిత్ చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు. వహిదా రెహమాన్‌ను ఇది వరకే పద్మశ్రీ, పద్మభూషణ్ వరించాయి. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేతో తనకు రెట్టింపు సంబరం కలుగుతున్నదని ఆమె అన్నారు. కాగా వహిదాకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్రధాని మోడి హర్షం వెలిబుచ్చారు. సినిమా రంగంపై ఆమె ముద్ర చెరగనిది అని కొనియాడారు. హైదరాబాద్, విశాఖ, చెన్నైలతో అనుబంధం కలిగిన వహిదా రెహమాన్ తెలుగు సినిమా ‘రోజులు మారాయి’తో సినిమా రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఆగ్రతారగా వెలుగొందారు. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా ఆమెను పరిగణిస్తారు. వహిదా రెహమాన్ అక్కినేని సరసన ‘బంగారు కలలు’ సినిమాలో నటించారు. ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’ హిట్ సాంగ్ ఆమెపై చిత్రీకరించినదే. -
ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు!
ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలామందికి తెలుసు. సింగర్, సాంగ్స్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్‌గా మాత్రమే చాలామందికి తెలిసిన ఇతనికి కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇటీవల ఇటలీ బ్రాండ్ కారు కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏఆర్ రెహమాన్ ఇటీవల 'లంబోర్ఘిని ఉరుస్ ఎస్' సూపర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ. 4.18 కోట్లు అని తెలుస్తోంది. తెలుపు రంగులో కనిపించే ఈ కారు చెన్నైలోని డిటైలింగ్ స్టూడియో వద్ద కనిపించింది. అయితే ఈ కారు ఎప్పుడు కొన్నారని విషయం మాత్రం స్పష్టంగా వెల్లడికాలేదు. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ అనేది బ్రాండ్ లైనప్‌లో రెండవ మోడల్. మొదటిది ఉరస్ పెర్ఫార్మంటే. ఉరుస్ ఎస్ సబ్బియా, నెవ్, టెర్రా అనే మూడు మోడ్లతో లభిస్తుంది. పెర్ఫార్మంటే మాత్రం ఆఫ్-రోడ్ మోడ్ పొందుతుంది. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో 666 బిహెచ్పి పవర్ & 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇదీ చదవండి: భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి? లంబోర్ఘిని ఉరస్ ఎస్ కలిగిన సెలబ్రిటీల జాబితాలో ఏఆర్ రెహమాన్ మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్, రోహిత్ శెట్టి, బాద్షా, రణవీర్ సింగ్, రోహిత్ శర్మ, రజనీకాంత్, కార్తీక్ ఆర్యన్, ఆకాష్ అంబానీ, జూనియర్ ఎన్టీఆర్, జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా ఉన్నారు. -
మాటిచ్చారు.. నెరవేర్చారు
నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.షణ్మోహన్‌కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది. మానవత్వంతో ఆదుకున్నారు నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్‌తో సీఎం జగన్‌ను కలిసింది. తన కుమారుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది. కార్వేటినగరం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్‌ను కలిసింది. తాను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండలం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్‌కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్.సుమిత్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. -
శిక్షపడిన మరునాడే విడుదల!
సాక్షి, హైదరాబాద్: నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన పాతబస్తీ వాసి ఒబేదుర్ రెహ్మాన్‌కు ఢిల్లీ కోర్టు గత బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షా కాలం రిమాండ్ పీరియడ్‌లోనే పూర్తి కావడంతో ఆ మర్నాడే ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై బెంగళూరు సీసీబీ పోలీసులు నమోదు చేసిన మరో కేసులోనూ ఇప్పటికే శిక్షపడటం, రిమాండ్‌లోనే అదీ పూర్తవడం జరిగాయి. ఒబేదుర్ రెహ్మాన్ గత శుక్రవారం సిటీకి చేరుకున్నాడు. తొలి కేసు బెంగళూరులో నమోదు... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ డిగ్రీ చదువుతుండగానే ఉగ్రవాద బాటపట్టాడు. ఉగ్రవాద సంస్థ హుజీలో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరులో ఉన్న బీజేపీ నాయకులను, ప్రముఖులను హతమార్చడానికి ఈ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాదులు 2012లో రంగంలోకి దిగారు. ఈ విషయం గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్‌లో ఒబేద్‌తో పాటు నాందేడ్, బెంగళూరు, హుబ్లీలకు చెందిన 11 మందినీ అరెస్టు చేశారు. వీళ్లు జైల్లో ఉండగానే ఐఎం నేతృత్వంలో సాగిన మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీల్లో పేలుళ్ళకు కుట్ర పన్నడంతో అదే ఏడాది ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ మరో కేసు నమోదు చేసింది. ఒబేద్ సహా మరికొందరికి బెంగళూరు జైలు నుంచి 2013లో తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉండగానే రెండు ‘శిక్షలు’ పూర్తి... ఈ రెండు కేసులకు సంబంధించి ఒబేద్ సహా మరికొందరు ఉగ్రవాదులు 2012 నుంచి జైల్లో రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. బెంగళూరు కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు న్యాయస్థానంలో నేరం అంగీకరించారు. దీంతో కోర్టు వీరిని దోషులుగా తేలుస్తూ ఆరేళ్ళ శిక్ష విధించింది. అప్పటికే వీళ్ళు అంతకంటే ఎక్కువే జైలులో ఉండటంతో ఆ కాలాన్ని కోర్టు శిక్షగా పరిగణించింది. ఢిల్లీలో నమోదైన కేసు విచారణ పూర్తి కావడంతో ఈ నెల 7న ఒబేద్ సహా నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు బుధవారం పదేళ్ళ జైలు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ ఉగ్రవాదులు అంతకంటే ఎక్కువ రోజులే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో శిక్షాకాలం పూర్తయింది. దీంతో ఒబేద్ తదితరులు పదేళ్ల శిక్షపడిన మరుసటి రోజైన గురువారమే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇదే కేసులో భత్కల్ తదితరులు... ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ నమోదు చేసిన ఈ కేసులో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీపార్క్ ట్విన్ బ్లాస్ట్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళకు బాధ్యులైన వాళ్ళూ నిందితులుగా ఉన్నారు. ఐఎం ఉగ్రవాదులైన రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ హడ్డీపై విచారణ జరగాల్సి ఉంది. వీరిలో రియాజ్ మినహా మిగిలిన వాళ్ళు అరెస్టు కావడం, నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసుల్లో శిక్షలు పడటం కూడా జరిగింది. ఐఎం కో–ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకు మిగిలిన ఉగ్రవాదులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మానవబాంబులతో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని ఎన్ఐఏ గుర్తించింది. -
ప్రేయసిని పదేళ్లపాటు దాచి.. పెళ్లి చేసుకున్నాడు
పాలక్కాడ్ (కేరళ): రెహమాన్.. గుర్తున్నాడా? ప్రియురాలు సజితాను ఏకంగా పదేళ్లపాటు తన ఇంట్లోనే ఓ గదిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రెహమాన్ ఇప్పుడు ఆమెను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్మారా పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది. పాలక్కాడ్ జిల్లా అయిలూర్కు చెందిన రెహమాన్ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచిపెట్టాడు. కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. చట్టవిరుద్ధంగా యువతిని నిర్బంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ అతడిపై కేసు పెట్టింది. చదవండి: ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో! -
ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో!
ప్రేమ కోసం లైలా, పార్వతి, జూలియెట్‌లు పడిన బాధ, వేదన వారిని కాలంతోపాటు నిలబెట్టింది. కేరళకు చెందిన సజిత ఇప్పుడు వీరి సరసన చేరనుంది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన సజిత తన ఇంటి పదిళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. ఆమె తన గదిలో ఉన్నట్టు ప్రేమికుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఈ ప్రేమ కథ బయటపడి అంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రేమకు కుల మతాలు అడ్డుగా ఉంటాయని భయపడినంత కాలం ఇలాంటి ప్రేమికులు తారసపడుతూనే ఉంటారు. సలీమ్‌ను ప్రేమించిన అనార్కలీని సలీమ్ నుంచి విడగొట్టడానికి అక్బర్ పాదుషా చీకటి గుహల్లోకి ఆమెను పంపించాడని ఒక కథనం. అయితే ఇక్కడ సలీమ్ ఉన్నాడు. అనార్కలీ కూడా ఉంది. అతని ప్రేమ కోసం ఆమె ఒక గదిలో చాటులో ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు ఉండిపోయింది. రెండు రోజుల క్రితం కేరళలో ఈ ఘటన బయటపడింది. 