Illnesses
-
నాడు సురక్ష.. నేడు శిక్ష
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన జె.అప్పలనాయుడు గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో కొవ్వు స్థాయిలను తగ్గించడానికి, గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్‌లను నివారించడంతో పాటు.. అధిక రక్తపోటు సమస్యకు సంబంధించిన మందులను రోజూ వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందులను బయట కొనుగోలు చేయడం ఆ కుటుంబానికి స్తోమతకు మించిన వ్యవహారం. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అమలులోకి తెచ్చిన మందుల డోర్ డెలివరీ ఈ కుటుంబానికి వరంగా మారింది. విలేజ్ క్లినిక్‌లోని సీహెచ్‌వో నెలనెలా ఆన్లైన్లో ఇండెంట్ పెడితే మందులు పోస్టల్లో గ్రామానికి వచ్చేవి.ఆ మందులను సీహెచ్‌వో/ఏఎన్ఎం ఇంటి వరకూ తీసుకెళ్లి అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నట్టుండి మందుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఆపేసింది. దీంతో మందుల కోసం అప్పలనాయుడు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఇలాఅప్పలనాయుడు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతున్న వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్ డెలివరీ.. ఇప్పుడు నిలిచి పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేచి నడిచే సత్తా ఉన్న వారు ప్రయాణ చార్జీలు పెట్టుకుని, ఆపసోపాలు పడి పెద్దాస్పత్రులకు వెళుతుంటే అక్కడ కూడా కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుక్కోమని చీటీలు రాసిస్తున్నారని పేదలు లబోదిబోమంటున్నారు. పక్షవాతం బారినపడి.. కాళ్లు, చేతులు పని చేయని, కదల్లేని స్థితిలో ఉండే వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేదేమీ లేక స్థానికంగా ప్రైవేట్ మెడికల్ స్టోర్స్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి బాధిత కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి.బాధితులకు భరోసా కరువు⇒ గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాల వారీగా వైద్య శాఖ ఆన్లైన్లో పొందు పరిచింది. ఈ సమాచారం ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లు ప్రతి నెలా మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఆ మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. అనంతరం సీహెచ్‌వో/ఏఎన్ఎంలు ఆ మందుల పార్సిల్‌ను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి, వాటిని ఎలా వాడాలో వివరించే వారు. ⇒ అయితే జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఆన్లైన్లో ఇండెంట్ పెడుతున్నప్పటికీ, ఏపీఎంఎస్ఐడీసీ మందులను గ్రామాలకు పంపడం లేదు. మందులు రావడం లేదని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించక పోవడంతో సీహెచ్‌వోలు ఇండెంట్ పెట్టడం కూడా మానేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. ⇒ బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, దీర్ఘకాలిక కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి నెలకు రూ.వేలల్లో కూడా ఖర్చు అవుతుంది. వ్యవసాయ, రోజు వారీ కూలి పనులపై ఆధారపడే పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బాధితులు ఖరీదైన మందులు నెలనెలా కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత సహకరించదు. దీంతో చాలా మంది మందుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జబ్బులు ముదిరి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.⇒ ఈ పరిస్థితిని నివారించి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మందుల డోర్ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆపేయడం పట్ల బాధిత కుటుంబాలు మండి పడుతున్నాయి.ఆత్మస్థైర్యం కోల్పోయినట్లైందిగతంలో ప్రభుత్వమే నేరుగా ఇంటి దగ్గరకు మందులు పంపేది. నర్సమ్మ ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేసి, నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, మందులు ఎలా వాడాలో వివరించేది. నాకు ఎంతో ఆత్మస్థైర్యం నింపింది. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాను. పై నుంచి వచ్చే మందులు కొద్ది నెలలుగా రావడం లేదని ఏఎన్ఎం, నర్సమ్మ చెప్పారు. – అప్పలకొండ, అనకాపల్లి జిల్లారోగాలు ముదిరిపోతాయిదీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, కదల్లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా మంది ఉంటారు. క్రమం తప్పకుండా మందుల వాడకంతో బాధితుల్లో జబ్బులు నియంత్రణలో ఉంటాయి. మందులు ఆపేస్తే జబ్బులు ముదిరి, మరిన్ని అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా
చైనాలో మళ్లీ కొత్త రకం కరోనావైరస్ విస్తరిస్తోందన్న ఆందోళనల మధ్య చైనా స్పందించింది. దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు పలు వ్యాధికారక కారకాల కలయికు కారణమని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ప్రధాన కారణాల్లో ఇన్ఫ్లుఎంజా ఒకటని ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. చైనాలో నమోదవుతోన్న న్యూమోనియా కేసుల్లో ఎలాంటి అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారకాలను గుర్తించ లేదని, కోవిడ్ -19 మహమ్మారి సమయం నాటి తీవ్రత లేదని కూడా స్పష్టం చేసింది. తద్వారా కొత్త కరోనా వస్తోందన్న ఆందోళనలకు చెక్ పెట్టింది. ఇన్ఫ్లుఎంజా, రైనోవైరస్, అడెనోవైరస్లు, మైకోప్లాస్మా న్యుమోనియా వంటి అనేక రకాల వ్యాధికారక కారకాల వల్ల కేసులు పెరుగుతున్నాయని నివేదించింది. అలాగే శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత అసాధారణం కాదని కూడా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ ఆంక్షలు అవసరం లేవని కూడా వెల్లడించింది. బీజింగ్, లియానింగ్ ,ఇతర ప్రదేశాలలో పిల్లల ఆసుపత్రులలో గుర్తించబడని న్యుమోనియా గురించి నివేదిక తర్వాత పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనా నుండి మరింత సమాచారం కోరిన తర్వాత ఈ వివరాలు వచ్చాయి. ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చైనాను కోరింది. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈమేరకు చైనా అధికారులు స్పందించారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు WHO తెలిపింది. చైనాలో చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కేసులు కలవర పెట్టాయి. కరోనా బాగా ప్రబలిన నాటి రోజులను తలపించేలా చైనాలో ఆసుపత్రుల వద్ద చిన్నారులతో తల్లిదండ్రులు గంటల తరబడి వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇది వ్యాప్తి చెందకుండా పాఠశాలల్ని తాత్కాలికంగా మూసివేశాయి. మరోవైపు వాకింగ్ న్యుమోనియా" కేసులు పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్యులు హెచ్చరించారు. కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల పిల్లలలో మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతున్నట్లు నివేదించాయి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండే పెద్ద పిల్లలు, పెద్దలలో తేలికపాటి జలుబు మాత్రమే కనిపిస్తోంది. అయితే ,కొన్ని వారాల పాటు కొనసాగుతున్న లక్షణాలతో చిన్న పిల్లల్లో న్యుమోనియా డెవలప్ అయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైకోప్లాస్మా న్యుమోనియా మైకోప్లాస్మా న్యుమోనియా అనేది ఒక బాక్టీరియా, ఇది సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది, సాధారణ జలుబు మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. ఇది చాలా అరుదుగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు దగ్గు వారాల పాటు కొనసాగుతుంది. ఫలితంగా చిన్న పిల్లలకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. -
చేసే పనీ.. చేటు చేయొచ్చు..!
