
వైఎస్సార్ సీపీ నేత రె హమాన్‌కు అస్వస్థత
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముఖ్యనేత హెచ్‌ఆర్ రెహమాన్ సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదర్‌గూడలో ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తల లోని కుడిభాగంలో రక్తం గడ్డ కట్టిం దని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.