2010లో ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ అనే పల్లెలో వేలాయుధన్ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సజితను వెతకడం ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి ఎంక్వయిరీ చేశారు. ఏమీ క్లూ దొరకలేదు. మరోవైపు సజిత తల్లిదండ్రులు అలుపెరగకుండా సజితను వెతికారు. కాని ఆమె కనిపించలేదు. ఏళ్లు గడిచే కొద్ది వారు ఆమెపై ఆశ వదులుకున్నారు. మెల్లగా ఆమె చనిపోయిందనే నిర్థారణకు వచ్చారు. రేషన్ కార్డులో ఆమె పేరు తీయించేశారు కూడా. కాని ఆమె బతికే ఉంది. వాళ్లింటికి పదిళ్ల అవతలే ఉంది. నాలుగు గోడల గదిలో సజిత తన వీధిలోనే ఉన్న రహమాన్‌ను ప్రేమించింది. అతను చిన్నపాటి ఎలక్ట్రీషియన్. పెయింటర్. అయితే ఇరువురి మతాలు వేరు కాబట్టి పెళ్లికి ఇద్దరి పెద్దలు అడ్డం పడతారని వాళ్లకు సందేహం వచ్చింది. మరోవైపు సజితకు పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. సొంతంగా పారిపోయి బతికే ధైర్యం రహమాన్‌కు లేదు. అలాగే ఆర్థికంగా ఆమెను పోషించే స్థితిలో లేడు. కనుక వాళ్లిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఫిబ్రవరి 2, 2010న ఎవరూ లేని సమయంలో ఆమె అతని ఇంటికి వచ్చేసింది. ఆ ఇంట్లో అతనికి ప్రత్యేకం ఒక గది ఉంది. ఆ గదిలో ఉండిపోయింది. ఆ గది లో ఆమె ఉన్నట్టు రహమాన్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. రహమాన్ తండ్రి అబ్దుల్ ఘని, అతని భార్య డైలీ లేబర్స్. వాళ్లు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. రహమాన్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆమె ఇంట్లో ఉండేది. అయినప్పటికీ గత పదేళ్లుగా సజిత రహమాన్ గదిలో దాక్కుని ఉండిపోయింది. రహమాన్‌కు ముక్కోపం. అదీగాక సజితను తన గదిలో దాచాక కావాలని తిక్క తిక్కగా వ్యవహరించేవాడు. దాంతో అతనికి కొంచెం స్క్రూలూజ్ అని అతని జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. అతను ఇంట్లో ఉంటే గదిలో ఉండేవాడు. బయటకు వెళితే గదికి తాళం వేసుకొని వెళ్లేవాడు. ఆ తాళం ఎవరూ తీయకుండా ప్రత్యేకంగా చేయించాడు. ఆ గదిలోనే అన్నం తీసుకెళ్లి తినేవాడు. ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అందుకని కిటికీ ఊచలను తొలగించి అవి అవసరం ఉన్నప్పుడు తీసి పెట్టుకునేలా ఏర్పాటు చేశాడు. సజిత తన టాయిలెట్ అవసరాలను ఆ కిటికీ గుండా రాత్రిళ్లు బయటకు వెళ్లి తీర్చుకునేది. గదిలో సజిత ఉన్నందున రహమాన్ తక్కువగా పనికి వెళ్లేవాడు. ఎక్కువగా ఇంట్లో లేదా గదిలో ఉండేవాడు. ఆమె లోపలే ఉండిపోయేది. ఒక టీవీ ఉంది ఆ గదిలో. అదే ఆమె కాలక్షేపం. ఎలా బయటపడింది? మూడు నెలల క్రితం రహమాన్ ఇంట్లో వాళ్లతో గొడవపడ్డాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దాంతో రహమాన్ అన్న (మరో ఊరిలో ఉంటాడు) పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అయితే పోలీసులు ఇతణ్ణి వెతకలేకపోయారు. నాలుగు రోజుల క్రితం రహమాన్ అన్న ఏదో పని మీద దాపునే ఉన్న ‘నెమర’ అనే చిన్న టౌన్‌కి వెళితే అక్కడ మోపెడ్ మీద వెళుతున్న రహమాన్ కనిపించాడు. వెంటనే అన్న పోలీసులకు చెప్తే వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. ఆ సమయంలోనే అతను సజితతో ఒక అద్దె ఇంట్లో జీవిస్తున్నాడని తెలిసింది. ఇద్దరూ విముక్తులు పోలీసులు ఇద్దర్నీ కోర్టులో హాజరు పరిచారు. జడ్జి సజితను ‘ఎక్కడ ఉంటావమ్మా’ అని అడిగితే రహమాన్తోనే అని చెప్పింది. కోర్టు ఇద్దరినీ పంపించేసింది. అయితే ఈ సంగతి విన్న ఊరి వాళ్లు ఇరు పక్షాల పెద్దలు దిగ్భ్రమలో ఉండిపోయారు. పోలీసులు వీరి కథనాన్ని ఏ మాత్రం నమ్మలేదు. రహమాన్‌ను విడిగా, సజితను విడిగా ప్రశ్నిస్తే ఒకే కథ చెప్పారు ఇద్దరూ. వారు ఉన్న గదిని చూసి ఇంత చిన్న గదిలో ఇన్నాళ్లు ఈమె ఎలా ఉందా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. ఏ వ్యక్తికీ అన్ని రోజులు అలా ఒక గదిలో ఉండటం సాధ్యం కాదు. బహుశా ప్రేమ ఆమెకు ఆ శక్తి ఇచ్చిందేమో. ప్రస్తుతానికి వీరి కథ సుఖాంతం. వీరి ప్రేమను విడగొట్టాలనే సాహసం ఇంత కథ విన్నాక ఏ పెద్దలూ చేయరేమో. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. – సాక్షి ఫ్యామిలీ -
బాబు సినిమాల్లో మాంత్రికుడిలాంటి నాయకుడు
సాక్షి, విశాఖపట్నం : కరోనా సమయంలో రాష్ట్రంలో ఉండకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు పారిపోయారని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ విమర్శించారు. విశాఖ వస్తానని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సినిమాల్లో మాంత్రికుడు లాంటి నాయకుడని.. జూమ్ మంతర్ అంటూ నలుగురు నాయకులతో మీటింగ్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్.. బీసీల కోసం పార్టీ పెడితే, చంద్రబాబు వారికే అన్యాయం చేశారని మండిపడ్డారు. (చదవండి : అచ్చెన్నాయుడుకు కృపారాణి సవాల్) అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వారి జపం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని చేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. తన పాలనలో చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహకాలు ఎగవేస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో కూడా వాటిని చెల్లించారని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కూడా సీఎం వైఎస్ జగన్ విద్యాసంస్థలకు అందించారని తెలిపారు. బీసీ నాయకులు ఎదిగిన దశలో ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు, తెలంగాణలో దేవేందర్ గౌడ్లపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారని తెలిపారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రంలో బీసీలకు మంత్రి పదవి ఇస్తామన్నా.. చంద్రబాబు వద్దని వారి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. -
వైఎస్ జగన్ పాలన మెచ్చి
-
వైఎస్సార్సీపీలోకి డొక్కా, రెహమాన్
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్‌లు వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వారు వేర్వేరుగా వచ్చి పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. డొక్కా చేరిక కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జగన్ నాయకత్వం ఆకర్షించింది 2014, 2015లోనే వైఎస్సార్సీపీలో చేరాల్సి ఉన్నా, రాయపాటితో కలిసి అప్పట్లో టీడీపీలో చేరాను. అక్కడ నాకు కలిసి రాలేదు. వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్సీపీలో చేరాను. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి. – డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ రోజే సీఎంకు మద్దతు తెలిపాను విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన రోజే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపాను. నా సతీమణి మద్యపాన నిషేధం కోసం పోరాటం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం బావుంది. పదవుల కోసం పార్టీలో చేరలేదు. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని కచ్చితంగా వైఎస్సార్సీపీ గెలుచుకుంటుంది. – ఎస్ఏ రెహమాన్ -
‘లెక్కలతో సహ బయటపెడతా’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంటే ‘జే ట్యాక్స్’ పేరుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జే ట్యాక్స్ అని టీడీపీ నేతలు మరోసారి విమర్శిస్తే.. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో లెక్కలతో సహ బయటపెడతానని హెచ్చరించారు. ‘చంద్రబాబు హయాంలో కొన్ని బ్రేవరేజెస్‌కి మాత్రమే అనుమతులిచ్చింది నిజం కాదా.. రూ. 600 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆ రోజు అసెంబ్లీలో మైసురారెడ్డి ఆరోపణలు వాస్తవం కాదా.. ’ అని రెహమాన్ ప్రశ్నించారు. కొందరు ప్రజల్లోకి రాలేకపోతున్నారు.. ఎన్పీఆర్, ఎన్ఆర్సీలతో మైనార్టీలు అభద్రత భావానికి గురవుతున్నారని ఎన్ఆర్సీ అమలు కాకుండా కేంద్రంతో మాట్లాడతానని.. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు. కొందరు నేతలు ట్విట్టర్‌కి మాత్రమే అలవాటు పడ్డారని.. ప్రజల్లోకి రాలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అమలు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అయితే.. తూట్లు పొడిచిన నేత చంద్రబాబు అని అభివర్ణించారు. దశలవారీ మద్యపాన నిషేధంపై తీసుకుంటున్న చర్యలతో ప్రజల జీవన విధానాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ విధానంతో సంతోషంగా ఉన్నామని ప్రజలంతా చెబుతుంటే టీడీపీకి అర్థం కావటం లేదా అని దుయ్యబట్టారు ‘రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సహకరించాలి. అవసరమైతే సూచనలు కూడా చేయాలి. తప్పుడు విమర్శలతో అభివృద్ధికి అడ్డుపడొద్దని’ రెహమాన్ హితవు పలికారు. -
‘చంద్రబాబు ఆ మాట ఉత్తరాంధ్ర ప్రజలతో చెప్పిస్తారా?’
సాక్షి, విశాఖపట్నం: అమరావతికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరుగుతానన్న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహమాన్ ప్రశ్నించారు. అంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్ అన్నారని సన్ అంటే అన కొడుకు అన్నది ఆయన ఆలోచనని ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు అవలంభిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబుకు అన్నీ తెలుసు. కానీ దేన్నీ సవ్యంగా తీసుకెళ్లరు. ఆయన మనసులో ఉండేది ఒకటి. పైకి చెప్పేది మరొకటి. విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారని బాబు ప్రశ్నిస్తున్నారు. మరి అమరావతిని రాజధాని చేయాలని మిమ్మల్ని ఎవరడిగారు? విశాఖ రాజధాని కావాలని 1953లోనే చట్టసభ తీర్మానం చేసింది. అది ఎవరికీ తెలయదులే అని బాబు అనుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించే దమ్ముందా? యూటర్న్ చంద్రబాబు ప్రధాని మోదీ మీద విషపోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేశారు. చంద్రబాబు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేరదీసి పదవులిచ్చిన మాట వాస్తవం. కానీ ఆయనే టీడీపీ ఎమ్మెల్సీలను సీఎం వైఎస్ జగన్ కొనబోయారని ఆరోపించడం హాస్యాస్పదం. మీరు ఐదేళ్లు ఓపిక పట్టండి ప్రజలే తీర్పు ఇస్తారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ సిటీ అధ్యక్షుడు వాసుపల్లి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అమరావతని రేసు కారుతో, విశాఖను ఎడ్లబండితో పోల్చారు. అలా పోల్చడం దారుణం. గాడిదలు లొట్టిపిట్టలతో పిచ్చి ఉద్యమాలు చేయడం మానాలి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అమరావతే రాజధాని అనే నినాదంతో పోటీ చేయాలి. ఇదే రిఫరెండంగా తీసుకుందాం’అని రెహమాన్ సవాల్ విసిరారు. -
విశాఖలో టీడీపీకి షాక్!