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్ అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. అనారోగ్య ‘గనులు’ గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, అటూ ఇటూ దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదని చెప్తున్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచి్చతంగా వాడాలని సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిపై తరచుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. నివారణే శరణ్యం. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, ముందు జాగ్రత్తలు పాటించడం మంచిది. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సమస్యల కర్మాగారాలు కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కార్మికులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. బీపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్ బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ♦ ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ♦ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ♦ లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తుండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ♦ సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. -
సికింద్రాబాద్ కస్తూర్బాలో గ్యాస్ లీక్.. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్ కావడంతో కలకలం రేగింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రేపటి దాకా అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. చదవండి: వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు -
మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత
-
AP: మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంకి తీసుకు వెళ్లారు. ఇది కూడా చదవండి: బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా? -
Salmonella Outbreak: ఉల్లి ఎంత పని చేసింది?.. 650 మందికి తీవ్ర అస్వస్థత..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని అంటారు.. ఉల్లిలోని ఔషధగుణాలు ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందని దానర్థం. కానీ ఈ దేశ ప్రజలు కేవలం ఉల్లి తినడం మూలంగానే వింత వ్యాధి భారీన పడి తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. అమెరికాలో దాదాపు 37 రాష్ట్రాల్లో 650 మందికి పైగా ప్రజలకు సాల్మొనెల్లా అనే వ్యాధి వ్యాపించింది. మెక్సికోలోని చివావా నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలే అందుకు కారణమట. దీంతో ప్యాకింగ్, స్టిక్కర్ లేని ఉల్లిపాయలన్నింటినీ వెంటనే పారవేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చి ఉల్లి తిన్న వెంటనే తాము అనారోగ్యబారిన పడ్డట్టు 75% మంది బాధితులు వెల్లడించారు. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! సీడీసీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ 129 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని, అత్యధికంగా సాల్మొనెల్లా కేసులు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో నమోదయ్యాయని వెల్లడించింది. టెక్సాస్, ఓక్లహోమా ప్రావిన్స్‌లలో మొదట ఈ వ్యాధి తాలూకుకేసులు నమోదయ్యాయని మీడియాకు తెల్పింది. ఏమిటీ సాల్మొనెల్లా..? సాల్మొనెల్లా లేదా సాల్మొనెల్లోసిస్ అనేది సాధారణ బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి. ఇది పేగులను ప్రభావితం చేసి, జీర్ణసంబంధిత సమస్యలకు కారణమౌతుంది. కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాలకు కూడా దారితీస్తుందని సీడీసీ పేర్కొంది. ఐతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా సాధారణంగా జంతువుల్లో, మనుషుల పేగుల్లో ఉంటుంది. ఇది మల విసర్జన ద్వారా బయటికి పోతుంది. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం తీసుకున్న 6 గంటలకు సాల్మొనెల్లా వ్యాపిస్తుంది. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. ఈ వ్యాధి 4 నుంచి 7 రోజుల పాటు బాధిస్తుంది. కొన్ని రకాల బాక్టీరియాలు మూత్రం, రక్తం, ఎముకలు, కీళ్ళు లేదా నాడీ వ్యవస్థల్లో తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమౌతాయి కూడా. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
నో పార్టీ.. ఓన్లీ సేవ: రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా..ప్రజాసేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపుతానని మంగళవారం ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఒక ప్రకటన ద్వారా సుదీర్ఘ సంజాయిషీ ఇచ్చుకున్నారు. అందులోని వివరాలు యథాతథంగా..‘నా జీవనాధారమైన తమిళనాడు ప్రజలకు ప్రేమపూర్వక నమస్సులు. జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి వైద్యుల సూచనలను ఖాతరు చేయకుండా అన్నాత్తే చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాను. 120 మంది సభ్యులతో కూడిన చిత్రబృందంలో నాతో సహా జాగ్రత్తలు తీసుకున్నా నలుగురికి పాజిటివ్ నిర్ధారణైంది. చిత్రదర్శకులు వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి అందరికీ మరోసారి పరీక్షలు జరిపించగా నాకు నెగెటివ్ వచ్చింది. అయితే బీపీలో హెచ్చుతగ్గులు గుర్తించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నందున ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో హైదరాబాద్‌లోనే చికిత్స చేయించుకున్నా. అన్నాత్తే చిత్ర షూటింగ్‌ను రద్దు చేయగా పలువురి ఉపాధి దెబ్బతింది, కొందరికి కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. వీటన్నింటికీ నా అనారోగ్యమే కారణం. ఈ పరిణామాలు దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాను. నేను పార్టీ ప్రారంభించిన తరువాత మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే ప్రజల్లో నేను ఆశించిన చైతన్యాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో ఘనవిజయం సాధించలేను. ఈ వాస్తవాన్ని రాజకీయ అనుభవజ్ఞులెవ్వరూ కొట్టిపారేయలేరు. ఎన్నికల ప్రచార సభలతో లక్షలాది మంది ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. 120 మంది చిత్రబృందంలోనే కరోనా సోకడంతో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. కరోనా కొత్తరూపుదాల్చి రెండోవేవ్ వ్యాపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లి అనారోగ్యం పాలైతే నన్ను నమ్ముకుని నా వెంట రాజకీయ ప్రయాణం చేసే వారిని సైతం సంకట పరిస్థితుల్లోకి నెట్టినవాడినవుతాను. నా ప్రాణం పోయినా పరవాలేదు, ఇచ్చిన మాటను మీరను. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఇపుడు రావడం లేదని ప్రకటించడాన్ని నలుగురు నాలుగు విధాలుగా వ్యాఖ్యానిస్తారనే కారణంతో నమ్ముకున్న వారిని బలిపశువులను చేయలేను. ఈ కారణాలతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ఎంతో బాధాతప్త హృదయంతో చెబుతున్నాను. ఈ నిర్ణయం రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులకు, అభిమానులకు, ప్రజలకు ఎంతో నిరాశను కలిగిస్తుంది. నన్ను క్షమించండి. మూడేళ్లుగా నా మాటలకు కట్టుబడి, కరోనా కాలంలో ప్రజలకు సేవలందించిన నిర్వాహకుల శ్రమ వృథాపోదు. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుతుంది. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రజనీ మక్కల్ మన్రం యథాప్రకారం పనిచేస్తుంది. మూడేళ్లుగా నా వెంట నిలిచిన తమిళరువి మణియన్‌కు, బీజేపీ నుంచి వైదొలిగి నాతో కలిసి పనిచేసేందుకు సమ్మతించిన అర్జున్‌మూర్తికి రుణపడి ఉంటాను. ఎన్నికల రాజకీయాల్లోకి రాకుండా ప్రజలకు వీలయినంత సేవ చేస్తాను. నిజాలు మాట్లాడేందుకు ఎన్నడూ వెనుకాడను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్ద హృదయంతో అందరూ అంగీకరించాలని వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. ఆందోళనకు గురైన అభిమానులు తమ అభిమాన హీరో రాజకీయ అరంగేట్రంపై మూడు దశాబ్దాలకుపైగా ఎదురుచూసిన అభిమానులు రజనీకాంత్ ప్రకటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరో రెండురోజుల్లో పార్టీ ప్రకటన ఖాయమని ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్తతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయపార్టీలు స్వాగతించాయి. ‘రజనీకాంత్ చేసిన ప్రకటనతో నా మానసిక పరిస్థితి ఆయన అభిమానుల్లానే ఉంది. కొద్దిగా నిరాశ చెందినా ఆయన క్షేమంగా ఉండాలి’అని నటుడు కమల్‌హాసన్ అన్నారు. అప్పట్నుంచే ఒత్తిడి ► 1996 నుంచే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమాన సంఘాల ఒత్తిడి. ► జయలలిత, కరుణానిధి మరణానంతరం 2017లో అభిమానులతో విస్తృత సమావేశాలు. అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తి. ► డిసెంబర్ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ స్థాపన, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ నవంబర్‌లో ప్రకటన. ► ‘అన్నాత్తే’ చిత్రం షూటింగ్ కోసం ఈ నెల 13న చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లి, అనారోగ్యంపాలు. -
70 మంది విద్యార్థులకు అస్వస్థత
సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో 70 మంది విద్యార్థులు చర్మ సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. ముఖాలపై ఎర్రటి పొక్కులతో చర్మం పొలుసుబారడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా 70 మంది పిల్లలు అస్వస్థతకు గురైనప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మిణుగురు పురుగులు కుట్టడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. నారాయణరావుపేట జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మిస్తున్ననేపథ్యంలో స్కూల్‌ను తాత్కా లికంగా సిద్దిపేట శివారులోని ఎల్లంకి కళాశాల లోకి మార్చారు. 5వ తరగతి నుంచి 9వ తరగతివరకు 327 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. పాఠశాలలో పైఅంతస్తులోని డార్మిటరీ హాల్లో విద్యార్థులు నిద్రించేందుకు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా కొందరు విద్యార్థుల మొఖాలపై ఎర్రటి పొక్కులు ఏర్పడ్డాయి. బుధవారం పాఠశాలలో మొత్తంగా 70 మందికిపైగా పొలుసుబారిన చర్మంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ముఖాలపై చర్మం పొలుసుబారడం తగ్గకపోవడంతో పిల్లల అస్వస్థతకు గల కారణంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.. మిణుగురు పురుగులతో విద్యార్థులకు చర్మం పొలుసుబారిపోవడంతో వెంటనే వైద్యులకు చూపించాం. పిల్లలు డారి్మటరీ రూంలోని తెరలను తొలగించడంతో పురుగులు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో మెష్‌లు ఏర్పాటు చేసేలా చూసుకుంటాం. –మహబూబ్ అలీ, ప్రిన్సిపాల్ -
కలుషిత ఆహార కలకలం
పార్వతీపురం టౌన్: పాడైన ఆహారం తిన్న 45మంది విద్యారి్థనులు రాత్రికి రాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. పార్వతీపురం మండలం కవిటిభద్ర కేజీబీవీ వసతిగృహంలో మంగళవారం మధ్యాహ్నం వండి వడ్డించగా మిగిలిన కూరలు, పెరుగు రాత్రి వేళ కూడా విద్యారి్థనులకు బలవంతంగా వడ్డించడంతో గత్యంతరం లేక వాటిని తిన్న వారంతా అనారోగ్యం పాలయ్యారు. మొత్తం 165మంది విద్యారి్థనుల్లో 45మందికి విరేచనాలు, వాంతులు ఒక్కసారిగా ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న ఏఎన్ఎం ప్రాథమిక చికిత్స అందించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పూర్తి చికిత్సకోసం తరలించారు. అనారోగ్యం పాలైనవారిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులున్నారు. వెంటనే పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పి.వరలక్ష్మి, సిబ్బంది హుటాహుటిన వారిని రాత్రికి రాత్రి ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్సను ఇప్పించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్–2 ఆర్.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి బుధవారం ఉదయం ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేశారు. విద్యారి్థనుల ఆరోగ్యంపరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రూరల్ ఎస్ఐ వీరబాబు, తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఈఓ కృష్ణమూర్తి, ఎంపీడీఓ కె. కృష్ణారావు తదితర అధికారులు ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వద్దన్నా వడ్డించడం వల్లే... మధ్యాహ్నం వడ్డించగా మిగిలి పోయిన పెరుగు వేసుకునేందుకు పిల్లలు అంగీకరించలేదు. కానీ ఊరికే వృథా అవుతుందన్న కారణంతో సిబ్బంది బలవంతంగా వారిచే తినిపించారు. అదే వారి కొంప ముంచింది. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వాగ్దేవి ఆధ్వర్యంలో వైద్యబృందం తక్షణ వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. కోలుకున్న 30మంది విద్యారి్థనులకు అల్పాహారం ఇచ్చి హాస్టల్‌కు తిరిగి పంపించారు. మిగిలిన వారికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించి మెరుగుపడేంతవరకు ఆస్పత్రిలో ఉంచారు. వారిలో ముగ్గురు కోలుకొనేందుకు రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. అధికారుల ఆరా... విద్యారి్థనుల అస్వస్థత విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి, జాయింట్ కలెక్టర్–2 ఆర్. కూర్మనాథ్ బుధవారమే పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఫుడ్‌పాయిజినింగ్ కారణాలపై సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఇలాంటి పరిణామాలు ఎదురైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశమై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. రాష్ట్ర బాలబాలికల హక్కుల కమిషన్ మెంబర్ పి.వి.వి.ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యారి్థనులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీకి వెళ్లి పరిసరాల శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యంపట్ల పాఠశాల సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను ఆరా తీశారు. ఏమైపోతుందోనని భయపడ్డాం.. రాత్రి భోజనం చేసిన తరువాత కొంత సేపటికి వసతిగృహంలో చాలా మంది అమ్మాయిలకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయని ఏఎన్ఎంకు చెప్పాం. ఆమె మాత్రలు ఇచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో భయపడ్డాం. ఎస్ఓ మేడమ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను ఇప్పించారు. భోజనంలో నాణ్యత లేకపోవడంవల్లే ఇలా అయింది. – ఎస్.శరణ్య, విద్యార్థిని పాడైన ఆహారం వల్లే... రాత్రి భోజనంలో మధ్యాహ్నం మిగిలిన కూరలు, పెరుగు ఇచ్చారు. వాటిని తిన్న తరువాతనే వాంతలు, విరేచనాలు మొదలయ్యాయి. దాదాపు అందరిదీ అదే పరిస్థితి కావడంతో విషయం తెలుసుకుని ఎస్ఓ మేడమ్, ఏఎన్ఎం మమ్మల్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు. – ఎస్.శకుంతల, విద్యార్థిని పుల్లని పదార్ధాలు ఇవ్వవద్దు.. పులిసిన, చెడిపోయిన పదార్ధాలు విద్యార్థులకు ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆటలాడుకోవదు. అదృష్ట వశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాం. పూర్తిస్థాయి విచారణ చేపట్టి... పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తాం. ప్రస్తుతానికి విద్యారి్థనుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. – జి.నాగమణి, డీఈఓ -
టీకాలతో పాడి పశువుల ఆరోగ్య రక్షణ
పాడి పశువులను రైతు ప్రతి రోజూ గమనించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనపడితే తక్షణమే సంబంధిత పశువైద్యునిచే చికిత్స చేయించాలి. అశ్రద్ధ కనబరిస్తే నష్టం అపారంగా ఉంటుంది. అందుకు పాడి పశువుల ఆరోగ్యం పరిరక్షణ కార్యక్రమాల పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి. పాడిపశువులకు వ్యాధులు రాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పాడి పశువులకు అంటువ్యాధులు సోకక ముందే నివారణ చర్యగా వ్యాధినివారణ టీకాలు వేయించడం ఎంతైనా మంచిది. చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. పాడి పశువులు అంతః, బాహ్య పరాన్న జీవులకు లోనయినప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు: ► సూక్ష్మజీవుల (బాక్టీరియా) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసిస్. ► సూక్ష్మాతి సూక్ష్మ జీవులు (వైరస్) వలన కలిగే వ్యాధులు – ఉదా.. గాలికుంటు, శ్వాసకోశవ్యాధి, మశూచి వ్యాధి. ► అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు– ఉదా.. కుందేటి వెర్రి (సర్రా), థైలేరియాసిస్, బెబీసియోసిస్, కార్జపు జలగవ్యాధి, మూగబంతి. ► ఇతర వ్యాధులు– ఉదా.. పాల జ్వరం, పొదుగు వాపు, చర్మవ్యాధులు, దూడల మరణాలు. ► రైతులు తమ పశు సంపదను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులలో పోషించి, సాధారణంగా వచ్చే వ్యాధుల గురించి, వాటి నివారణ పద్ధతులపై సరైన అవగాహన ఏర్పరచుకొని రక్షించుకున్నట్లయితే ఆర్థికంగా ఎంతో లాభపడతారు. పశువులలో సామాన్యంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు – చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. -
స్టేజీపైనే సొమ్మసిల్లిన గడ్కరీ
షిర్డీ: నాగ్‌పూర్ ఎంపీగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్ధి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షిర్డీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన స్టేజీపైనే సొమ్మసిల్లారు. షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం శివసేన అభ్యర్థి సదాశివ్ లొఖాండే తరఫున శనివారం సాయంత్రం రహతాలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసంగం పూర్తి చేసి కుర్చీలో కూర్చోబోతూ సొమ్మసిల్లారు. భద్రతా సిబ్బంది, నేతలు కిందకు పడిపోకుండా పట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆయన తన కారు వద్దకు ఎవరి సాయం లేకుండానే నడిచి వెళ్లారు. అనంతరం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. -
అయ్యో.. బంగారుకొండ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలి తీసుకుంది. పదుల సంఖ్యలో నవజాత శిశువులను తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. మరో 24 గంటలు గడిస్తే కానీ వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీకాలు వేశాక ఒక మందుకు బదులు మరో మందు ఇవ్వడమే పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని తేలింది. ఎలా జరిగింది? జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో శిశువులకు వాక్సినేషన్ వేశారు. ఒకటిన్నర నెలల నుంచి మూడున్నర నెలలలోపు ఉన్న 92 మంది శిశువులకు పెంటావాలంట్ వాక్సిన్ ఇచ్చారు. సాధారణంగా టీకాలు వేశాక శిశువులకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బంది జ్వరాన్ని తగ్గించేందుకు ‘పారాసిటమాల్’టాబ్లెట్ ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నొప్పుల నివారణకు వాడే ‘ట్రెమడాల్’(300 ఎంజీ) పెయిన్‌కిల్లర్ టాబ్లెట్‌ను ఇచ్చారు. సాధారణంగా ఈ మాత్రలను పిల్లలకు రికమెండ్ చేయరు. ఆస్పత్రి వైద్య సిబ్బంది వాటిని పరిశీలించకుండానే పంపిణీ చేయడంతో ఇది తెలియని తల్లిదండ్రులు ఆ మాత్రలను పిల్లలకు వేశారు. దీంతో టాబ్లెట్ వేసిన కొద్దిసేపటికే అవి వికటించి పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డోస్ ఎక్కువై..ఊపిరాడక, అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం చికిత్స కోసం చిన్నారులను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కిషన్‌బాగ్‌కు చెందిన రెండున్నర నెలల ఫైజాన్ అనే బాలుడు మార్గమధ్యలోనే మృతిచెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తూ అపస్మారక స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న మ రో ముగ్గురు (సయ్యద్ ముస్తఫా, హీనా బేగం, అబూఅజ్మల్)శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంట లు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు 22 మంది చిన్నారులను నిలోఫర్‌కు తరలించగా సాయంత్రానికి ఈ బాధితుల సంఖ్య 27కు చేరుకుంది. కళ్లు మూసుకుని మందులు పంచారు.. నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వాక్సినేషన్‌తోపాటు ప్రసవాలు, ఆర్థోపెడిక్ వంటి స్పెషాలిటీ సేవలు కూడా అందిస్తున్నారు. సర్జరీల తర్వాత నొప్పిని నివారించేందుకు ఆ టాబ్లెట్లను వాడుతుంటారు. వీటిని పెద్దలకే ఇస్తారు. ఫార్మసీ సిబ్బంది ఓపీ సేవలకు ముందే తమ వద్దకు వచ్చిన మెడికల్ స్ట్రిప్‌లను (రెండు టాబ్లెట్ల చొప్పున) ఐదు భాగాలుగా కట్ చేసుకొని బాక్సుల్లో పెట్టుకుంటారు. మందులు నిల్వ చేసిన బాక్సులు సహా ఆ రెండు టాబ్లెట్ల కవర్లు చూడ్డానికి ఒకేలా ఉండటం, సిబ్బంది వాటిపై ముద్రించిన పేర్లు కూడా చూడకుండానే పంచడం, విషయం తెలియక తల్లిదండ్రులూ వేయడం చిన్నారుల అస్వస్థతకు కారణమైంది. ఫార్మసిస్ట్‌లే మందులు ఇవ్వాల్సి ఉండగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఏఎన్ఎంలతో పంపిణీ చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎన్ఎంలుగా పని చేస్తున్న వారిలో చాలా మందికి చికిత్సలపై అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతేడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. త్వరలోనే కోలుకుంటారు.. చిన్నారులంతా త్వరలోనే కోలుకుంటారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
పాలు రుబ్బండి... గొడుగు పట్టండి!
ఇప్పటి పశువుల పాలు ఒకనాటి పాలు కావు. రసాయన అవశేషాలుండే ఆ పాలు తాగితే మనమూ అనారోగ్యం పాలు కావచ్చు. ఇల్లూ ఆఫీసూ ఇవే జీవితమైపోయిన మనకు ఎండ ఎండమావి అయిపోయింది. విటమిన్–బి 12, విటమిన్–డి లోపాలకు మందులు అక్కర్లేదు... రుబ్బిన పాలు, పట్టించే గొడుగు చాలంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్‌వలి. ఆరోగ్యవంతమైన జీవనానికి పోషకాలతోపాటు విటమిన్ డి, విటమిన్ బి–12 అత్యంత అవసరం. ఎండ తగలని జీవనశైలి వల్ల, భిన్నమైన డ్యూటీ సమయాల వల్ల విటమిన్–డి లోపం వస్తుంది. కొందరికి బి–12 లోపం వస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలం మందులు వాడాల్సిందేనన్న భావన చాలా మందిలో ఉంది. అయితే ఈ రెండు ముఖ్య విటమిన్లూ, కాల్షియం కూడా దేశీయ ఆహార పదార్థాల్లోనే పుష్కలంగా ఉన్నాయంటున్నారు ప్రసిద్ధ స్వతంత్ర ఆరోగ్య, ఆహార శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బీ 12 చాలా అవసరం. ఇది లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బి 12 కేవలం మాంసాహారం ద్వారా లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే కోడిగుడ్డు, కోడి, గొడ్డు, మేక, పంది, కుందేలు మాంసం.. ఇంకా ఏ జంతువు/పక్షిæనుంచి సేకరించిన మాంసాహారమైనా మనిషి దేహంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందే తప్ప సమతుల్యత కలిగించదు. నాటు జాతి కోళ్లు, పశువులను రసాయనాల్లేకుండా పెంచినవైనప్పటికీ వాటి గుడ్లు, మాంసం మనిషికి ఉపయోగపడవు. చిరుధాన్యాల పాలతో బి 12 విటమిన్ బి 12ను.. ఆ మాటకొస్తే ఏ విటమిన్‌ను అయినా టాబ్లెట్లు, ఇంజక్షన్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకుంటేనే సరిగ్గా ఒంటికి పడుతుంది.ఆహారంలో ఇమిడి ఉంటేనే దేహం సజావుగా గ్రహించగలుగుతుంది. ఆహారం ద్వారా విటమిన్ బి 12ను పొందడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. దేశీ ఆవు పాలు, పెరుగు, మజ్జిగలో బి 12 విటమిన్ పుష్కలంగా ఉంది. ఈ పాలు తోడుపెట్టి చిలికి వెన్న తీసిన మజ్జిగను ఉదయం ఒక గ్రాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకుంటే బి 12 విటమిన్ లోపం రాదు. రెండోది.. కుసుమలు, వేరుశనగలు, నువ్వులు మనకు నూనె గింజలుగా మాత్రమే తెలుసు. అయితే వీటి ద్వారా పాలు, ఆ పాలతో పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని వాడుకోవడం పూర్వం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో వాడుకలో ఉండేది. వీటితోపాటు సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరితో కూడా చక్కని పాలు, పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని నిక్షేపంగా వాడుకోవచ్చు. పశువుల మాంసం, పశువుల పాలకు బదులుగా ఈ పాలతో తయారు చేసిన పెరుగును, మజ్జిగను వాడుతూ ఉంటే బి 12 విటమిన్ లోపం రాదు. వచ్చినా కొద్ది వారాల్లో పోతుంది.పర్యావరణ దృక్కోణంలో చూసినా కూడా ఇదే సబబైన దారి. బి 12తోపాటు కాల్షియం కూడా.. నువ్వులు, రాగుల పాల ద్వారా బి 12తోపాటు మన దేహానికి అవసరమైనంత మేరకు కాల్షియం కూడా లభిస్తుంది. పశువుల పాలలో కన్నా నువ్వుల పాలతో తయారైన పెరుగు/మజ్జిగలో 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది. నువ్వుల పాల పెరుగు అందుబాటులో లేకపోతే వారానికి ఒక నువ్వు లడ్డు తిన్నా లేదా వారానికి రెండు చెంచాల దోరగా వేపిన నువ్వులు తిన్నా పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరికైనా కాల్షియం లోపం దరిచేరదు. లోపం ఉంటే కొద్దివారాల్లోనే తగినంత సమకూరుతుంది. నేరుగా కాయకూడదు నూనె గింజలు, చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరితో తయారు చేసుకునే పాలలో సాధారణ పశువుల పాలలో మాదిరిగా కొవ్వు ఎక్కువగా ఉండదు. అందువల్ల వీటిని గిన్నెలో పోసి నేరుగా పొయ్యి మీద కాయకూడదు. నురగ వచ్చి పొంగవు. అలా చేస్తే ఇరిగిపోతాయి. పొయ్యి మీద గిన్నెలో నీరు పోసి మరిగిస్తూ ఆ నీటిలో ఈ పాల గిన్నెను ఉంచి వేడిచేయాలి. గోరు వెచ్చగా కాగితే చాలు. మొదట్లో సాధారణ పెరుగు/మజ్జిగతోనే తోడు వేసుకోవాలి. అలా గింజల పాల ద్వారా తయారైన పెరుగు/మజ్జిగతోనే తోడు వేస్తూ ఉంటే కొన్నాళ్లకు పూర్తిగా ఈ పెరుగే సిద్ధమవుతుంది. పశువుల పాలు/పెరుగు/మజ్జిగకు బదులు నూనెగింజలు, చిరుధాన్యాలు, పచ్చి కొబ్బరి పెరుగు/మజ్జిగను తీసుకోవటం ఉత్తమం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా నిశ్చింతగా వీటిని తాగవచ్చు. కుసుమ, వేరుశనగ, నువ్వులు, సజ్జలు, జొన్నలు, పచ్చి కొబ్బరిలలో మీకు ఏవి అందుబాటులో ఉంటే లేక ఏవి నచ్చితే వాటిని ఉపయోగించి పాలు తయారు చేసుకొని పెరుగు/మజ్జిగ చేసుకొని వాడుకోవచ్చు. ఒకే రకం పాలతో చేసిన పెరుగు/మజ్జిగ దీర్ఘకాలం పాటు నిరంతరాయంగా వాడకుండా ఉంటే మంచిది. వారానికి ఒక రకం తీసుకుంటే బాగుంటుంది. మీ నోట్లోకి వెళ్లే ప్రతి ముద్దా, ప్రతి నీటి చుక్కా సరైనదైతే.. సంపూర్ణ ఆరోగ్య వంతులవ్వడానికి ఏ ఔషధమూ అక్కర్లేదు. ఆహారం సరైనది కాకపోతే ఏ ఔషధమూ పనిచేయదు. దేశీయ ఆహారమే నిజమైన దివ్యౌషధం. ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం. అందరమూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుదాం. ఎలుగెత్తి చాటుదాం! – డాక్టర్ ఖాదర్ వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త, మైసూరు ఎండిన పుట్టగొడుగుల్లో పుష్కలంగా విటమిన్ డి! ఎండ వేళ ఆరుబయట తిరిగే అవకాశం లేని వారికి కాలక్రమంలో విటమిన్ డి లోపం వస్తుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ తదితర రంగాల ఉద్యోగులు, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో నివసించే వారిలో కూడా కొందరికి అసలు ఎండ పొడ సోకని పరిస్థితి ఉంటుంది. ఇటీవల కాలంలో విటమిన్ డి లోపాన్ని ఖరీదైన మాత్రల ద్వారా తగ్గించుకోవచ్చన్న ప్రచారం సాగుతోంది. నిజానికి, ఎటువంటి మందులూ అవసరం లేదు. పుట్టగొడుగులను ఎండబెట్టి వంట చేసుకొని తినటం ద్వారా విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. పుట్టగొడుగుల్లో ఎర్గోస్టెరాల్ అనే పదార్థం ఉంటుంది. ఎండ తగిలినప్పుడు విటమిన్ డిగా మారుతుంది. అందువల్ల వారానికి రెండు, మూడుసార్లు ఎండు పుట్టగొడుగులు తింటూ ఉంటే కొన్ని వారాల్లో విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. తాజా పుట్టగొడుగులను 3 గంటల పాటు ఎండబెట్టి, అదేరోజు కూర వండుకొని తినవచ్చు లేదా సూప్ చేసుకొని తాగవచ్చు. మరో పద్ధతి ఏమిటంటే.. పుట్టగొడుగులను 3–4 రోజులు ఎండలో పెట్టి పూర్తిగా ఒరుగుల మాదిరిగా చేసుకొని, గాజు సీసాల్లో నిల్వ చేసుకొని.. తదనంతరం అవసరమైనప్పుడు వాడుకోవడం. ఎండిన పుట్టగొడుగులను నీటిలో నానబెట్టి, తర్వాత కూర వండుకోవచ్చు. లేదా బాగా ఉడకబెట్టి జావ మాదిరిగా చేసుకొని తాగవచ్చు. ఏదో ఒక విధంగా?? రోజు మార్చి రోజు ఒకసారైనా ఎండు పుట్టగొడుగులు తింటూ ఉంటే.. 