మహారాణిపేట(విశాఖపట్నం): టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహమాన్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తాను చరిత్ర హీనుడిగా మిగలదల్చుకోలేదని, చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిందిగా టీడీపీ ఆదేశించిందని, స్థానికంగా ఉంటూ విశాఖ అభివృద్ధిని ఎలా వ్యతిరేకిస్తామని ప్రశి్నంచారు. జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ)పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి కూడా తన రాజీనామాకు కారణమన్నారు. విశాఖకు నిధులు రాకుండా అడ్డుకున్న బాబు విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా జీఎన్ రావు కమిటీ ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు రెహమాన్ పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో విశాఖకు చేసిందేమీ లేదని విమర్శించారు. విశాఖ ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనని నగర కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు కూడా రాకుండా చేశారని ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయాల్లోకి ప్రవేశించాక చంద్రబాబు మరింత దిగజారిపోయారని, పార్టీ పూర్తిగా నాశనమైందని చెప్పారు. అమరావతిలో రాజకీయ డ్రామాలు నడిపిస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు రాజకీయాలు ఆపి అక్కడి రైతులకు క్షమాపణ చెప్పాలని రెహమాన్ డిమాండ్ చేశారు. రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఐదేళ్లు అధికారంలో ఉన్నా రాజధాని నిరి్మంచలేనందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఏ వర్గానికీ ఆయన మేలు చేయలేదన్నారు. అందుకే ఎన్నికల ముందు పసుపు – కుంకుమ పేరుతో డబ్బులు మళ్లించినా మహిళలు టీడీపీకి కాకుండా వైఎస్సార్సీపీకే ఓటు వేశారని చెప్పారు. తాను ఎన్టీఆర్ అభిమానినని, చంద్రబాబును నమ్మి తమ జీవితాలను ఫణంగా పెట్టి పాపం చేశానని రెహమాన్ పేర్కొన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబుతో పాటు కొందరు టీడీపీ నేతలు కులాల ప్రస్తావన తేవటాన్ని ఖండించారు. జగన్‌కు మైనారిటీలు రుణపడి ఉంటారు ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడాన్ని రెహమాన్ స్వాగతించారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయబోమని ప్రకటించిన సీఎంకు మైనారీ్టలంతా రుణపడి ఉంటారన్నారు. సీఎంపై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారని, మైనార్టీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశి్నంచారు. -
ఇమ్రాన్‌ఖాన్‌పై మాజీ భార్య రేహన్ ఆరోపణలు
-
‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది!!
రెహమాన్.. రెహమాన్ సిస్టర్ కేటీఆర్.. కేటీఆర్ సిస్టర్ వరుణ్ తేజ్.. వరుణ్ తేజ్ సిస్టర్ ఆకాశ్.. ఆకాశ్ సిస్టర్ నలుగురు సిస్టర్స్ కట్టిన నాలుగు రాఖీలివి! నలుగురు బ్రదర్స్ ‘అనురాగ బంధన్’ లివి! అల్లరికి అనుపల్లవి.. చెల్లెలు. చెల్లెలి హరివిల్లు.. అన్నయ్య. ఎక్కడైనా ఇంతే కదా. కొత్త ఉందా ఇక్కడేమైనా?! ఎస్.. ఉంది. రెహమాన్ అంటే మ్యూజిక్కే కదా? ప్రేమను పంచే మ్యాజిక్ కూడా ఉందట! కేటీఆర్ అంటే... ఐటీ స్టార్ కదా? పిల్లల మధ్య ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అట! వరుణ్ తేజ్ అంటే.. ఆరడుగులు కదా? ఆటపట్టిస్తే ఇప్పటికీ చిన్నపిల్లాడేనట! ఆకాశ్ అంటే.. పోరడు కదా? చెల్లి విషయంలో పెద్దోడు అట! చెల్లెళ్లనడిగి.. ‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది. ‘రాఖి’ంగ్ ఇంటర్వ్యూలు చేసుకొచ్చింది. తమ్ముడు కాదు నాన్న రాఖీ దక్షిణాది సంప్రదాయం కాకపోయినా మెల్లిగా మనం అడాప్ట్ చేసుకున్నాం. కుల, మతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అక్కాతమ్ముళ్ల (రైహానా, ఏఆర్ రెహమాన్) అనుబంధం గురించి తెలుసుకోవాలని ఉంది... రైహానా: మేం ఎప్పుడూ రాఖీ పండగ చేసుకోలేదు. తమ్ముడికి రాఖీ కట్టింది లేదు. అయితే ‘నీకు ఎప్పుడూ తోడుగా నేను ఉన్నా’ అని చెప్పే పండగ కాబట్టి మాకు తోడుగా ఉన్న మా తమ్ముడి గురించి ఇష్టంగా మాట్లాడాలని ఉంది. తమ్ముడు అనేకంటే రెహమాన్‌ని ‘మా నాన్న’ అంటే బాగుంటుందేమో. తమ్ముడు ఎంతో బాధ్యతగా ఉంటేనే ‘నాన్న’ అనాలనిపిస్తుంది. మీ తోడబుట్టినవాళ్లు ఎంతమంది? నేను పెద్దదాన్ని. నాకు, రెహమాన్‌కి ఒక ఏడాది తేడా. ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లెలు నాకన్నా తొమ్మిదేళ్లు, మరో చెల్లెలు ఐదేళ్లు చిన్న. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన పోయాక మాకు ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇచ్చింది మా తమ్ముడే. అందుకే ‘నాన్న’ అన్నాను. తోడబుట్టినవాడు ఇలా ఉంటే ఆ అక్కాచెల్లెళ్లు ఎంత ‘ప్రొటెక్టివ్’గా ఫీలవుతారో మాటల్లో చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు రెహమాన్‌గారికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనివ్వడానికి మీ అమ్మగారు నగలు అమ్మేవారట. అది నిజమే. రెహమాన్‌కి మార్కెట్లో ఏ కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కొనుక్కోవాలని ఉండేది. అది కావాల్సిందే అని మొండి పట్టు పట్టేవాడు. రెండు మూడు రోజులు అన్నం కూడా మానేసేవాడు. చివరికి అమ్మ నగలు అమ్మి కొనిచ్చేది. రెహమాన్ కూడా చాలా బాధ్యతగా ఉండేవాడు. దాని మీద బాగా ప్రాక్టీస్ చేసేవాడు. టీనేజ్లోనే మీ తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టారు. అప్పుడు తనకోసం ఏమైనా దాచుకునేవారా? 14, 15 ఏళ్ల వయసుప్పుడే సంపాదన మొదలైపోయింది. దాదాపు ఖాళీగా ఉండేవాడు కాదు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసేవాడు. రోజుకి వెయ్యి రూపాయలు దాకా వచ్చేవి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అమ్మకిచ్చేసేవాడు. ఆ తర్వాత లెక్కలు కూడా అడిగేవాడు కాదు. ఓ రెండు మూడేళ్ల క్రితం వరకూ అంతే. ఇప్పుడు మా మరదలు (రెహమాన్ భార్య) చూసుకుంటోంది. ఇప్పుడు రెహమాన్‌గారు గంభీరంగా కనిపిస్తారు. చిన్నప్పుడు తన సిస్టర్స్‌తో ఎలా ఉండేవారు? నాకు, తనకీ వయసు వ్యత్యాసం ఏడాదే కాబట్టి మేం ఇద్దరం ఎక్కువగా ఆడుకునేవాళ్లం. క్యారమ్స్ బాగా ఆడేవాళ్లం. పిల్లలందరిలానే గొడవలు పడేవాళ్లం. అయితే జీవితం తెలిసే కొద్దీ ఆ అల్లరంతా పోయింది. అయితే చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండేవాడు. మెల్లిగా రెహమాన్ బ్యూటిఫుల్ పర్సన్‌గా మారడం చూశాను. రాను రాను డివైన్ పర్సన్‌ని చూస్తున్నాను. ప్రతిరోజు తన లైఫ్‌ని చూసి ఏదోటి నేర్చుకోవచ్చు. తన ఫోకస్ అమేజింగ్. మీ తమ్ముడు సంగీతదర్శకుడిగా ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ఊహించారా? ఒకవేళ ఊహిస్తే దానికి కారణం ఏంటి? తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్నాను. ఒక్కోసారి ఇండియాలో బాగా పాపులర్ అవుతాడనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటాడని మాత్రం ఊహించలేదు. రెహమాన్ బాగా పైకొస్తాడని నేను ఎందుకు నమ్మానంటే.. అప్పట్లో తను క్రియేట్ చేసిన మ్యూజిక్ నేనెక్కడా వినలేదు. ఆ ట్యూన్స్ నాకు కొత్తగా అనిపించేవి. వినసొంపుగా ఉండేవి. నేరుగా హృదయాన్ని తాకినట్లుగా అనిపించేది. హిందూ మతం నుంచి ముస్లిమ్ మతానికి మారాలని రెహమాన్‌గారు అనుకున్నాక మీ అందరూ కూడా మారడం మీ యూనిటీని తెలియజేస్తోంది... యాక్చువల్‌గా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని ‘సూఫిజమ్’ చాలా ప్రభావితం చేసింది. రెహమాన్ కూడా ప్రభావితుడయ్యాడు. ఆ భగవంతుడి నుంచి వాళ్లకు ఓ పిలుపు అందింది. దాంతో మారారు. అయితే నేను మాత్రం ఆ తర్వాత ఎప్పటికో దేవుడి నుంచి కబురు వచ్చిందనే భావన కలిగినప్పుడు మాత్రమే మారాను. ‘నేను మారాను. నువ్వు మారాలి’ అని రెహమాన్ ఎప్పుడూ అనలేదు. నా జర్నీలో నాకెదురైన అనుభవాలే మార్పుకి కారణం అయ్యాయి. మీరు గాయనిగా, సంగీతదర్శకురాలిగా ఉన్నారు. ఈ జర్నీకి రెహమాన్‌గారి సాయం ఎంతవరకూ ఉంది? తన హెల్ప్ ఉంది. ముందు కోరస్ పాడించేవాడు. ఆ తర్వాత గాయనిగా అవకాశం ఇచ్చాడు. అలాగే తను చేసే మ్యూజికల్ షోస్‌కి తీసుకెళుతుంటాడు. అయితే యూస్, ఇతర విదేశాల్లో జరిగినప్పుడు వెళ్లను. నా అంతట నేను విదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాను. తమ్ముడు ఉన్నాడు కదా.. చూసుకుంటాడులే అనుకోకుండా నేను కీబోర్డ్ , గిటార్, డ్రమ్స్.. ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ‘ఏండా తలైల ఎన్న వెక్కలే’ అనే సినిమా కూడా నిర్మించాను. మీ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు మరచిపోలేనిది? డబుల్ క్యాసెట్ టేప్ రికార్డర్. అది కొనిచ్చినప్పుడు రెహమాన్ వయసు 21. చెన్నైలో బర్మా బజార్ ఫేమస్. అక్కడికివెళ్లి కొనుక్కొచ్చాడు. ఆ టేప్ రికార్డర్లో బోలెడన్ని పాటలు విన్నాను. నేను పాడుతూ రికార్డ్ చేసేదాన్ని. మిగతా ఇద్దరి చెల్లెళ్లకు ఓ దారి చూపించారా? వాస్తవానికి క్యాసెట్స్ అమ్మకం జోరుగా ఉన్నప్పుడు నాకు క్యాసెట్ బిజినెస్ అప్పజెప్పాడు. క్యాసెట్స్ పోయి సీడీలు వచ్చాక మానేశాం. ఆ తర్వాత నేను నా వర్క్‌తో బిజీ అయ్యాను. నా రెండో చెల్లెలు రెహమాన్ మ్యూజిక్ కాలేజీ చూసుకుంటోంది. ఇంకో చెల్లెలు ప్లేబ్యాక్ సింగర్. రెహమాన్ ట్యూన్స్‌కి, బయటవాళ్లకు పాడుతుంటుంది. మీ అబ్బాయి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతదర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో పాటు హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. మేనమామ హెల్ప్ ఉందా? చిన్నప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని కీ బోర్డ్ ప్రాక్టీస్ చేయించేవాడు. అలా రెహమాన్ తనని గైడ్ చేసేవాడు. ఐదారేళ్ల వయసప్పుడే రెహమాన్ ట్యూన్‌కి జీవీ పాడాడు. ‘జెంటిల్‌మేన్’ సినిమాలో ‘చికు బుకు చికు రైలే’ చిన్నపిల్లాడి గొంతు జీవీదే. అలాగే ‘బొంబాయి’లో ‘కుచ్చి కుచ్చి కూనమ్మా’ పాడాడు. పెద్దయ్యాక కూడా పాడాడు. ఆ తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కూడా పాడటం మొదలుపెట్టాడు. ఫైనల్లీ తన మేనమామలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అంతవరకూ సక్సెస్ అవుతాడనుకున్నాను. హీరోగా మాత్రం నేనూహించలేదు. అయితే జీవీకి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంది. హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్నాడు. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లను రెహమాన్‌గారు గ్రాండ్‌గా చేశారా? బావగార్లతో ఎలా ఉంటారు? మా పెళ్లిళ్లకు హాజరైన ప్రతి ఒక్కరూ ‘చాలా ఘనంగా చేశారు’ అన్నారు. నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటా. బావగార్లతో రెహమాన్ రాసుకుని పూసుకుని ఉండడు. మాట్లాడే నాలుగు మాటలు బాగా మాట్లాడతాడు. ఎక్కువగా దైవత్వం గురించి మాట్లాడతాడు. అసలు మీ అందరికీ టైమ్ కేటాయించేంత తీరిక మీ తమ్ముడికి ఉంటుందా? అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకు అనిపిస్తోంది.. ఎప్పుడూ బిజీ. రోజూ ఫోన్ చేసుకోవడం లాంటివి ఉండవు. ‘తిన్నారా? ఏం చేస్తున్నారు’ అనేవి అడక్కపోయినా ఓవరాల్‌గా మా అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుసుంటూ ఉంటాడు. అంతకు మించి ఏం కావాలి? ఇక అమ్మ విషయానికొస్తే.. బిజీగా ఉంటాడు కాబట్టి రోజూ కలవలేడు. అమ్మ నాతోనే ఉంటుంది. తమ్ముడు ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకుంటాడు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేదంటే మంచి మంచి డాక్టర్స్‌తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే మా అందరి విషయంలో ‘హీ ఈజ్ వెరీ కేరింగ్’. అంతా బాగానే ఉంది.. గూగుల్‌లో ఎంత వెతికినా పెద్దయ్యాక మీరంతా దిగిన ఒక్క ఫ్యామిలీ ఫొటో కూడా లేదేంటి? దానికి కారణం ఉంది. ఒకసారి మేమంతా కలసి ఓ గ్రూప్ ఫొటో దిగాం. ఆ తర్వాత ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి దిగడం మానేశాం. ఇది మా తమ్ముడి సెంటిమెంట్. అందుకే చిన్నప్పుడు మేం దిగిన ఫొటోలు ఉంటాయోమో కానీ పెద్దయ్యాక మా ఫొటోలు ఉండవు. ఫైనల్లీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ఏదైనా సలహా ఇస్తారా? ‘నాకిది చేయలేదు. నాతో ఇలా ఉండలేదు’ అని కంప్లైంట్ చేయకూడని బంధం ఇది. ఒకరి మంచిని మరొకరు కోరుకోవాలి. ఒకరి నుంచి ఒకరు ఏమీ ఆశించకూడదు. నేను మాత్రమే కాదు.. నా తోడబుట్టినవాళ్లు బాగుండాలని కోరుకోవాల్సిన బంధం ఇది. అక్కాచెల్లెళ్లకు అన్నతమ్ముళ్లు భరోసాగా నిలవాల్సిన బంధం ఇది. మా జీవితంలో ఈ బంధం చాలా పటిష్టంగా ఉంది. అక్కాచెల్లెళ్లందరికీ అది దక్కాలని కోరుకుంటున్నాను. రెహమాన్‌గారి విజయానికి కారణాలేంటి? ఫ్యూర్లీ తన టాలెంట్. వర్క్ మీద తనకున్న ఫోకస్. మ్యూజిక్ మినహా వేరే దేని మీదా దృష్టి ఉండదు. ఎప్పుడూ వినయంగా ఉంటాడు. నా తమ్ముడి సక్సెస్‌కి ప్రతిభ, పని మీద ఏకాగ్రత, వినయం.. వీటికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయి. ఫాదర్ ఫిగర్ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపే రాఖిలాంటి పండగ బహుశా మనకే సొంతమేమో! నాకు తెలిసీ ప్రపంచంలో ఇలాంటి కల్చర్ ఇంకా ఎక్కడా లేదనుకుంటా. మన దేశంలో ఈ రాఖి అంటే తెలియని వాళ్లుండరేమో. మేమూ ఈ కాన్సెప్ట్‌లోనే పెరిగాం. బ్రదర్ అంటే మన దగ్గర అమ్మాయిలకు ఫాదర్ ఫిగరే. ఎస్పెషల్లీ ఎల్డర్ బ్రదర్. నాక్కూడా అంతే. రామన్న (కేటీఆర్) ఫాదర్ ఫిగరే. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ లైక్ మై ఫాదర్. పైగా మా నాన్న ఎప్పుడూ బిజీయే కాబట్టి, రామన్ననే ఆయన ప్లేస్ తీసుకున్నాడు. ప్రతీదీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇష్టాఇష్టాల నుంచి చదువు, కెరీర్ వరకు.. అన్నీ! ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి.. ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లడం వరకు అన్నీ రామన్నతో డిస్కస్ చేశాను. అయితే డెసిషన్ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. ఉంటుంది కూడా. ఏది మంచి ఏది చెడు జడ్జ్ చేస్తాడు కాని నిర్ణయం నన్నే తీసుకోమంటాడు. బోరింగ్ బ్రదర్ అండ్ బోరింగ్ సిస్టర్ రామన్న నాకన్నా మూడేళ్లు పెద్ద. మోర్ లైక్ ఫ్రెండ్స్‌లాగే ఉంటాం. నిజం చెప్పాలంటే మేమిద్దరం బోరింగ్ బ్రదర్ అండ్ సిస్టర్. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ గొడవపడలేదు. ఒక వస్తువునే ఇద్దరం కావాలని పట్టుపడలేదు. దేని కోసం డిమాండ్ కూడా లేదు. అలాగే క్వశ్చనింగ్ కూడా లేదు. రామన్న ఏది చెబితే అది చేయడమే. అయితే పెళ్లయి వెళ్లిపోతుంటే ‘‘హమ్మయ్య ఈ గయ్యాళి వెళ్లిపోతుంది’’ అని మాత్రం అనుకుని ఉంటాడు (నవ్వుతూ). ‘‘మీ ఆయన్ని సతాయించకు’’అని చెప్పాడు. తన కూతురు అలేఖ్య అచ్చం నా పోలికే అని చెప్తుంటాడు. ‘‘నీలాగే గయ్యాళి’’ అంటుంటాడు (నవ్వుతూ). రామన్న ఉన్నాడు అనే ధీమానే రాఖీ కడితే గిఫ్ట్స్ లాంటి సీనేం ఉండదు పెద్దగా. చిన్నప్పుడు అమ్మో, నాన్నో.. రామన్న జేబులో డబ్బులు పెడితే.. నేను రాఖీ కట్టగానే అవి నాకు ఇచ్చేవాడు. ఇప్పుడు అయితే రాఖీ కన్నా నా ప్రతి బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాడు. పిల్లల బర్త్‌డేలకు కూడా. రామన్న నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే.. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా.. రామన్న ఉన్నాడు అన్న ధీమానే. నా లైఫ్‌లో నేను మరిచిపోలేనిది అంటే.. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు.. రామన్న నా దగ్గర ఉండడం. అప్పుడు మేం యూఎస్‌లో ఉన్నాం. వాడు పుట్టగానే వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు. రామన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో చాలా సరదాగా ఉంటాడు. వాళ్లతో బాగా ఆడ్తాడు. మా బర్త్‌డేలకు, పిల్లల బర్త్‌డేలకు తప్పకుండా కలుసుకుంటాం. నేను రామన్నకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లాస్ట్ ఇయర్ ఆయన బర్త్‌డే రోజు మొదలుపెట్టిన గిఫ్ట్ ఎ హెల్మెట్ చాలెంజ్. ఎవ్రీ ఇయర్ రామన్న బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటా. బట్ లాస్ట్ ఇయర్ ఆయనకే తెలియకుండా సర్ప్రైజింగ్ ఆయన బర్త్ డే రోజు వెళ్లి హెల్మెట్ ప్రెజెంట్ చేశాను. ఆ చాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ రోజు కూడా హెల్మెట్ ఇస్తాను. నేను స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్ రెస్పాన్స్ చాలా బాగుంది. హెల్మెట్ పెట్టుకోవడం మీద అవేర్నెస్ వచ్చేంత వరకు ప్రతియేడు రామన్న బర్త్‌డే నుంచి రాఖీ వరకు ఈ క్యాంపెయిన్ చేస్తూనే ఉంటాను. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు.. ఇద్దరం అన్ని విషయాలు చాలా ఓపెన్‌గానే మాట్లాడుకుంటాం. విల్ డిస్కస్ ఎవ్రీ థింగ్. కాని ఏ విషయం మాట్లాడినా ఎండ్ అయ్యేది మాత్రం పాలిటిక్స్ దగ్గరే. ఏది చెప్పినా వింటాడు. నిరుత్సాహ పర్చడు. చేసేద్దాం అంటాడు. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు. ఏదైనా పని మొదలుపెడితే పట్టుదలగా పూర్తి చేస్తాడు. నాకూ పట్టుదల ఎక్కువే. ఇద్దరం ఒకరి నుంచి ఒకరం అడ్వయిజెస్ తీసుకుంటాం. నేను చేసే వంటలంటే రామన్నకు చాలా ఇష్టం. ఇది చేయకు.. అది చేయకు ఒక్క రామన్ననే కాదు.. మా ఇంట్లో ఏ విషయంలోనూ ఎవరూ వెనక్కి లాగలేదు. లాగరు కూడా. ఇంజనీరింగ్ చేస్తానన్నా.. అమెరికా వెళ్తానన్నా.. చివరకు పాలిటిక్స్‌లోకి రావడాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేదు. అడ్డు చెప్పలేదు. ఎంకరేజింగ్‌గానే ఉంటారు. అందరూ ఇండువిడ్యువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు.. రెస్పెక్ట్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ ఎప్పుడూ లేవు. రాఖీ.. బ్రదర్స్ అందరికీ నా రిక్వెస్ట్... అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లది రక్తసంబంధం. ఎవరి లైఫ్‌లో వాళ్లు ఎంత బిజీగా ఉన్నా అక్క, చెల్లెళ్ల కోసం టైమ్ కేటాయించండి. ఎందుకంటే ఆడపిల్ల తను లైఫ్‌లో ఎంతబాగా సెటిల్ అయినా ప్రతి అన్నా, తమ్ముడు తన పట్ల కేర్ తీసుకోవాలని, కన్సర్న్ చూపించాలని కోరుకుంటారు. సో.. దయచేసి వాళ్లతో టైమ్ స్పెండ్ చేయండి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్ చేసే స్పిరిట్‌నే పెంపొందించారు తప్ప పిరిగా అన్న వెనకాలో.. నాన్న వెనకాలో దాక్కునే తత్వాన్ని నూరిపొయ్యలేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే చెప్పారు. ఆ ధైర్యాన్నే ఇచ్చారు. నిజానికి మా ఇంట్లో నాకు గాని, రామన్నకు గాని మా అమ్మే ఇన్సిపిరేషన్. అమ్మ ఓపిగ్గా లేకపోతే నాన్న జర్నీ ఇంత సాఫీగా సాగేది కాదు. సో.. షి ఈజ్ అవర్ స్ట్రెన్త్. అన్నాచెల్లెళ్లం ఎలా ఉండాలో కూడా అమ్మను చూసే నేర్చుకున్నాం. నా పిల్లలకూ అదే చెప్తా.. మా అమ్మ నన్నెప్పుడూ అణగిమణిగి ఉండాలని ఆర్డర్ చేయలేదు. అలాగే రామన్నకు మగపిల్లాడు అని ప్రివిలేజెస్ ఇవ్వలేదు. అంటే నన్ను తక్కువా చేయలేదు.. రామన్నను ఎక్కువా చేయలేదు. ఇద్దరినీ ఈక్వల్‌గానే చూసింది. సర్దుకుపోవడం, ఒకరంటే ఒకరు గౌరవంగా ఉండడం ఇద్దరికీ నేర్పింది. నేనూ నా పిల్లలకు అదే చెప్తా. నాకు ఇద్దరు అబ్బాయిలే. అందరూ సమానమనే చెప్తా. ‘‘నువ్వు చెప్పింది అందరూ వినాలి అని అనుకోవద్దు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు వాళ్లకు ఉంటాయి. గౌరవించాలి. పర్సనల్స్పేస్ ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా సున్నితంగా ఆలోచించాలి. బాలెన్సింగ్‌గా ఉండాలి’’ అనే చెప్తుంటా. కళ్యాణలక్ష్మిని సరిగ్గా అర్థం చేసుకోవాలి... మా నాన్న చేసిన దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం.. ప్రతి గర్భిణీ స్త్రీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం. నెలలు నిండే వరకు కూడా పనిచెయ్యక తప్పని పరిస్థితులన్న మహిళలకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భవతి అని నిర్థారణ అయి, బిడ్డ పుట్టిన మూడు నెలల వరకు ప్రతి నెలా వాళ్లకు వెయ్యి రూపాయలు వచ్చేలా చేసే స్కీమ్ ఇది. అలాగే అంగన్ వాడీలో ప్రతి రోజూ ఒక పూట పోషక విలువలతో కూడి భోజనం ఇవ్వడం. ఈ పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తగ్గించినా కూడా నాన్న ఈ స్కీమ్ రన్ అయ్యేలా చేస్తున్నారు. ఇవి చాలా మంచి స్కీమ్స్. కళ్యాణ లక్ష్మిని చాలా మంచి తప్పుగా అర్థం చేసుకున్నారు కాని.. సీఎమ్గారు చాలా విజన్‌తో దాన్ని స్టార్ట్ చేశారు. పేదరికం వల్ల తెలంగాణలో అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అందుకే పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లికి సహాయపడే ఈ కళ్యాణ లక్ష్మి పథకం వల్ల అమ్మాయిలు కనీసం పద్దెనిమిదేళ్లు వచ్చే వరకన్నా చదువుకునే వీలు కలుగుతోంది. బాల్య వివాహాలూ కాస్త అయినా ఆగుతాయని ఆశ. అమ్మాయి భవిష్యత్‌ను బాగు చేసే పథకమే ఇది. ఆయన ఏ పని చేసినా నెక్స్›్ట ఎలక్షన్స్ వరకే కాదు.. నెక్స్›్ట జనరేషన్ వరకు ఉంటుంది. లిక్కర్విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు. దాన్ని తగ్గించేందుకు ఆయన స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటున్నారనుకుంటున్నాను. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ రాఖీ పండగని ఎలా చేసుకుంటారు? నిహారిక: దసరా, దీపావళిలా ఫుల్‌గా చేయకపోయినా బాగానే చేసుకుంటాం. బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి, కాళ్లు మొక్కి డబ్బులు గుంజడం (నవ్వుతూ ). చిన్నప్పటి నుంచి రాఖీ ఎప్పుడూ మిస్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే వరుణ్ అన్న ‘ఫిదా’ షూటింగ్ కోసం నిజామాబాద్‌లో ఉన్నాడు. నేను వరుణ్ అన్నకు రాఖీ కట్టాకే మిగతా అన్నలకు కడతాను. నైట్ అంతా జర్నీ చేసి నిజామాబాద్ వెళ్లి అన్నకు రాఖీ కట్టి మళ్లీ రిటర్న్ వచ్చి చరణ్ (రామ్‌చరణ్) అన్నకు కట్టాను. ఒకవేళ వేరే కంట్రీలో ఉంటే ఏం చేయలేం. నెక్ట్స్ స్క్రిప్ట్స్ వినేప్పుడు కూడా రాఖీ అప్పుడు షెడ్యూల్స్ లేకుండా చూడాలి. ఎందుకంటే నాకు లాస్ కదా. పైసల్ ఇవ్వకుండా తప్పించుకుంటాడు (నవ్వుతూ). వరుణ్: మా జనరేషన్స్‌లో కజిన్స్ ఎక్కువ. చరణ్ అన్న వాళ్ల ఇంటికి నిహా వెళ్లడం, సుష్మితా వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మెమరబుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం కలిసి బయటకు వెళ్తాం. సినిమాల్లోకి వచ్చాక బయటకి వెళ్లడం తగ్గిపోయింది. ఆ రోజు షూటింగ్స్ లేకపోతే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. ఎక్కువ సేపు జరుపుకునే ఫెస్టివల్ కాదు కూడా. రాఖీ కట్టించుకున్న తర్వాత టైమ్ స్పెండ్ చేస్తుంటాం. మిస్ అవ్వకుండా పాటిస్తాం. రాఖీ కట్టేప్పుడు అన్నయ్య ఇలా ఉండాలి అని ఏదైనా కోరుకుంటారా? నిహారిక: రాఖీ రోజే ప్రొటెక్ట్ చేయాలని కోరుకోం. అన్న నన్నెప్పుడూ ప్రొటెక్ట్ చేస్తుంటాడు. చెల్లి పుట్టగానే బ్రదర్స్‌కి ఒక బాధ్యత వచ్చేస్తుంది. సెకండ్ ఫాదర్ లాగా మారిపోతారు. నాన్నకు అన్నీ చెప్పలేం కదా. అన్నయ్యకు చెబుతాం. అలా అని అన్నయ్యకు కూడా మొత్తం చెప్పం అనుకోండి (నవ్వుతూ). వరుణ్: నేను ఒక్కరోజు పండగల్ని పెద్దగా నమ్మను. తను నీకు ఆ ఒక్క రోజు చెల్లెలు కాదు కదా. జీవితాంతం చెల్లెలే. లైఫ్‌లాంగ్ తనను ప్రొటెక్ట్ చేస్తుండాలి. రాఖీ అనేది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ రోజు అన్నట్టు నేను ఫీల్ అవుతాను. చిన్నప్పటి నుంచి అల్లరిగా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చేప్పటికి కొంచెం ప్రొటెక్టెడ్‌గా అయిపోతారు. మీ అన్న అలా మారారని ఎప్పుడు అర్థం అవ్వసాగింది? నిహారిక: అది మెల్లిగా అర్థం అవుతుంది. చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. అమ్మా నాన్న దగ్గర ఊరికే కంప్లైంట్ చేసుకోవడం నుంచి మెల్లిగా మెచ్యూర్డ్ అవ్వడం గమనించాను. నేను కాలేజ్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ఉండేదాన్ని. అన్నయ్య అప్పుడు వైజాగ్‌లో యాక్టింగ్ కోర్స్‌లో ఉన్నాడు. 5–6 నెలలు చూడలేదు. అప్పుడు మిస్ అయ్యాను. ఆ తర్వాత నుంచి అన్నయ్యలో కొంచెం ప్రొటెక్టీవ్నెస్ కనిపించేది. అది కూదా గుడ్ వేలోనే. మరీ ఓవర్‌గా, రెస్ట్రిక్షన్లా కూడా కాదు. ఇంకో ప్లస్ ఏంటంటే.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నాను అంటే త్వరగా ఇంటికి వచ్చేయ్ అంటారు. అదే అన్నతో అయితే ఈజీగా బయటకు వెళ్లోచ్చు. అన్నయ్యతో ఉన్నావా? అని ఇంకే అడగరు. వరుణ్: ఆ ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ జరుగుతుంది అనుకుంటున్నాను. నేను, మా చెల్లెలు ఊరికే కొట్టుకోవడం, గొడవపడటం తప్ప కూర్చొని స్వీట్‌గా మాట్లాడటం ఎప్పుడూ లేదు. నా విషయంలో తను ఎంత ప్రొటెక్టివ్‌గా ఉందో నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాతే తెలుసుకున్నా. చరణ్ అన్న, నేను కూడా ఎక్కువ గొడవలు పడేవాళ్లం. ఎక్కువ తిట్టేవాడు.. కొట్టేవాడు. సడెన్‌గా చరణ్ అన్న యాక్టర్ అయ్యాక నన్ను ఫాదర్‌లా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను యాక్టర్‌ని అయ్యాక అది అర్థం అయింది. నిహారిక: నాకు తెలిసిన ఫ్రెండ్స్‌లో కొందరు ‘మా అన్నయ్య అన్నింటికీ అడ్డంకులు పెడతాడు. వాడికి వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కువ’ అనేవాళ్లు. నా అన్న మాత్రం అలా కాదు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని అన్నయ్య అడిగేవాడు. అప్పుడు చిరాకుగా అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది.. ఒకవేళ అది కూడా అడగకపోతే ఇంకా అల్లరి పిల్లలా తయారయ్యేదాన్ని అని. మీ ఇంట్లో ఎవరికి వాళ్లు మీ కెరీర్‌తో బిజీ. ఈ బిజీ వల్ల వచ్చే గ్యాప్‌ని ఎలా ఫిల్ చేస్తారు? నిహారిక: ఇప్పుడు అన్న కొంచెం ఖాళీ దొరికినా నా ఆఫీస్‌కి రా. సెట్స్‌కి రా అంటాడు. వాళ్ల ఫ్రెండ్స్‌తో నన్ను కలుపుకుంటాడు. అందుకే అంత గ్యాప్ రాదు. ఒక వారం వరకూ ఓకే. వారం దాటి కలవకపోతే మాత్రం ఇద్దరికీ ‘మిస్సింగ్’ అనే అలారం మోగిపోతుంది. వెంటనే కలుస్తాం. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఎక్కువ శాతం టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. మరి మీ ఇంట్లో టామ్ ఎవరు జెర్రీ ఎవరు? నిహారిక: నేను జెర్రీ.. అన్నయ్య టామ్. ఆ ప్రోగ్రామ్‌కి ఇన్స్పైర్ అయ్యి, అన్న చేతులు గీరేసేదాన్ని. అప్పుడు వాడు హీరో అవు తాడు అని తెలియదు కదా. ఇప్ప టికీ ఆ గీతలు వాడి చేతుల మీద ఉంటాయి. అన్న కోసం నాకు చాక్లెట్స్ లంచం ఇచ్చేవాళ్లు - నిహారిక రాఖీ అనగానే బ్రదర్ సిస్టర్ని ప్రొటెక్ట్ చేయాలి. భరోసా ఇవ్వాలి అంటాం. మరి సిస్టర్స్ బ్రదర్స్‌కి ఏం చేయాలి. నిహారిక : మేం కూడా ఏమైనా చేయాలా? (పెద్దగా నవ్వుతూ). చిన్నప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంటాం కదా. సోఫాలో కూర్చొని చిటికేస్తే మేమే కదా వాటర్ బాటిల్ అయినా ఏదైనా అందించేది. పరిగెత్తిస్తారు కదా. ఇలా సంవత్సరం అంతా చేస్తూ రాఖీ రోజు గుర్తు చేస్తుంటాం హాలో.. నువ్వు కూడా బాధ్యతగా ఉండూ అని. రాఖీ రోజు వరుణ్ మీకు గిఫ్ట్స్ ఇస్తుంటారా? నిహారిక: ఏది పడితే అది తీసుకుంటాను. అప్పటి మైండ్‌సెట్‌కి తగ్గట్టుగా అడుగుతా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇలాంటి పండగలప్పుడు అడగాలనిపించదు. కానీ మాములు టైమ్‌లో చంపుతుటాను. మీ అన్నయ్యకు మీరిచ్చిన వాటిలో బెస్ట్ గిఫ్ట్స్ ఏదైనా? వస్తువు కొని ఇస్తే ప్రేముంటుందని నేను అనుకోను. నేను నా టైమ్ తీసుకొని నా సొంతంగా చేసినవి ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాంటి గిఫ్ట్స్ ఇవ్వడంవల్ల మనం ఎంత స్పెషలో తెలియజేస్తాం. అలా ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. గిఫ్ట్స్ కంటే అన్నయ్యతో స్పెండ్ చేసే స్పెషల్ మూమెంట్స్‌ని చాలా ఇష్టపడతాను. బయట మీ అందరికీ కనిపించే వరుణ్ వేరు.. మా ఇంట్లో ఉండే