3 నెలల్లో విటమిన్ లోపాన్ని ఎటువంటి మందులూ వాడకుండానే అధిగమించవచ్చు. ఇప్పటికే లోపం వచ్చినా లోపాన్ని పూడ్చుకోవడానికి నిస్సందేహంగా ఆస్కారం ఉంది. ఎండలోకి వెళ్లే అవకాశం ఉన్న వారు కూడా బయటకు వెళ్లకపోవడం వల్ల కూడా విటమిన్ డి లోపానికి గురవుతూ ఉంటారు. అటువంటి వారు ఖాళీ ఉన్నప్పుడల్లా వీలైనప్పుడల్లా ఎండలో నడవటం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎండలో నడుస్తూ ఉంటే 3 నెలల్లో సమస్య తీరిపోతుంది. కనీసం వారానికి ఒక రోజు వంటికి నువ్వుల/కొబ్బరి నూనె రాసుకొని ఎండలో కొద్దిసేపు నిలబడినా కొద్ది వారాల్లో విటమిన్ డి లోపం తీరిపోతుంది. రాతి రోలులో రుబ్బి పాలు తయారు చేసుకునే పద్ధతి ఈ నూనెగింజలు/చిరుధాన్యాలను కనీసం 7, 8 గంటలు లేదా రాత్రి నానబెట్టి పొద్దున రాతి రుబ్బు రోలులో కొంచెం కొంచెం నీరు కలుపుతూ పొత్రంతో రుబ్బుతూ.. ఆ పిండిని పల్చని గుడ్డలోకి తోడుకొని పిండితే పాలు వస్తాయి. మిక్సీలో వేస్తే పాలు రావు. మోటారుతో నడిచే వెట్ గ్రైండర్‌ను వాడుకోవచ్చు. ఆ పిండిని మళ్లీ రోట్లో వేసి కొంచెం నీరు పోసి రుబ్బుతూ.. మళ్లీ పిండుకోవాలి. ఇలా అనేక సార్లు చేయడం ద్వారా వంద గ్రాముల నూనెగింజలు/చిరుధాన్యాలతో కనీసం లీటరు వరకు పాలు తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాలను తోడు వేసి పెరుగు/మజ్జిగ చేసుకొని ఉదయం, సాయంత్రం గ్లాసు తీసుకున్నట్లయితే మందుబిళ్లల ద్వారా కన్నా ఎక్కువ మోతాదులో బి 12 మనకు అందుతుంది. మాంసాహారంతో హార్మోన్ అసమతుల్యత మనిషి దేహం మాంసాహారం భుజించడానికి అనువుగా నిర్మితమైనది కాదన్న వాస్తవాన్ని ప్రపంచం నెమ్మదిగా గుర్తిస్తోంది. మాంసాహారం కలిగించే హార్మోన్ల అసమతుల్యత వల్ల మనిషి దేహంలో జీవక్రియలు అస్తవ్యస్తమై అనేక అనారోగ్యాలు వస్తున్నాయన్న చైతన్యం కూడా పెరుగుతోంది. పారిశ్రామిక ప్రక్రియలతో అతి తక్కువ రోజుల్లోనే అధిక పరిమాణంలో మాంసం, గుడ్లు ఉత్పత్తి చేయడానికి కోళ్లు, వివిధ జంతువులకు తినిపించే కృతకమైన పదార్థాలు, అందులో కలిపే రసాయనాలు, గ్రోత్ హార్మోన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ ఔషధాలు.. అన్నీ గుడ్లు, మాంసాన్ని అనేక రసాయనాల కుప్పగా మార్చుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీనినే జైవిక్ సాంద్రీకరణ (బయో కాన్సంట్రేషన్) అంటారు. మాంసాహారం తిన్న వారి దేహాల్లో పోగుపడే రసాయనిక అవశేషాలు, కల్మషాలు వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఒక కిలో మాంసం ఉత్పత్తి చేయడానికి ఇటువంటి 8 కిలోల ఆహార ధాన్యాలను పశువులకు మేప వలసి వస్తున్నది. అంటే, 8 కిలోల ధాన్యాలను తిన్నప్పుడు కలిగే హాని కిలో మాంసంతోనే కలుగుతోంది. మరోవైపు పారిశ్రామిక, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో అడ్డూ అదుపూ లేకుండా రసాయనిక కలుపు మందులు, ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. దీని అర్థం ఏమిటంటే.. ఈ ధాన్యాలను తిని ఆకలి తీర్చుకునే వారికన్నా మాంసం, గుడ్లు తిని ఆకలి తీర్చుకునే మనుషుల దేహాల్లోకి విష రసాయనాల అవశేషాలు 8 రెట్లు ఎక్కువగా చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వనరులను మాంసాహారుల కన్నా శాకాహారులు చాలా పొదుపుగా వాడుతున్నారని మనం గ్రహించాలి. వాతావరణంలోకి అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాల విడుదలకు కారణభూతమవుతున్న అన్ని రకాల మాంసం, గుడ్ల ఉత్పత్తిని తగ్గించుకుంటేనే భూతాపాన్ని కొంతమేరకైనా తగ్గించగలుగుతాం.కిలో వరి బియ్యం ఉత్పత్తి చేయడానికి 8 వేల లీటర్ల నీరు ఖర్చవుతోంది. కిలో కొర్ర, అరిక వంటి సిరిధాన్యాల బియ్యం ఉత్పత్తికి కేవలం 300 లీటర్ల నీరు సరిపోతుంది. వరి తినటం, పండించడం మాని సిరిధాన్యాల వైపు కదలితే ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది. ప్రకృతి వనరుల వృథా తగ్గిపోతుంది. ఆ మేరకు ఉద్గారాలతోపాటు భూతాపమూ తగ్గుతుంది. ఏ విటమిన్‌ను అయినా టాబ్లెట్లు, ఇంజక్షన్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా తీసుకుంటేనే సరిగ్గా ఒంటికి పడుతుంది. విటమిన్లు ఆహారంలో ఇమిడి ఉంటేనే దేహం సజావుగా గ్రహించగలుగుతుంది. – డాక్టర్ ఖాదర్ వలి -
74 మంది విద్యార్థులకు అస్వస్థత
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో గల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళా శాలలో ఆహారం వికటించి 74 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసి పడుకున్నాక వేకువజామున నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో కళాశా ల ప్రిన్సిపల్, కేర్ టేకర్‌కు సమాచారం ఇవ్వగా వారు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మూర్ డిప్యూటీ డీఎం హెచ్‌వో రమేశ్, వైద్యులు అశోక్, స్వాతి వినూత్న, వైద్య సిబ్బంది హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. ఆర్మూర్ డివిజన్లోని ఐదు రాష్ట్రీయ బాల ల స్వస్థ్య కార్యక్రమ్ బృందాలు కళాశాలకు చేరుకునారు. తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులకు వైద్యాధికారులు కళాశాలలోనే సెలైన్ బా టిళ్లు ఏర్పాటు చేసి చికిత్సలు అందజేశారు. మరో 34 మంది విద్యార్థులకు మాత్రలతో నయం చేశా రు. మధ్యాహ్నం విద్యార్థుల పరిస్థితి నిలకడకు వ చ్చింది. కారణాలు అవేనా.. కళాశాలలో 380 మంది విద్యార్థులున్నారు. శుక్రవారం 361 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా రాత్రి ఆహారంలో విద్యార్థులకు పప్పు, ఆలుగడ్డ కూరలను వడ్డించారు. ఆలుగడ్డ కూర మాడి పోవడంతో విద్యార్థులు దాన్ని వదిలి పప్పుతో భోజనం చేశారు. మాడిపోయిన కూరను తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా దీనికి ముందు విద్యార్థులు ఐరన్ మాత్రలను తీసుకున్నారు. ఖాళీ కడుపుతో ఐరన్ మాత్రలను తీసుకోవడంతో వచ్చే గ్యాస్ట్రిక్తో విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఆర్నెళ్ల కిందే కళాశాల ఏర్పాటు.. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఆరు నెలల క్రితం కళాశాలను ఏర్పాటు చేశారు. వర్ని మండలం చందూర్‌లో ఉన్న కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆశించినంత లేక పోవడంతో ఆర్మూర్‌కు తరలించారు. పెర్కిట్‌లోని ఒక ప్రైవేటు కళాశాలను అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కళాశాలలోని అవసానదశకు చేరుకున్న వంట పాత్రలల్లో ఆహార పదార్థాలు వండడం ద్వారా అడుగంటి మాడిపోతున్నాయని వంట చేసేవారు పేర్కొంటున్నారు. తిన్న తర్వాతనే ఇలా జరిగింది.. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయాం. అయితే కాసేపటికి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. కేర్ టేకర్ దగ్గరకు వెళ్లగా ఉపశమనానికి మందు గోలీలను ఇచ్చారు. –దివ్య, సెకండియర్, చల్లగరిగ కూరలు మాడిపోయాయి.. రాత్రి అందజేసిన ఆహార పదార్థాలలో ఆలుగడ్డ కూర మాడిపోయింది. దీంతో పప్పుతో భోజనం చేశాం. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా కళాశాలలోని 70 మంది విద్యార్థులకు అవస్థలు పడ్డాం. –హారిక, సెకండియర్, చౌట్పల్లి -
నావద్ద ఏమియునూ లేదు...
అనారోగ్యం మాటేమిటోగానీ అప్పుడయాన యుద్ధానికి వెళుతున్న చక్రవర్తిలా ఉన్నాడు. తెలియని ఉత్సాహం ఏదో అతని కండ్లలో వెలుగుతుంది.కళాకారులకు పెద్దగా ఏమీ అక్కర్లేదనుకుంటా.... చప్పట్లు చాలు, వన్స్మోరు కేకలు చాలు! ఈ మాత్రం దానికే ఆ కొద్దిసేపు వాళ్లు రాజ్యాలను జయించే చక్రవర్తులవుతారు. కుబేరుణ్ణి తలదన్నే అపరకుబేరులవుతారు.జీవితసార్థకతను ప్రేక్షకుల చప్పట్లలో కొలుచుకొని పదేపదే మురిసిపోతారు. అలాంటి ఒక కళాకారుడు సత్యవతి వాళ్ల నాన్న. ఆయన స్టేజీ ఎక్కితే, స్టేజీ మాయమై మరోలోకం కనిపిస్తుంది. ఆయన ప్రేక్షకులను ఎటో తీసుకువెళతాడు.ఈసారి మాత్రం అలా జరగలేదు. ఆయనే ఎక్కడికో వెళ్లిపోయాడు.సత్యహరిశ్చండ్రి వేషంలో ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కుండతో ఉత్సాహంగా స్టేజీ వైపు పరుగులాంటి నడకతో వెళుతున్నాడు ఆయన. కూతురు సత్యవతి ‘నాన్నా!’ అని అరుస్తూ ఆయన దగ్గరకు వచ్చింది.‘‘ఏమిటమ్మా?’’ అడిగాడు ఆయన.‘‘మాత్రలు వేసుకోవడం మరిచిపోయావు నాన్నా’’ అని గుర్తు చేసింది ఆమె.కూతురికి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధకు ఒకవైపు మురిసిపోతూనే...‘‘ఆ డాక్టర్ చాదస్తం సగం నీకు వచ్చినట్లుందమ్మా’’ అంటూ చేతిలోని కుండను ఆమెకు ఇచ్చి మాత్రలు వేసుకొని గ్లాసులో నీళ్లుతాగి స్టేజీవైపు నడిచాడు. తండ్రి ఉత్సాహన్ని చూస్తూ తనలో తాను చిన్నగా నవ్వుకుంది సత్యవతి.నాటకం మొదలైంది.‘‘మాలిని... ఎవరైనసరే కాటి సుంకం చెల్లించిగానీ దానకార్యమునకు ఉపక్రమించను’’ అని తేల్చేశాడు హరిశ్చంద్రుడు.‘‘అయ్యా! కాటిసుంకంమును చెల్లించుటకు నా వద్ద ఏమియునూ లేదే’’ అని అసలు విషయం చెప్పింది చంద్రమతి.