వరుణ్ వేరు. చాలా ఏడిపిస్తాడు. చాలా ఫన్నీ. ఈ విషయం మీ అందరికీ తెలుసో.. లేదో. అన్న బెస్ట్ కంపెనీ. అలాంటి ఇంకెన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. గిఫ్ట్స్ అన్నీ ఏదో పాయింట్లో ఇరిగిపోతాయి.. అరిగిపోతాయి. స్పెండ్ చేసిన టైమే బెస్ట్ అని నా ఫీలింగ్. నిహారిక మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? వరుణ్: తను గిఫ్ట్స్ ఎక్కువ ఇవ్వదు కానీ బాగా చూసుకుంటుంది నన్ను. ఒకసారి తను సొంతంగా నా బర్త్‌డేకి నా ఫోట్స్ అన్నీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్ తయారు చేసి ఇచ్చింది. అది ఇప్పటికీ నా రూమ్‌లోనే ఉంది. మీరు షేర్ చేసుకున్న బెస్ట్ మూమెంట్స్ వరుణ్: మా ఫ్యామిలీలో ఒక స్పెషల్ మూమెంట్ అని ఉండదు. అన్నీ కలిపి ఉంటాయి. నాకు నిహారిక ఒక్కతే కాదు.. చరణ్ అన్న వాళ్ల సిస్టర్స్ కూడా క్లోజ్. మా కజిన్స్ అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అందరం రెగ్యులర్‌గా కలుస్తాం. మీట్ అవుతుంటాం. సంక్రాంతికి బయటకు వెళ్తుంటాం. బెంగళూర్‌లో ఫామ్ హౌస్ ఉంది. నిహారిక తన షూటింగ్స్‌కి రమ్మంటుంది కానీ నా బిజీ వల్ల కుదరడం లేదు. సాధారణంగా ఏ అమ్మాయి అన్నయ్యని అయినా అబ్బాయిలు విలన్‌గా ఫీలవుతారు. మీ అన్నయ్య ఎంతమందికి విలన్ అయ్యారు? నిహారిక: మా అన్న ఒక లైన్ చెప్పాడు. అది తనెక్కడో చదివాడట. అదేంటంటే.. ఏ చెల్లైనా అన్నయ్యకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అర్థం చేసుకుంటుందట. అదే అన్నయ్యకు ఆ చెల్లి వచ్చి నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటే అస్సలు అర్థం చేసుకోడట. దానికి కారణం చెప్పాడు. చెల్లెలికి ప్రేమంటే ఏంటో తెలుసు. కానీ అన్నయ్యలకు అబ్బాయిలంటే ఏంటో తెలుసు అన్నాడు. నిజమే కదా అనిపించింది. హిస్టరీ చూస్తే ఇదే నిజం అని అర్థమవుతుంది. సినిమాల్లో కూడా చెల్లెలు వదినా అని వెంటనే ఒప్పుకుంటుంది. అన్నయ్య మాత్రం సింపుల్ రిజెక్షన్. అది కూడా ప్రొటెక్షనేలే. నాకు తెలిసి మా అన్న ఎవరికీ విలన్ అవ్వలేదనే అనుకుంటున్నాను. ఎప్పుడూ హీరోనే. ఇద్దరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. ఒకరి వర్క్‌ని ఇంకొకరు ఎలా కాంప్లిమెంట్ లేదా క్రిటిసైజ్ చేసుకుంటారు? నిహారిక: 5 ఏళ్ల క్రితం అయితే చెత్తగా చేశావు.. బాగా చేశావులే అని అనుకునేవాళ్లం అనుకుంటున్నాను. బావున్నా బాలేకున్నా డీటైల్డ్‌గా చెప్తాను నేను. ప్రతి సినిమాకు యాక్టర్‌గా గ్రో అవుతుంటారనే అనుకుంటాను. డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కామెంట్ చేస్తుంటాను. వరుణ్: చెల్లి సినిమాలను బాగానే క్రిటిసైజ్ చేస్తుంటాను. నిహా మాత్రం అంతగా చెప్పదు. చరణ్ అన్న దగ్గరకు వచ్చినప్పుడు అన్న చెప్పేది వింటాను. ఎందుకంటే మా అందరిలో సీనియర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. చరణ్ అన్న, నేను సినిమాల గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం. ఐడియాస్ పంచుకుంటాం. నిహా, నేను సేమ్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి హ్యాపీ. తను డాక్టరో లేక ఇంజనీరో అయ్యింటే తన వర్క్ నాకు అర్థం అవ్వదు. ఆ టాపిక్ కూడా నేను మాట్లాడలేను. సినిమాల్లోకి వెళ్తున్నాను అనగానే అన్నయ్య రియాక్షన్ ఏంటి? నిహారిక: వాట్!! నిజంగానా అన్నాడు. మీరు ముందు హింట్స్ ఇవ్వలేదా? నిహారిక: నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాక ఇంట్లో గంతులేస్తున్న టైమ్‌లో అన్నయ్య ఇంట్లో లేడు. యాక్టింగ్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. సో 6–7 నెలలు లేకపోయే సరికి వాడికి కొత్తగా అనిపించింది. మా ఫ్యామిలీలో ఎవరూ వద్దని చెప్పలేదు. నేను సీరియస్‌గా ఉన్నానా? లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చే నెగటివ్, పాజిటివ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లేదా అని చూశారు. అందరికంటే చిన్నదాన్ని, చిన్నపిల్ల అని భయపడ్డారు. హ్యాండిల్ చేయగలుగుతుందా? అని కొంచెం ఆలోచించారు. నా కాన్ఫిడెన్స్ చూసి అన్నయ్యకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది మైండ్‌లో ఫిక్స్ అయిందన్న మాట అనుకున్నాడు. ఇలానే ఉండాలని నిబంధనలేమైనా? నిహారిక: లేదు. కానీ నీకేదైనా పని చేయాలనిపించినప్పుడు నీ వెనక 8–9 మంది ఉన్నారు. సో ఏది చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. చిరంజీవిగారు. నాగబాబు, పవన్‌కళ్యాణ్, చరణ్.. ఇలా అన్ని పేర్లు వస్తాయి అన్నారు. నాకూ ఆ విషయంలో క్లారిటీ ఉంది. వరుణ్: కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్షన్ పొసెసివ్‌నెస్ అయిపోతుంది. అది చాలా సన్నటి గీత. బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మా నాన్న కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తూనే కొన్ని నిబంధనలు పెట్టారు. నేను కూడా ఆ లైన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. మా చెల్లి సైడ్ నుంచైతే ఏం కంప్లైంట్స్ లేవు. తను హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం వచ్చిన తర్వాత ఫ్రీ హ్యాండెడ్‌గా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు వద్దన్నా నేనే మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తాను. (నవ్వుతూ) మీ అన్నయ్య రిలేషన్షిప్స్ నాన్నగారికి తెలియ కుండా దాచిపెట్టడం. నిహారిక: నేను, అన్నయ్య ఒకే కాలేజ్‌లో చదువుకోలేదు. కానీ 5 వరకూ ఒకే స్కూల్. అన్నయ్యను లైక్ చేసే అమ్మాయిలు తెలుసు కానీ అన్నయ్య లైక్ చేసిన అమ్మాయిలు తెలియదు. చాలా మంది చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేవారు. బ్రేక్ టైమ్‌లో అన్న క్లాస్‌కి వెళ్తే ‘హే వరుణ్ చెల్లి’ అని చాక్లెట్స్ ఇచ్చేవాళ్లు. చాక్లెట్స్ వస్తున్నాయి కదా అనుకున్నే దాన్ని. అది లంచం అని తర్వాత తెలిసింది. వరుణ్: నేను అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడ్ని కాదు. అమ్మాయిలంటే శత్రువులు అని అనుకునేవాడ్ని. అలా ఎందుకు అనుకున్నానో కూడా సరిగ్గా తెలియదు. మా క్లాస్‌లో అమ్మాయిలందరూ కూడా చెల్లితో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్లు ఇచ్చిన చాక్లెట్స్ తీసుకునేది కానీ నాతో చెప్పమన్నది మాత్రం చెప్పలేదు. మీ చరణ్ అన్న ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా? నిహారిక: ఒకసారి అనుకోకుండా నాక్కావల్సింది ఇచ్చాడు. నేను ట్రిప్‌కి వెళ్తున్నాను. కొత్త కళ్లజోడు కొనుక్కుందాం అనుకున్నాను. దార్లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వెళ్తుంటే చరణ్ అన్న కార్ కనిపించింది. హాయ్ చెప్పేదాం అని వెళ్లాను. అన్న క్యారవ్యాన్ బాగా ఫేమస్. నువ్వేంటి సడెన్‌గా ఇలా? అన్నాడు. ఏం లేదు.. కళ్లజోడు కొనుక్కుందాం అని అన్నాను. నేనుండగా నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవడమా అని చెప్పి పర్స్‌లో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ ‘నీ హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి డబ్బులు బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడవనుకుంటా’ అని ఆటపట్టించారు. ఊహించకుండా వచ్చిన గిఫ్ట్ కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా స్కూల్ అవుటింగ్స్లో హెల్ప్ చేశారా? వరుణ్: మా నాన్నగారి మితిమీరిన ప్రేమ వల్ల చిన్నప్పుడు స్కూల్ అవుటింగ్స్ ఒకటి కూడా వెళ్లలేదు నేను. మహా అంటే ఒక్కసారి అనుకుంటాను. అందరికీ ఉంటుంది కదా బయటకు వెళ్లాలని. నిహారిక టైమ్ వచ్చేసరికి ఆయన కొంచెం ఫ్రీగా ఉండేవారు. తనే చాలా సార్లు వెళ్లింది. నేను గొడవపడేవాణ్ని నన్ను ఆపేశారు... తనను పంపుతున్నారని (నవ్వుతూ). ఇద్దరికీ సీరియస్ గొడవలేమైనా అయ్యాయా? వరుణ్: నాకు గొడవలను ఎక్కువగా లాగడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి కోప్పడుంటాను కానీ పెద్దగా మాట్లాడుకోలేనంత గొడవలు ఎప్పుడూ జరగలేదనుకుంటాను. మీరిచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి? వరుణ్: అవతలి వాళ్లకు ఏది నచ్చుతుంది అని ఆలోచించి గిఫ్ట్ తీసుకోవడంలో చాలా వీక్. కానీ నాకు గుర్తున్నదైతే యాక్టర్ అయ్యాక నా సంపాదనతో తనకో వాచ్ కొనిచ్చాను. డబ్బులిస్తాను కావాల్సింది కొనుక్కో అంటాను. నాన్నకి తెలియకుండా మీ ఇద్దరూ చేసిన పనులు... వరుణ్: కొన్ని సార్లు లేట్ నైట్స్ బయట ఉండాల్సి వస్తుంటుంది. ఆ విషయం నాన్నకు చెప్పాలంటే భయం. అప్పుడు చెల్లి కవర్ చేస్తుంటుంది. అలా నాన్నకు అబద్ధాలు చెప్పి బయట తిరిగేవాళ్లం. మీ పాకెట్ మనీని మీ అన్న కొట్టేసేవారా? నిహారిక: అబ్బే. కిడ్డీ బ్యాంక్ ఉండేది కానీ పొరపాటున రూపాయి వేసేదాన్ని కాదు. వరుణ్ అన్నకు కాయిన్స్ కలెక్షన్ ఉండేది. అన్నీ మంచిగా సెట్ చేసుకునేవాడు నేను చిందరవందర చేసేదాన్ని. తర్వాత నాకు తెలిసిన విషయమేంటంటే నాకు కాయిన్స్ అంటే ఎలర్జీ అని. దాంతో వాటి జోలికి వెళ్లడం మానేశాను. రాఖీ విలువ తెలిసింది రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి? పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు. ఆకాశ్: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను. పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం? ఆకాశ్: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ). పవిత్ర: లాస్ట్ ఇయర్ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్ నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకాశ్: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి ప్లాన్ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్ బ్యాగ్ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్ ఉంది. కానీ సర్ప్రైజ్. పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ). ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారా? పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీ ఇద్దరూ పర్సల్ విషయాలు షేర్ చేసుకుంటారా? పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్ ఏముంటాయి? మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్? పవిత్ర: సినిమా షూటింVŠ టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని మేం కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేసి షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రివ్యూస్ ఎలా వచ్చినా తను డల్ అవ్వటం ఉండదు. ఆకాశ్: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను. అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు – పవిత్ర మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా? ఆకాశ్: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే. పవిత్ర ఎలాంటి కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది? ఆకాశ్: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్ అయిపోగానే ప్రొడక్షన్లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్ తెచ్చిస్తుంటారు. ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటారు? పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు. కాలేజీలో మీరు డైరెక్టర్ పూరీ డాటర్ అని అందరికీ తెలుసా? పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్ అవుతాను. డ్రగ్స్ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది.. పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్ ఉంది అని మా అమ్మను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు. ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్ చేశాను. ఆకాశ్: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్ చేస్తూ, నాకు చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా? ఆకాశ్: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు. పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ). అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు? ఆకాశ్: ఏమో స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం. పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు. పవిత్ర ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆకాశ్: కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్ అందరితో ఫుల్ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నీ డ్రీమ్ రోల్? ఆకాశ్: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా చాలెంజింగ్ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్ టచ్ చేయాలనేది నా డ్రీమ్. నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? పవిత్ర: ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్లో సక్సెస్ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్ వాళ్లు. అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా? పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే తను బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ దగ్గర వీటి గురించి డిస్కస్ చే సేవాడు. అందుకే ఫస్ట్ డే షూటింగ్లో తన ఎగై్జట్‌మెంట్ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్ అయ్యాను. ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి.. ఆకాశ్: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు. పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్లో ఆకాశ్ సరదాగా ఆశీర్వదించాడు. -
చాటింగ్‌తో చీటింగ్
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి. వెంకటేశ్ జూన్ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాటలు రిలీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్ ఆవిష్కరించారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వాట్సప్, ఫేస్బుక్ ఐడీస్లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది’’ అన్నారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్ హెరాస్మెంట్, అన్‌మెచ్యూర్డ్ మైండ్స్‌తో ఏ విధంగా మోసపోతున్నారు? అమ్మాయిలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? అనే నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు రహమాన్. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: ప్రేమ్ కుమార్. -
ముస్లింలకు ‘దేశం’లో ఇంతేనా మర్యాద
‘వేదికపై బ్యానర్లో జిల్లాకు చెందిన ఒక్క మైనారిటీ నాయకుడి ఫొటో లేదు.. అసలు ఇది ముస్లింల ఆత్మీయ సదస్సేనా?!..తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఇచ్చే గౌరవం ఇంతేనా’.. ఇదీ మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రెహ్మాన్ ఆవేదన, ఆక్రోశం.అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు దీన్నేమాత్రం పట్టించుకోలేదు..నాకు అర్జంట్ పనుంది.. రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతాను.. అని ముందుకొచ్చారు.దానికి రెహ్మాన్ కుదరంటే కుదరదని స్పష్టీకరించారు.. మా ముస్లిం మైనారిటీ నేతలు మాట్లాడే వరకు ఉండలేరా.. మా బాధలు కూడా వినలేరా.. మీ ప్రసంగాల కోసమే మేం వచ్చామా?.. అని రుసరుసలాడారు.దీంతో అలిగిన గంటా సభలో మాట్లాడకుండానే వేదిక దిగి వెళ్లిపోయారు.శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో చోటుచేసుకున్న ఈ హాట్ హాట్ పరిణామాలు.. పార్టీలో మైనారిటీలకు లభిస్తున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాయని స్వయంగా ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీలో ముస్లిం మైనారిటీలకు ఏపాటి గౌరవం ఉందో తేటతెల్లమైంది. కేవలం ఆ వర్గం కోసం నిర్వహించిన సమావేశంలో కూడా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడంపై మైనారిటీలు మండిపడుతున్నారు. నగరంలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన విశాఖ జిల్లా ముస్లిం మైనారిటీల సదస్సుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రెహ్మాన్, టీడీపీ విశాఖ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేశ్, పంచకర్ల రమేష్ హాజరయ్యారు. సదస్సు ఆ పార్టీలోని మైనారిటీ నేతల పట్ల వివక్షను బట్టబటయలు చేసింది. పార్టీలో ముస్లిం మైనారిటీలకు విలువే లేకుండా పోతుందని మొత్తుకున్నా పట్టించుకోకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు విసురుగా వెళ్లిపోవడం వివాదాస్పదమవుతోంది. ఇదీ పరిస్థితి తొలుత వాసుపల్లి, పంచకర్ల, చాంద్ బాషా మాట్లాడిన తర్వాత మంత్రి గంటా ప్రసంగించేందుకు ముందుకొచ్చారు. ఆ సమయంలో పక్కనే సభావేదికపైన ఉన్న రెహ్మాన్ లేచి... ఇది జిల్లా మైనారిటీల ఆత్మీయ సదస్సేనా... జిల్లా ముస్లిం నేత ఒక్కరు కూడా మాట్లాడకుండా మీరు మాట్లాడేసి వెళ్లిపోతే ఎలా.. అని గంటాను నిలదీశారు. ఇందుకు గంటా .. నాకు పనిఉంది.. రెండు నిమిషాలు మాట్లాడేసి వెళ్లిపోతాను అని చెప్పుకొచ్చారు. దీనిపై రెహ్మాన్ ఘాటుగా స్పందించారు. మొక్కుబడిగా మాట్లాడేందుకు ఎందు కు అని నిలదీస్తుండగా, వాసుపల్లి గణేష్ పరుగుపరుగున వచ్చి.సార్‌కు పని ఉంది.. ఆయన్ను మాట్లాడనివ్వండి.. అని రెహ్మాన్‌కు సూచించారు. దానికి ఆయన అంగీకరించలేదు. దీంతో అలిగిన గంటా అగ్రహంతో సభావేదిక దిగి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు..ఆ విషయాన్ని గంటా వద్ద ప్రస్తావించగా స్పందించకుండా వెళ్లిపోయారు. గంటా వెళ్లిన తర్వాత పార్టీ శ్రీకాకుళం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నహీబుల్లాఖాన్ మాట్లాడుతూ..జిల్లా ముస్లిం మైనారిటీ ఆత్మీయ సభావేదిక బ్యానర్‌పై జిల్లాలో ఉన్న ఒక్క ముస్లిం సోదరుడి ఫొటోనైనా వేశారా?..ఇదేనా టీడీపీలో ముస్లింలను గౌరవించుకోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీం తో అప్పటి వరకు కూర్చున్న జిల్లా రూరల్ అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు విసురుగా లేచి వెళ్లిపోయారు. ముస్లిం మైనారిటీలు తమ కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినందుకే మంత్రి గంటా, పంచకర్లలు ఏమాత్రం లెక్కలేకుండా విసురుగా వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో చర్చాంశనీయమైంది. టీడీపీలోనే ఎమ్మెల్యేగా, వుడా చైర్మన్‌గా పనిచేసి సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న రెహ్మాన్ ఆవేదనను కనీసం పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. -
వాళ్లవి రాంగ్ స్టెప్స్... ‘బాహుబలి’ది రైట్ స్టెప్!