‘‘నేనిది బొత్తిగా నమ్మను. ఆలోచించు’’ అని కంఠంలో కాస్త కోపాన్ని కొని తెచ్చుకున్నాడు హరిశ్చంద్రుడు. ఇద్దరి మధ్య కాసేపు పదునైన పద్యాల యుద్ధం జరిగింది. ‘‘అయ్యా! నా వద్ద ఏమియు లేదన్నా నన్ను ఏల బాధించెదరు?’’ శోకతప్తహృదయంతో నిలదీసింది ఆమె.ఆమె శోకంతో తనకు బొత్తిగా పనిలేదన్నట్లు...‘‘అది మాంగల్యం కాబోలు. ఏ వెలకైనా దాన్ని తెగనమ్మి నీ సుతునికై వెచ్చించు... వెచ్చించు.. ఆ...ఆ...ఆ...’’ అంటూ రాగం తీశాడు హరిశ్చంద్రుడు.వినలేనిదేదో విన్నట్లు ‘అయ్యో! దైవమా’ చెవులకు చేతులు అడ్డం పెట్టుకుంది చంద్రమతి.తరువాత ఆలోచించింది.‘‘నా పతికి తక్క అన్యులకు గోచరించని నా దివ్యమాంగల్యం.... కాదు కాదు కాదు... ఇతడు ఛండాలుడు కాదు. నా మంగల్యం కనుగొన్న ఇతడు నా పతి హరిశ్చంద్రుడు. స్వామి... నేను స్వామి నీ చంద్రమతిని’’ అంటూ భర్త దగ్గరకు వచ్చింది.‘‘దేవీ నువ్వా! నా చంద్రమతివా? అటులైన వీడు?’’ అని కుర్రాడి శవాన్ని చూస్తూ అడిగాడు హరిశ్చంద్రుడు.‘‘మన కుమారుడు లోహితుడు’’ అంటూ ఆమె దీర్ఘమైన పద్యం ఒకటి పాడింది.హరిశ్చంద్ర– చంద్రమతులు కుమారుడి తలనిమురుతూ ‘హా లోహితా! లోహితా’ అని కంటికి మింటికి ధారగా ఏడుస్తున్నారు.ప్రేక్షకుల్లో ఏడ్వనివాడు పాపాత్ముడు!‘వన్స్‌మోర్’ అంటూ ఈలలు.పాత్రకు ప్రాణం పోస్తూ .... ఏడుస్తూ ఏడుస్తూ.... ఒక్కసారిగా స్టేజీపైనే కూలిపోయాడు సత్యవతివాళ్ల నాన్న. ‘నాన్న... నాన్న’ అంటూ ఆందోళనగా పరుగెత్తుకు వచ్చింది కూతురు.‘‘ఈసారి చాలా ఉధృతంగా వచ్చింది. వెంటనే బస్తీకి తీసుకెళ్లి పెద్ద డాక్టర్‌కు చూపించాలి’’ అని చెప్పాడు ఆ ఊరివైద్యుడు. ఆయన్ను ట్రాక్టర్లో ఎక్కించి తీసుకెళుతున్నారు. ‘‘ఏంకాదమ్మా’’ అంటూ పోస్ట్ మాస్టర్ బాబాయ్ సత్యవతికి ధైర్యం చెబుతున్నాడు. ఏమైందో ఏమో ట్రాక్టర్ మధ్యలోనే ఆగింది.మెకానిక్‌ను తీసుకొస్తానంటూ డ్రైవరు కుర్రాడు పరుగెత్తుకు వెళ్లాడు. ఏడుపులు విని... అటుగా వెళుతున్న రమేష్ ‘‘ ఏమైంది?’’ అని అడిగాడు.‘‘మావాడు చావుబతుకుల మధ్య ఉన్నాడు... ట్రాక్టరేమో చెడిపోయింది. అర్జంటుగా పట్నానికి తీసుకెళ్లాలి’’ అని చెప్పాడు బాబాయ్.రమేష్ మెకానిక్ అవతారమెత్తి ట్రాక్టర్లో కదలిక తెచ్చాడు.‘‘ఆ డ్రైవర్ ఎప్పుడొస్తాడో ఏమో... నేను తీసుకెళ్తాను పదండి’’ అంటూ డ్రైవర్ సీట్లో కూరున్నాడు రమేష్. ట్రాక్టర్ పట్నం రోడ్డు మీద అడుగుపెట్టగానే ఊరేగింపు ఒకటి కనిపించింది. తెల్లటి పొడవాటి బ్యానర్లపై‘ప్రభుత్వ వైద్యుల సమ్మె’ అనే నీలిరంగు అక్షరాలు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ గవర్నమెంట్ ఆస్పత్రి ముందు ఆగింది. ‘‘సీరియస్ కేసు సార్. మీరు వెంటనే అడ్మిట్ చేసుకోవాలి’’ అని ఆస్పత్రి ఉద్యోగిని అభ్యర్థించాడు పోస్ట్‌మాస్టర్ బాబాయ్.‘‘ఏంలాభం లేదండీ. డాక్టర్లెవరూ లేరు. బోర్డ్ చూడలేదా!’’ అని చావుముందు కబురు చల్లగా చెప్పాడు ఆ ఉద్యోగి.‘‘ప్రజలకు ప్రాణం పోయాల్సిన డాక్టర్లు సమ్మె చేయడం ఏమిటి?’’ అని అంతెత్తు లేచాడు రమేష్. సమాధానం చెప్పేవారు లేరక్కడ.‘‘పోనీ... చుట్టుపక్కల వీధిలో ప్రైవేట్ డాక్టర్ ఎవరు లేరా?’’ ఆరా తీశాడు బాబోయ్.ఆ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోయే సమయానికే సత్యవతి నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.స్టేజీపై ఆయన పాడిన పద్యం గాలిలో లీలగా వినిపిస్తుంది.‘నా ఇల్లాలని... నా కుమారుండని.... ఎంతో అల్లాడిన ఈ శరీరం... ఒంటరిగా కట్టెలలో కాలుచున్నది. ఆ ఇల్లాలు రాదు.... పుత్రుడు తోడై రాడు’ -
ఎంత ఘాటు ప్రేమయో...
‘100% లవ్’ సినిమాలో మహాలక్ష్మీ పాత్రలో చికెన్ లవర్‌గా తమన్నా కనిపించారు. రోజులో ఏదో ఓ టైమ్‌లో మహాలక్ష్మీ చికెన్ లాగించాల్సిందే. ఆ పాత్రలానే తమన్నా రియల్ లైఫ్‌లో కూడా బీభత్సమైన నాన్ వెజ్ లవర్ అట. కానీ కొన్ని రోజుల పాటు మాంసాహారం ముట్ట కూడదని ఒట్టు పెట్టుకున్నారట. ఎందుకూ..? ఏదైనా దేవుడికి మొక్కా? కాదు. పాత్ర కోసం ఫిట్‌నెస్‌లో భాగమైన డైటా? కాదు.. కాదు. మరి ఎందుకూ అంటే.. తను ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కోసమట. తమన్నా పెట్ పేరు పెబ్బల్. ఈ మధ్యన కొంచెం అస్వస్థతకు గురైయిందట. పెబ్బల్ అలా బాధపడుతుంటే చూడలేకపోయారట తమన్నా. పెంపుడు కుక్కపిల్ల త్వరగా కోలుకునేందుకు తనకు బాగా నచ్చినదానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దాంతో తనకు కొన్ని రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం తమన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో ‘సైరా: నరసింహారెడ్డి’, తమిళంలో ‘దేవి 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
సాక్షి, కశింకోట : కశింకోటలోని హౌసింగ్ కాలనీలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో ఆహారం విషపూరితమై సుమారు 18 మంది చిన్నారులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హౌసింగ్ కాలనీలో ఒక చిన్నారికి జన్మదిన వేడుకలు జరగ్గా దానికి హాజరైన పిల్లలు కేక్ తిని, రస్నా తాగిన తర్వాత వాంతులై అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వినయ్, డి.గణేష్, డి.సాయి, డి.మనోహర్, మానశ్రీ, లేఖిని, దుర్గా, వినయ్, తదితరులు ఉన్నారు. వీరంతా రెండు నుంచి పదేళ్లలోపు వయస్సు వారే. వీరిని తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స అందించి పంపించామని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
పోచంపల్లిలో 15మందికి అస్వస్థత
గుర్రంపోడు (నాగార్జునసాగర్) : మండలంలోని పోచంపల్లిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కల్తీ కల్లు తాగడవల్లే.. తీవ్ర వాంతులు, విరేచనాల బారిన పడ్డారని వైద్యాధికారులు అంటున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు కుంభం యాదయ్య వద్ద రోజూ మాదిరిగానే సాయంత్రం కల్లు సేవించారు. రాత్రి పదిగంటల సమయంలో కొందరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారు స్థానిక ఆర్ఎంపీ వద్దకు చికిత్స పొందారు. ఆర్ఎంపీ వద్దకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో కల్లు తాగడం వల్లే అని గుర్తించారు. వారిని తెల్లవారుజామున మండలకేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 108లో నల్లగొండకు తరలించారు. బాధితుల్లో గ్రామానికి చెందిన గుండెబోయిన జ్యోతి, గుండెబోయిన యాదమ్మ, గుండెబోయిన దనమ్మ, గుండెబోయిన పాపయ్య, జాల మల్లయ్య, పూలె లక్ష్మమ్మ, గుండెబోయిన సత్యనారాయణ, గుండెబోయిన కోటేష్, పూల ఇద్దయ్య, ముక్కాముల యాదమ్మ, గుండెబోయిన బక్కమ్మ, గుండెబోయిన భిక్షమయ్య, పోలేని ఏశమ్మ, ముక్కాముల లక్ష్మీప్రసన్న ఉన్నారు. వీరిలో జాల మల్లయ్య, గుండెబోయిన సత్యనారాయణచ పూలె లక్ష్మమ్మ, గుండెబోయిన భిక్షమయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. కల్తీ కల్లు కారణమా..! కల్లు తాగిన వారందరూ అస్వస్థతకు గురికావడంతో.. కల్లు కల్తీ కావడం వల్లే జరిగిందని పోలీసు, ఎక్సైజ్ అధి కారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కల్లు శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌కు పంపామని, మూడు రోజుల్లో ఖచ్చి తమైన రిపోర్టు వస్తుందని పోలీసులు చెబుతున్నారు. బాధితులను పరామర్శించిన కలెక్టర్ నల్లగొండ టౌన్ : గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో శనివారం రాత్రి కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆదివారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితుల్లో ఐదుగురిని డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఎక్సైజ్ అధికా రులు విచారణ చేస్తున్నారని, కల్లు పరీరక్షకు పంపినట్లు, కల్తీకల్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు కల్తీకల్లు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు. కల్లులో పురుగు మందుల అవశేషాలు : ఎస్పీ నల్లగొండ క్రైం : గుర్రంపోడు మండలంలోని పోచంపల్లిలో కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలో కల్లులో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారని ఎస్పీ ఏవీ.రంగనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గీత కార్మికుడితో విబేధాలు ఉన్న వ్యక్తులు కల్లులో పురుగుమందు కలిపినట్లు తెలిసిందని, సంఘటనా స్థలంలో విషకారక ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన 15 మందిలో నలుగురిని మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించామని, ఎవరికీ ఎలాంటి హానీ లేదని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నిషా కోసమే కల్లు కల్తీ..! గుర్రంపోడు : నిషా కోసమే కల్లును కల్తీ చేస్తారు. ఈ కల్లు సేవించిన వారి ప్రాణాల మీదకు తెస్తుంది. కొందరు నిషేధితమైన తీపిదనాన్ని కల్గించేందుకు చక్రిన్, నిషాకు ప్రమాదకరమైన డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి రసాయనాలు వాడుతారు. వీటితో కల్లును కల్తీ చేయడం నేరం. ఎక్సైజ్ అధికారుల వద్ద గల కిట్ ద్వారా తరుచూ కల్లు శాంపిల్స్‌ను తనిఖీలు చేయాల్సి ఉంది. కల్లు కల్తీకి వాడే రసాయనాలు అమ్మే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తారు. ఈ రసాయనాలు ఒక్కోసారి కల్లు అమ్మేవారు మోతాదుకు మించి వేయడం.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ కల్తీ కల్లు ఎక్కువగా వాసన ఉంటుంది. కల్తీ కల్లు శాంపిల్‌ను వేడిచేస్తే పసుపు రంగులోకి మారుతుంది. పో చంపల్లిలో కల్లు కల్తీ ఘటనలో కల్లు విక్రయిం చిన కుంభం యాదయ్యను పోలీసులు విచారించగా రసాయనాలు అమ్మిన గ్రామంలోని వ్యాపారితోపాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమచారం. జానా పరామర్శ.. నల్లగొండ టౌన్ :గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి సీఎల్సీ నేత కుందూరు జానారెడ్డి పరామర్శించారు. అనంతరం జానా మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైన వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్లకు సూచించారు. కల్తీకల్లుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. -
20 మంది చిన్నారులకు అస్వస్థత
ఆలూరు: నియోజకవర్గంలోని ఆలూరు, హాలహర్వి, హొళగుంద మండలాలకు చెందిన 20మంది చిన్నారులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వారి కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చించారు. రెండు రోజుల నుంచి కలుషిత నీరు తాగడం, ఎండవేడిమి ఎక్కువ కావడంతోనే విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైనట్లు చిన్న పిల్లల వైద్యుడు జయకృష్ణ తెలిపారు. ఆలూరుకు చెందిన హేమంత్ (6), హేమలత (6), గిరీష్ (7), ఉషా (5), పెద్దహోతూరు సందీప్ (5), కురువెళ్లి రంగస్వామి (7), అంగస్‌కల్లు నందిని (16), మాచనూరు చంద్రశేఖర్ (6), సులువాయి చిట్టి (7)తో పాటు మరో 11 మంది వివిధ గ్రామాలకు చెందిన చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చిన్నారులను ఎండలో వదలొద్దని, ఈగలు, దోమలు వాలిన ఆహార పదార్థాలను ఇవ్వవద్దని డాక్టర్ జయకృష్ణ సూచించారు. నీటిని కాచి, వడబోసి చల్లారిన తర్వాత పిల్లలకు తాపించాలన్నారు. -
20 మంది విద్యార్థులకు అస్వస్థత
శింగనమల: ముగ్గిన కారం బొంగులు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సలకంచెరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మంగళవారం అధికమోతాదులో కారం ఉండి, ముగ్గిపోయి ఉన్న బొంగులను ఒక పాత్రలో ఉంచారు. ఉదయం 11 గంటల సమయంలో అటుగా వెళ్లిన దాదాపు 20 మంది విద్యార్థులు ఆ బొంగులు తిన్నారు. మధ్యాహ్న సమయానికి ఆ విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు వెంటనే గుర్తించి ఏఎన్ఎం శైలజ చేత ప్రథమ చికిత్స చేయించి శింగనమల సీహెచ్‌సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం)కి తీసుకెళ్లారు. సీహెచ్ఓ డాక్టర్ కృష్ణమూర్తి వైద్యం అందించారు. తహాసీల్దారు నాగేంద్ర, తరిమెల ఎంపీహెచ్‌ఓలు శివప్రసాద్, వెంకటరమణ, వారి సిబ్బంది విద్యార్థులను పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన అంజలి, ప్రవల్లిక ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి ప్రమాదమూ లేదన్నారు. ఎక్కువ కారం ఉన్న బొంగులు తినడం వల్ల వాంతి చేసుకున్నారని తెలిపారు. -
ఆయుష్మాన్‌భవ
సాక్షి, హైదరాబాద్ : దేశంలో సగటు మనిషి ఆయుః ప్రమాణం పెరుగుతోంది. 1990తో పోలిస్తే ఏకంగా పదేళ్లకుపైగా జీవితకాలం పెరిగింది. దేశవ్యాప్తంగా స్త్రీల జీవితకాలం 70.3 ఏళ్లు, పురుషుల జీవితకాలం 66.9 ఏళ్లకు పెరిగింది. అదే తెలంగాణలో దేశవ్యాప్త సగటుకన్నా అధికంగా స్త్రీల జీవితకాలం 73.2 ఏళ్లకు, పురుషుల జీవితకాలం 69.4 ఏళ్లకు పెరిగింది. భారత వైద్య పరిశోధన మండలి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ సంస్థలు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, వైద్య సౌకర్యాలు వంటివి ఇందుకు కారణమవుతున్నాయని తేలింది. కానీ ఇదే సమయంలో మారుతున్న జీవన శైలి, పోషకాహార లోపం కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని, మరణాలకు కారణమవుతున్నాయని స్పష్టమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య విభాగాల ద్వారా ఈ అధ్యయనం చేసి.. నివేదిక రూపొందించారు. పెరుగుతున్న జీవన ప్రమాణం 1990లో భారత మెడికల్ కౌన్సిల్ ప్రజారోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా మహిళల సగటు జీవితకాలం 59.7 ఏళ్లుగా, పురుషుల జీవితకాలం 58.3 ఏళ్లుగా తేల్చింది. తాజాగా 2016–17 ఏడాదికిగాను నిర్వహించిన అధ్యయనంలో మహిళ ఆయుష్షు 70.3 ఏళ్లకు, పురుషుల ఆయుష్షు 66.9 ఏళ్లకు పెరిగినట్లు గుర్తించింది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు, శాతాలను లెక్కించింది. తెలంగాణలో 1990లో సగటు జీవితకాలం మహిళల్లో 61.8 ఏళ్లు, పురుషులకు 60.2 ఏళ్లుగా ఉండగా.. 2016–17లో స్త్రీలలో 73.2 ఏళ్లకు, పురుషుల్లో 69.4 ఏళ్లకు పెరిగినట్లు తేల్చింది. తగ్గుతున్న శిశు మరణాల రేటు దేశవ్యాప్తంగా కొన్నేళ్లలో శిశు మరణాల రేటు బాగా తగ్గిందని మెడికల్ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. 1990లో ప్రతి 1,000 మంది శిశువుల్లో 100 మంది వరకు మరణించగా.. 2016–17 నాటికి 39కి తగ్గినట్లు పేర్కొంది. ఇదే తెలంగాణలో 30కి తగ్గిందని తెలిపింది. ఏ వయసులో ఏ సమస్యతో.. వివిధ వయసుల్లో అనారోగ్య కారణాలతో మరణిస్తున్న వారి శాతాన్ని సైతం కౌన్సిల్ నివేదికలో పేర్కొంది. పద్నాలుగేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాల్లో.. గర్భస్థ దశలో సరిగా ఎదగక, వివిధ లోపాలతో పుట్టినవారి శాతమే 42.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. మరో 30.5 శాతం మరణాలకు మలేరియా, తట్టు వంటి సాంక్రమిక వ్యాధులు కారణమని, వివిధ ఇతర వ్యాధులతో 8.7 శాతం, ప్రసూతి సమస్యలతో 2.4 శాతం, పోషకాహార లోపంతో 1.2 శాతం మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. ► ఇక 15 ఏళ్ల నుంచి 39 ఏళ్లలోపు వారిలో సంభవిస్తున్న మరణాల్లో... 13.5 శాతం శ్వాసకోశ వ్యాధులతో, ఎయిడ్స్‌తో 13 శాతం, రోడ్డు ప్రమాదాల్లో 10.4 శాతం, కేన్సర్‌తో 10 శాతం, మలేరియా వంటి వ్యాధులతో 8.9 శాతం మరణిస్తున్నారు. ► 40 ఏళ్ల నుంచి 69 ఏళ్లలోపు వారి మరణాల్లో... 