భారతీయ దర్శక–నిర్మాతలు ఎవరూ ‘బాహుబలి’ వంటి సినిమాలు తీసే సాహసం చేయలేదా? కలలో కూడా అలాంటి సినిమా గురించి ఊహించలేదా? అనడిగితే... ‘‘ఎందుకు లేదు? ఎప్పుడో ‘బాహుబలి’ విడుదలకు ముందెప్పుడో ఊహించారు. అటువంటి సినిమా తీశారు కూడా. కానీ, సక్సెస్ కాలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి’ గురించే డిస్కషన్. ఆ సినిమా సాధించిన సక్సెస్ అటువంటిది మరి. ఇండియన్ సినిమాపై ‘బాహుబలి’ ప్రభావం ఎంతుంది? అనే దానిపై ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెహమాన్‌కు సేమ్ క్వశ్చన్ ఎదురైంది. అప్పుడు రెహమాన్ – ‘‘బాహుబలి’ గురించి తప్పకుండా చెబుతాను. అంతకు ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు శేఖర్ కపూర్ ‘పానీ’ పేరుతో సినిమా తీయాలనుకున్నారు. ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కానీ, సెట్ కావడం లేదు. ఈ మేనియాను ఏడెనిమిదేళ్ల క్రితమే శేఖర్ కపూర్ ఊహించారు. తర్వాత ‘కొచ్చాడియన్’లో యానిమేషన్, సీజీ వర్క్ (గ్రాఫిక్స్) సరిగా కుదరలేదు. లేకపోతే... అది ‘బాహుబలి’ అయ్యేదే. సో, ఇట్ ఈజ్ నాట్ లైక్ ‘బాహుబలి’ ఈజ్ ద ఫస్ట్ వన్ (బాహుబలి ఏం ఫస్ట్ సినిమా కాదు). అలాంటి ప్రయత్నాలు అంతకు ముందు జరిగాయి. కానీ, ఫెయిల్ అయ్యాయి. వాళ్ల నమ్మకం సరైనదే. కానీ, తప్పటడుగులు పడ్డాయి. ‘బాహుబలి’ టీమ్ ఈజ్ వెరీ లక్కీ. మంచి మంచి ప్రతిభావంతులు ఆ సినిమాకు పనిచేశారు’’ అన్నారు. -
'16 (ఎవ్రీ డిటైల్ కౌంట్స్)' మూవీ రివ్యూ
టైటిల్ : 16 (ఎవ్రీ డిటైల్ కౌంట్స్) జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : రెహమాన్, ప్రకాష్ విజయ రాఘవన్, అశ్విన్ కుమార్, అంజనా జయప్రకాష్.. సంగీతం : జేక్స్ బిజోయ్ దర్శకత్వం : కార్తీక్ నరేన్ నిర్మాత : చదలవాడ పద్మావతి కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యువతరం దర్శకులకు మంచి ఆదరణ లభిస్తుంది. అదే బాటలో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ధృవంగల్ పతినారు సినిమాతో తమిళ ఆడియన్స్ మెప్పు పొందిన దర్శకుడు కార్తీక నరేన్. అదే సినిమాను ఇప్పుడు 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన 16 తెలుగు ఆడియన్స్ ను ఎంత వరకు ఆకట్టుకుంది..? కథ : దీపక్ (రెహమాన్) ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిగా పరిచయం అవుతాడు. పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడే ఓ యువకుడు.. దీపక్ అనుభవాలు, సలహాలు తెలుసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికే ఓ కేసు వల్ల తన కాలు కోల్పోయిన దీపక్, పోలీసు ఉద్యోగంలో చేరవద్దని సలహా ఇస్తాడు. 5 ఏళ్ల క్రితం తాను డీల్ చేసిన కేసు విషయాలను ఆ యువకుడికి వివరించటం మొదలు పెడతాడు. ముందుగా ఓ వ్యక్తి రోడ్డు మీద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న కేసు దీపక్ దృష్టికి వస్తోంది. ఆ కేసు వివరాలు తెలుసుకుంటుండగానే, ఓ అపార్ట్మెంట్ లో అమ్మాయి మిస్ అయ్యిందన్న మరో కేసు డీల్ చేయాల్సి వస్తుంది. మిస్ అయినా అమ్మాయి రూంలో గోడ మీద ఉన్న రక్తపు మరకలు తప్ప ఎలాంటి ఆధారం దొరకదు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వివరాలు కూడా దొరకవు. మిస్టరీగా మారిన ఈ రెండు కేసులను దీపక్ ఎలా పరీక్షించాడు..? అసలు ఈ రెండు వేరు వేరే కేసులా..లేక ఒకే కేసా..? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో దీపక్ కు ప్రమాదం ఎలా జరిగింది..? చిరవకు ఆ కేసు ఏం అయ్యింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ దీపక్ చుట్టూనే తిరుగుతోంది. తెలుగు వారికి సహాయ నటుడిగా మాత్రమే పరిచయం అయినా రెహమాన్ ఫుల్ లెంగ్త్ రోల్ లోనే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఓ క్రైం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఎమోషన్ ను అద్భుతంగా పలికించాడు. కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన ప్రకాష్ విజయ రాఘవన్ ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలకు పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవటం, ఆ పాత్రలో కనిపించిన వారు తెలుగు వారికి పరిచయం ఉన్న నటులు కాకపోవటంతో పాత్ర పరంగా ఓకె అనిపించారు. సాంకేతిక నిపుణులు : ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాను కేవలం 28 రోజుల్లో పూర్తి చేసిన దర్శకుడు కార్తీక్ నరేన్, కథా కథనాల మీద తనకున్న పట్టు చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం అంతా ఇన్వెస్టిగేషన్ సమయంలో పోలీసులు కేసుల ఎలా విశ్లేషిస్తారో చూపించిన దర్శకుడు, రెండో భాగంలో ప్రతీ ప్రశ్నకు సమాధానం చెపుతూ వచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తీర్చిదిద్దిన తీరు సినిమా స్థాయిని పెంచింది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన మూడ్ ను పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన మరో అంశం శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్. టిపికల్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాను ఎలాంటి కన్య్ఫూజన్ లేకుండా సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా ఎడిట్ చేశాడు శ్రీజిత్. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలతో పాటు, తెలుగు డబ్బింగ్ కూడా సినిమా స్థాయి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రెహమాన నటన కథా కథనాలు క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ టాలీవుడ్‌కు పరిచయం లేని నటీనటులు 16 (ఎవ్రీ డిటైల్ కౌంట్స్) పర్ఫెక్ట్ క్రైం థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
' D16 ' మూవీ స్టిల్స్
-
ఏడుగురు పేకాటరాయుళ్లకు రిమాండ్
పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై మేడిపల్లి పోలీసు లు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పీర్జాదిగూడలో టి. సంతోష్ (29), షేక్ మనుసూర్(35), షేక్ నసీర్ హుస్సేన్(35), షేక్ హమాన్ బాషా(30), షేక్ అబ్దుల్ రహమాన్(38), బానోతు రమేష్(35), పానుగంటి మశ్చేందర్‌గౌడ్(38)లు పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ 1,00,720 నగదు, ఏడు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
బోల్తాకొట్టిన ఆటోను లారీ ఢీకొట్టడంతో..
మేడికొండూరు(గుంటూరు జిల్లా) పోటీ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోకు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ బోల్తాపడిన ఆటోను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో ఆదివారం జరిగింది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం రోలగంపాడు గ్రామానికి చెందిన మేండ్రగుత్తి కల్యాణ్, పి.వెంకట కాశీసాయిరామ్, రెహమాన్ విద్యార్థులు. వీరిలో కల్యాణ్, సాయిరామ్ మార్కాపురంలోని శామ్యూల్ జార్జ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఆదివారం జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షకు వీరికి పెదపలకలూరు విజ్ఞాన్ కళాశాలను సెంటర్‌గా కేటాయించారు. దీంతో ముగ్గురూ ఒకరోజు ముందుగా శనివారమే ఫిరంగిపురంలో ఉన్న కల్యాణ్ బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రానికి ఆటోలో బయలుదేరారు. డోకిపర్రు శివారులోని జోసిల్ కంపెనీ వద్దకు రాగానే ఆటోకు శునకం అడ్డురాగా అదుపుతప్పి బోల్తాకొట్టింది. అదే సమయంలో పేరేచర్ల నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న లారీ.. బోల్తాకొట్టిన ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న కల్యాణ్, సాయిరామ్ ఘటన స్థలంలోనే మత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన రెహమాన్‌ను, ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిల్లి ఏసోబును గుంటూరు సమగ్ర ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు కూడా చికిత్స పొందుతూ మరణించారు. ఘటన స్థలాన్ని గుంటూరు సౌత్ డివిజన్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు పరిశీలించారు. మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.