38.1శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో, 12.2 శాతం కేన్సర్‌తో, 10 శాతం శ్వాసకోశ వ్యాధులతో, 8.5 శాతం డయేరియా, 5.5 శాతం ఎయిడ్స్‌తో మృత్యువాత పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం ► అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ డిసీజెస్‌తో 8 శాతం మంది స్త్రీలు, 10 శాతం మంది పురుషులు సతమతమవుతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. ► ఐరన్ లోపంతో వచ్చే వ్యాధులతో 13 శాతం స్త్రీలు, 5 శాతం పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. ► వెన్నునొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులతో 7 శాతం స్త్రీలు, 6 శాతం పురుషులు జీవితం నెట్టుకొస్తున్నారు. ► మానసిక వ్యాధులతో 6 శాతం మహిళలు, 7 శాతం పురుషులు వేదనకు గురవుతున్నారు. ► నెలలు గడవక ముందు పుట్టినవారిలో 3 శాతం స్త్రీలు, 2 శాతం పురుషులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ► రోడ్డు ప్రమాదాల్లో 1 శాతం స్త్రీలు, 3 శాతం పురుషులు వైకల్యం బారిన పడుతున్నారు. ► డయాబెటిక్‌తో 2 శాతం స్త్రీలు, 4 శాతం పురుషులు దీర్ఘకాలంగా కాలం గడుపుతున్నారు. దీర్ఘకాలిక వైకల్యం, అనారోగ్యాలకు ఇవీ కారణాలు 1990 లో.. ►విరేచనాలు, సంబంధిత వ్యాధులు ►శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు ►గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు ►తట్టు, సంబంధిత వ్యాధులు ►నియోనాటల్ వ్యాధులు ►క్షయ వ్యాధి ►తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు ►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం ►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు ►గర్భస్థ, శిశు సంబంధిత వ్యాధులు ►పక్షవాతం ►మధుమేహం (డయాబెటిస్) 2016-17లో.. ►గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు ►తీవ్ర (క్రానిక్) ఊపిరితిత్తుల వ్యాధులు ►విరేచనాల సంబంధిత వ్యాధులు ►నెలలు నిండకముందే జన్మించడంతో వచ్చే సమస్యలు ►ఆత్మహత్య, స్వయంగా గాయపర్చుకోవడం ►అంధత్వం, చెవుడు వంటి సెన్స్ ఆర్గాన్ వ్యాధులు ►ఐరన్ లోపంతో వచ్చే సమస్యలు ►పక్షవాతం ►రోడ్డు ప్రమాదాలు ►నడుంనొప్పి, మెడనొప్పి సంబంధిత వ్యాధులు ►మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్ ►శ్వాసకోశ వ్యాధులు ►రోడ్డు ప్రమాదాలు ఈ పదీ మరణ హేతువులు! జీవితకాలంలో వివిధ అనారోగ్యాలకు గురికావడానికి పది ప్రధాన కారణాలను సర్వే గుర్తించింది. 1990 నాటి కారణాలను, ప్రస్తుత కారణాలను నిగ్గు తేల్చింది. మొత్తంగా పోషకాహార లోపం ప్రధాన సమస్యగా ఉందని, మహిళల్లో అధికశాతం దీనితో బాధపడుతున్నారని గుర్తించింది. కారణాలను ర్యాంకుల వారీగా పరిశీలిస్తే.. మారిన రిస్క్ ఒకప్పుడు విరేచనాలు (కలరా) వంటి వ్యాధులతో భారీగా మరణాలు సంభవించగా.. ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువమంది చనిపోతున్నట్లు మెడికల్ కౌన్సిల్ సర్వే తేల్చింది. అప్పుడు, ఇప్పుడు ఎక్కువగా మరణాలకు కారణమవుతున్న పది ప్రధాన అంశాలను నివేదికలో పేర్కొంది. పోషకాహార లోపమే పెద్ద సమస్య.. 1990 నాటి నుంచి ఇప్పటికీ పోషకాహార లోపమే పెద్ద సమస్యగా ఉందని మెడికల్ కౌన్సిల్ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు తగిన పోషకాహారం అందక ఆరోగ్య సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నట్లు పేర్కొంది. ఇక నగర ప్రాంతాల్లో అధిక కొవ్వు, ఊబకాయం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, జంక్ ఫుడ్ అలవాటు ఆయుష్షును తగ్గిస్తోందని స్పష్టం చేసింది. అరక్షిత శృంగారంతో.. దేశంలో అరక్షిత శృంగారం కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నట్లు మెడికల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో 627 మంది దీర్ఘకాలం వ్యాధిగ్రస్తులుగా ఉండిపోయారని పేర్కొంది. అరక్షిత శృంగారంతో తెలంగాణ నుంచే ఎక్కువ శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు గుర్తించింది. తర్వాతి స్థానాల్లో మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఇక లైంగిక వేధింపుల కారణంగా మతిస్థిమితం కోల్పోయినవారు తెలంగాణలో 124 మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ బాధితుల సంఖ్యలో తమిళనాడు (159) మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ (140) రెండో స్థానంలో నిలిచింది. -
తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో మరణించిన తల్లి అంత్యక్రియలకు చిల్లిగవ్వకూడా లేకపోవడంతో ఏం చేయాలో తోచని ఇద్దరు పిల్లలు భిక్షాటన చేసిన దారుణఘటన తమిళనాడులో జరిగింది. దిండుగల్ జిల్లాలోని మేటుపట్టికి చెందిన కాళియప్పన్, విజయ దంపతులకు మోహన్(14), వేల్ మురుగన్(13) కుమారులు, కుమార్తె కాళీశ్వరి ఉన్నారు. గతంలోనే కాళియప్పన్ చనిపోయాడు. దీంతో విజయ ఒక్కతే రెక్కల కష్టంతో పిల్లల్ని చూసుకుంటోంది. ఇటీవల ఆమెకు రొమ్ము కేన్సర్ సోకింది. దీంతో కుమారులు బడి మానేసి కూలిపనికి వెళ్తున్నారు. విజయ పరిస్థితిని చూసిన ఓ ఆశ్రమం కుమార్తె కాళీశ్వరి బాధ్యతలు స్వీకరించింది. ఆరోగ్యం క్షీణించిన విజయను దిండుగల్ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం కన్నుమూసింది. తల్లి మృతిపై బంధువులకు సమాచారం అందించినా ఎవ్వరూ స్పందించకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అంత్యక్రియల కోసం ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో భిక్షాటనకు దిగారు. విషయం తెల్సుకున్న ఆస్పత్రి సంక్షేమాధికారి మాలతి అంత్యక్రియల ఏర్పాట్లు చూశారు. చివరికి ప్రభుత్వ దహన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
అనారోగ్యం... అశాంతి!?
కొందరి ఇళ్లలో ఏదో తెలియని అశాంతి నెలకొని ఉంటుంది. అలాంటి ఇళ్లలోని చిన్నారులు తరచు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. నిష్కారణంగా భయపడుతూఉంటారు. ఇంట్లోని పెద్దలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో తెలియని చింతతో లోలోపలే కుమిలిపోతూ ఉంటారు. దృష్టిదోషాల వల్ల, పితృదోషాల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. వీటికి కొన్ని పరిహారాలు... సోమవారం రుద్రాభిషేకం జరిపించి, పాశుపత మంత్రంతో అభిమంత్రించిన దశముఖ రుద్రాక్షను మెడలో ధరించాలి. దీనివల్ల దోషాలు తొలగిపోతాయి.సాయంత్రం చీకటి పడిన తర్వాత మట్టిమూకుడులో ఆవుపేడతో చేసిన పిడకలకు నిప్పుపెట్టి, వాటిపై ఎండిన వేపాకులను వేసి మండించాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నిత్యపూజకు ఉపక్రమించే ముందు గోరోచనం, కుంకుమపువ్వు, పసుపు నూరి ముద్దగా చేసి తిలకంగా ధరించండి. పిల్లలకు కూడా పెట్టండి. చిన్నారులు ఊరకే భయపడుతున్నట్లయితే, వారికి సాయంత్రం వేళ ఒక నిమ్మకాయతో ఏడుసార్లు దిష్టి తీయాలి. ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా తరిగి, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాటిని నాలుగు దిక్కులకు విసిరి పారేయాలి. పేద అమ్మాయిల పెళ్లికి శక్తివంచన లేకుండా ఆర్థిక సాయం చేయండి. వీలుంటే స్వయంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించండి. దీనివల్ల పితృదోషాలు తొలగుతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
కపాల మర్దన శాస్త్రం
మానసిక వ్యాధుల చికిత్సలో దాదాపు ఒక శతాబ్దం పాటు ‘ఫ్రెనాలజీ’ అనే కుహనా శాస్త్రం రాజ్యమేలింది. అప్పట్లో చాలామంది వైద్యులు సైతం దీనిని అసలు సిసలు శాస్త్రమేనని గుడ్డిగా నమ్మేవారు. ‘పుర్రెకో బుద్ధి’ అనే నానుడి ఎటూ ఉండనే ఉంది. ఈ శాస్త్రం బహుశ ఆ నానుడినే నమ్ముకున్నట్టుంది. కపాలంలోని ఒక్కో నిర్ణీత భాగం నిర్ణీత ఆలోచనలకు, అనుభూతులకు కేంద్రంగా ఉంటుందనేది ‘ఫ్రెనాలజీ’ సిద్ధాంతం. కపాలంలోని ఏదైనా భాగంలో లోపం ఏర్పడితే సంబంధిత భాగానికి చెందిన ఆలోచనలు, అనుభూతులు, భావోద్వేగాల్లో లోపాలు తలెత్తి మానసిక రుగ్మతలు ఏర్పడతాయని నాటి ఫ్రెనాలజిస్టులు బలంగా నమ్మేవారు. కపాలంలో ఏయే భాగాలు ఏయే భావోద్వేగాలను, ఆలోచనలను నియంత్రిస్తాయో సూచించే చార్టులను రూపొందించి, విస్తృతంగా ప్రచారం చేయడంతో 18–19 శతాబ్దాల కాలంలో ఫ్రెనాలజీని శాస్త్రంగానే చాలామంది నమ్మేవారు. వివిధ మానసిక సమస్యలకు ఆ చార్టు ఆధారంగా సంబంధిత కపాల భాగాన్ని బాగా మర్దన చేసేవారు. క్రమంగా అలా కపాల మర్దన చేస్తుంటే పిచ్చి కుదురుతుందని వెర్రిగా నమ్మేవాళ్లు. తర్వాతి కాలంలో ఇదంతా ఉత్తుత్తి శాస్త్రమేనని తేలిపోయినా, సైకియాట్రీలోను, న్యూరాలజీలోను ఆధునిక పరిశోధనలకు ఇది కొంతవరకు స్ఫూర్తినిచ్చిందని చెబుతారు.